ఫోన్ కు మెసేజ్.. కంగుతిన్న ఖాతాదారుడు | account holder shocking on debit of money | Sakshi
Sakshi News home page

ఫోన్ కు మెసేజ్.. కంగుతిన్న ఖాతాదారుడు

Published Tue, Mar 28 2017 8:58 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

ఫోన్ కు మెసేజ్.. కంగుతిన్న ఖాతాదారుడు - Sakshi

ఫోన్ కు మెసేజ్.. కంగుతిన్న ఖాతాదారుడు

డోన్‌: తన ఖాతాలో ఉన్న సొమ్ములో కొంత తనకు తెలియకుండానే డెబిట్‌ కావడంతో ఓ ఖాతాదారుడు విస్తుపోయాడు. కర్నూలు జిల్లా డోన్‌ పట‍్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లో డోన్ మండలం మల్లెంపల్లె గ్రామానికి చెందిన మనోహార్‌ ఖాతాదారుడు. ఈ క్రమంలో మనోహార్‌ ఖాతాలో ఉన్న రూ.50వేల మొత్తంలో నుంచి రూ.39 వేలు డెబిట్‌ అయినట్లు అతడి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో కంగుతున్న బాధితుడు మనోహర్‌ డోన్‌ ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌ గోపాలక్రిష్ణయ్యకు ఫిర్యాదు చేశాడు.

బేల్దార్‌ పని చేస్తూ జీవిస్తున్న తాను ఎలాంటి షాపింగ్‌ చేయలేదని మనోహర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంక్ ఖాతా వివరాలను ఇతరులకు తెలపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని మేనేజర్‌ అన్నారు. ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయాలని ఆయన సూచించడంతో మనోహర్‌ ఆ మేరకు డోన్‌ రూరల్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ వ్యవహారం సైబర్‌నేరం కిందికి వస్తుందని, విచారణ చేపట్టిన్నట్లు ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement