debit money
-
అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు
మైసూరు: అప్పు చెల్లించాలని అడగడంతో హత్య చేసిన హంతకులకు జిల్లా 7వ అదనపు కోర్టు జీవితఖైదు విధించింది. మైసూరు నగరంలోని కేటి. స్ట్రీట్‌కు చెందిన అనిల్ కుమార్, మేగళ కొప్పళగ్రామవాసి మహే‹Ùలు దోషులు. వివరాలు.. మైసూరు తాలూకాలోని బెళవాడికి చెందిన జయరామ్ (34) వద్ద అనిల్‌కుమార్ 20 వేల రూపాయలను అప్పు తీసుకున్నాడు. ఎంతకూ తిరిగి ఇవ్వకపోవడంతో జయరామ్ గట్టిగా నిలదీశాడు. దీంతో పగ పెంచుకున్న అనిల్‌కుమార్ మహేష్‌తో కలిసి 2017 మే నెల 27న సాయంత్రం జయరామ్‌ను బైకుపై తీసుకెళ్లి విజయనగర 4వ స్టేజ్‌లో చాకుతో పొడిచి చంపాడు. ఈ కేసులో పై ఇద్దరితో పాటు సతీష్ అనే మరో యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అనిల్, మహేష్‌ల నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కే.దొడ్డెగౌడ ఈ మేరకు తీర్పు చెప్పారు. సతీష్‌కు సంబంధం లేదని తేలడంతో వదిలిపెట్టారు. (చదవండి: లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు) -
ఫోన్ కు మెసేజ్.. కంగుతిన్న ఖాతాదారుడు
డోన్: తన ఖాతాలో ఉన్న సొమ్ములో కొంత తనకు తెలియకుండానే డెబిట్ కావడంతో ఓ ఖాతాదారుడు విస్తుపోయాడు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లో డోన్ మండలం మల్లెంపల్లె గ్రామానికి చెందిన మనోహార్ ఖాతాదారుడు. ఈ క్రమంలో మనోహార్ ఖాతాలో ఉన్న రూ.50వేల మొత్తంలో నుంచి రూ.39 వేలు డెబిట్ అయినట్లు అతడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతున్న బాధితుడు మనోహర్ డోన్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ గోపాలక్రిష్ణయ్యకు ఫిర్యాదు చేశాడు. బేల్దార్ పని చేస్తూ జీవిస్తున్న తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంక్ ఖాతా వివరాలను ఇతరులకు తెలపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని మేనేజర్ అన్నారు. ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయాలని ఆయన సూచించడంతో మనోహర్ ఆ మేరకు డోన్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ వ్యవహారం సైబర్‌నేరం కిందికి వస్తుందని, విచారణ చేపట్టిన్నట్లు ఎస్ఐ రామసుబ్బయ్య తెలిపారు.