బాలుడిపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు! | a man sentenced to 10 years in jail in molestation case | Sakshi
Sakshi News home page

బాలుడిపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు!

Published Fri, Sep 2 2016 1:47 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

బాలుడిపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు! - Sakshi

బాలుడిపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు!

బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఓ భూస్వామికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కర్ణాటకలోని జిల్లా రెండో అదనపు సెషన్స్, స్పెషల్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయపుర జిల్లా హన్నుక్తి గ్రామంలో రాకేశ్ దశరథ్ ఓ పేరుమోసిన ఆసామి. అయితే దాదాపు మూడేళ్ల కిందట ఓ బాలుడితో తన ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆ భూస్వామి తనను లైంగిక చర్యలకు ప్రేరేపిస్తున్న విషయాన్ని ఆ బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు విజయపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నమోదైంది. గతవారం కిందట తాజాగా జరిపిన విచారణలో రాకేశ్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు. కోర్టులో ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ ఆ భూస్వామికి పదేళ్ల కఠినశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement