బ్యాంక్‌ల్లో పోలీసుల మాక్‌డ్రిల్‌ | Police Mock Drill In Banks | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ల్లో పోలీసుల మాక్‌డ్రిల్‌

Published Thu, Jul 19 2018 1:05 PM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

Police Mock Drill In Banks - Sakshi

 ఆంధ్రా బ్యాంక్‌లో మేనేజర్‌తో మాట్లాడుతున్న పోలీసు అధికారులు 

బరంపురం ఒరిస్సా : నగరంలో ఏటీఎం కేంద్రాలు, బ్యాం క్‌ల చోరీ యత్నం వంటి నేరాల సంఘటనలతో బరంపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని 29 బ్యాంక్‌ల్లో బుధవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాంక్‌లకు వెళ్లి బ్యాంక్‌ మేనేజర్లతో మాట్లాడారు. అదేవిధంగా బ్యాంక్‌లకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు.

అనంతరం బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. ఈ మాక్‌డ్రిల్‌లో అన్ని పోలీసు స్టేషన్‌లకు చెందిన ఐఐసీ అధికారులు పాల్గొన్నారని ఏఎస్‌పీ సంతున్‌ కుమార్‌ దాస్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement