coimbattore
-
ఇండియన్ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!
తిరువొత్తియూరు(చెన్నై): కోవైకి చెందిన యువకుడు ఆఫ్రికాకు చెందిన యువతిని ప్రేమించి తమిళ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. వివరాలు.. ఆఫ్రికా దేశమైన కెమెరూన్లోని ఓ సంస్థలో కోవైకి చెందిన ముత్తు మారియప్పన్ పని చేస్తున్నాడు. ఇతను పనిచేస్తున్న సంస్థలో వాల్మీ ఇనాంగో అనే ఆఫ్రికా యువతి అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఈ మేరకు తమిళ సంప్రదాయం ప్రకారం కోవై తుడియలూర్‌లో ఉన్న ఓ వివాహ మండపంలో వివాహం జరిపించారు. వివాహ వేదిక పైకి వాల్మీఇనాంగో పట్టు చీర ధరించి తమిళ సాంప్రదాయంలో మెరిసింది. మారిముత్తు వధువు మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత వీరిద్దరూ క్రైస్తవ ఆచారం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. కాగా, వివాహానికి వధువు తరుపున హాజరైన ఆఫ్రికా వాసులు పట్టు పంచెలు, పట్టు చీరలు కట్టుకుని హాజరుకావడం అందరినీ ఆకట్టుకుంది. ఽ చదవండి: ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు -
ఒకే నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షలు
సేలం(చెన్నై): వాచ్మెన్ హత్య కేసులో నిందితుడికి రెండు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోయంబత్తూరు కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోయంబత్తూరులోని ఓ గోడౌన్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రామన్ 2017లో హత్యకు గురయ్యాడు. విచారణలో అక్కడ పని చేస్తున్న కార్మికుడు చంద్రన్ నిందితుడిగా తేలింది. అయితే ఏడాదిన్నర తర్వాత పోలీసులకు చంద్రన్ పట్టుబడ్డాడు. ఈ కేసును కోయంబత్తూరు మొదటి మెజిస్ట్రేట్ కోర్టు విచారించి, వాదనలు, విచారణ ముగియడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ( చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం ) మరో ఘటనలో.. ముక్కనేరిలో వివాహిత మృతదేహం సేలం(చెన్నై):సేలం జిల్లాలోని ముక్కనేరి చెరువులో గురువారం వివాహిత మృతదేహం లభ్యమైంది. సేలంలోని కన్నంగురిచ్చి సమీపంలో ముక్కనేరి చెరువు వద్దకు వాకింగ్‌కు వచ్చిన స్థానికులు చెరువులో బుడగతామర మధ్య మహిళ కాలు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో ఆ మహిళ కన్నంగురిచ్చి, సత్యానగర్‌కు చెందిన రవీంద్రన్ భార్య కౌసల్య(30) అని తేలింది. ఇదివరకే తన కూతురు కనిపించలేదని కౌసల్య తండ్రి వెంకటప్ప సెవ్వాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ స్థితిలో కౌసల్య మృతదేహంగా తేలిన సంఘటన కలకలం రేపింది. -
మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి!
చెన్నై: మైనర్ బాలుడిని ట్రాప్ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలుడు కాలేజ్‌కు వెళ్లేటప్పుడు.. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేవాడు. దీంతో ఆ యువతితో ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు తీసుకునే వరకు వచ్చింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఏడాది పాటు ఆ యువతి, మైనర్ బాలుడు జాలీగా కలిసి గడిపారు. కాగా, వీరిద్దరి విషయం మైనర్ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా.. యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్చుకోలేదు. తాజాగా, బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి -
కరోనా వ్యాక్సిన్ భయంతో చెట్టెక్కిన గ్రామస్తులు
-
షాకింగ్: ఓటమిపాలైన కమల్ హాసన్
చెన్నె: అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓడిపోయాడు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్‌పై కమల్‌హాసన్ పరాజయం పొందాడు. కాగా కమల్‌మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కానున్నారు. చదవండి: ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ -
కన్నవాళ్లు షెడ్డులో వదిలేస్తే.. కుక్క కాపాడింది
చెన్నై: మానసిక వికాలంగురాలైన మహిళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు షెడ్డులో వదిలేశారు. ఈ క్రమంలో మృగాడు మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. జరుగుతున్న దారుణాన్ని గమనించిన ఆ ఇంటి పెంపుడు కుక్క.. ప్రబుద్ధుడి ఆట కట్టించింది. వారం రోజుల క్రితం తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కోయంబత్తూరు సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికాలాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఇంటి పక్కన ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి దానిలో ఉంచారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చాడు. షెడ్డులో దూరి మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షెడ్డులో పవర్ కట్ చేశాడు. అయితే దిలీప్ కుమార్ చర్యలను గమనిస్తున్న వారి ఇంటి పెంపుడు కుక్క అతడి వెనకే షెడ్డులో ప్రవేశించింది. దిలీప్ కుమార్ ప్యాంట్ పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అనుకోని ఈ ఘటనకు బిత్తరపోయిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. ఈలోపు ఇంట్లో కరెంట్ ఉండి.. షెడ్డులో పవర్ కట్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. అక్కడ కుక్కతో పెనుగులాడుతున్న దిలీప్ కుమార్‌ను గమనించారు. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్ కుమార్ ఫోన్లో పలువురు మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇక కుక్కన్న పాటి దయ కూడా తల్లిదండ్రులకు లేకుండా పోయింది.. పాపం మానసిక వికలాంగురాలు అని కూడా చూడకుండా ఇలా షెడ్డులో ఉంచడం అమానుషం అంటున్నారు స్థానికులు. కుక్క అతడిని చూడకపోతే ఆ అభాగ్యురాలి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: మతిస్థిమితం లేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని -
ఈశా వేడుకల్లో సింగర్ మంగ్లీ స్వరాలు
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సంగీత ప్రపంచంలో గాయని మంగ్లీది ప్రత్యేక స్థానం అని చెప్పనవసరం లేదు. జానపదాలు మొదలు బతుకమ్మ పాటల వరకు తన గానామృతంతో అందరినీ అలరిస్తోంది. ప్రతి పండుగకు తన కొత్త పాట సందడి చేయాల్సిందే. తన యాసతో ప్రకృతి, సంస్కృతి మిళితమైన జానపదాలు మొదలు సినిమా పాటల్లోనూ దూసుకుపోతుంది. వీటితో పాటు దక్షిణ భారతదేశంలో ఎవరికీ దక్కని అవకాశం మంగ్లీకి దక్కింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదికైన కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో తన గొంతును వినిపించనుంది. ప్రతి శివరాత్రికి ఈశా యోగా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరగడం విదితమే. అయితే ఈసారి కోవిడ్ కారణంగా isha.sadhguru.org/msrలో ఇంగ్లిష్తో పాటు 11 భారతీయ భాషల్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాశివుడిని స్మరిస్తూ ఐదు పాటలు పాడనున్నట్లు మంగ్లీ తెలిపింది. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పార్థివ్ గోహిల్, ఆంధోని దాసన్, కబీర్ కేఫ్, సందిప్ నారాయణ్ తదితరులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
బాత్రూమ్లో 35 పాము పిల్లలు
-
ఒంటరి నక్షత్రం
కోయంబత్తూరులోని గవర్నమెంట్ ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి కోవిడ్ వార్డులో కరోనా కంటే కూడా స్నేహను (అసలు పేరు కాదు) ఎక్కువగా భయపెట్టింది.. తొలిరోజు ఒంటరితనం! 26 ఏళ్ల అమ్మాయి. దేనికీ భయపడని అమ్మాయి. తనే ఆసుపత్రికి వచ్చి, తనే టెస్ట్ చేయించుకుని, తనే అడ్మిట్ అయిన అమ్మాయి. రెండు రోజులు చూసి మూడో రోజు మామూలైపోయింది! తనతో పాటు తెచ్చుకున్న ల్యాప్‌ట్యాప్, కొన్ని పుస్తకాలు.. వాటిలో పడిపోయింది స్నేహ. స్పెయిన్‌లో ఎంబీయే చేస్తోంది ఆమె. రెండో సెమిస్టర్ ఫైనల్ పరీక్షలకు ముందు ఇండియా వచ్చింది. తిరిగి వెళ్దామనుకునే లోపు కరోనా పాజిటివ్‌తో మార్చి 16న హాస్పిటల్లో చేరింది. కరోనా నెగిటివ్‌తో ఏప్రిల్ 6న డిశ్చార్జ్ అయింది. మధ్యలో మూడు వారాల ఒంటరితనం. ఒకరోజుకే ఒణికిపోయిన స్నేహ ఇన్నిరోజుల ఒంటరితనంతో ఎలా ఫైట్ చేసింది. ఫైట్ చెయ్యలేదు. స్నేహం చేసింది! ఒంటరితనంతో స్నేహం ఎవరైనా చేయగలిగిందే. ఐసొలేషన్ ఒంటరితనంలోకి వెళ్లే సాహసాన్ని చేసింది స్నేహ. అందుకు ఆశ్చర్యపోవాలి. స్పెయిన్ నుంచి మొదట ఢిల్లీకి, ఢిల్లీ నుంచి కోయంబత్తూర్‌కి వచ్చింది స్నేహ. నేరుగా ఇంటికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షకు శాంపిల్స్ ఇచ్చింది. రిపోర్టులు వచ్చేవరకు ఇంట్లో ఎవరితోనూ కలవకుండా వేరుగా ఉంది. రిపోర్ట్స్‌లో నెగటివ్ అని వచ్చాక కూడా మూడు రోజులు వేరుగా ఉండి మళ్లీ టెస్ట్‌లకు వెళ్లింది. స్పెయిన్‌లో తన క్లాస్‌మేట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అదీ అనుమానం స్నేహకు. చివరికి ఆమె అనుమానం నిజమైంది. తనకూ పాజిటివ్! వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. మళ్లీ ఇంకో అనుమానం. అమ్మకు, నాన్నకు వచ్చి ఉంటుందా అని! వాళ్లకు టెస్ట్ చేయించింది. నెగటివ్ అని రావడంతో ఆమె మనసులోని భారం దిగిపోయింది. ఈలోగా స్నేహ గురించి వాట్సాప్ గ్రూపులలో వదంతులు! ఫలానా ఏరియాలో, ఫలానా వాళ్ల అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చిందనీ.. ఇక్కడ మాల్స్‌లో, మార్కెట్లో తిరిగిందనీ, ఆసుపత్రి నుంచి పారిపోయిందనీ, పట్టుకొచ్చి మళ్లీ హాస్పిటల్లో పెట్టారనీ.. ఇలాంటివి. వాళ్లుండే అపార్ట్మెంట్లో స్నేహ తల్లికీ అంతా దూరంగా జరిగారు. స్నేహకు ఎలా ఉంది అని దగ్గరగా వచ్చి అడగడానికి కూడా వాళ్లు సంశయించారు. బయట స్నేహ తండ్రిని కొందరు ఆపి అడిగేవారు.. ‘పాపకు ఇలాగయిందట కదా’ అని. ఇంత జరిగిందని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తెలిసింది స్నేహకు. మనిషి పక్కన లేకపోతేనే ఐసొలేషన్లా ఉంటుందే.. ఇక మనుషులే ఉండని ఐసొలేషన్ అంటే.. అంతరిక్ష ద్వీపంలో మినుకు మినుకుమనే ఒంటరి నక్షత్రమే. స్వప్న అనే ఈ నక్షత్రం చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఐసోలేషన్ నుంచే ఎంబీయే పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని! పైపైన చదువుదామని పుస్తకాలు తెచ్చుకున్న అమ్మాయి పరీక్షల కోసం స్పెయిన్ కాలమానాలకు అనుగుణంగా రేయింబళ్లు చదివింది. ఆన్లైన్లో పరీక్షలు రాసింది. రాసిన నాలుగు సబ్జెక్టులూ పాస్ అయింది. ఆరోగ్యం పూర్తిగా నయమై బయటికి వచ్చేనాటికి స్నేహ సెకండ్ సెమిస్టర్ కూడా పూర్తయింది. ఒక్కోసారి ఆమె తెల్లవారు జామున 3 గంటల వరకు చదువుతూ కూర్చునేది. ఊరికే చదివితే కాదు. క్లాసులూ వినాలి. అక్కడ స్పెయిన్‌లో మధ్యాహ్నం క్లాసులు మొదలయ్యే సమయానికి ఇక్కడ సిస్టమ్‌లో తను లాగ్ అయ్యేది. వాళ్లు పెట్టిన గడువు సమయానికి అసైన్మెంట్లు పూర్తి చేసి పంపడానికి ఇక్కడ తన టైమ్‌ని సర్దుబాటు చేసుకునేది. ఆసుపత్రి నుంచి వచ్చేసే రోజైతే అక్కడి ఇంటెర్న్షిప్ ఇంటర్వూ్యకి కూడా ఆన్లైన్లోనే హాజరైంది స్నేహ. డిశ్చార్జి అయి ఆపార్ట్మెంట్కి రాగానే ముప్పైమంది వరకు స్నేహకు ఎదురొచ్చి చప్పట్లతో స్వాగతం పలికారు. కొందరు గేటు దగ్గర, కొందరు లిఫ్టు దగ్గర, కొందరు బాల్కనీలలో పూలగుత్తులతో నిలుచున్నారు. పక్కన మనుషులు లేనప్పుడు మాత్రమే కాదు.. చుట్టూ ఎందరున్నా మనకు మనం లేకుండా పోయినప్పుడు మిగిలేది కూడా ఒంటరితనమే. మనకు మనం ఉండటమంటే.. మన లక్ష్యాల వైపు, గమ్యాలవైపు ఒంటరిగానైనా ప్రయాణించగలగడం. ఒంటరితనంలోనూ జీవించగలగడం. -
కొన్ని క్షణాలు.. ఆయన లేకుంటే చచ్చేవాడే!
-
తమిళనాడును కుదిపేస్తున్న విగ్రహాల ధ్వంసం
సాక్షి, కోయంబత్తూర్ : ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు పెరియార్ రామస్వామి విగ్రహం విధ్వంసంతో తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యాలయాలపై దాడులకు దారి తీశాయి. కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై కొందరు దుండగులు బాంబులు విసిరారు. చితపుదూర్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ దాడి జరిగింది. కార్యాలయ భవనంపై గుర్తుతెలియని వ్యక్తులు రెండు పెట్రోల్ బాంబులు విసిరి వెనువెంటనే పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనకు సంబంధించి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం అందించామని వారు తెలిపారు. కాగా, దాడి సమయంలో కార్యాలయం మూసివేసి ఉందని, ఎవరికీ గాయాలైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి ఘటన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. కోయంబత్తూరు దాడి నేపథ్యంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. త్రిపురలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన క్రమంలో లెనిన్, పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనల నేపథ్యంలో బీజేపీ కార్యాలయంపై దాడి జరగడం గమనార్హం. మాటమార్చిన హెచ్ రాజా మరోవైపు తన ఫేస్బుక్ పోస్టుపై హెచ్ రాజా మాట మార్చారు. తాను కామెంట్ చేసినట్టు చెబుతున్న ఫేస్ బుక్ పేజీ తనది కాదని, వేరెవరో దాన్ని మెయింటెయిన్ చేస్తున్నారని తెలిపారు. కాగా పెరియార్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు సైదాపేటలో ఆందోళనకు దిగారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్నినిరసిస్తూ తమిళ సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
కోయంబత్తూర్‌లో బీజేపీ ఆఫీసుపై బాంబు దాడి
-
కోయంబత్తూర్ పేలుళ్ల ప్రధాన నిందితుడు అరెస్ట్
మల్లాపురం: కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో నిందితుడు కుంజు మహ్మద్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని మల్లాపురంలో కుంజు మహ్మద్‌ను అరెస్ట్ చేసినట్టు తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు తెలిపారు. 1998లో అద్వానీ బహిరంగసభలో కుంజు మహ్మద్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నాటి ఘటనలో 58 మంది మృతి చెందగా, సభకు ఆలస్యంగా రావడంతో నాడు అద్వానీకి ప్రాణాలకు ముప్పు తప్పింది.