nude photographs
-
సోషల్ మీడియాలోయువతి నగ్న చిత్రాలు
చెన్నై,టీ.నగర్: ప్రేమ నిరాకరించడంతో ఆగ్రహించిన యువకుడు ఆమె నగ్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా గండాచ్చిపురానికి చెందిన కలైయరసన్ (24) వండిపాళ్యంలో బంధువు ఇంట్లో ఉంటూ కడలూరులోని సెల్ దుకాణంలో పనిచేస్తున్నా డు. అదే షాపులో పనిచేస్తున్న యువతితో ప్రే మ ఏర్పడింది. వీరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో యువతి ఇంట్లో వ్యతిరేకించారు. దీంతో యువతి కలైయరసన్తో మాట్లాడడం ఆపేసింది. దీంతో ఆగ్రహించిన కలైయరసన్ యువతి తనకు పంపిన నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కడలూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి కలైయరసన్ను అరెస్టు చేశారు. అతని ఫేస్బుక్ అకౌంట్‌ను స్తంభింపజేశారు. -
యువతిగా ఇన్‌స్టాగ్రామ్‌లో వల
బనశంకరి : ఓ మైనర్ బాలుడు నకిలీ ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్‌కు తన నగ్న ఫొటో పంపించి సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కుకుని రూ.6 లక్షలకుపైగా నష్టపోయిన ఘటన బెంగళూరు నగరంలోని రాజాజీనగరలో వెలుగుచూసింది. రెండునెలల క్రితం యువతి పేరుతో ఓ వంచకుడు ఇన్‌స్ట్రాగాంలో నకిలీ అకౌంట్ తెరిచాడు. రాజాజీనగరకు చెందిన మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన యువతి ఫొటో కనబడగానే సదరు యువతిని పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి (వంచకుడు)తో కలిసి ఛాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నకిలీ అకౌంట్ ద్వారానే మైనర్ బాలుడు నగ్న ఫోటో పంపాలని వంచకుడు అడగడంతో దీంతో బాలుడు తనకు పరిచయమైంది యువతి అని భావించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న ఫొటో పంపాడు. అతడి నగ్నఫోటో అందగానే ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అకౌంట్ తెరిచి డబ్బు ఇవ్వాలని వంచకుడు బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెడుతూ ఒక వేళ డబ్బు ఇవ్వకపోతే సోషల్‌మీడియాలో నగ్న ఫోటో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనతో భయపడిపోయిన బాలుడు ఇంట్లో రూ.6 లక్షల 40 వేల నగదు, 17 వెండి వస్తువులు చోరీకి పాల్పడ్డాడు. అనంతరం అతడి బాధ భరించలేక జరిగిన ఘటనను తండ్రికి వివరించడంతో తండ్రి, కుమారుడు రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్‌మీడియాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. -
భార్య అశ్లీల వీడియోలు తీసి..
అన్నానగర్: భార్య అశ్లీల వీడియోలు తీసి అదనపు కట్నం తేకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడిన భర్త, అత్తమామాలతో సహా నలుగురిపై మహిళా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చెన్నై కీల్పాక్కానికి చెందిన ముబారక్ అహ్మద్. ఇతని సోదరుడు సంగమ్‌షేక్ దౌత్ ఉగాండా దేశంలో వ్యాపారం చేస్తూ అక్కడే కుటుంబంతో నివశిస్తున్నాడు. ఇతని కుమార్తె సంగమ్‌హస్మీ. ఈమెకు మదురై అళగప్పన్ నగర్. బందర్ వీధికి చెందిన అల్లావుద్దీన్ఆసిక్తో గత జనవరిలో వివాహం జరిగింది. వివాహ సమయంలో 140 సవర్ల నగలు, కారు వరకట్నంగా ఇచ్చారు. అనంతరం అల్లావుద్దీన్ఆసిక్ వ్యాపారం ప్రారంభించడానికి సంగమ్‌షేక్‌దౌత్ ఉగాండా నుంచి రూ.25 లక్షలు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేశాడు. సంగమ్‌హస్మి ధరించిన నగలను కూడా భర్త ఇంటి వారు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో సరిపెట్టుకోకుండా అదనపు కట్నం తేవాలని అల్లావుద్దీన్ఆసిక్ భార్యను హింసించేవాడు. అంతేగాకుండా భార్యను అశ్లీలంగా వీడియో తీసి అదనపు కట్నం తేకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సంగమ్‌హస్మి ఉగాండాకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారితో వాపోయింది. ఈ వ్యవహారంపై చెన్నైలో ఉన్న సంగమ్‌షేక్‌దౌత్ తమ్ముడు ముబారక్అహ్మద్ మదురై మహిళా పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు అల్లావుద్దీన్ ఆసిక్ (28), ఇతని తండ్రి అల్లావుద్దీన్ (62), తల్లి జిన్నత్ (50), అన్న జలావత్ (37). ఈ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అమ్మకానికి నటి న్యూడ్ చిత్రాలు
లండన్ : ప్రముఖ నటి, హాలీవుడ్ తార ఏంజిలీనా జోలి అరుదైన న్యూడ్ చిత్రాలను లండన్‌లో అమ్మకానికి పెట్టారు. స్థానిక జీబ్రా వన్ గ్యాలరీలో జోలీ ఫోటోలు విక్రయిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ తార ఒక్కొక్క ఫోటో రూ. 1,82,000 ధర పలుకుతోంది. అయితే ఆమె ఈ ఫోటోలు 1995లో దిగింది. అప్పటికి జోలీ వయస్సు 20 ఏళ్లు. ఏంజిలీనా జోలి ఈ ఏడాది 40వ పడిలో అడుగుపెట్టనుంది. ఈ మేరకు లండన్‌లోని కాంటాక్ట్ మ్యూజిక్ బుధవారం వెల్లడించింది.