Minor boy
-
టెక్సాస్‌లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్‌ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
డబ్బుల కోసం బామ్మను చంపేశాడు
న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. -
ఆడుకుంటూ.. అనంత లోకాలకు.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకార.. ఖమ్మం జిల్లాకు చెందిన మూర్తమ్మ కొన్ని సంవత్సరాలుగా సూరారం రాజీవ్ గృహకల్ప 29/27వ బ్లాక్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు తులసీనాథ్ (13) ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు సెలవు కావడంతో తులసీనాథ్ రాజీవ్ గృహకల్ప 27వ బ్లాక్‌లోని భవనంపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతో బాలుడి తండ్రి కనకరత్నం కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి మూర్తమ్మ టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. -
క్రికెట్లో గొడవ... బాలుడి ప్రాణం తీసింది
మహారాష్ట్ర, చంద్రాపూర్: మహారాష్ట్రలోని బాగాడ్కిడ్కిలో దారుణం జరిగింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా తలెత్తిన వివాదంలో 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో కొట్టి చంపేశాడు. హత్య జూన్ 3న జరిగితే జూన్ 6న మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, అప్పటికే పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు చంద్రాపూర్ పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి... జూన్ 3న బాగాడ్కిడ్కిలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా పిల్లల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అంతలోనే కోపగించిన 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో బలంగా తలపై కొట్టాడు. దీంతో ఆ మైనర్ బాలుడు కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ జూన్ 5న బాలుడు తుదిశ్వాస విడిచాడు. పోలీసులకి విషయం చెప్పకుండా బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాతి రోజున బాలుడి తల్లి చంద్రాపూర్ జిల్లా పోలీసులను ఆశ్రయించి విషయాన్ని వివరించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జూన్ 7న మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షల నిమిత్తం పంపించి, హత్య చేసిన బాలుడిపై ఐపీసీ 302 సెక్షన్‌ను అభియోగించారు. ఇది కూడా చదవండి: చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత -
మైనర్‌కు బండి.. ‘మేజర్’ మిస్టేక్
ఫ్రెండు వాళ్లింటికెళ్లొస్తానని.. కూరగాయలు తీసుకొస్తానని అడిగినా.. లేదా మీరే మరేదో పని అప్పజెప్పి పిల్లలకు వాహనాలిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరూ ఊచల్లెక్కపెడతారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా పట్టుబడిన మైనర్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. పిల్లల సంతోషం, సరదా కోసం వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు కేసులు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. అందులో 91 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు మైనర్లు వాహనాలు స్పీడ్‌గా, అజాగ్రత్తగా నడపడం కారణంగా జరిగినట్లు పోలీసు అధికారుల సమీక్షలో తేటతెల్ల మైంది. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని, పూర్తిగా నేర్చుకోకముందే రోడ్డె్డక్కి రైడింగ్ చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో మైనర్లు ఎక్కువ మంది ఉండడం దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రమాదాల కారణంగా పలు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన మైనర్లు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈఏడాది 43 మంది పట్టుబడ్డారు. వరంగల్‌లో 69 మంది పట్టుబడగా.. కాజీపేటలో 32 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 91 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన 1,755 మందికి రూ.1,25,02,700 జరిమానా విధించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 209 కేసులు నమోదు కాగా.. రూ.1,04,500 జరిమానా విధించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 280 కేసులకు రూ.1,40,000, కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 305 కేసులకు రూ.1,52,500 జరిమానా విధించారు. మొత్తం 794 కేసులు నమోదు కాగా.. వాటికి రూ. 3,97,000 జరిమానా విధించారు. పిల్లలు అడిగినా వాహనాలివ్వొద్దు.. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి బండ్లు ఇస్తున్నారు. దీని వల్ల వారు తెలిసీ తెలియని వయసులో ఎమోషన్స్‌తో స్పీడ్‌ను థ్రిల్‌గా భావించి ప్రమాదాలకు కారణమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిచి్చన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. వాహనాల ఓనర్ ఏ1గా ఉంటే.. మైనర్ ఏ2గా ఉంటాడు. వేసవి సెలవుల్లో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా వాహనాలు తనిఖీలు చేస్తారు. పట్టుపడితే శిక్ష తప్పదు. – ఏవీ.రంగనాథ్, సీపీ -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్‌గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్‌తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
ఎయిర్ రివాల్వర్‌తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం..
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోసమంటూ ఖరీదు చేసిన ఎయిర్ రివాల్వర్‌తో ఓ పాతబస్తీ వాసి ఆటలాడాడు. అప్పటి వరకు వీధికుక్కలపై కాల్పులు జరిపిన అతగాడు గోడపై ఉన్న బల్లిని కాల్చాలని ప్రయత్నించాడు. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కావడంతో సమీపంలో ఉన్న బాలుడి వీపులోకి దూసుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పుర పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఎ.శివ కుమార్ వివరాలు వెల్లడించారు. సుల్తాన్‌షాహీ కైసర్ హోటల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం కుమారుడు మహ్మద్ అఫ్జల్ అఫ్సర్ వాటర్ ప్లాంట్, పాన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఇతడు 2021 అక్టోబర్ 21న అబిడ్స్‌లోని ఏషియన్ ఆరమ్స్ దుకాణం నుంచి 0.117 క్యాలిబర్ ఎయిర్ రివాల్వర్ ఖరీదు చేశాడు. ఆ సందర్భంలో క్రీడల కోసమంటూ (స్పోర్ట్స్) రూ.17,700 వెచ్చించి దీనిని కొన్నాడు. ఈ రివాల్వర్‌లో చెర్రాలను తూటాల మాదిరిగా వినియోగించే అఫ్సర్ ఇంట్లో గోడలపై ఉన్న బల్లులు, వీధికుక్కలను కాలుస్తుంటాడు. సోమవారం (ఈ నెల 1వ తేదీ) ఉదయం 10.30–11 గంటల మధ్య ఇలానే చేస్తున్న అఫ్సర్‌ను ఓ బాలుడు కలిశాడు. గోడపై ఉన్న బల్లిని కాల్చాల్సిందిగా కోరాడు. ఇతడు అదే పని చేయగా.. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కారణంగా దిశ మార్చుకుని దూసుకుపోయింది. ఇంటి పక్కన ఉండే సయ్యద్ మోహసీన్ అలీ కుమారుడు ఆజాన్ (9) బయటకు ఆడుకుంటున్నాడు. ఈ చెర్రా వేగంగా వెళ్లి ఆజాన్ వీపులోకి దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న క్లీనిక్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై మెరుగైన వైద్య సేవల చికిత్స నిమిత్తం బుధవారం బహదూర్‌పురాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాలుడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి ఆజాన్ తండ్రి సయ్యద్ మెహసీన్ అలీ ఫిర్యాదు మేరకు మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అఫ్సర్ కోసం గాలిస్తున్నారు. ఎయిర్ రివాల్వర్, పిస్టల్, గన్స్కు లైసెన్స్ అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా జంతువులను కాల్చడం, ఎదుటి వారిని గాయపరచడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నిందితుడు చిక్కిన తర్వాత విచారణలో, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడికి బాలుడి కుటుంబానికి మధ్య ఆరి్థక లావాదేవీలు ఉన్నాయని, వీటి నేపథ్యంలోనే కొన్ని స్పర్థలు కూడా వచ్చాయని తెలుస్తోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. -
ఉదయం కార్పెంటర్ షాపులో పని.. రాత్రయితే బస్తీల్లో..
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనాలపై నగరంలో చక్కర్లు కొట్టాలనే ఉద్దేశంతో వాటి చోరీలు మొదలెట్టిన ఓ బాలుడు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. ఇతడి నుంచి ఈ దొంగ వాహనాలు ఖరీదు చేస్తున్న ముగ్గురు రిసీవర్లను పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి శుక్రవారం వెల్లడించారు. జిర్రా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (15) స్కూలు స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. అప్పటి నుంచి ఓ కార్పెంటర్ షాపులో పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనాలపై సిటీలో తిరగాలన్నది అతడి కోరిక. అయితే బైక్స్ ఖరీదు చేయడానికి స్తోమత లేకపోవడంతో వాటిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. గోల్కొండ, హుమాయున్‌నగర్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, ఆసిఫ్నగర్ల్లోని బస్తీల్లో రాత్రి వేళల్లో సంచరించే వాడు. గల్లీల్లో పార్క్ చేసిన వాహనాల్లో హ్యాండిల్ లాక్ వేయని వాటిని గుర్తించేవాడు. అదును చూసుకుని వాటిని తస్కరించే బాలుడు తోసుకుంటూ కొద్దిదూరం వెళ్లేవాడు. ఆపై వైర్లు కలపడం ద్వారా వాటిని స్టార్ట్ చేసుకుని ఉడాయించే వాడు. ఆ వాహనంపై మోజు తీరే వరకు దానిపై చక్కర్లు కొట్టే వాడు. ఆపై ఎలాంటి పత్రాలు లేని వాటిని ఒక్కోటి రూ.10 వేల చొప్పున తన ప్రాంతంలోనే నివసించే సయ్యద్ నబీ, అబ్దుల్ అల్తాఫ్, మహ్మద్ ఫెరోజ్‌లకు విక్రయించాడు. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలను బాలుడు తస్కరించాడు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కె.నర్సింములు, షేక్ బుర్హాన్, కె.శీనయ్య వలపన్ని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ వాహనాలు ఖరీదు చేసిన ముగ్గురినీ అరెస్టు చేసి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని గోల్కొండ పోలీసులకు అప్పగించారు. -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం -
కన్నతల్లి కొనఊపిరితోనే ఉన్నా.. దిగ్భ్రాంతికర విషయాలు
పబ్జీ కోసం కన్నతల్లిని తుపాకీతో కాల్చి చంపిన తనయుడి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని చంపిన తర్వాత స్నేహితులను ఇంటికి పిలిపించుకుని.. వాళ్లతో హ్యాపీగా దావత్ చేసుకున్నాడు మైనర్. అయితే తాజాగా విచారణలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. పబ్జీ విషయంలో కన్నతల్లిపై కోపం పెంచుకుని తుపాకీతో కాల్చి చంపాడు కొడుకు. ఈ కేసులో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని తుపాకీతో కాల్చేసిన తర్వాత ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి తాళం వేశాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణం పోలేదు. అప్పుడే కాదు.. ఆ మరుసటి రోజు ఉదయం వరకూ కూడా ఆమె కొన ఊపిరితోనే ఉంది. ఘటన జరిగిన రాత్రి సమయం నుంచి ఉదయం వరకూ మధ్యమధ్యలో గది తాళం తీసి ఆమె పరిస్థితిని చూస్తూ ఉండిపోయాడు ఆ కొడుకు. ఈ మధ్యలోనే స్నేహితులను ఇంటికి పిలిచి ఆన్లైన్లో ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ పెట్టి మరో గదిలో హ్యాపీగా పార్టీ చేసుకున్నాడు. ఒకవేళ తల్లికి ఇలా జరిగిందనే విషయం ఎవరికైనా చెప్పి ఉంటే.. కనీసం ఆమె బతికి ఉండేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అంతేకాదు.. ఇంటికి వచ్చిన స్నేహిడిని తల్లి శవం మాయం చేసేందుకు సాయం పట్టాలని తుపాకీతో బెదిరించాడు. అంతేకాదు ప్రతిగా ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లో లక్నోలో ఉంటున్న ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి.. తన సర్వీస్ రివాల్వర్‌ను ఇంట్లోనే ఉంచి వెళ్లాడు. కొడుకు పదే పదే పబ్జీ ఆడుతుండడంతో మందలించింది తల్లి సాధన(40). ఆ కోపంలో తుపాకీతో తల్లిని కాల్చేసి.. ఆమెను ఓ గదిలో, చెల్లిని(10) మరో గదిలో ఉంచాడు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంబంధిత వార్త: తల్లి శవం ఓ గదిలో.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్ -
గదిలో తల్లి శవం.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్
సమాజంలో మైనర్ సంబంధిత నేరాలు పక్కదోవ పట్టడానికి కారణాలు అనేకం. అందునా తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్లే జరుగుతున్నాయంటూ విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ, తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టడమే కాదు.. మందలిస్తే వాళ్లపై దాడులకు తెగబడుతోంది ఇప్పటి యువతరం. తాజాగా ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ తనయుడు. యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు సదరు టీనేజర్. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్లో పబ్జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్(16). అది చూసి పట్టరాని కోపంతో తల్లి సాధన(40) మందలించింది. దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్ రివాల్వర్‌తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయంతో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆపై ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆన్లైన్లో ఎగ్‌కర్రీ, ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ చేసుకుని.. సినిమాలు చూస్తూ దోస్తులతో దావత్ చేసుకున్నాడు. తల్లి గురించి అతని స్నేహితులు ఆరాతీయగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని కహానీ చెప్పాడు. అలా రెండు రోజులు గడిచింది. మృతదేహాం దుర్వాసన వస్తుండడంతో రూమ్‌ఫ్రెష్‌నర్ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడంతో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఆ కుర్రాడి తండ్రి ఆర్మీ అధికారి. ప్రస్తుతం బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్ రివాల్వర్‌ను మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారాయన. చదవండి: గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. -
పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు
kissing on lips and fondling are not unnatural offences : మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు. అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడూ నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐతే జస్టిస్ ప్రభుదేసాయి సదరు నిందితుడికి బెయిల్ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది. (చదవండి: వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..) -
పెరుగు కోసం యాక్టివాపై వెళ్లి..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ మైనర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 15 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం రాయలసీమ ప్రాంతం నుంచి వెంకటరామయ్య, అరుణ దంపతులు ఓల్డ్ కర్నూల్ రోడ్డు నేతాజీనగర్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. మేస్త్రీ పని చేస్తున్న వెంకటరామయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు వెంకటమణిదీప్ (14) స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మణిదీప్ పెరుగు తీసుకురావాలని ఇంట్లో చెప్పడంతో తండ్రి యాక్టివా వాహనాన్ని తీసుకుని వెళ్లాడు. పెరుగు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో నేతాజీనగర్‌లోని రోడ్డు డివైడర్‌కు ఢీకొని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తెలివైన విద్యార్థిగా ఆటపాటలలో ముందుండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం వెంకటమణిదీప్ మృతికి సంతాపం తెలిపి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. చదవండి: హైదరాబాద్: కుమారుడికి చిత్రహింసలు ... కాదు కిడ్నాప్ ! -
ఆడుకుంటానని చెప్పి వెళ్లాడు.. ఆపై చేనులో దుస్తులు లేకుండా!
వావీవరుసలు, వయో భేదం లేకుండా.. చివరికి మూగ జీవాలను వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి మానవ మృగాలు. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఓ ఘోరం.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఓ దళిత మైనర్ చిన్నారిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ అవుటర్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం రైతుది. అతని పదేళ్ల కొడుకు సోమవారం మధ్యాహ్నం.. ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతిక్కి.. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ లోపు ఊరి బయట ఆవ చేనులో ఓ బాలుడి మృతదేహాన్ని పనులకు వెళ్లిన ఓ మహిళ గుర్తించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అది కనిపించకుండా పోయిన మైనర్దేనని తేలింది. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. దుస్తులు యాభై మీటర్ల దూరంలో పడేసి ఉన్నాయి. ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో ఆ పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని, కన్నుకి తీవ్రంగా గాయమైందని, ఒంటిపై పంటి గాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ లైంగిక దాడి జరిగిందా? ఎలా హత్య చేశారు? అనే విషయాల నిర్ధారణకై శవపరీక్ష కోసం ఎదురుచూస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని కాన్పూర్ ఏఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు. మరోవైపు చనిపోయింది పదేళ్ల బాలుడు కావడం, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటడంతో.. గ్రామస్థుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కాసేపు రహదారి దిగ్భంధించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆపై పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
అడిక్షన్ సెంటర్‌కి పంపించారన్న కోపంతో...కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కొడుకు
16 Year Old Boy Kills His Parents With An Axe: తల్లిదండ్రులను పిల్లల అబివృద్ధికై అహర్నిశలు పోరాడతారు. వాళ్ల అభివృద్ధిని తమ అభివృద్ధిగా భావించి ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధుల తల్లిదండ్రల పై అత్యంత పాశవికమైన దాడులు చేయడమే కాక క్రూరమైన ఘాతుకాలకు పాల్పడతున్న ఉదంతాలే కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) అసలు విషయంలోకెళ్లితే... రాజస్తాన్‌లోన హనుమాన్‌ఘర్‌లోని ఒక గ్రామంలోని 16 ఏళ్ల మైనర్ బాలుడు మాదక ద్రవ్యాలకు బానిసై అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకు జీవితం బావుండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్‌కి పంపించారు. అయితే సదరు బాలుడు కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకుని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. అంతేకాదు తననెందుకు డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించారంటూ సదరు బాలుడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సదరు బాలుడు తనను మళ్లీ డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించే నిమిత్తమే తనను ఇంటికి తీసువచ్చారన్న కోపంతో నిద్రిస్తున్న తన తల్లిదండ్రలను అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో సమాచరం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు మీడియాకి తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..
సాక్షి, బంజారాహిల్స్: పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకున్న మేనత్త ఆ బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ 20 తులాల బంగారు నగలతోపాటు రూ. 6 లక్షలను బలవంతంగా వసూలు చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఓ మహిళ ఇంట్లో ఇటీవల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అలమారాలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో ఆమె గాలిస్తున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు(14) తాను మేనత్తకు ఒక నెక్లెస్ ఇచ్చానని చెప్పాడు. ఎందుకు ఇచ్చావంటూ తల్లి ప్రశ్నించగా బెంగళూరులో నివసించే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్ ఇర్ఫాన్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉండేదని చెప్పాడు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) తాను చదువుతున్న స్కూల్‌కు వచ్చి తనతో పాటు తీసుకెళ్లి లాడ్జిలో తన వాంఛలు తీర్చుకునేదని ఈ క్రమంలో ఆమె మాజీ భర్త ఇర్ఫాన్ ఈ దృశ్యాలను వీడియో తీసేవాడని ఎవరికైనా ఈ విషయం తెలియజేస్తే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేవాడని... ఇలా మూడుసార్లు తనను లాడ్జికి తీసుకెళ్లిందన్నారు. బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షలు తీసుకురాకపోతే వీడియో బయటపెడతామంటూ బ్లాక్మెయిల్ చేయడంతో దొంగిలించినట్లు బాలుడు తల్లికి చెప్పాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (వివాహేతర సంబంధం.. రాత్రి 11:30 గంటలకు ప్రియుడికి అన్నం తీసుకెళ్లి..) -
చాక్లెట్లు ఇస్తానని చెప్పి 13 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగికదాడి..
సాక్షి, చిలకలగూడ: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్న ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్‌లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని చాక్లేట్లు ఇస్తానని చెప్పి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: ప్రేమ పెళ్లి: రోజూ నరకం చూపిస్తూ.. చివరికి చీర కొనుక్కుందని.. -
11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 11 ఏళ్ల హిందూ బాలుడుని లైంగిక వేధింపులకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు ఆ బాలుడు శవమై ప్రావిన్స్‌లో ఖైర్పూర్ మీర్ ప్రాంతంలోని బబర్లోయ్ పట్టణంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించింది. ఈ మేరకు ఆ బాలుడు బంధువు రాజ్‌కుమార్ మాట్లాడుతూ..."మా కుటుంబం గురునానక్ పుట్టినరోజు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మా పిల్లవాడు ఎప్పుడూ అదృశ్యమయ్యాడో మేము గుర్తించలేకపోయాం." అని చెప్పారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) అంతేకాదు ఆ బాలుడు 2011లో జన్మించాడని, ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్నట్లు ఆ బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా ఆ మైనర్ బాలుడి శరీరంపై చిత్రహింసల తాలుకా గుర్తులు కూడా ఉన్నాయని చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీ సుక్కుర్‌కు చెందిన జుబైర్ మహర్ తెలిపారు. అంతేకాదు గత కొన్ని వారాల్లో ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని మహర్ చెబుతున్నారు. ఈ మేరకు బాబర్లోయి పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) మాట్లాడుతూ.." నిందితులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడే ముందు బాలుడిని గొంతు కోసి చంపినట్లు చెప్పారు. మేము ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. పైగా వారిలో ఒకరు నేరాన్ని అంగీకరించారు" అని ఎస్హెచ్ఓ చెప్పారు. (చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..) -
మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం
సాక్షి, శివమొగ్గ(కర్ణాటక): మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటన శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలో గురువారం వెలుగు చూసింది. శికారిపుర గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. తాలూకాలోని ఒక మారు మూల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలుడు తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న దంపతుల కుమార్తె(3)పై కన్నేశాడు. బాలిక ఆడుకుంటుండగా ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.చిన్నారి తల్లిదండ్రులు గమనించి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై..
సాక్షి,చిన్నశంకరంపేట(మెదక్): ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై పద్నాగేళ్ల బాలుడు లైంగిక దాడికిపాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు లైంగికదాడికి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్క ఇంటిలోఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది. చిన్నారి తల్లిదండ్రులు చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించారు. పాపను మెదక్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీస్‌లు తెలిపారు. కాగా బాలుడు పరారీలో ఉన్నాడని తెలిసింది. మరో ఘటనలో.. యువతి అదృశ్యం నారాయణఖేడ్: కుటుంబం పొలం పనులకు వెళ్లిన సమయంలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నా రాయణఖేడ్ మండలం శేరితండాకు చెందిన ఓ మహిళ అక్టోబర్ 29న తన కూతురును ఇంటిలో ఉంచి కొడుకు, కోడలితో కలిసి అల్లాపూర్ శివారులో కౌలుకు తీసుకున్న చేలో పత్తిని తెంచడానికి వెళ్లింది. పొలం నుంచి సాయంత్రం ఇంటికి రాగా కూతురు కనిపించలేదు. చుట్టుపక్కలవారిని, బంధువులను విచారించినా ఆమె ఆ చూకీ తెలియలేదు. దీంతో యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించడంతో.. బయటకు వెళ్లి.. -
ఈడ్చుకొచ్చి, గొంతు కోసి రేప్ చేయాలని చూశాడు...కానీ
తిరువనంతపురం: అమ్మాయిలు, మహిళలపై కామాంధుల అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. మైనర్ బాలురు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కేరళలోని ఒక యువతి దారికాచి దాడిచేసిన మైనర్‌బాలుడి దుర్మార్గంనుంచి తృటిలో తప్పించుకుంది. కేరళ, మలుప్పురం జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలుడు(15) స్థానిక మహిళ (21) పై దారి కాచి దాడిచేశాడు.సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసులకు వెళ్తున్న మహిళను వెంబడించి మరీ రోడ్డు పక్కనే ఉన్న ప్లాంటేషన్ ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధిత యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎటాక్ చేశాడు. ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. అనంతరం ఆమె దుపట్టాతో చేతులు కట్టి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ క్రమంలో నిందితుడు ఆమె గొంతు కోసేందుకు కూడా ప్రయత్నించాడని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ ఎస్ తెలిపారు. అయితే బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని సమీపంలోని ఇంటికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందన్నారు.నిందితుడిపై కేసునమోదు చేసిన పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ షాక్‌నుంచి బాధితురాలు తేరుకోవడానికి సమయం పడుతుంది కనుక విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు నిందితుడికి మార్షల్ ఆర్ట్ జూడోకూడా తెలుసని, జిల్లా స్థాయి ఛాంపియన్ అని వెల్లడించారు. అయినా ఆమె చాకచక్యంగా తప్పించుకోవడం విశేషమన్నారు. -
ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..
సాక్షి, హిమాయత్‌నగర్: ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ వ్యవహారం ఈ రెండింటినీ భరించలేక మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగు చూసింది. ఎస్ఐ మధుసూదన్ సమాచారం మేరకు... కింగ్ కోఠి పరదాగేట్లో నివాసం ఉంటున్న ఎం.డి.అంజాద్‌ఖాన్, రజ్వీయా సుల్తానా దంపతుల కుమారుడు ఎం.డి.అక్బర్‌ఖాన్(16 ) నగరంలో ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తనకు చదువుపై ఆసక్తి లేదు. ఇటీవల తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇలా ఓ వైపు చదువు మరో పక్క ప్రేమ వ్యవహారం అతన్ని మానిసికంగా కుంగదీశాయి. ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పలేక, ఎవరినీ బాధ పెట్టలేక సోమవారం అర్ధరాత్రి బెడ్రూంలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రజ్వీయా సుల్తానా ఎంత పిలిచినా పలకలేదు. అనుమానం వచ్చి కిటికీ గ్రిల్స్ తొలగించి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. చదవండి: (‘క్షమించండి.. నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి’) -
వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరు బనశంకరిలోని యారబ్‌నగరలో మహిళా టైలర్ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి, మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యాడు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆమె బంధువైన పీయూసీ విద్యార్థే (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే నిందితుని కుటుంబం కొత్త ఇల్లు కడుతోంది. అబ్బాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దామని హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బు ఇవ్వాలని ఆమెను అతడు పీడించాడు. దీంతో గొడవ జరిగింది, అబ్బాయి కత్తెర తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను.. -
మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి!
చెన్నై: మైనర్ బాలుడిని ట్రాప్ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలుడు కాలేజ్‌కు వెళ్లేటప్పుడు.. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేవాడు. దీంతో ఆ యువతితో ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు తీసుకునే వరకు వచ్చింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఏడాది పాటు ఆ యువతి, మైనర్ బాలుడు జాలీగా కలిసి గడిపారు. కాగా, వీరిద్దరి విషయం మైనర్ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా.. యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్చుకోలేదు. తాజాగా, బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి -
నంబర్ ప్లేట్‌పై ‘అప్నా టైమ్ ఆయేగా’.. ఇక నీ టైం అయిపోయింది!
సాక్షి, నల్లకుంట: నంబర్ ప్లేట్‌పై నంబర్ కనిపించకుండా ట్రాఫిక్ వయోలెన్స్‌కు పాల్పడిన ఓ మైనర్‌పై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం ఓయూ ఎన్సీసీ ఎక్స్ రోడ్స్ వద్ద నల్లకుంట సెక్టార్–2 పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విద్యానగర్ చర్చి కాలనీకి చెందిన ఓ మైనర్ (16) హీరో మ్యాస్ట్రో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. వాహనం నంబర్ ప్లేట్‌పై నల్లటి తొడుగు ఉండడంతో ఆ వాహనాన్ని వెంబడించిన పోలీసులు విద్యానగర్ చర్చి వద్ద నిలిపి వేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో పోలీసులు పంపించే ఈ చలానాల నుంచి తప్పించుకోవడానికి వెనుక నంబర్ ప్లేట్‌పై మాస్క్ లాంటి నల్లటి ఓ తొడుగును తొడిగాడు. దానిపై ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే స్లోగన్ రాశాడు. ఆర్సీ చెక్ చేయగా వాహన నంబర్ టీఎస్11ఈసీ 7505 అని ఉంది. ఇక ఏముంది అప్నా టైమ్ ఆయేగా కాదు ఇప్పుడు పోలీసుల టైం వచ్చిందంటూ మోటారు వాహన చట్టం ప్రకారం నల్లకుంట పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
భార్య కావాలన్న మైనర్ బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే
లక్నో: ఒక్కోసారి కోర్టుకు కొన్ని వింత కేసులు వస్తుంటాయ్. తాజాగా అలాంటి ఓ కేసు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆజంగఢ్‌కు చెందిన ఓ 16 ఏళ్ల బాలుడికి ఓ మేజర్ యువతితో వివాహమైంది. కాగా బాలుడు ఎవరితో ఉండాలనే విషయంపై అతడి తల్లి, భార్య మధ్య తలెత్తిన వివాదం అలహాబాద్ హైకోర్టు వరకు వెళ్లింది. మరి ఇటువంటి వింత కేసుకు కోర్టు ఎలా స్పందించిందో చూద్దాం. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్‌లో ఉంటున్న ఓ మైనర్ బాలుడు తన కన్నా వయసులో పెద్దదైన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లి తన కొడుకును తన వద్దకు పంపించాలని కోరుతూ గతేడాది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్18, 2020 జరిగిన విచారణలో న్యాయమూర్తి బాలుడి అభిప్రాయాన్ని తెలపాలని అడగగా.. తాను ఇష్టపడే ఆమెను పెళ్లి చేసుకున్నట్లు అంగీకరిస్తూ తనకు పెళ్లామే కావాలని కోరాడు. అదే క్రమంలో తన తల్లితో వెళ్లేందుకు నిరాకరించాడు. కేసు తిరిగి ఈ ఏడాది మే 31న విచారణలో.. మైనర్ బాలుడు మేజర్ యువతితో వివాహం చట్ట ప్రకారం చెల్లదు. ప్రస్తుతం ఆ బాలుడికి మైనార్టీ తీరకపోవడంతో అతడిని 2022 ఫ్రిబ్రవరి 24 వరకు ప్రభుత్వ షెల్టర్ హోం నందు ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. బాలుడికి మైనార్టీ తీరాక అతని ఇష్టం ప్రకారం ఎవరితోనైనా ఉండోచ్చని స్పష్టం చేసింది. కాగా ఆ బాలుడు ఇటీవలే తండ్రి కూడా అయ్యాడు. చదవండి: సంచలనం: గంగానదిలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన -
‘రోజూ నరకం చూపేవాడు.. కసితీరా పొడిచి చంపేశా’
గాంధీనగర్: నిండా పదిహేనేళ్లు కూడా లేవు.. లోకం పోకడ గురించి తెలియదు. చదువుకుంటూ.. స్నేహితులతో కలిసి.. సంతోషంగా గడపాల్సిన ఆ కుర్రాడు హంతకుడిగా మారాడు. క్షణికావేశంలో తల్లి చేసిన తప్పు ఆ కుర్రాడి జీవితాన్ని గందరగోళం చేసింది. ఆ వివరాలు.. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన నిందితుడి తల్లి.. చాలా ఏళ్ల క్రితమే ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజులు తర్వాత ప్రియుడి నిజ స్వరూపం బయటపడింది. చీటికి మాటికి ఆమెతో గొడవపడుతూ.. చికతబాదేవాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె మైనర్ కుర్రాడిని కూడా కొట్టేవాడు. ప్రతి రోజు చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ బాధ భరించలేకపోయిన నిందితుడు.. తల్లి ప్రియుడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 17న అతడిని తీసుకుని బైక్ మీద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత కత్తితో అతడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతడు మరణించేవరకు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు. ఇక దర్యాప్తులో మైనర్ బాలుడి పేరు వెలుగులోకి రావడంతో.. కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడు.. చనిపోయిన వ్యక్తి ప్రతి రోజు తనను, తల్లిని చిత్ర హింసలకు గురి చేసేవాడని.. నరకం చూపేవాడని.. అందుకే అతడిని హత్య చేశానని అంగీకరించాడు. చదవండి: ‘అతని వల్లే నా భర్త వదిలేశాడు.. ప్రియుడు పెళ్లి చేసుకోవాలి’ -
మృతదేహం మాయం: టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి
సాక్షి, కమ్మర్పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌లో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురవడం, అనుమానితుడి ఇంటిని వందలాది మంది ముట్టడించడం, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హాసాకొత్తూర్ మారుతినగర్లో నివాసముండే మాలవత్ శ్రీనివాస్, సరోజ దంపతులకు ఇద్దరు కుమారులు కృష్ణ, సిద్ధార్థ (17) ఉన్నారు. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ అచేతన స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. సరోజ వ్యవసాయ కూలీ కాగా, పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు. చిన్న కొడుకు సిద్ధార్థ హార్వెస్టర్ క్లీనర్‌గా కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కరోనాతో చనిపోయాడని.. బుధవారం రాత్రి సిద్ధార్థను అతని స్నేహితుడు నరేందర్ వచ్చి మెదక్ వెళ్లాల్సి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో సిద్ధార్థకు వరసకు మామ అయిన వసంత్, అన్న కృష్ణకు ఫోన్ చేసి సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కనక రాజేశ్ చెప్పాడు. అంత్యక్రియల నిమిత్తం గండి హన్మాన్ ప్రాంతానికి రమ్మని తెలిపాడు. దీంతో కృష్ణ, వసంత్‌తో పాటు రవి, స్వామి అక్కడకు వెళ్లగా, ఎవరు లేరు. మరోవైపు, సిద్ధార్థ గురించి నరేందర్‌ను అడిగితే రాత్రి భోజనం చేశామని, కొద్దిసేపటికి సిద్ధార్థకు ఫోన్ రాగా బయటకు వెళ్లాడని తెలిపాడు. మరోవైపు, గండి హన్మాన్ వద్ద మృతదేహం ఉందని చెప్పినప్పటికీ అక్కడ లేకపోవడం, ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీ గదిలో మృతదేహం తేలడం అంతా సినీ ఫక్కీలో జరిగి పోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగా, వారు మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై, తలపై కమిలి పోయిన గాయాలు కనిపించాయి. కట్టెలతో కొట్టి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. ఇంటిపై దాడికి యత్నం.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కనక రాజేశ్, అతని అనుచరులు కలిసి 15 రోజుల క్రితమే కృష్ణ, సిద్ధార్థను చంపేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థను కనక రాజేశ్, అతని అనుచరులు బాలాగౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్ తదితరులు కలిసి చంపేశారని వాపోయారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు రాజేశ్ ఇంటిని ముట్టడించారు. నిందితుడి ఇంటిపై దాడికి యత్నించగా, పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. గంట గంటకు పరిస్థితులు మారి పోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను దింపారు. ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలుమార్లు ఆందోళనకారులను చెరదగొట్టారు. పరిస్థితులు చేయి దాటుతుండడంతో అదనపు బలగాలను పిలిపించారు. ఇటు స్థానికులు, అటు పోలీసులు.. ఆరేడు వందల మందికి పైగా అక్కడ గుమిగూడారు. సాయంత్రం వేళ నిజామాబాద్ డీసీపీలు స్వామి, శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ రఘు చేరుకొని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. బందోబస్తు నడుమ అంత్యక్రియలు.. పరిస్థితులు అదుపులోకి వచ్చాక పోలీసులు రాత్రి ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్నతాధికారుల సమక్షంలో, భారీ బందోబస్తు మధ్యే రాత్రి వేళ ఖననం చేశారు. మరోవైపు, మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. చదవండి: రైస్‌పుల్లింగ్: రాగిపాత్రకు రంగుపూసి.. -
వైరల్ వీడియో: చిన్నారికి పంజాబ్ ముఖ్యమంత్రి సాయం
-
సీఎంని కదిలించిన 10 ఏళ్ల బాలుడి పరిస్థితి.. వీడియో వైరల్
లుధియానా: పలకా బలపం పట్టి బడికి పోవాల్సిన చిన్నారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిక్షాటన చేయడం, లేదా చిన్ని చిన్న వస్తువులను అమ్ముకుంటున్న దృశ్యాలు మనందరికీ రోజు కనిపించేవే. అలాంటి సంఘటన ఒకటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను కదిలించింది. వెంటనే ఆ చిన్ని తమ్ముడిని ఆదుకునేందుకు రంగంలోకి దిగిపోయారు. తక్షణమే రూ. 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతేకాదు అధికారులతో మాట్లాడి ఆ బాలుడు తన చదువును కొనసాగించేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిని కదిలించిన ఆ బాలుడి విశేషాలు : పదేళ్ల వయసున్న వన్ష్ సింగ్ అనే చిన్నారి లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సాక్సులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండ తరగతిలోనే బడి మానేసిన బాలుడు సాక్సులమ్మి కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నాడు. దీన్ని గమనించిన కారులోని ఒకవ్యక్తి చిన్నారి మీద జాలితో వ్యక్తి డబ్బులివ్వడానికి ప్రయత్నించాడు. కానీ దాన్ని వన్షు తిరస్కరించాడు. దీన్ని గమనించిన మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోనే సీఎం కంటపడింది. వెంటనే ఆయన బాలుడితో వీడియో ఫోన్ ద్వారా మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి పాఠశాలలో చేర్పించేలా చూస్తానని, శ్రద్ధగా చదువుకోవాలని వన్షుకి హితవు పలికారు. కుటుంబ ఖర్చులను తాను చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. దీంతో అటు వన్షు ఆత్మగౌవరం, నిజాయితీ పైనా, ఇటు సీఎం ఔదార్యంపైనా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమరేందర్ సింగ్‌ను "నిజమైన సీఎం" అంటూ ప్రశాంత్ దహిభేట్ అనే ట్విటర్ యూజర్ కొనియాడారు. అలాగే పంజాబ్‌లోని ఏ పిల్లవాడూ ఇకపై చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చూడాలని మరొకరు కామెంట్ చేయడం విశేషం. -
పైకి చూస్తే మైనర్.. పనులు మాత్రం ముదురే
సాక్షి, హైదరాబాద్: పైకి చూస్తే మైనరే. చేసే పనులు మాత్రం ముదురే. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉంటే నమ్మక ద్రోహానికి ఒడిగట్టాడు. ఓ యువతికి చుక్కలు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు ‘మైనర్’ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఓ సందర్భంలో ఆమెకు సహకరించిన ఇతగాడు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిటీకి చెందిన ఓ యువతి వైద్య విద్యనభ్యసిస్తున్నారు. ఆమెకు చెందిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతాల్లో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో పాటు తొలగించడం కోసం ఆమె తన పక్కింట్లో ఉండే ఓ బాలుడి సహాయం తీసుకున్నారు. అతడు ఈ యువతితో స్నేహంగా, ఆత్మీయంగా మెలిగేవాడు. ఆమెకు సహకరించిన ఇతగాడు తన ఈ– మెయిల్ ఐడీ, పాస్వర్డ్ తదితరాలను సంగ్రహించాడు. అదను చూసుకుని ఆమె మెయిల్ ఐడీని యాక్సెస్ చేశాడు. దాని ద్వారా ఆమె ఆన్లైన్ క్లాసుల్లోకి అక్రమంగా ప్రవేశించేవాడు. అంతటితో ఆగకుండా ఆ క్లాసుల్లో ఆమె పోస్టు చేస్తున్నట్లు అసభ్య, అశ్లీల ఫొటోలు షేర్ చేసేవాడు. ఆ మెయిల్లో ఆమె సేవ్ చేసుకున్న ఫొటోలను తన అధీనంలోకి తీసుకున్నాడు. తన వద్ద ఉన్న మెయిల్ వివరాల ఆధారంగా వారి ఇంటి వైఫై కనెక్షన్‌ను యాక్సెస్ చేసి ఫోన్లు హ్యాంగ్ అయ్యేలా చేశాడు. ఇలా వాటిని గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్ చేసిన భావన కలిగించాడు. బాధితురాలి ఫేస్బుక్ ఖాతాను యాక్సెస్ చేసిన బాలుడు అందులో ఆమె చేసినట్లు అశ్లీల ఫొటోలు పోస్టు చేశాడు. ఆమెతో పాటు వారి కుటుంబికుల దైనందిన జీవితాలను చూస్తున్న ఈ మైనర్ ఆ వివరాలను వారికి మెయిల్ చేసి తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు భావించేలా చేశాడు. ఈ పనులు చేస్తూ తనలో తాను వికృతానందం పొందేవాడు. కొన్ని సందర్భాల్లో నిజం తెలియని బాధితురాలు ఈ బాలుడి వద్దకే వచ్చి విషయం చెప్పేది. తన ఫేస్బుక్ ఖాతా బ్లాక్ చేయాలని కోరేది. ఆమె ముందు అలాగే చేసిన మైనర్ ఆ తర్వాత యాక్టివ్ చేసే వాడు. తుదకు సైబర్ వేధింపులతో విసిగివేసారిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్వాపరాలు పరిశీలించి, సాంకేతికంగా దర్యాప్తు చేసి యువతి పక్కింటి బాలుడే బాధ్యుడని తేల్చారు. అతడిని పట్టుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. చదవండి: ఖైరతాబాద్: ఆన్లైన్ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్ చేస్తూ.. -
ఏడాదిగా మైనర్ బాలుడిపై అత్యాచారం చేస్తోన్న మహిళ
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఏడాది నుంచి పద్నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతోంది. తాజాగా తాను సదురు బాలుడి వల్ల గర్భవతి అయినట్లు తెలిపింది. వివరాలు.. అర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన బ్రిట్ని గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం నెరపుతోంది. దీని గురించి గతేడాది సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాక బ్రిట్ని మైనర్ బాలుడి వల్ల గర్భవతి అయినట్లు తెలిపాడు. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు బ్రిట్ని నివాసానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బ్రిట్ని ఏడాది నుంచి మైనర్ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్నానని.. ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతిని అని పోలీసులకు వెల్లడించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రిట్నిని ఈ నెల 1న అరెస్ట్ చేశారు. అనంతరం 5000 డాలర్ల పూచికత్తు మీద ఆమె విడుదలయ్యింది. ఏప్రిల్ 23న ఆమెని కోర్టు ముందు హాజరు పరచనున్నారు పోలీసులు. చదవండి: నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు.. -
క్లాస్‌రూంలోనే దారుణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి లోకమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తోంటే.. బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థి మాత్రం తన సహచరుడిపై పగతో రగిలిపోయాడు. క్లాస్ రూంలో జరిగిన చిన్న తగాదాకే పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. ఇద్దరూ మైనర్ బాలురు కావడం, నిందితుడు తరగతి గదిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడటం ఆందోళన రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే. కేవలం సీటుకోసం నిన్న (బుధవారం) ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు తన మామయ్య తుపాకీని పాఠశాలకు తీసుకెళ్లి మరీ గురువారం ఉదయం బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంతేకాదు నిందితుడి బ్యాగులోమరో నాటు తుపాకీ కూడా ఉండటం పోలీసులను కూడా విస్మయపర్చింది. సైన్యంలోపనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్డ్ తుపాకీని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు. ఘటనా స్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
నాలుగేళ్ల బాలుడిపై దారుణం..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా పరిధిలో పన్నెండేళ్ల బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన బయటపడింది. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ అమానుషం బాధిత బాలుని తండ్రి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగుచూసింది. సెక్టార్ బేటా 2 ఎస్హెచ్ఓ సుజీత్ ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కపక్క ఇళ్లల్లో ఉండే రెండు కుటుంబాలకు చెందిన 12 ఏళ్లు, 16 ఏళ్ల బాలురు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఒకే బస్‌లో స్కూలు వెళ్లొస్తారు. ఈక్రమంలోనే 12 ఏళ్ల బాలునికి మాయమాటలు చెప్పిన నిందితుడు (16 ఏళ్ల బాలుడు) లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యాడు. ఈక్రమంలోనే చైల్డ్ లైఫ్ నెంబర్ 1098 కి ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. చైల్డ్ లైఫ్ ప్రతినిధులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోక్సో చట్టం, ఐపీసీ 377 సెక్షన్ (అసహజ నేరాలు) కింద కేసులు నమోదు చేశామని ఎస్హెచ్ఓ సుజీత్ ఉపాధ్యాయ తెలిపారు. కాగా, 2018లోనే ఓసారి నిందితుని అకృత్యాలు బయటపడినట్టు తెలిసింది. బాధిత బాలుని తల్లిదండ్రులు నిందితుని కుటుంబ సభ్యులను హెచ్చరించడంతో వారు అక్కడ నుంచి ఇళ్లు ఖాళీ చేసి మరోచోటుకు వెళ్లిపోయారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్!) -
12 ఏళ్ల బాలుడిపై యజమాని దారుణం!
-
అందరూ చూస్తుండగానే దారుణం!
సాక్షి, నిజామాబాద్: 12 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా ఓ వ్యక్తి అతని పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. పనిలోకి రావడం లేదని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. కొట్టొద్దని ఆ బాలుడు యజమానిని ఎంతగా బతిమాలినా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కాళ్లకు తాడు కట్టి బాలుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్‌లో బుధవారం ఈ దారుణం వెలుగుచూసింది. బాలుడిని యజమాని చిత్ర హింసలకు గురిచేస్తున్నా జనమంతా చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. (ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని అక్కాచెల్లెళ్లు..) ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం కాగా, మైనర్ బాలుడిపై దాడి ఘటనపై మల్కాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ స్పందించింది. ఈ అమానుష దాడి ఘటనను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ఇదిలాఉండగా.. బాలుడిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిజామాబాద్ రూరల్ పోలీసులు మల్కాపూర్ చేరుకున్నారు. వివరాలు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
పదేళ్ల బాలుడు పది లక్షలు కొట్టేశాడు
ఇండోర్: అందరూ చూస్తుండగానే పదేళ్ల బాలుడు పది లక్షలు కాజేసిన షాకింగ్ ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నీమూచ్ జిల్లాలోని జవద్ ప్రాంతంలో ఓ కార్పొరేటివ్ బ్యాంకు ఉంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ బ్యాంకులోకి అందరూ కస్టమర్లతోపాటు ఓ బాలుడు ప్రవేశించాడు. అయితే రాగానే నెమ్మదిగా వెళ్లి క్యాషియర్ క్యాబిన్లోకి దూరి ఓ మూలకు నక్కాడు. ఎదురుగా బారెడంత క్యూ ఉన్నా వారెవరికీ ఈ బక్కపలుచని బుడ్డోడు కనిపించలేదు. పైగా అక్కడ క్యాబిన్లో సదరు ఉద్యోగి లేకపోవడంతో దొరికిందే చాన్సని అక్కడున్న 500 నోట్ల కట్టలను దొరికిన కాడికి అందుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి క్షణమాలస్యం చేయకుండా ఉడాయించాడు. (కరోనా : భార్య శాంపిల్స్ పనిమనిషి పేరుతో.. ) ఈ చోరీ అంతా కేవలం ముప్పై సెకన్లలోనే పూర్తి చేసేయడం విశేషం. అయితే ఆ పిల్లవాడు బ్యాంకు నుంచి అడుగు బయటపెట్టే ముందు అలారమ్ మోగింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు గార్డు అతని వెనకాలే పరిగెత్తాడు, కానీ అప్పటికే ఆ బుడ్డోడు జారుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా వారు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో ఆ పిల్లవాడికి బ్యాంకులో ఉన్న మరో వ్యక్తి సహకరించినట్లు స్పష్టమైంది. ఈ ఘటనపై జవద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ.. "మైనర్ బాలుడుతోపాటు, అతనికి సహకరించిన వ్యక్తి వేర్వేరు దారుల్లో పరిగెత్తారు. ఆ ప్రాంతంలో రోడ్ల పక్కన ఉండే దుకాణాదారులను దీని గురించి ప్రశ్నిస్తున్నాం. సెక్యూరిటీ గార్డును సైతం విచారిస్తున్నాం" అని తెలిపారు. (ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..) -
పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు
సాక్షి, చండీగఢ్ : పబ్జీ మాయలో పడి లక్షల రూపాయలను మాయం చేసిన ఘటన మరువకముందే పంజాబ్‌లో మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా మొహాలికీ చెందిన ఒక టీనేజర్ (15) పబ్జీ ఉచ్చులో చిక్కుకుని తన తాత ఖాతాలోంచి 2 లక్షల రూపాయలను కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..) తాజా నివేదికల ప్రకారం మొహాలికి చెందిన బాలుడు పబ్జీ మొబైల్ గేమ్ వలలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ గేమ్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఇదే అదునుగా భావించిన అతని సీనియర్ ఒకడు ఆటలో మెలకువలు నేర్పుతానని మభ్యపెట్టాడు. దీంతో సీనియర్ నుంచి శిక్షణ పొందేందుడు మైనర్ బాలుడు తన తాతా ఖాతానుంచి భారీ ఎత్తున రహస్య చెల్లింపు చేసేవాడు. తాతా పెన్షన్ ఖాతాను ఇటీవల పేటీఎంకు లింక్ చేయడంతో ఈ టీనేజర్ పని మరింత సులువైంది. పైగా అతని ఖాతాలోని లావాదేవీలను ఇతర కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో అతనికి అడ్డే లేకుండా పోయింది. గత రెండు నెలల కాలంలో పేటీఎంద్వారా 30కి పైగా లావాదేవీలు చేశాడు. ఈ గేమ్‌కు అవసరమైన స్కిన్, క్రాట్స్ ఇతర ఫీచర్లను కొనుగోలు చేసుందుకు 55వేలు ఖర్చు పెట్టాడు. మొత్తంగా సుమారు 2 లక్షల రూపాయలను మాయం జేశాడు. చివరికి విషయం తెలిసిన కుటుంబ పెద్దలు గట్టిగా నిలదీయడంతో పబ్జీలోని రాయల్ ఆట కోసం 2 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు మైనర్ బాలుడు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఈ ఆటకోసం కొత్త సిమ్‌కార్డును కూడా కొనుగోలు చేసినట్టు తెలిపాడు. దీంతో బాలుడి కుటుంబం మొహాలీ ఎస్‌ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. కాగా పంజాబ్‌లోని ఖరార్‌లోని ఒక యువకుడు తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుండి 16 లక్షల రూపాయల మాయం చేసిన ఘటన గతవారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కరోనా, లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడటంతో ఇంటికే పరిమితమవుతున్న చిన్నపిల్లలు, టీనేజర్లు, విద్యార్థులు పబ్జీ గేమ్‌కు బానిసలవుతున్నారు. దీంతో మే నెలలో రికార్డు స్థాయిలో 270 మిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని వసూలు చేసిందంటేనే ఈ గేమ్ డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. -
డబ్బుల కోసం నానమ్మను చంపేశాడు
మొయినాబాద్(చేవెళ్ల): ఓ బాలుడు డబ్బుల కోసం తన నానమ్మతో గొడవపడి ఆమె గొంతునులిమి హత్యచేశాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం శ్రీరాంనగర్‌లో సోమవారం జరిగింది. ఎస్సై జగదీష్, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ(65) కొడుకు కుమార్ కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ఆమె కోడలు విజయ, ఇద్దరు మనవలు, మనువరాలితో కలిసి ఉండేది. రెండో మనవడు (16) పదో తరగతి వరకు చదివి గ్రామంలో కొంతకాలంగా ఖాళీగా తిరుగుతున్నాడు. డబ్బులు ఇవ్వాలంటూ తరచూ అతడు నానమ్మ వెంకటమ్మతో గొడవపడేవాడు. అయితే, ఆదివారం కోడలు విజయ, పెద్ద మనవడు, మనవరాలు బంధువుల వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న బాలుడు డబ్బులు కావాలని వెంకటమ్మతో గొడవపడ్డాడు. ఈక్రమంలో రాత్రి 10 గంటల సమయంలో ఆమెతో మరోమారు ఘర్షణపడి బెల్టుతో కొట్టాడు. అనంతరం గొంతు నులిమేయడంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి అనంతరం స్నేహితుడి ఇంటికి వెళ్లి నిద్రించాడు. సోమవారం ఉదయం నల్లా నీళ్లు వస్తున్నాయని చెప్పేందుకు పక్కింటి వారు వెళ్లి చూడగా వెంకటమ్మ విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ జానయ్య, ఎస్సై జగదీష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.(బాలిక బలవన్మరణం) పోలీసుల అదుపులో బాలుడు డబ్బుల కోసం నానమ్మను హత్య చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటమ్మ మృతి విషయంపై గ్రామస్తులకు ఆమె చిన్న మనవడిపై అనుమానం వచ్చి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా, వృద్ధురాలు హత్యకు బాలుడికి మరో ఇద్దరు యువకులు కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు రాబడతామని చెబుతున్నారు. -
బాలుడిపై యువకుడి అత్యాచారం, ఆపై..
లక్నో: ఓ వ్యక్తి మైనర్ బాలుడిపై అసహజ అత్యాచారానికి పాల్పడటమే కాక బతికుండగానే కాల్చివేయడానికి ప్రయత్నించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ప్రయాగరాలో సల్మాన్ అనే యువకుడు బుధవారం మధ్యాహ్నం ఓ మైనర్ బాలుడిని ఆడుకుందామని పిలిచాడు. దీంతో అతన్ని నమ్మి వెళ్లిన పదేళ్ల బాలుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాలుడు రక్షించండంటూ సాయం కోసం కేకలు వేస్తూ ఏడ్చాడు. (భార్యకు కరోనా పాజిటివ్.. భర్త ఆత్మహత్య) దీంతో ఆగ్రహం చెందిన నిందితుడు బాలుడి గొంతు నులుముతూ హత్యాచారానికి ప్రయత్నించగా అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చనిపోయాడని భావించిన నిందితుడు అతడిని తగులబెట్టాలని భావించాడు. వెంటనే పిల్లవాడిని సమీపంలోని పొదలోకి లాక్కెళ్లి అతడి శరీరానికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. స్పృహలోకి వచ్చిన మైనర్ బాలుడు సాయం కోసం అరవడంతో గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. (ఎదిగి వస్తున్నారనుకున్న పిల్లలు..) -
ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
-
ట్రాక్టర్ ఢీ: కళ్లెదుటే స్నేహితుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ వివేకానంద చౌరస్తాలో ఓ ట్రాక్టర్ సైకిల్‌ను ఢీకొట్టింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో జగదీష్ (12) అనే బాలుడు మృతిచెందగా.. అతడి స్నేహితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. సూర్యాపేట జిల్లాకు చెందిన నగేశ్, మంగమ్మ దంపతులు గత కొంతకాలంగా మీర్‌పేటలోని దాసరి నారాయణ కాలనీలో నివాసముంటున్నారు. ఈక్రమంలో వారి రెండో కుమారుడు జగదీశ్ స్నేహితుడితో కలిసి సైకిల్‌పై వెళ్తున్నాడు. వివేకానంద చౌరస్తావద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారి సైకిల్‌ను ఢీకొట్టింది. జగదీశ్ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోగా.. అతని స్నేహితుడు ఎగిరి పక్కకు పడ్డాడు. తీవ్రగాయాలతో జగదీశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగదీశ్ బాలాపూర్‌లోని శ్రీగాయత్రి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇక ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కూడా మైనరే కావడం గమనార్హం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో నమోదయ్యాయి. -
మైనర్‌కు బైక్ విక్రయం.. కుటుంబ సభ్యుల గొడవ
సనత్‌నగర్: ఓ మైనర్ బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించడం వివాదానికి దారితీసింది. దీంతో బేగంపేట్‌లోని ఓ షోరూం వద్ద బాలుడి బంధువులు, షోరూమ్ నిర్వాహకుల మధ్య గొడవ జరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే నాచారం అన్నపూర్ణ కాలనీకి చెందిన జంగయ్య కుమారుడు సాయి(17) తన సోదరుడితో కలిసి బేగంపేట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కేటీఎం మోటర్స్ షోరూంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30న కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా తన సోదరుడు నిఖిత్(19) పేరు మీద వాహనాన్ని తీసుకున్నాడు. పది రోజుల క్రితం బాలుడు బైక్ నడుపుతూ ఘట్కేసర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. ఈ విషయం బాలుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో బైక్ ఎక్కడిదని ప్రశ్నించగా.. ఇంట్లో వారికీ చెప్పకుండా తానే వాహనాన్ని కొన్నట్టు చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి జంగయ్య, బాబాయి రవినాయక్ శనివారం బేగంపేటలోని కేటీఎం షోరూంకు వచ్చి బాలుడికి ద్విచక్ర వాహనాన్ని ఎలా విక్రయించారంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీనిపై 100 డయల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షోరూం నిర్వాహకులు తమపై దాడి చేశారని బాలుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారే తమపై దాడి చేశారని షోరూం సిబ్బంది మరో ఫిర్యాదు చేశారు. అయితే, తాము బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించలేదని, అతని సోదరుడితో కలిసి వచ్చి కొనుగోలు చేసినట్లు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సిన్మాలు చూసి.. ఇంటర్నెట్లో వెతికి..!
సాక్షి, హైదరాబాద్: 14 ఏళ్ల పిల్లాడు ఏడేళ్ల బాలుణ్ని కిడ్నాప్ చెయ్యడం సాధారణ వ్యక్తుల్నే కాదు.. పోలీసుల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకే అతన్ని లోతుగా విచారించారు. కిడ్నాప్‌కు తెగించిన నేపథ్యాన్ని తెలుసుకున్నారు. కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చిందని అడిగారు. పోలీసులకు ఏ మాత్రం తడుముకోకుండా ఆ బాలుడు చెప్పిన సమాధానాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. సినిమాలను చూసే తాను చోరీలు, కిడ్నాప్ చెయ్యడం నేర్చుకున్నానని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. మీర్‌పేటలో ఏడేళ్ల బాలుణ్ని 14 ఏళ్ల మరో బాలుడు కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పదో తరగతి చదివే బాలుడు మూడు లక్షలు కావాలంటూ మీర్‌పేటలో అర్జున్ అనే పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి మీ కొడుకు నీకు దక్కాలంటే వెంటనే డబ్బు ఏర్పాటు చెయ్యి అని బెదిరించాడు. చివరికి పోలీసులు చైల్డ్ కిడ్నాపర్‌ను ఫేస్బుక్ అకౌంట్, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. ఏడేళ్ల అర్జున్ను సేవ్ చేసి.. కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. అయితే.. ఈ 14 ఏళ్ల పిల్లాడికి కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చింది. వాడి బుర్రలో ఉంటే చదువు లేదా ఆటపాటలు ఉండాలి. అలాంటిది నేరాలు, ఘోరాలు.. ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఎందుకు ఆలోచించాడు. ముందుగా పోలీసులు అతని నేపథ్యం ఏంటో తెలుసుకున్నారు. గతంలో అతను ఓ ఇంట్లో లక్ష రూపాయలు చోరీ చేసి దొరికిపోయాడట. అప్పటికైనా పెద్దవాళ్లు అతని ఆలోచనల్ని పసిగట్టాల్సింది. ఆ విషయం పోలీసులదాకా వెళ్లకుండా కప్పిపెట్టారు. ఆ దొంగతనాన్ని సెటిల్ చేసుకున్నారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్ తర్వాత పోలీసులు కిడ్నాప్ చేసేంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటూ బాలుడిని ప్రశ్నించారు. సినిమాల్లో హీరోలు చేసే చోరీలను చూసి తాను కూడా డబ్బు కోసం దొంగతనాలు చెయ్యాలని డిసైడయ్యాడట. ఈ క్రమంలోనే వెంటనే ఎక్కువ డబ్బు ఎలా వస్తుందంటూ ఇంటర్ నెట్లో వెదుకుతూ వెళ్తే.. కిడ్నాప్ చెయ్యాలని అతనికి తట్టిందట. అలా సినిమాలు.. వీడియోలు చూసిన అనుభవాన్ని ఆచరణలో పెట్టినట్లు బాలుడు చెప్పాడు. అలా వచ్చే డబ్బుతో ఏం చేస్తావ్ అడిగినప్పుడు.. ఛలో ముంబై.. ముంబయి ఎగిరిపోయి... జల్సాగా బతకాలి అన్నాడట. బాలుడి ప్రవర్తనలో ఇంతటి మార్పులకు కారణం అతను చూసే సినిమాలు, వీడియోలేనని పోలీసులు తెలిపారు. సినిమాలు తీసేవాళ్లకు ఆ సినిమా ఎంత బలమైన మాధ్యమమో.. దాన్ని ఎంతమంది పిల్లలు చూసి నేర్చుకుంటారో అనే బాధ్యత ఉండదు. అమ్మాయిల్ని ఏడిపించే హీరోలను.. చోరీలను చేసే హీరోలను.. గ్యాంగులు మెయిన్ టైన్ చేసి డాన్ లుగా ఎదిగే హీరోలను చూస్తూ మన పిల్లలు పెరుగుతున్నారు. ఎక్కువగా ఏం చూస్తే వాటిని అనుసరించడం పిల్లల సహజ స్వభావం. నేరం అని తెలియకుండా నేరాలు చేసే పిల్లలు.. దొరికిపోతామన్న భయం లేకుండా తీవ్రమైన క్రైమ్స్ చేసే పిల్లలు ఇప్పుడు పెరిగిపోతున్నారు. వాళ్ల అలా మారడానికి కారణం సమాజం. మనముందున్న పరిస్థితులేమిటన్న వాస్తవం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటపడుతోంది. అందుకే పిల్లల్ని రెండు రకాలుగా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల్ని నేరాల బారిన పడకుండా కాపాడుకుంటూనే... నేరాల వైపు ఆకర్షితులు కాకుండా పెంచడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాంటిదే. -
ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన మైనర్; తండ్రికే టోపి
లక్నో : ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డ ఓ మైనర్ బాలుడు తండ్రి బ్యాంక్ నుంచి డబ్బులు కాజేయడం ప్రారంభించాడు. దీనికోసం తండ్రి ఫోన్లోని పేటీఎమ్ నుంచి ఈ తతంగాన్నినడిపించాడు. ఈ క్రమంలో తన అకౌంట్లో డబ్బులు మాయం అవడాన్ని గమనించిన తండ్రి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో సొంత కుమారుడే డబ్బులు కాజేశాడని తేలడంతో ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు చిన్నతనం నుంచే ఆన్లైన్ గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. తర్వాత అదే ఆటలకు బానిసైన ఆ మైనర్ డబ్బుల కోసం తండ్రికే ఎసరు పెట్టాడు. సాధారణంగా అనేక ఆన్లైన్ గేమ్‌లను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఆన్లైన్ చెల్లింపులు తప్పనిసరి. దీంతో ఆ బాలుడు డబ్బుల కోసం తండ్రి మొబైల్లో పేటీఎమ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి దానికి బ్యాంక్ అకౌంట్‌ను జతపరిచాడు. ఇదంతా 2018 డిసెంబర్లోనే ప్రారంభించి, తండ్రికి అనుమానం కలగకుండా రహస్యంగా ఉంచాడు. అంతేగాక పేటీఎమ్ వాలెట్లో డబ్బులు అయిపోయినప్పుడల్లా మళ్లీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసి మరీ గేమ్‌లు ఆడేవాడు. ఈ నేపథ్యంలో సంవత్సరంలో దాదాపు 35 వేల రూపాయలను గేమ్‌లపై వెచ్చించాడు. తన అకౌంట్‌ను నుంచి డబ్బులు మాయమవుతుండాన్ని గమనించిన తండ్రి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రాథమిక విచారణలో.. డబ్బులు బదిలీ అయిన ఫోన్ నంబర్ తనదే అని చెప్పడంతో తండ్రి ఆశ్చర్యానికి గురయ్యాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు వేరే దారి లేక అనుమానం వచ్చి తన కొడుకును విచారించగా వాస్తవాలు బహిర్గతమయ్యాయి. పిల్లవాడు తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం సైబర్ పోలీసు సిబ్బంది బాలుడికి కౌన్సెలింగ్ ఇప్పించి ఇంటికి పంపించారు. -
కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపిన మైనర్..
వాషింగ్టన్ : ఓ మైనర్ బాలుడు కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అలబామాలో నివాసముంటున్న ఐదుగురు కుటుంబ సభ్యుల్ని ఇంటి వద్దనే 14 ఏళ్ల మైనర్ బాలుడు తుపాకీతో కాల్చి హతమార్చాడు. అనంతరం తానే పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఈ విషయాన్నిపోలీసులు మంగళవారం మీడియా ముందు వెల్లడించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే మరణించగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. బాలుడు కాల్పుల్లో ఉపయోగించిన తుపాకీ నూతన టెక్నాలజీతో తయారు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, విచారణలో నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని వెల్లడించారు. అయితే అతనికి ఆ తుపాకీ ఎలా చేరిందని, కుటుంబాన్ని చంపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కాగా అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పులు ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత వారం టెక్సాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా 22 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అంతేగాక గత నెలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. -
అదుపు తప్పిన బాలుడు.. నగరంలో దందాలు
చాంద్రాయణగుట్ట: తనకంటే పెద్ద వారిని ముఠాగా ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడి ఉదంతాన్ని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్య కుమార్ తెలిపిన మేరకు.. బాల్యం నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్న బాలుడు శాస్త్రీపురానికి చెందిన మహ్మద్ వకీల్ అలియాస్ పర్వేజ్ (21), బహదూర్‌పురాకు చెందిన షేక్ హుస్సేన్ అలియాస్ గోర్ (30), కామాటీపురాకు చెందిన మహ్మద్ దస్తగిర్ (24), తీగలకుంటకు చెందిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ మస్తాన్ (25), దూద్‌బౌలికి చెందిన గౌస్ పాషా (24), జహనుమాకు చెందిన గౌస్ మోయినోద్దీన్ అలియాస్ మాము (64), తాడ్‌బన్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ ఇమ్రాన్ (23), కామాటీపురాకు చెందిన షాబాజ్ ఖాన్(26), తీగల కుంటకు చెందిన హసన్ అంజా (28), కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ (19)లను అనుచరులుగా ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడసాగాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మధుమోహన్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇందులో పదో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులను తదుçపరి విచారణ నిమిత్తం కామాటీపురా పోలీసులకు అప్పగించారు. నిందితుల వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఒక డాగర్, ఎనిమిది సెల్పోన్లు, రెండు తాళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాల్యం నుంచే అదుపు తప్పి... మైనర్‌గా ఉన్న బాలుడి తండ్రి చిన్న తనంలోనే ముంబైకి వెళ్లడంతో తల్లితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే పాఠశాలలో ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను బెదిరిస్తూ అవారాగా మారాడు. మద్యానికి బానిసయ్యాడు. ఏడు కేసులలో ప్రమేయముండి జువైనల్ హోంకు వెళ్లి వచ్చినా తన నేర జీవితాన్ని మార్చుకోకుండా ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. వీరందరికి లీడర్‌గా ఉంటూ నేరాలకు పాల్పడసాగాడు. కామాటీపురా అనుమియా గూడ శ్మశాన వాటికను అడ్డాగా చేసుకొని నేరాలు చేయసాగాడు. ఇప్పటికే ఆ యువకుడు రెండు హత్య కేసులతో పాటు ఐదు హత్యాయత్నం కేసులలో ప్రమేయం ఉన్నాడు. ఇటీవల ఫిబ్రవరి మాసంలో కామాటీపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జువైనల్ హోంకు వెళ్లాడు. -
మైనర్ దొంగ.. మేజర్‌గా చిక్కాడు
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు అల్తాఫ్.. చిన్ననాటి నుంచే నేరబాట పట్టాడు. అతడు మైనర్‌గా ఉండగా సంతోష్‌నగర్ పరిధిలో తొలి నేరం చేశాడు. తర్వాత అనేక కేసుల్లో అరెస్టయ్యాడు. అయినప్పటికీ తన తొలి నేరం విషయం బయటపెట్టలేదు. ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న ఇతగాడిని ‘పాపిల్లన్’ సాఫ్ట్వేర్ ఆధారంగా పోలీసులు నాటి కేసులో నిందితుడిగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు. ఇదే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 18 ఏళ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన హత్య కేసును కొలిక్కితెచ్చిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 16 ఏళ్ల కిందటి చోరీ కేసును ఛేదించారు. బాలాపూర్ పరిధి ఎర్రకుంటలోని జామ్జామ్ కాలనీకి చెందిన షేక్ సర్దార్కు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఒకడైన అల్తాఫ్‌కు చదువుపై ఆసక్తి లేక స్నేహితులతో కలిసి తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఇతగాడు మైనర్‌గా ఉండగానే అనేక వ్యసనాలకు బానిసయ్యాడు. వాటికి అవసరమైన డబ్బు కోసం చోరీల బాటపట్టాడు. అలా 2003లో తొలిసారిగా సంతోష్‌నగర్ పరిధిలోని ఓ ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం అపహరించుకుపోయాడు. దీన్ని కొందరు రిసీవర్లకు విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేశాడు. దీని తర్వాత దాదాపు 14 నేరాలు చేసిన ఇతగాడు ఆయా కేసుల్లో పోలీసులకు చిక్కాడు. అయినప్పటికీ తాను సంతోష్‌నగర్‌లో చేసిన నేరం సంగతి బయటపెట్టలేదు.. పోలీసులూ పసిగట్టలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు మరుగున పడిపోయిన ఈ కేసు ‘పాపిల్లన్’ సాయంతో సోమవారం కొలిక్కి వచ్చింది. ఒకప్పుడు ఘటనా స్థలాల్ని సందర్శించిన పోలీసులు అక్కడ నుంచి సేకరించిన అనుమానితుడి వేలిముద్రలను మాన్యువల్‌గా పరీక్షించారు. అయితే, అవి పాత నేరస్తుల డేటాబేస్‌లో ఉన్న వాటితో సరిపోకపోవడంతో అల్తాఫ్ తాత్కాలికంగా తప్పించుకోగా.. 30 తులాల బంగారం చోరీకి సంబంధించిన కేసు పెండింగ్‌లో పడిపోయింది. నగర పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం ‘పాపిల్లన్’ అనే ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకుంది. దీనికితోడు ఇప్పటి వరకు అరెస్టు అయిన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్లతో పాటు వివిధ నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రలను డిజిటలైజ్ చేశారు. నగర పోలీసులు వాటన్నింటినీ ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ఈ డేటాబేస్‌ను సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడంతో పాటు అందులో సెర్చ్ ఆప్షన్ చేర్చి సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సాఫ్ట్వేర్ వివిధ సందర్భాలు, సమయాల్లో నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రలను పాత నేరగాళ్లకు చెందిన వాటితో సరిచూసి తక్షణం రిజల్ట్ వస్తోంది. ఇలా ఈ సాఫ్ట్వేర్ అల్తాఫ్ 16 ఏళ్ల క్రితం చేసిన కేసును తవ్వి చూపించి చోరీ వ్యవహారం బయటపెట్టింది. దీంతో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్ రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ తర్ఖుద్దీన్‌తో కూడిన బృందం అల్తాఫ్ కోసం గాలించింది. సోమవారం పట్టుకుని ఏడు తులాల చోరీ సొత్తు స్వాధీనం చేసుకుంది. నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం సంతోష్‌నగర్ పోలీసులు అప్పగించింది. -
యువతిగా ఇన్‌స్టాగ్రామ్‌లో వల
బనశంకరి : ఓ మైనర్ బాలుడు నకిలీ ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్‌కు తన నగ్న ఫొటో పంపించి సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కుకుని రూ.6 లక్షలకుపైగా నష్టపోయిన ఘటన బెంగళూరు నగరంలోని రాజాజీనగరలో వెలుగుచూసింది. రెండునెలల క్రితం యువతి పేరుతో ఓ వంచకుడు ఇన్‌స్ట్రాగాంలో నకిలీ అకౌంట్ తెరిచాడు. రాజాజీనగరకు చెందిన మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన యువతి ఫొటో కనబడగానే సదరు యువతిని పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి (వంచకుడు)తో కలిసి ఛాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నకిలీ అకౌంట్ ద్వారానే మైనర్ బాలుడు నగ్న ఫోటో పంపాలని వంచకుడు అడగడంతో దీంతో బాలుడు తనకు పరిచయమైంది యువతి అని భావించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న ఫొటో పంపాడు. అతడి నగ్నఫోటో అందగానే ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అకౌంట్ తెరిచి డబ్బు ఇవ్వాలని వంచకుడు బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెడుతూ ఒక వేళ డబ్బు ఇవ్వకపోతే సోషల్‌మీడియాలో నగ్న ఫోటో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనతో భయపడిపోయిన బాలుడు ఇంట్లో రూ.6 లక్షల 40 వేల నగదు, 17 వెండి వస్తువులు చోరీకి పాల్పడ్డాడు. అనంతరం అతడి బాధ భరించలేక జరిగిన ఘటనను తండ్రికి వివరించడంతో తండ్రి, కుమారుడు రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్‌మీడియాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. -
వివాహిత స్నానం చేస్తుండగా మైనర్ ఘాతుకం..
చాంద్రాయణగుట్ట: ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలుడిని ఛత్రినాక పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం జువైనల్ హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జంగమ్మెట్ ఆర్.ఎన్.కాలనీకి చెందిన వివాహిత 20 రోజుల నుంచి ఇంట్లో స్నానం చేస్తుండగా ఓ బాలుడు(16)దీనిని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి స్నేహితులకు పోస్ట్ చేశాడు. ఈ విషయం బాధితురాలి దృష్టికి రావడంతో ఆమె నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 16న ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఛత్రినాక పీఎస్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపారు సోమ వారం బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. -
బైక్‌ల దొంగ అరెస్టు
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట: పట్టణంలో ఆరుబయట పార్కు చేసిన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్ప డుతున్న బాలుడిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్ఐ హరిబాబు సోమవారం చెప్పారు. ఆ యన కధనం ప్రకారం పట్టణానికి చెందిన బాలుడు కొంత కాలంగా ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నాడు. ఈ మేరకు ద్విచక్ర యజమానులు ఫిర్యాదు చేయటంతో కేసును విచారించి పట్ట ణానికి చెందిన బాలుడిగా గుర్తించారు. మ ధ్యాహ్న సమయంలో ముక్త్యాల రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆవిడకు 60.. అతడికి 15.. ఇద్దరికి పెళ్లి!!
సాక్షి, గుహవాటి: పదిహేనేళ్ల బాలుడు చిలిపిగా చేసిన రాంగ్ కాల్ అతడి జీవితాన్నే తారుమారు చేసింది. అస్సాంలోని గోల్‌పాడా జిల్లాకు చెందిన కుర్రాడు చదువు మధ్యలోనే ఆపేసి కార్మికుడిగా మారాడు. ఓ రోజు టైమ్‌పాస్ కాక రాంగ్ కాల్ చేశాడు. అవతలి నుంచి మాట్లాడింది ఆడ గొంతు కావడంతో డబుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. రోజుకొకసారైనా మాట్లాడుకోంది ఇద్దరూ ఉండలేని పరిస్థితికి వచ్చారు. అలా నెలరోజులగా ఆమెతో ఫోన్ మాట్లాడటంతో నిండా ప్రేమలో మునిగిపోయాడు. ఇక ఆగలేక కచ్చితంగా ఆమెను కలవాలని ఆమె చెప్పిన ఆడ్రస్‌కు వెళ్లాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ రివర్సయింది. అలా ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లి ఒకరినొకరు చూసుకోగా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఆమె బార్పేట జిల్లా సుఖూవాజార్కు చెందిన 60 ఏళ్ల వితంతువు. నెలరోజులుగా మాట్లాడుకున్నా ఇద్దరూ వయసుల గురించి మాట్లాడుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం తెలిసిన మహిళ బంధువులు, సన్నిహితులు, పొరుగింటివారు బలవంతంగా ఆ ఇద్దరికీ వివాహం చేశారు. తమకు ఇష్టం లేకుండా వివాహం చేశారని ఇరువురూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల హక్కుల కమిషన్ దీనిపై విచారణకు ఆదేశించింది. అబ్బాయి మైనర్ అయివుంటే.. బలవంతంగా వివాహం చేసినవారిపై చట్టపరమైన శిక్షలు ఉంటాయని కమిషన్ పేర్కొంది. ఇక ఈ గొడవపై స్పందించిన గోల్‌పాడా డిప్యూటీ కమిషనర్ వార్నాలి డెకా.. ఆ ఇద్దరి పెళ్లి గురించి ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, కానీ ఎవరైన దీనిపై విచారణ కోరితే దర్యాప్తు చేసి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కోరిక తీర్చలేదని మైనర్ బాలుడిపై..
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. తన కోర్కెను తీర్చలేదని 13 ఏళ్ల బాలుడి జననాంగాలను ఓ వివాహిత గాయపరిచిన ఘటన వెలుగుచూసింది. బదాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చప్రౌలా గ్రామంలో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితురాలు గత శుక్రవారం ఒంటరిగా ఉన్న సమయంలో తన పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి పిలిచి తన కోర్కెను తీర్చాలని బలవంతపెట్టిందని, బాలుడు నిరాకరించడంతో వేడి అట్లకాడతో జననాంగాలపై వాతపెట్టిందని పోలీసులు తెలిపారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం వంటి పలు సందేహాలపైనా విచారణలో దృష్టిసారిస్తామన్నారు. పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
ఆమెకు 24.. అతడికి 19
బంజారాహిల్స్: ప్రేమ ఎలా.. ఎక్కడ.. ఎవరిపై.. ఎందుకు చిగురిస్తుందో అది ప్రేమించినవారికే తెలుస్తుంది. దానికి వయసుతో గానీ, పేదా, గొప్పా తేడాలు గానీ లేవనేందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతమే ఉదాహరణ. ఆమె వయసు 24.. అతని వయసు 19.. ఆమె ఎంబీఏ చదువుతుండగా. అతను ఏడో తరగతితో చదువుకు స్వస్తి పలికి వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆమె ఐదంతస్తుల భవనంలో నివాసం ఉంటుండగా, అతను రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాడు. అయినా వారి ప్రేమ మధ్య చిగురించింది. ఇరువురి హృదయాలను ఒక్కటి చేసింది. తన ఇంటికి వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ కలిసి చెప్పాపెట్టకుండా ఇళ్లలోంచి వెళ్లిపోయారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు హఫీజ్‌పేట్‌లో ఉంటున్న వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చి వయసు నిర్ధారణ చేయగా ఆమె మేజర్ అని తేలింది. అతని వయసు 19 కావడంతో మైనర్‌గా తేల్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. ఇదిలా ఉండగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న యువతి తల్లికి వారానికి ఓసారి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సెంచురీ ఆస్పత్రిలో డయాలసిస్ జరుగుతోంది. రెండు వారాల క్రితం తల్లికి తోడుగా వచ్చిన సదరు యువతి ఆస్పత్రిలో తల్లికి డయాలసిస్ జరుగుతుండగానే ప్రియుడిని అక్కడికి పిలిపించుకొని అతడితో కలిసి వెళ్లిపోయింది. అదే రోజు యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తాజాగా వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాను ప్రియుడితోనే కలిసి ఉంటానని యువతి మొండికేయగా, మైనర్‌తో పంపేందుకు చట్టం ఒప్పుకోదని పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో ఆమెను పునరావాస కేంద్రానికి పంపించారు. ప్రేమించిన వాడితో తనకు దుర్గ గుడిలో పెళ్లి కూడా జరిగిందని ఎలా విడదీస్తారని, ప్రియుడి నుంచి దూరం చేస్తే చచ్చిపోతానని బెదిరించింది. దీంతో ఎటూ పాలుపోని పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. చట్టప్రకారం సదరు యువతిని ఎక్కడికి పంపించాలంటూ అడగగా ఆమె ఎవరి దగ్గరికి వెళ్లాలని అనుకుంటే అక్కడికే పంపించవచ్చని తెలిపారు. దీంతో శుక్రవారం మరోసారి స్టేషన్లో పంచాయితీ నడిచింది. తాను ప్రేమించిన వాడితోనే వెళ్తానంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆ ప్రకారమే నడుచుకోవాల్సి వచ్చింది. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ ప్రేమ వ్యవహారం పోలీసులకు గత రెండు వారాలు తలనొప్పిగా మారడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేక సతమతమయ్యారు. -
చిన్నారిపై బాలుడి అఘాయిత్యం
నెక్కొండ(నర్సంపేట) వరంగల్ : అభం, శుభం తెలియని ఓ చిన్నారిపై ఆటలాడిస్తానంటూ నమ్మబలికి ఓ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ శివారు విద్యుత్ సబ్‌స్టేషన్ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు అదే తండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటికి తరచూ వస్తుంటారన్నారు. బాలిక తండ్రి బట్టల వ్యాపారం చేసేందుకు వెళ్లగా, ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 17న ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు వచ్చి తండా సమీపంలోని ఓ గుడి వద్దకు బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చిన తండ్రి ఏ డ్చుకుంటూ ఉన్న బాలికను గమనించి వ్యవసా య పనులకు పోయిన తల్లి దగ్గరకు తీసుకువెళ్లా డు. దీంతో కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో జరిగిన విషయాన్ని గమనించింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకొని బాలుడి కుటుంబ సభ్యుల ను నిలదీశారు. పెద్ద మనుషుల సలహాతో సోమవారం చిన్నారి తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. దీంతో ఏసీపీ సునీతామోహన్ తండాకు చేరుకొని దర్యాప్తు చేసి, చిన్నారిని వైద్య పరీక్షలకు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘టీచర్ కూడా పట్టించుకోలేదు.. చనిపోదామనుకున్నా’
న్యూఢిల్లీ : ఓ మైనర్ బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేసిన మరో ముగ్గురు మైనర్లపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పొక్సో చట్టం) కింద కేసు నమోదయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలో నాల్గో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడిని.. అదే పాఠశాలలో చదువుతున్న మరో ముగ్గురు మైనర్ విద్యార్థులు స్కూల్ బస్సులో లైంగిక వేధింపులకు గురి చేశారు. అయితే బాధిత బాలుడు ఈ విషయం గురించి ఓసారి ఉపాధ్యాయుడికి కూడా ఫిర్యాదు చేశాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో బాలున్ని వేధింపులకు గురి చేస్తున్న మిగతా విద్యార్ధులు మరింత రెచ్చిపోయారు. అప్పటికే పలుమార్లు బాలున్ని లైంగిక వేధింపులకు గురిచేశారు. వారి చేష్టలతో విసిగిపోయిన బాలుడు ఆత్మాహత్యాయత్నం చేశాడు. సమాయానికి తల్లిదండ్రులు చూడటంతో ఆ పసివాన్ని కాపాడారు. అనంతరం తల్లిదండ్రులు బాలున్ని సముదాయించి ఏం జరిగిందని అడగ్గా.. పాఠశాలలో, మిగతా విద్యార్ధులు తనతో ప్రవర్తిస్తోన్న తీరు గురించి చెప్పాడు. టీచర్లకు చెప్పినా వారు ఎటువంటి చర్య తీసుకోవడం లేదని వాపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తమ కొడుకును వేధించిన విద్యార్ధులపై ఫిర్యాదు చేశారు. పొక్సో యాక్ట్ కింద ముగ్గురు బాలుర మీద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కృష్ణా జిల్లాలో దారుణం; బాలుడిపై అత్యాచారం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరువూరు నగర పంచాయతీలోని భగత్‌సింగ్‌లో నగర్లో బాలుడిపై అత్యాచారం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడు కేకలు వేయడంతో యువకులు పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలడ్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దారుణం: మామిడి పళ్లు కోయబోతే..
పట్నా : ఒక పక్క విచ్చలవిడి తుపాకీ సంస్కృతితో అమెరికాలో రోజుకో రక్తచరిత్ర నమోదవుతుండగా.. మన దేశంలో కూడా అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఆకలిగా ఉందని మామిడి పళ్లు కోసుకోవడానికి ఒక తోటలోకి ప్రవేశించిన బాలున్ని యజమాని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని గోర్గి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేర్గర్ గ్రామ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న పన్నెండేళ్ల పిల్లాడు పక్కనే ఉన్న తోటలోకి మామిడి పళ్లు కోసుకుందామని వెళ్లాడు. అక్కడే కాపలాగా ఉన్న యజమాని బాలున్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. భయంతో పిల్లాడు పారిపోయేందుకు యత్నించడంతో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ సరాసరి తలలోకి దూసుకుపోవడంతో మైనర్ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన మృతుని స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమచారం అందించారని ఎస్సై తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటన అనుకోకుండా జరిగిందా.. లేదా వేరెవరినో కాల్చే క్రమంలో పొరపాటున పిల్లాడు బలయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, తోట కాపలాదారుని వద్ద తుపాకీ ఎందుకుందనే విషయం కలకలం రేపుతోంది. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
అతడికి పదహారు.. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబాలను ఒప్పించారు. పెద్దల సమక్షంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక సమస్యేమీ లేదనుకున్న సమయంలో కథ అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాల్య వివాహమంటూ వధూవరులను వేరు చేసి ఎవరిళ్లకు వారిని పంపించేశారు. కర్నూలు : కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో కలిశారు. వారికి ఎవరిలో ఏ అంశం నచ్చిందో ఏమో తెలియదు కానీ వయస్సును పక్కనబెట్టి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అబ్బాయి కంటే అమ్మాయి వయస్సు దాదాపు 12 ఏళ్లు ఎక్కువ. కొన్నా ళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో గత నెల 27న వరుడి స్వగృహంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పత్రి కల్లోనూ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి వారి కోసం ఆరా తీశారు. వారు ఊళ్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక సోమవారం వధూవరులను, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, జేసీ–2 రామస్వామి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరేళ్ల వరకు ఎవరింటి వద్ద వారు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా జరిగే రెవెన్యూ కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్ అధికారి శారద, ఐసీడీఎస్ ఏపీడీ విజయ హాజరయ్యారు. -
అబ్బాయికి 14.. అమ్మాయికి 23
సాక్షి, కర్నూలు: ఓ బాలుడికి, యువతికి వివాహం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని ఉప్పరహాల్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడికి అక్క కూతురు అయిన కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప తాలుకా చాణికనూరు గ్రామానికి చెందిన అయ్యమ్మ(23) అనే యువతితో వివాహం చేశారు. ఈ వివాహం ఉప్పరహాల్‌లో గత నెల 27న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ విషయంపై గ్రామంలో చర్చించుకోవడంతో మీడియా దృష్టికి వచ్చింది. కాగా.. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గ్రామంలో విచారించగా ప్రస్తుతం ఆ జంట ఊర్లో లేదు. అయితే వయోభేదం ఎక్కువగా ఉండే పెళ్లిళ్లతో సామాజికంగా చాలా సమస్యలు వస్తాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. మైనర్ బాలుడికి పెళ్లి చేయడం చట్టప్రకారం నేరమని గుర్తు చేశారు. -
కారుపై మోజుతో చోరీ
మలక్‌పేట: కారుపై కోరికతో ఓ మైనర్ బాలుడు తన బంధువుల ఇంట్లో చోరీ చేశాడు.ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డీఐ గుజ్జ రమేష్ తెలిపిన మేరకు..కర్ర సత్యనారాయణ కుటుంబంతో కలిసి సలీంనగర్‌లోని ప్రణవ అపార్ట్మెంట్లో 302 ఫ్లాంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 3 తేదిన భార్య భర్తలు ఉద్యోగాలకు వెళ్లగా పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం 8 గంటలకు అందరూ ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లో ఉన్న 16 తులాల బంగారు నగలు,రూ.38 వేలు నగదు కన్పించలేదు. ఇంటికి వేసినా తాళాలు, బీరువా తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బాధితుని బంధువు కుమారుడు (17) నిందితుడిగా తేలింది.అతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కారు కొనుకోవాలనే ఆశతో మైనర్‌బాలుడు ఓ పథకం ప్రకారం చోరీ చేశాడు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించి, బంగారు అభరణాలు, 25 వేలు నగదు రీకవరీ చేసినట్లు డీఐ తెలిపారు. సమావేశంలో డీఎస్సై శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మైనర్ బాలుడి వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ధర్పల్లి, నిజామాబాద్ : మైనారిటీ తీరకుండానే బాలుడికి వివాహం చేసేందుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా, అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ పరిధి బేల్యా తండాకు చెందిన మెగావత్ జగన్, కవిత దంపతుల కుమారుడు శ్రీనివాస్‌కు ఇంకా 21 ఏళ్లు నిండలేదు. అయితే, అదే తండాకు చెందిన మేజర్ అయిన యువతితో శ్రీనివాస్‌కు ఈ నెల 12న వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెళ్లి నిశ్చితార్థం గురించి అధికారులకు సమాచారం అందటంతో ఐసీడీఎస్ రూరల్ సీడీపీవో ఝాన్సిలక్ష్మి, ఎల్సీపీవో సూపర్వైజర్ అనిల్ శుక్రవారం విచారణ జరిపించి పెళ్లిని నిలిపి వేయించారు. బాలుడికి 21 ఏళ్లు వచ్చిన తరువాతనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో తండా పెద్దల సమక్షంలో ఒప్పందం పత్రం రాయించారు. ఏఎస్సై వెంకన్న, ఆర్ఐ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణి, వీఆర్వో పోశెట్టి పాల్గొన్నారు. బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న అధికారులు -
ఆమెకు 20, అతనికి 16..
ఈ కలియుగంలో వింతలకు చోటు లేదు. డిగ్రీ అమ్మాయి, 16 ఏళ్ల బాలుని మధ్య ఫేస్బుక్ ద్వారా ప్రేమ పుట్టి, అది పెళ్లితో ముగిసింది. కొద్దిరోజులు కాపురం చేశాక అసలు కథ మొదలైంది. మూడురోజులుగా పోలీసు స్టేషన్లో కొనసాగుతూనే ఉంది. దొడ్డబళ్లాపురం:ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఒక మైనర్ బాలుడు, తనకన్నా నాలుగేళ్లు పెద్దదయిన దివ్యాంగురాలయిన యువతి పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 15 రోజులు సంసారం చేయగానే ఆ అబ్బాయి ఆమెను వదిలేసి పరారయ్యాడు. ఈ వింత సంఘటన దొడ్డ తాలూకాలోని కొనఘట్ట గ్రామంలో చోటుచేసుకుంది. ఇప్పుడతన్ని పట్టుకొచ్చి పంచాయతీ పెట్టారు. వివరాలు.. పోలియో బాధితురాలైన ఒక యువతి (20)ది తాలూకాలోని కొనఘట్ట గ్రామం. దొడ్డ పట్టణంలోని ఒక కాలేజీలో బీఏ చదువుతోంది. ఈమెకు 5 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా బెంగళూరు ఉత్తర తాలూకా బేగూరుకు చెందిన 16 ఏళ్ల బాలునితో పరిచయం కుదిరింది. నెమ్మదిగా ఫోన్లలో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడూ కలిసేవారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఇద్దరూ బాగేపల్లిలోని ఒక దేవాలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. 15 రోజులు అక్కడే స్నేహితుడి ఇంట్లో గడిపారు. ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూతురికోసం తెలిసిన చోటల్లా వెదికి చివరకు బాగేపల్లిలో ఉన్నారని కనుక్కుని ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చారు. నాకేం తెలిదంటున్న బాలుడు అయితే మైనర్ బాలుడు ఇంటికి వెళ్లి వివాహం రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన పత్రాలు, తల్లిదండ్రులను ఒప్పించి తీసుకువస్తానని చెప్పి వెళ్లినవాడు తిరిగి రాలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, బాలున్ని వెతికి పట్టుకొచ్చారు. ఈలోపే బాలుడు ప్లేటు ఫిరాయించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియదని బుకాయించాడు. నిందితుడు మైనర్ కావడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మాయేమో తన భర్త తనకు కావాలని పట్టుబట్టింది. దీంతో ప్రజా విమోచనా చళువళి నాయకులు యువతికి న్యాయం చేయాలంటూ డీవైఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. -
మైనర్ బాలుడిని పెళ్లాడేందుకు యువతి పోరాటం
సాక్షి, చెన్నై : కాంచీపురానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో తనకు వివాహం జరిపించాలంటూ 18 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. దీన్ని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, గాజులపెళ్లూరుకు చెందిన యువతి తన అక్క ప్రసవం కోసం ఏడాది కిందట కాంచీపురం జిల్లాకు వెళ్లారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా యువతి కొన్ని నెలల కిందట తన సొంత గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి బాలుడితో తరచూ ఫోన్లో మాట్లాడేది. అయితే తరచుగా ఫోన్లో మాట్లాడేందుకు బాలుడు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 10 తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు అమెను ఆస్పత్రిలో చేర్చడంతో చికిత్స పొంది క్రమంగా కోలుకుంది. ఈ క్రమంలో బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. అందులో కాంచీపురానికి చెందిన 16 ఏళ్ల బాలుడు తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని, దీనిపై చర్యలు తీసుకుని తనను బాలుడి చెంత చేర్చాలని కోరింది. ఫిర్యాదు చేసిన యువతి మేజరైనప్పటికీ బాలుడికి 16 ఏళ్లు మాత్రమే ఉండడంతో వారికి దిక్కుతోచలేదు. ప్రస్తుతం వరదయ్య పాళెం మండలం, పాండూరులో విడిగా జీవిస్తున్న యువతి తనను ప్రేమించి మోసగించిన బాలుడితో వివాహం జరిపించాలని కోరుతూ, తామిరువురు కలిసి తీసుకున్న ఫొటోలతో సోమవారం విలేకరులకు కన్నీటితో తెలిపింది. -
లైంగిక వేధింపుల కేసులో క్రికెట్ కోచ్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ 13 ఏళ్ల బాలుడిపై ఓ క్రికెట్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో క్రికెట్ అకాడమీ నడుపుతున్న 30 ఏళ్ల నజీర్ 13 ఏళ్ల బాలుడికి గత 8 నెలలుగా శిక్షణ ఇస్తున్నాడు. గత శనివారం బాలుడి క్రికెట్ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఇంటి దగ్గర దిగబెడతానని తన వ్యానులో ఎక్కించుకున్నాడు. ప్రయాణంలో అభ్యంతరకర రీతిలో చేతితో తాకి.. తనకు సహకరించాలని కోరాడు. అక్కడి నుంచి తప్పించుకొచ్చిన బాలుడు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కోచ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మైనర్ బాలుడితో 42 ఏళ్ల మహిళ సహజీవనం
సాక్షి, పథినంతిట్ట : కేరళలో 42 ఏళ్ల నర్సు.. 18 సంవత్సరాల యువకుడితో సహజీనం చేయడం సంచలనంగా మారింది. లివ్ఇన్ రిలేషన్ ఇప్పుడు సహజమే అయినా.. వయసులో ఇంత అంతరమా? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేరళ మహిళా కమిషన్‌కు చేరడంతో అందరికీ తెలిసింది. డబ్బు, శృంగారం.. వంటి వాటిని ఎరగా వేసి తమ కుమారుడిని నర్సు బుట్టలో వేసుకుందని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి యువకుడి తల్లి చెబుతున్న వివరాలు ఇవి.. ‘పథినంతిట్ట జిల్లా కేంద్రంలో మేము కూలి చేసుకుని జీవిస్తున్నాం, నా కుమారుడు సెకండరీ విద్యను అభ్యసించే సమయంలో నర్సు పరిచయమైంది. ఒకరోజు మా అబ్బాయి బైక్ కావాలని అడిగాడు.. ఆర్థిక పరిస్థితిని వివరించి కొనలేనని చెప్పాను. అదే సమయంలో అతడికి సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న 42 ఏళ్ల మహిళ ఫేస్బుక్లో పరిచయం అయింది. గిఫ్ట్ కింద బైక్ కొనుక్కోమని రూ. 43 వేలు మావాడి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సౌదీ అరేబియా నుంచి నర్సు ఇండియాకు తిరిగి రాగానే.. మా అబ్బాయిని తీసుకుని బెంగళూరు వెళ్లిపోయింది. అక్కడే ఇద్దరు ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో మా అబ్బాయికి మద్యం, సహా ఇతర దురలవాట్లను నేర్పింద’ని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా... ఆరు నెలల తరువాత 19 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. వెంటనే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ నర్సు.. వేధింపులు మొదలు పెట్టింది. యువకుడి మీద క్రిమినల్ కేసులు పెట్టి.. మూడు నెలల పాటు జైలు పాల్జేసింది. కుమారుడిని విడిపించుకోవడం కోసం అతడి తల్లిదండ్రులు ఆస్తిని తనఖా పెట్టారు. దీంతో సదరు నర్సు కేరళ మహిళా మిషన్‌ను ఆశ్రయించింది. రూ.43 వేల అసలుతో పాటూ వడ్డీ కూడా చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేసిన మహిళా కమిషన్.. ఆమె దిమ్మతిరిగేలా తీర్పు చెప్పింది. సమాజానికి నీలాంటి మహిళల వల్ల ప్రమాదం ఉందని చెబుతూ.. యువకుడు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్ ప్రకటించింది. -
మైనర్‌ను ఘోరంగా హింసించారు
మహారాజ్‌గంజ్ : విచక్షణ మరిచి ఇద్దరు పోలీస్ అధికారులు చేసిన నిర్వాకం ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. మైనర్ అని కూడా చూడకుండా ఓ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్ర విమర్శలతోపాటు వేటును ఎదుర్కున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగతనం ఆరోపణలపై బాలుడిని స్టేషన్ కు తెచ్చిన పోలీసులు ఆ వస్తువు ఎక్కడ దాచాడో చెప్పాలంటూ అతన్ని వేధించటం మొదలుపెట్టారు. ముందు ఓ వెదురు బొంగును అతని తోడలపై పెట్టి ఇరుపక్కల అధికారులు నిల్చున్నారు. బాధతో అతను అరుస్తున్నా కనికరించలేదు. ఆపై మరో అధికారి లాఠీ తీసుకుని అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. కాలితో తంతుంటే ఆ పిల్లాడు వేడుకోవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అధికారుల వివరణ... కాగా, ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ అశుతోష్ శుక్లా స్పందించారు. పనియారా స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఘటనపై ఇప్పటికే సబ్ ఇన్ స్పెక్టర్ కేఎన్ షాహి, మరో పోలీసును సస్పెండ్ చేశామని వెల్లడించారు. చోరీకి గురైన వస్తువుల రికవరీ కోసమే వారు అలా ప్రవర్తించారని.. అతని వద్ద ఏం లభించకపోవటంతో వదిలేశారని శుక్లా చెబుతున్నారు. కాగా, ఆ వీడియో ఎవరు తీశారన్నదానిపై స్పష్టత రాలేదు. -
అనుకోకుండా అక్కపై కాల్పులు
భీండ్: మధ్యప్రదేశ్ భీండ్ జిల్లా లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ తమ్ముడి చేతిలో అక్కప్రాణాలు కోల్పోయిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తుపాకీతో ఆడుకుంటున్న ఓ మైనర్ బాలుడు అంజు (8) చేతిలో మరో మైనర్ బాలిక నిధి(10) ప్రాణాలు విడిచింది. తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఘటన కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది. భిండ్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పి) రాజేంద్ర వర్మ అందించిన సమాచారం ప్రకారం బాధిత బాలిక తండ్రి దినేష్ కుమార్ ఓఝా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్నారు. తండ్రికిచెందిన లెసెన్స్డ్ తుపాకీతో పిల్లలిద్దరూ తుపాకీతో మంచంమీద ఆడుకుంటుండగా, పొరపాటున అంజు ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో తీవ్రమైన బుల్లెట్ గాయంతో నిధి అక్కడికక్కడే చనిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోవడం కుటుంబం కన్నీని సంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. -
డబ్బులివ్వలేదని! అమ్మనే అంతమొందించాడు
మద్యం మత్తులో బాలుడి కిరాతకం హైదరాబాద్: మత్తు పదార్థాలకు బానిసైన పద్నాలుగేళ్ల ఓ మైనర్ బాలుడు కన్న తల్లినే గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల శివలాల్‌నగర్‌లో చోటుచేసుకుంది. చదువును ఐదవ తరగతిలోనే ఆపి తల్లితో కలసి చిత్తు కాగితాలు ఏరుకుంటూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన బాలుడు అమ్మనే పొట్టనపెట్టుకున్నాడు. మంగళ్‌హాట్ పోలీసు ఇన్స్పెక్టర్ ఎ. సంజీవరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఖైరతాబాద్‌కు చెందిన రేణుకా(45) పదేళ్ల క్రితం భర్త మృతిచెందగా, కొడుకుతో మంగళ్‌హాట్‌లోని శివలాల్‌నగర్‌లో అద్దెకు ఉంటోంది. రోడ్లపైన చిత్తు కాగితాలు ఏరుకొని అమ్ముతూ 14 ఏళ్ల కొడుకును పోషించేది. గత ఐదేళ్లుగా మత్తు పదార్థాలకు బానిసైన బాలుడు ప్రతిరోజూ వైట్నర్, గుడుంబా సేవించేవాడు. దీని కోసం డబ్బులు కావాలంటూ తల్లితో గొడవకు దిగేవాడు. చుట్టు పక్కలవారు కూడా పలుమార్లు అతన్ని మందలించినా మార్పురాలేదు. మద్యం తాగించి.. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తల్లికి మద్యం తీసుకువచ్చి ఇచ్చాడు. మద్యం సేవించిన తరువాత తల్లితో గొడవకు దిగాడు. చిత్తు కాగితాలు ఏరగా వచ్చిన డబ్బులో తనకు రావాల్సిన రూ.200 ఇవ్వాలంటూ తల్లిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు. కిందపడ్డ తల్లిని కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు ఏడ్చుకుంటూ ఇంటిబయట కూర్చున్నాడు. స్థానికులు ఈ ఘటనను గమనించి మంగళ్‌హాట్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న రేణుక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 14 ఏళ్ల బాలుడు తల్లిని హత్య చేయడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. -
బాలుడిపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు!
బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఓ భూస్వామికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కర్ణాటకలోని జిల్లా రెండో అదనపు సెషన్స్, స్పెషల్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయపుర జిల్లా హన్నుక్తి గ్రామంలో రాకేశ్ దశరథ్ ఓ పేరుమోసిన ఆసామి. అయితే దాదాపు మూడేళ్ల కిందట ఓ బాలుడితో తన ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ భూస్వామి తనను లైంగిక చర్యలకు ప్రేరేపిస్తున్న విషయాన్ని ఆ బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు విజయపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నమోదైంది. గతవారం కిందట తాజాగా జరిపిన విచారణలో రాకేశ్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు. కోర్టులో ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ ఆ భూస్వామికి పదేళ్ల కఠినశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
బాలికపై అఘాయిత్యం...
నాగోలు: చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ కాశిరెడ్డి కథనం ప్రకారం.... నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓ కుటుంబం బైరామల్‌గూడలో నివాసముంటూ దుస్తులు అమ్ముకుంటూ జీవిస్తోంది. వీరికి కుమారుడు (13) సంతానం. వీరి ఇంటి పక్కనే ఉండే బాలిక (7) రెండో తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉన్న ఆ చిన్నారికి సదరు బాలుడు చాక్లెట్లు ఇస్తానని తన ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకొని, చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
కారుపై పడ్డ లిఫ్ట్ .. ఇద్దరి మృతి
ముంబై: మైనర్ బాలుడు కారు నేర్చుకోవడానికి ప్రయత్నించగా దురదృష్టవశాత్తూ, ఆ బాలుడితో పాటు డ్రైవింగ్ నేర్పిస్తున్న వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్(14) స్థానిక నాగపడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కారు నేర్చుకోవాలని ఆశపడ్డాడు. జావేద్ (30) అనే వ్యక్తిని కారు డ్రైవింగ్ నేర్పించమంటూ కోరాడు. అయితే వాహనాన్ని గ్రౌండ్ లోనే, రోడ్డుపైనో కాకుండా ఓ పెద్ద బిల్డింగ్ లో శిక్షణ ఇస్తున్నాడు. ఇక్బాల్ టవర్స్ అనే బిల్డింగ్ లో విశాలమైన స్థలం ఉండటంతో రెండో అంతస్థులో హఫీజ్ కు డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తూ నడపటం ప్రారంభించాడు. జావేద్ సూచనలు వింటున్న మైనర్ బాలుడు కారును రివర్స్ చేస్తుండగా లిఫ్ట్ డోర్ ను ఢీకొట్టాడు. కారు లిఫ్ట్ లోకి దుసుకెళ్లి ఇరుక్కుపోయింది. ఆ సమయంలో థర్డ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఎలివేటర్ ఒక్కసారిగా కారుపై వచ్చి పడింది. దీంతో కారులో ఉండిపోయిన మైనర్ బాలుడు హఫీజ్ తో పాటు డ్రైవింగ్ నేర్పిస్తున్న జావేద్ అక్కడిక్కడే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
పొన్నూరు(గుంటూరు): అభం శుభం తెలియని చిన్నారి పై ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపుడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కొండమూది సంపత్(16) బిస్కెట్ కొనిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం పాపను అక్కడే వదిలేసి వెళ్లడంతో.. ఎడ్చుకుంటూ ఇంటికి చేరిన చిన్నారిని కుటుంబ సభ్యులు ఏం జరిగిందని అడగడంతో.. చిన్నారి జరిగిన విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
పొన్నూరు(గుంటూరు): అభంశుభం తెలియని ఓ చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపుడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి (16) బిస్కెట్ కొనిస్తానని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏడ్చుకుంటూ ఇంటికి చేరిన చిన్నారిని కుటుంబ సభ్యులు అడగడంతో.. విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలుడికి చేతికి బేడీలు
-
ముగ్గుర్ని కొట్టి చంపిన గ్రామస్తులు
పట్నా: తండ్రీ కొడుకులపై కాల్పులు జరిపి, ఒక బాలుడి మరణానికి కారణమైన వ్యక్తులను గ్రామస్తులు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీహార్‌లోని సీతామారి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఉన్నతాధికారి హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం తమ మొబైల్ షాప్‌ను మూసివేసి ఇంటికి వెళ్తుండగా తండ్రీకొడుకులైన అవద్ కిశోర్ , రత్నేష్(12)లను సాయుధులైన నలుగురు దుండగులు అడ్డుకున్నారు. వారి మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో వారు తండ్రీ కొడుకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈఘటనలో కొడుకు అక్కడికక్కడే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఘటనా స్థలం నుంచి పారిపోతున్న నలుగురిపైన దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. పట్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
అమ్మాయి మేజర్ అబ్బాయి మైనర్!
అధికారులు వచ్చేలోగా బాల్యవివాహం శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంటపే మండలం తాళ్లపల్లి తండాలో మైనర్ అబ్బాయి, మేజర్ అమ్మాయిలకు వివాహం జరిగింది. తండాకు చెందిన 20 ఏళ్ల అమ్మాయికి, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ ఉసేన్గడ్డ తండాకు చెందిన 16 ఏళ్ల యువకుడితో శనివారం ఉదయం 11:30కి పెళ్లి చేసేందుకు ఇరుకుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నారు. బాల్యవివాహం జరుగుతుందని తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది ఉదయం 9 గంటలకు తండాకు చేరుకోగా అప్పటికే పెళ్లి చేసేశారు. అయితే అధికారులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అమ్మాయిని అబ్బాయి వెంట అత్తగారింటికి పంపించమని రాతపూర్వకంగా రాయించుకున్నారు. -
బాలుడి కాళ్లకు సంకెళ్లు.. నిర్బంధం!
దొంగతనం కేసులో అనుమానం రావడంతో ఓ బాలుడిని పోలీసులు కాళ్లకు సంకెళ్లు వేసి నిర్బంధించారు. కస్టడీలోకి తీసుకుని లాకప్‌లో వేశారు. కోల్‌కతాకు చెందిన ఓ బాలుడు తన సోదరుడితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. బాలుడి సోదరుడు చాంద్రాయణగుట్టలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి సెల్ఫోన్లు దొంగిలించారన్నది పోలీసుల అభియోగం. కొన్ని ఫోన్లను కూడా బాలుడి వద్ద స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. సెల్ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ఆరా తీస్తున్నామని తెలిపారు. అయితే బాలుడి కాళ్లకు సంకెళ్లు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కిడ్నాపైన విద్యార్థి హత్య
పహాడీషరీఫ్‌లో డబ్బు కోసం ఇద్దరి ఘాతుకం హైదరాబాద్: పాతబస్తీలో 13 రోజుల కిందట కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి కరుణాకర్ (10) కథ విషాదాంతమైంది. అతడిని అపహరించిన నిందితులు తమ వివరాలు వెల్లడవుతాయనే భయంతో చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు. నేరగాళ్ల ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం రాత్రి మిస్టరీని ఛేదించారు. శనివారం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలుని మృతదేహాన్ని గుర్తించారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణ గుట్ట ఇంద్రానగర్‌కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి ఎన్నమళ్ల ప్రభాకర్, ఉమారాణికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి పిల్లల్లో కరుణాకర్ పెద్దవాడు. స్థానిక మదర్స్మేరీ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. వీరింటికి సమీపంలో ఉంటున్న సెంట్రింగ్ వర్కర్స్ మల్లికార్జున్, మోహన్ దుర్వ్యసనాలకు బానిసలై అప్పుల్లో కూరుకు పోయారు. ఈ నేపథ్యంలో వారు ప్రభాకర్ పిల్లల్లో ఒకరిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 22న కరుణాకర్‌ను నిందితులు కిడ్నాప్ చేశారు. ఒక నిందితుడు ఆ రోజు సాయంత్రం ఉమారాణికి కాయిన్ బాక్స్‌నుంచి ఫోన్ చేసి.. తాము వారి కుమారుడిని అపహరించామని, రూ.2 లక్షలిస్తే వదిలేస్తామని బెదిరించాడు. దీంతో బాధితులు చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. 5 బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చేస్తున్న దశలోనే నిందితులు పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బాలుడ్ని ఓ యువకుడు బైక్‌పై తీసుకెళ్లడం చూశామని చెబుతూ ఊహాచిత్రానికి క్లూ కూడా ఇచ్చారు. అయితే బాధితులకొచ్చిన కాల్స్ ఓ మొబైల్ నుంచి కావడంతో పోలీసులు ఆ రూట్లో దర్యాప్తు చేయగా నిందితుల గుట్టు రట్టయింది. తమను గుర్తించి విషయం వెల్లడిస్తాడనే భయంతో బాలుడిని సెప్టెంబరు 23న బాలాపూర్ ఆర్సీఐ సమీపంలో హత్యచేశామని అంగీకరించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టానికి పంపారు. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. -
కారు నడిపి.. ఇద్దరిని చంపేసిన కుర్రాడు!!
వచ్చీరాని డ్రైవింగ్‌తో కారు నడిపిన 14 ఏళ్ల కుర్రాడు.. ఆ కారుతో ఇద్దరిని తొక్కేసి చంపేయగా.. మరో నలుగురిని తీవ్రంగా గాయపరిచాడు. బుధవారం తెల్లవారుజాము సమయంలో వాళ్లంతా అహ్మదబాద్ నగరంలోని ఫుట్‌పాత్ మీద పడుకుని ఉండగా ఆ కుర్రాడు కారుతో వేగంగా వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దానిలిండా ప్రాంతంలోని వాగ్జీభాయ్ చాల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారును అతడు నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు ఇన్స్పెక్టర్ ఎంఎఫ్ షేక్ తెలిపారు. ఈ సంఘటనలో మరణించినవారిని సలీం రషీద్‌ఖాన్ పఠాన్ (40), రషీదా మున్షిఫా షేక్ (40)గా గుర్తించారు. వీరు దానిలిండా ప్రాంతానికి చెందిన కూలీలు. సంఘటన జరిగిన వెంటనే కుర్రాడు అక్కడినుంచి పారిపోయినా, పోలీసులు తర్వాత పట్టుకున్నారు. అతడు హ్యుందయ్ ఐ-20 కారు నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. పిల్లాడి తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు.