మైనర్‌ బాలుడి వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Officers who blocked the minor marriage | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలుడి వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Published Sat, May 5 2018 10:10 AM | Last Updated on Sat, May 5 2018 10:10 AM

Officers who blocked the minor marriage - Sakshi

ధర్పల్లి, నిజామాబాద్‌ : మైనారిటీ తీరకుండానే బాలుడికి వివాహం చేసేందుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా, అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని దమ్మన్నపేట్‌ గ్రామ పరిధి బేల్యా తండాకు చెందిన మెగావత్‌ జగన్, కవిత దంపతుల కుమారుడు శ్రీనివాస్‌కు ఇంకా 21 ఏళ్లు నిండలేదు.

అయితే, అదే తండాకు చెందిన మేజర్‌ అయిన యువతితో శ్రీనివాస్‌కు ఈ నెల 12న వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెళ్లి నిశ్చితార్థం గురించి అధికారులకు సమాచారం అందటంతో ఐసీడీఎస్‌ రూరల్‌ సీడీపీవో ఝాన్సిలక్ష్మి, ఎల్‌సీపీవో సూపర్‌వైజర్‌ అనిల్‌ శుక్రవారం విచారణ జరిపించి పెళ్లిని నిలిపి వేయించారు.

బాలుడికి 21 ఏళ్లు వచ్చిన తరువాతనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో తండా పెద్దల సమక్షంలో ఒప్పందం పత్రం రాయించారు. ఏఎస్సై వెంకన్న, ఆర్‌ఐ శ్రీనివాస్, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శోభారాణి, వీఆర్వో పోశెట్టి పాల్గొన్నారు.

 బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement