సేలం(చెన్నై): వాచ్‌మెన్ హత్య కేసులో నిందితుడికి రెండు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోయంబత్తూరు కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోయంబత్తూరులోని ఓ గోడౌన్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రామన్ 2017లో హత్యకు గురయ్యాడు. విచారణలో అక్కడ పని చేస్తున్న కార్మికుడు చంద్రన్ నిందితుడిగా తేలింది. అయితే ఏడాదిన్నర తర్వాత పోలీసులకు చంద్రన్ పట్టుబడ్డాడు. ఈ కేసును కోయంబత్తూరు మొదటి మెజిస్ట్రేట్ కోర్టు విచారించి, వాదనలు, విచారణ ముగియడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ( చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం )
మరో ఘటనలో..
ముక్కనేరిలో వివాహిత మృతదేహం
సేలం(చెన్నై):సేలం జిల్లాలోని ముక్కనేరి చెరువులో గురువారం వివాహిత మృతదేహం లభ్యమైంది. సేలంలోని కన్నంగురిచ్చి సమీపంలో ముక్కనేరి చెరువు వద్దకు వాకింగ్‌కు వచ్చిన స్థానికులు చెరువులో బుడగతామర మధ్య మహిళ కాలు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో ఆ మహిళ కన్నంగురిచ్చి, సత్యానగర్‌కు చెందిన రవీంద్రన్ భార్య కౌసల్య(30) అని తేలింది. ఇదివరకే తన కూతురు కనిపించలేదని కౌసల్య తండ్రి వెంకటప్ప సెవ్వాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ స్థితిలో కౌసల్య మృతదేహంగా తేలిన సంఘటన కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment