![Young Man Molested 13 Year Old Minor Boy In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/26/crime.jpg.webp?itok=xy05SVPs)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిలకలగూడ: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్న ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్‌లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని చాక్‌లేట్లు ఇస్తానని చెప్పి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు.
చదవండి: ప్రేమ పెళ్లి: రోజూ నరకం చూపిస్తూ.. చివరికి చీర కొనుక్కుందని..
Comments
Please login to add a commentAdd a comment