13-Year-Old Boy Kills Minor After Argument Over Cricket In Maharashtra - Sakshi
Sakshi News home page

క్రికెట్ ఆడుకుంటూ కొట్లాట... 12 ఏళ్ల  బాలుడిని చంపిన 13 ఏళ్ల  బాలుడు  

Published Thu, Jun 8 2023 12:01 PM | Last Updated on Thu, Jun 8 2023 12:19 PM

Minor Boy Killed By Another Minor While Playing Cricket - Sakshi

మహారాష్ట్ర, చంద్రాపూర్: మహారాష్ట్రలోని బాగాడ్కిడ్కిలో దారుణం జరిగింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా తలెత్తిన వివాదంలో 13 ఏళ్ల  బాలుడు 12 ఏళ్ల  బాలుడిని బ్యాట్ తో కొట్టి చంపేశాడు. హత్య జూన్ 3న జరిగితే జూన్ 6న మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, అప్పటికే పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు చంద్రాపూర్ పోలీసులు.

ఆలస్యంగా వెలుగులోకి... 
జూన్ 3న బాగాడ్కిడ్కిలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా పిల్లల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అంతలోనే కోపగించిన 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో బలంగా తలపై కొట్టాడు. దీంతో ఆ మైనర్ బాలుడు కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ జూన్ 5న బాలుడు తుదిశ్వాస విడిచాడు. పోలీసులకి విషయం చెప్పకుండా బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని పాతిపెట్టారు. 

ఆ తర్వాతి రోజున బాలుడి తల్లి చంద్రాపూర్ జిల్లా పోలీసులను ఆశ్రయించి విషయాన్ని వివరించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జూన్ 7న మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షల నిమిత్తం పంపించి, హత్య చేసిన బాలుడిపై ఐపీసీ 302 సెక్షన్ను అభియోగించారు.         

ఇది కూడా చదవండి: చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement