Tamil Nadu:19 Year Old Woman Arrested Under POCSO Act For Sexually Assaulting Minor - Sakshi
Sakshi News home page

మైనర్‌ను ట్రాప్‌ చేసి పెళ్లి చేసుకున్న యువతి!

Published Mon, Aug 30 2021 3:43 PM | Last Updated on Mon, Aug 30 2021 6:39 PM

Tamil Nadu:19 Year Old Woman Arrested Under POCSO Act For Sexually Assaulting Minor - Sakshi

చెన్నై: మైనర్‌ బాలుడిని ట్రాప్‌ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్‌ బంకులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలుడు కాలేజ్‌కు వెళ్లేటప్పుడు.. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్‌ పోయించుకునేవాడు. దీంతో ఆ యువతితో ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫోన్‌ నంబర్‌లు తీసుకునే వరకు వచ్చింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఏడాది పాటు ఆ యువతి, మైనర్‌ బాలుడు జాలీగా కలిసి గడిపారు.  కాగా, వీరిద్దరి విషయం మైనర్‌ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు.

అయినా.. యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్చుకోలేదు. తాజాగా, బాలుడికి హెర్నియా ఆపరేషన్‌ జరిగింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్‌ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement