Stopped marriage
-
పెళ్లి పీటలపై ఆగిన బాల్యవివాహం
బషీరాబాద్(తాండూరు) వికారాబాద్ : బాల్య వివాహాన్ని పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ ఘటన బషీరాబాద్ మండలం నవల్గ పంచాయతీ పరిధిలోని బోజ్యానాయక్ తండాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోజ్యానా యక్ తండాకు చెందిన బాలిక (16) అదే పంచాయతీ పరిధిలోని బాబునాయక్ తండాకు చెందిన రాథోడ్ రమేష్ అనే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే 1098కు బాల్యవివాహం జరుగుతుందని సమాచారం వెళ్లడంతో వెంటనే చైల్డ్‌లైన్ ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, వెంకటేష్, పోలీసులు బోజ్యానాయక్ తండాకు చేరుకున్నారు. బాలికకు పెళ్లి వయసు రాలేదని, పెళ్లిని నిలుపుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పెళ్లి పందిరిలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వధూవరులను, పెళ్లి పెద్దలను బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు వారిని తహీసల్దార్ వెంకటయ్య ఎదుట బైండోవర్ చేశారు. బాలికకు పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు ఒప్పంద పత్రం రాసిచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
మైనర్ బాలుడి వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ధర్పల్లి, నిజామాబాద్ : మైనారిటీ తీరకుండానే బాలుడికి వివాహం చేసేందుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా, అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ పరిధి బేల్యా తండాకు చెందిన మెగావత్ జగన్, కవిత దంపతుల కుమారుడు శ్రీనివాస్‌కు ఇంకా 21 ఏళ్లు నిండలేదు. అయితే, అదే తండాకు చెందిన మేజర్ అయిన యువతితో శ్రీనివాస్‌కు ఈ నెల 12న వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెళ్లి నిశ్చితార్థం గురించి అధికారులకు సమాచారం అందటంతో ఐసీడీఎస్ రూరల్ సీడీపీవో ఝాన్సిలక్ష్మి, ఎల్సీపీవో సూపర్వైజర్ అనిల్ శుక్రవారం విచారణ జరిపించి పెళ్లిని నిలిపి వేయించారు. బాలుడికి 21 ఏళ్లు వచ్చిన తరువాతనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో తండా పెద్దల సమక్షంలో ఒప్పందం పత్రం రాయించారు. ఏఎస్సై వెంకన్న, ఆర్ఐ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణి, వీఆర్వో పోశెట్టి పాల్గొన్నారు. బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న అధికారులు -
నిఖా అక్కడ.. నిరీక్షణ ఇక్కడ!
యాలాల/బొంరాస్‌పేట: ఆ ఊళ్లో పెళ్లికూతురు.. ఈ ఊళ్లో పెళ్లికొడుకు.. మధ్యలో ఉప్పొంగుతున్న నది.. మరికొద్ది సేపట్లో పెళ్లికూతురి ఊళ్లో నిఖా (పెళ్లి) జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఇరువర్గాల పెద్దలు. మరో గంటలో పెళ్లి కూతురి ఇంటికి చేరుకునేలోపు, మార్గమధ్యంలో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. పెళ్లి కొడుకుతోపాటు, ఆయన కుటుంబీకులంతా నది ఒడ్డునే నిలిచిపోయారు. దీంతో ఉదయం 10 గంటలకు జరగాల్సిన పెళ్లిని.. సాయంత్రం 5.30 గంటలకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్‌కు చెందిన మహబూబ్ అలీ, షబానాబేగం దంపతుల కూతురు పర్వీన్‌కు.. మహబూబ్‌నగర్ జిల్లా చిలమల మైలారానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్‌తో ఆదివారం ఉదయం 10 గంటలకు ‘నిఖా’ ఖాయం చేశారు. పెళ్లికూతురు తరఫు వారు భోజనాలు ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకుతోపాటు కుటుంబసభ్యులంతా ఉదయం 7 గంటలకు స్వగ్రా మం నుంచి బయలుదేరగా.. మార్గమధ్యంలోని కోకట్ కాగ్నా నది ఉప్పొంగింది. మరో మార్గం లేకఅక్కడే వారు ఆగిపోయారు. ఇలా 8 గంటల పాటు నదివద్దే నిరీక్షించారు. చివరకు సాయంత్రం కాగ్నా నది ఉధృతి తగ్గడంతో వాహనాల్లోనే పెళ్లికూతురి ఇంటికి వెళ్లారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన పెళ్లి.. సాయంత్రం 5.30 గంటల కు జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.