బనశంకరి : ఓ మైనర్ బాలుడు నకిలీ ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్‌కు తన నగ్న ఫొటో పంపించి సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కుకుని రూ.6 లక్షలకుపైగా నష్టపోయిన ఘటన బెంగళూరు నగరంలోని రాజాజీనగరలో వెలుగుచూసింది. రెండునెలల క్రితం యువతి పేరుతో ఓ వంచకుడు ఇన్‌స్ట్రాగాంలో నకిలీ అకౌంట్ తెరిచాడు. రాజాజీనగరకు చెందిన మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన యువతి ఫొటో కనబడగానే సదరు యువతిని పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి (వంచకుడు)తో కలిసి ఛాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నకిలీ అకౌంట్ ద్వారానే మైనర్ బాలుడు నగ్న ఫోటో పంపాలని వంచకుడు అడగడంతో దీంతో బాలుడు తనకు పరిచయమైంది యువతి అని భావించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న ఫొటో పంపాడు.
అతడి నగ్నఫోటో అందగానే ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అకౌంట్ తెరిచి డబ్బు ఇవ్వాలని వంచకుడు బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెడుతూ ఒక వేళ డబ్బు ఇవ్వకపోతే సోషల్‌మీడియాలో నగ్న ఫోటో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనతో భయపడిపోయిన బాలుడు ఇంట్లో రూ.6 లక్షల 40 వేల నగదు, 17 వెండి వస్తువులు చోరీకి పాల్పడ్డాడు. అనంతరం అతడి బాధ భరించలేక జరిగిన ఘటనను తండ్రికి వివరించడంతో తండ్రి, కుమారుడు రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్‌మీడియాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment