chilakalaguda
-
బాబోయ్ బరాత్!.. పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం
చిలకలగూడకు చెందిన వర్షిణి ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధవుతోంది. చదువుకునే సమయంలో అర్ధరాత్రి దాటేంతవరకు ఆగకుండా మోగుతున్న డప్పుల చప్పుడుకు ఏకాగ్రత కోల్పోయి, అటు చదువుకు ఇటు నిద్రకు దూరమై.. మరుసటి రోజు పరీక్ష సరిగా రాయలేక పోయింది.రాత్రి 10 గంటల వరకే.. బ్యాండ్ బరాత్‌లు, ర్యాలీలకు రాత్రి 10 గంటల వరకే పోలీసులు అనుమతి ఇస్తున్నా.. అర్ధరాత్రి దాటేవరకు ఇవి సాగుతున్నాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో శబ్ద కాలుష్యంపై డయల్ 100కు మూడుసార్లు ఫిర్యాదు చేయగా ఆలస్యంగా స్పందించారు’ అని నామాలగుండుకు చెందిన వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి, సిటీబ్యూరో/చిలకలగూడ: ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కంటే ఎక్కువగా పెళ్లి బరాత్‌ల టెన్షన్ పట్టుకుంది. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర శబ్ద కాలుష్యం వెలువడుతుంటమే దీనికి కారణం. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసు విభాగం సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. డయల్–100కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన ఉండట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరి బాధ వారిది.. పెళ్లిళ్ల సీజన్ వచి్చందంటే చాలు నగర వ్యాప్తంగా బరాత్‌ల హడావుడి కనిపిస్తుంటుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుకని, అందరికీ మధుర జ్ఞాపకంగా మిగలడం కోసం ఇలా చేసుకుంటామని నిర్వాహకులు చెబుతుంటారు. హంగులు, ఆర్భాటాల మాట అటుంచితే.. ఊరేగింపులోని డీజేలు, ఇతర శబ్దాలతో పాటు బాణాసంచా తదితరాల వల్ల ఎదుటి వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారు పట్టించుకోరనేది బాధితుల మాట. రహదారులకు పక్కన, ఫంక్షన్ హాళ్ల చుట్టుపక్కల నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సాధారణ సమయల్లో ఈ ఇబ్బందుల్ని భరిస్తున్నా ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పిల్లల ఏకాగ్రత దెబ్బతింటోందని వాపోతున్నారు. ఆ ప్రాంతాల్లో నిషేధం ఉన్నా.. పెళ్లి బరాత్ అంటేనే నెమ్మదిగా సాగే సమూహం. ఒకప్పుడు బరాత్‌లు కిలోమీటర్ల మేర సాగేవి. అంతర్గత రహదారుల్లోనే కాకుండా ప్రధాన రహదారుల పైనా గంటల పాటు ఈ ఊరేగింపులు నడిచేవి. వీటి కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు కొన్నేళ్ల క్రితం బరాత్‌లను నిషేధించారు. అయినప్పటికీ.. కాలనీలతో పాటు ఫంక్షన్ హాళ్ల సమీపంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిర్వాహకులను దృష్టిలో పెట్టుకుంటున్న పోలీసులు వీటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. సమయపాలన లేకుండా శబ్దాలు.. దీంతో ఇటీవల కాలంలో బరాత్‌ల హంగామా ఎక్కువైంది. నగరంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వాడాలనే నిబంధన ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి సౌండ్లు చేయడానికి వీలులేదు. ప్రాంతాల వారీగా ఎన్ని డెసిబుల్స్ శబ్ద తీవ్రత ఉండాలనేది నిర్ధారించారు. వీటికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. అయినప్పటికీ బరాత్‌ల నిర్వాహకులు వీటిని పట్టించుకోవట్లేదు. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు వీరివల్ల నరకం చవి చూస్తున్నారు. పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు.. బరాత్ల్లో వెలువడుతున్న శబ్దాల కారణంగా విద్యార్థులు చదువుకోలేకపోవడమే కాదు.. చివరికి కంటి నిండా నిద్రకూ దూరమై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ప్రభావం ఫైనల్ పరీక్షలపై ఉంటోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా నడుస్తున్న బరాత్‌లు, డీజేలపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండట్లేదని వాపోతున్నారు. కఠిన చర్యలు లేని కారణంగా గస్తీ బృందాలు వచి్చనప్పుడు ఆపేస్తున్న నిర్వాహకులు వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ మొదలెడుతున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు అవసరమైన పట్టించుకోకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పరీక్షల సీజన్లో శబ్ద కాలుష్యం లేకుండా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం -
సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు సైతం గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావానికి స్థానికంగా ఎనిమిది ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టింది. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. చదవండి: Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
సికింద్రాబాద్ చిలకలగూడలో పేలిన గ్యాస్ సిలిండర్
-
హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి..
సాక్షి, చిలకలగూడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన సెంట్రింగ్ కార్మికుడైన ముస్తాల రవి, నాగలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి పార్శిగుట్టలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న నాగలక్ష్మి (24) తన కుమార్తెలు రిత్విక(4), రెండున్నరేళ్ల సిరిని వెంటతీసుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్వగ్రామంతోపాటు సన్నిహితులు, బంధు మిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త రవి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అడ్మిన్ ఎస్ఐ తెలిపారు. చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం! -
చాక్లెట్లు ఇస్తానని చెప్పి 13 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగికదాడి..
సాక్షి, చిలకలగూడ: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్న ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్‌లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని చాక్లేట్లు ఇస్తానని చెప్పి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: ప్రేమ పెళ్లి: రోజూ నరకం చూపిస్తూ.. చివరికి చీర కొనుక్కుందని.. -
ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు..
సాక్షి, చిలకలగూడ: ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ ఠాణా పరిధిలోని పార్శిగుట్టకు చెందిన గట్టు నిఖిత (23), జాన నాగమణి (23) వేర్వేరు కారణాలతో అక్టోబరు 29న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో అదృశ్యమైన యువతుల కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫూటేజీలు, సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌లను పరిశీలిస్తున్నామని తెలిపారు. చదవండి: కిరాణా దుకాణానికి వెళ్తున్నానని చెప్పి..సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసి.. -
Telangana: కొంప ముంచుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం’ అనే సామెత పోలీసు విభాగానికి సరిగ్గా సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అమలులో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నించి దెబ్బ తింటున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న పోలీసులపై దాడుల ఉదంతాలు దీన్ని వెక్కిరిస్తున్నాయి. బుధవారం సాక్షాత్తూ చిలకలగూడ ఠాణాలోనే ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడటం గమనార్హం.. బయటకు రానివి ఎన్నో.. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో కొన్ని అసాంఘిక శక్తులు, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులతో పాటు మరికొందరు రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఏకంగా యూనిఫాంలో ఉన్న వారిని దూషించడంతో పాటు వారి పైనే దాడులకు దిగుతున్నారు. గడిచిన పక్షం రోజుల్లో ఇలా.. రాజేంద్రనగర్ పరిధిలోని ఇమ్మద్‌నగర్ ప్రాంతంలో లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై స్థానికుడు సమీర్ సహా ముగ్గురు దాడికి యత్నించారు. యాకత్‌పురాకు చెందిన మహ్మద్ అనీస్ ఇక్బాల్ మొఘల్‌పురా ఇన్స్పెక్టర్ రవికుమార్‌కు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించాడు. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చిలకలగూడ: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సమయంలో అదే నిందితుడు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. గోపాలపురం ఏసీపీ, చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన మామిడి హరి కూరగాయల వ్యాపారి. ఇతనికి డేవిడ్‌తో పాటు మరో కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో హరి కుటుంబ సభ్యులను స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహించే శీతల శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ వారం రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మరోసారి వాగ్వాదం జరిగింది. క్షణికావేశానికి లోనైన హరి పెద్ద కుమారుడు డేవిడ్ తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో శ్రీకాంత్‌పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం శ్రీకాంత్‌ను ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులు హరితో పాటు ఆయన ఇద్దరు కుమారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ విచారణ చేస్తున్న సమయంలో డేవిడ్ తన వెంట ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కిరణ్‌కుమార్ మెడ, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన శ్రీకాంత్, కానిస్టేబుల్ కిరణ్ ఫిర్యాదు మేరకు మామిడి హరి, ఆయన ఇద్దరు కుమారులపై కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: Telangana: ఎంసెట్ వాయిదా! -
కరోనాతో భర్త మృతి.. భార్యకు పాజిటివ్.. తీవ్ర వేదనతో..
చిలకలగూడ: ఆనంద కాపురంలో కరోనా విషాదాన్ని నింపింది. వారం రోజుల వ్యవధిలో దంపతులను బలిగొంది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలోని వారాసిగూడలో జరిగింది. మృతురాలి సోదరుడు అరవింద్, చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడలోని బజరంగ్ అపార్ట్మెంట్లో నివస్తున్న విశ్వనాథ లక్ష్మీనారాయణ (46) బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ)గా విధులు నిర్వర్తించేవారు. ఆయనకు భార్య రూపాదేవి (37), కుమారుడు కార్తీక్ (13), కుమార్తె శృతి (11) ఉన్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన లక్ష్మీనారాయణకు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నెల 20న గాంధీ ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. చికిత్స పొందుతూ ఆయన అదే రోజు మృతి చెందారు. భర్త మృతితో తీవ్ర మానసిక వేదన.. భర్త మరణవార్తతో రూపాదేవి తీవ్రంగా కలత చెందారు. ఆమెకు స్వల్పంగా జ్వరం రావడంతో ఈ నెల 25న టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో మరింత మానసిక వేదనకు గురయ్యారు. మంగళవారం ఆమె సోదరుడు అరవింద్ సోదరి ఇంటికి వచ్చి గది తలుపులు ఎంత కొట్టినా తెరవలేదు. తలుపులు బద్ధలు కొట్టి చూడగా రూపాదేవి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. తీవ్రమైన మానసిక వేదనతోనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సోదరుడు అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో వారాసిగూడలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ( చదవండి: కరోనా విషాదం: టెస్టు ఫలితం రాకముందే.. ) -
రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు !
సాక్షి, చిలకలగూడ: క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు.. సీతాఫల్మండి డివిజన్ మధురానగర్‌కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో 20వ తేదీన తనపై తప్పుడు కథనాలు ప్రచురించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 22న పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపేస్తా -
అయ్యో కొడుకా.. అమ్మ ఉరికి వేలాడుతోంది
చిలకలగూడ: పదకొండేళ్ల దాంపత్యజీవితం అన్యోన్యంగా గడిచింది. అల్లారు ముద్దుగా పెంచిన ఇద్దరు పిల్లలతో సరదా, సంతోషాలతో గడిచిపోతున్న తరుణంలో విధి వక్రించింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో నెలన్నర క్రితం భర్త మృతి చెందాడు. భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక భార్య ఉరి వేసుకొని తనువు చాలించింది.ఈ హృదయ విదారకర ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. బౌద్ధనగర్ డివిజన్ మహ్మద్‌గూడకు చెందిన శ్రీనివాస్(38), హేమలత (32)లు భార్యభర్తలు. వీరికి ఐశ్వర్య (10), అభిలాష్ (08) ఇద్దరు పిల్లలు. వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెండునెలల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. (చదవండి: ప్రేమను నిరాకరించిందని వెబ్సైట్లో వేధించాడు) ఈ క్రమంలో బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో గతేడాది నవంబరు 17న మృతి చెందాడు. హఠాత్తుగా భర్త మృతి చెందడంతో భార్య హేమలత తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త జ్ఞాపకాలను తలుచుకుని తనలోతానే కుమిలిపోయేది. ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గదిలోని సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుమారుడు అభిలాష్ వచ్చి చూడగా తల్లి ఉరికి వేలాడుతూ కనిపించింది. చిన్నారి ఏడుస్తు సీలింగ్ ఫ్యానుకు అమ్మ వేలాడుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక హేమలత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య
సాక్షి, చిలకలగూడ : కుటుంబ సమస్యల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడగా, బెడ్రూంలో బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ డివిజన్ అంబర్‌నగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ అంబర్‌నగర్‌కు చెందిన తిరుమల వెంకటేష్ (30), దండె భార్గవి (24) భార్యాభర్తలు. 2015లో వీరికి వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె మోక్షశ్రీ, మూడు నెలల కుమారుడు అన్విక్లున్నారు. పుత్లిబౌలిలోని విద్యుత్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా వెంకటేష్, కృష్ణజిల్లా జగ్గయ్యపేట పోస్ట్‌ఆఫీస్‌లో పోస్ట్‌ఉమెన్‌గా భార్గవి పనిచేస్తున్నారు. వెంకటేష్ తల్లి మృతి చెందడంతో తండ్రి బాలకృష్ణ మరో పెళ్లి చేసుకున్నాడు. బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటేష్. తన భార్య పిల్లలతో కలిసి తండ్రి ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు నెలవారీ జీతాలను తనకే ఇవ్వాలని, కుటుంబ పోషణ భారమవుతుందని తండ్రి బాలకృష్ణ తరచూ గొడవపడేవాడు. గతనెల 31వ తేదిన వెంకటేష్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తనకు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నాడని భావించిన తండ్రి డబ్బు కోసం మరింత ఒత్తిడి తెచ్చాడు. దీంతో భార్యభర్తలు తీవ్ర మానసిన వేదనకు గురయ్యారు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. అమ్మా నన్ను క్షమించి, పిల్లలను బాగా చూసుకో అని భార్గవి సూసైడ్‌నోట్ రాసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేని వెంకటేష్ బెడ్రూం దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మూడు నెలల బాబు గుక్కపట్టి ఏడుస్తున్నా ఇంటి లోపలి నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో కిటికీ నుంచి లోపలకు వెల్లి చూడగా భార్యభర్తలు వేర్వేరుగా ఉరికి వేలాడుతు కనిపించారు. మృతుల కుటుంబసభ్యులు ఒకరినొకరు దూషించుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, సెక్టార్ ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డిలు ఘటనస్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. వెంకటేష్ కుటుంబసభ్యులైన తిరుమల బాలకృష్ణ, లక్ష్మీ, రవి, సంతోష్, వజ్రమ్మ, రాణి, భాగ్యలే తన కుమార్తె, అల్లుడు ఆత్మహత్యకు కారణమని మృతురాలు భార్గవి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు, కోడలును డబ్బులు కోసం వేధించలేదని, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదని మృతుడు వెంకటేష్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
‘టెర్రస్‌పైకి పిలిచి దారుణానికి ఒడిగట్డాడు’
సాక్షి, సికింద్రాబాద్ : చిలకలగూడ ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేశామని నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్ మీడియాకు తెలిపారు. తనకు దక్కదనే కసితోనే ఇర్ఫానాను నిందితుడు షోయబ్ హతమార్చాడని వెల్లడించారు. ‘వారాసిగూడలో భవనంపై నుంచి పడి ఓ యువతి రక్తపు మడుగులో ఉందని ఈరోజు ఉదయం 7 గంటలకు డయల్ 100 ద్వారా సమాచారం అందింది. మృతురాలు ఇర్ఫానా కుటుంబ సభ్యులను విచారించాం. వారు షోయబ్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. సమీపంలోని సీసీ ఫుటేజీలో షోయబ్ చిత్రాలు రికార్డయ్యాయి. (చదవండి : వారాసిగూడలో బాలిక దారుణ హత్య) ఇర్ఫానా, షోయబ్ గతంలో కలిసి చదువుకున్నారు. ఇర్ఫానాతో వివాహం జరిపించాలని షోయబ్ గతంలో ప్రపోజల్ పెట్టాడు. దానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇది మనసులో పెట్టుకున్న అతను ఇర్ఫానాను హతమార్చాలనుకున్నాడు. ఇద్దరూ వాట్సాప్‌లో నిన్న రాత్రి చాటింగ్ చేసుకున్నారు. టెర్రస్‌పైకి రావాలని రాత్రి ఒంటిగంట సమయంలో షోయబ్ చెప్పడంతో ఆమె అక్కడకు వెళ్లింది. దీంతో షోయబ్ అక్కడే ఉన్న బండరాయితో యువతిపై దాడిచేశాడు. పదునైన రాయితో ఆమె గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. మృతదేహాన్ని బిల్డింగ్ పైనుంచి తోసేశాడు. ఈకేసులో షోయబ్ ఒక్కడే నిందితుడు. అన్ని కోణాల్లో కేసు విచారణ జరుపుతున్నాం’అని డీసీపీ పేర్కొన్నారు. -
హైదరాబాద్ చిలకలగూడలో మైనర్ల స్ట్రీట్ ఫైట్
-
చెల్లిని వేధిస్తున్నాడని.. తన్నుల నాటకం
చిలకలగూడ : చెల్లిని వేధిస్తున్న బావకు బుద్దిచెప్పాలని భావించిన ఓ బావమరిది తన స్నేహితులకు సుఫారీ ఇచ్చి బావపై దాడి చేయించాడు. తనపై అనుమానం రాకుండా బావతో కలిసి తానూ దెబ్బలు తిన్నాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు బావతో కలిసి తమపై దుండగులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడడంతో సుపారీ ఇచ్చిన స్నేహితులతోపాటు సూత్ర«ధారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ ఠాణాలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసులు, చిలకలగూడ డీఐ నర్సింహరాజు, డీఎస్ఐ వెంకటాద్రి బుధవారం వివరాలు వెల్లడించారు. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన కే. నరేష్కుమార్, వరుసకు బావమరిది అయిన రామంతాపూర్‌కు చెందిన రాచకట్ల శ్రీనివాస్ గతనెల 23న రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా చిలకలగూడ ఠాణా పరిధిలోని జామై ఉస్మానియా వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడిచేశారు. ఈ ఘటనలో నరేష్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, శ్రీనివాస్‌కు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌కు వరుసకు చెల్లెలిని నరేష్కుమార్ పెళ్లి చేసుకున్నాడు. నరేష్కుమార్ తనను వేధిస్తున్నాడని మాటల సందర్భంలో చెప్పడంతో అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ తన స్నేహితులకు సుపారీ ఇచ్చి నరేష్‌కుమార్‌పై దాడికి పథకం సిద్ధం చేశాడు. తనపై అనుమానం రాకుండా బావతో పాటు తనను కూడా కొట్టాలని సూచించాడు. ఈ క్రమంలో గతనెల 23న బావతో కలిసి జామై ఉస్మానియా మీదుగా తిరిగి వెళ్లేలా ప్లాన్ చేశాడు. బయలు దేరేముందు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. జామై ఉస్మానియా వద్దకు రాగానే టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పి బైక్‌ను ఆపించాడు. పథకం ప్రకారం ముగ్గురు దుండగులు వీరిపై దాడి చేసి సెల్ఫోన్లు, నగదు లాక్కుని పరారయ్యారు. అనంతరం నరేష్‌కుమార్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో నిజం బయట పడడంతో దాడి పథకానికి సూత్రధారైన శ్రీనివాస్‌తో పాటు అతని స్నేహితులు సాయికిరణ్, మహేష్, సీఈ జస్టిన్పాల్లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లతో రూ.4వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా కేసును చేధించిన చిలకలగూడ డీఐ నర్సింహరాజు, డీఎస్ఐ వెంకటాద్రి, క్రైం సిబ్బందిని ఉత్తరమండలం డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు. -
స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి
చిలకలగూడ: నగరంలో స్వైన్‌ప్లూతో చికిత్స పొందుతున్న మరో మహిళ మృతి చెందింది. పాతబస్తీ బహదూర్‌పురాకు చెందిన మహిళ(64) స్వైన్‌ఫ్లూతో కొద్దిరోజులుగా చికిత్స పొందుతోంది. అక్కడి నుంచి ఈ నెల 16న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. గత 20 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో నలుగురు మృతి చెందారు. -
‘చిలకలగూడ స్నాచర్లు’ చిక్కారు
జిమ్‌లో జత కట్టిన స్నాచర్ల ద్వయం విలాసాల కోసం చోరీల బాట అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సిటీబ్యూరో: నార్త్‌జోన్‌లోని చిలకలగూడ ఠాణా పరిధిలో గత గురువారం ఓ వృద్ధురాలి మెడ నుంచి బంగారం గొలుసు లాక్కుపోయిన స్నాచర్లను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల్లో చిక్కిన ఆనవాళ్ళ ఆధారంగా వీరిని పట్టుకున్నామని, నిందితులపై గతంలో ఎలాంటి కేసు లేవని డీసీపీ బి.లింబారెడ్డి గురువారం తెలిపారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రహమత్ పదో తరగతి వరకు చదివి వేనుభానగర్లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ముషీరాబాద్ హరినగర్‌కు చెందిన మహ్మద్ జఫార్ మేధి బాకారంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో బుక్ బైండింగ్ పని చేస్తున్నాడు. జిమ్‌కు వెళ్ళే వీరిద్దరికీ అక్కడే పరిచయమైంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంతో పాటు విలాసాలకు డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి స్నాచింగ్స్ చేయాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పరిసరాల్లో బైక్‌పై తిరుగుతూ కొన్ని రోజులుగా టార్గెట్ల కోసం వెతికారు. గత గురువారం నామాలగుండ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు నాగలక్ష్మమ్మ మెడలో ఉన్న 3 తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. ఆ సమయంలో జఫార్ బైక్ నడపగా... రహమత్ వెనుక కూర్చుని వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాగేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాల పుటేజీ ఆ«ధారంగా నిందితుల్ని గుర్తించారు. గురువారం ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని చోరీ సొత్తును విక్రయించడానికి వచ్చిన నిందితుల్ని పట్టుకున్నారు. వీరి నుంచి బంగారు గొలుసు, వాహనంతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. -
ఏడాది చిన్నారిపై లైంగిక దాడి
చిలకలగూడ: అమ్మ పొత్తిళ్ల వెచ్చదనాన్ని అనుభవిస్తున్న పసిపాపపై మానవ మృగం పంజా విరిసింది. ఏడాది వయసున్న చిన్నారిపై ఓ కాంమాధుడు మాటల్లో చెప్పలేని.. అక్షరాల్లో రాయలేని దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావమైన చిన్నారి చావుబతుకుల మధ్య గాంధీ ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. హృదయాలను కదిలించే ఈ దుర్ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ ఠాణా పరిధి దూద్‌బావిలో మంగళవారం అర్ధరాత్రి చోటుసుకుంది. ఉత్తర మండలం డీసీపీ సుమతి ఆదేశాల మేరకు చిలకలగూడ ఠాణాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోపాలపురం ఇన్చార్జి ఏసీపీ ఎస్.గంగాధర్, సీఐ కావేటి శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కనోజ్ జిల్లా తాటియా రాణా పరిధిలోని సత్సార్ గ్రామానికి చెందిన శశికాంత్(23), భార్య ఆరతి నగరానికి వలసవచ్చి దూద్‌బావిలో నివసిస్తూ తోపుడుబండిపై మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ బతుకుతున్నారు. వీరికి రెండున్నర, ఏడాది వయసుగల ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వీరి గ్రామానికే చెందిన దీపుసింగ్ అలియాస్ దీపు(20) కూడా నగరానికి వచ్చి శశికాంత్ ఉంటున్న ప్రాంగణంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి శశికాంత్, ఆరతి తమ ఇద్దరు పిల్లలను పక్కలో వేసుకుని పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక ఏడాది వయసు గల చిన్నారిని దీపుసింగ్ ఎత్తుకుపోయి బాత్రూంలోకి తీసుకెళ్లి పాప నోరునొక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని తీసుకువచ్చి తల్లితండ్రుల పక్కలో పడుకోబెట్టి జారుకున్నాడు. చిన్నారి ఏడుపుతో మెలకువ వచ్చిన తల్లితండ్రులు లేచి చూడగా ఒంటి నిండా రక్తంతో దారుణమైన పరిస్థితిలో కనిపించింది. ఈ అలికిడికి ప్రాంగణంలో ఉన్నవారంతా మేల్కొని చిన్నారి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. ఏడుస్తున్న చిన్నారిని బాత్రూం నుంచి దీపుసింగ్ ఎత్తుకుని రావడం చూసిన ఓ వ్యక్తి విషయాన్ని తెలిపాడు. వెంటనే పాపను గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. స్థానికులు దీపుసింగ్ను పట్టుకుని దేహశుద్ధి చేయగా దారుణానికి ఒడిడట్టినట్టు ఒప్పుకున్నాడు. చిన్నారి తండ్రి శశికాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు దీపుసింగ్ను అదుపులోకి తీసుకుని బుధవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. మెట్టుగూడ, సీతాఫల్మండి కార్పొరేటర్లు పీఎన్ భార్గవి, సామల హేమ చిన్నారి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. పసిపిల్లలకు రక్షణ లేదు.. నగరంలో పసిపిల్లలకు రక్షణ లేదని మరో రుజువైందని, బాలల హక్కుల సంఘం చైర్మన్ అనురాధరావు అవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారం జరిగినప్పుడు ‘పోక్సో చట్టం’ ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సాయం అందించక పోవడం దారుణమన్నారు. -
బిచ్చగాడని అన్నం పెడ్తె బ్యాగు కొట్టేశాడు
చిలకలగూడ: ఆకలితో అల్లాడుతుందని దయతో ఇంట్లోకి పిలిచి అన్నం పెడితే తృప్తిగా భోజనం చేసిన తర్వాత అదే ఇంట్లో బ్యాగును ఎత్తుకెళ్లిన సంఘటన చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావిలో మంగళవారం చోటు చేసుకుంది. ఆలుగడ్డబావికి చెందిన బీ.సోలమన్, దీనారాణిలు భార్యాభర్తలు. సోలమన్ చిరువ్యాపారి. మంగళవారం ఓ గర్భిణి, వికలాంగుడైన భర్త, ఇద్దరు చిన్నారులతో కలిసి భిక్షాటన చేస్తూ వీధిలోకి వచ్చారు. చిన్నారులు ఆకలితో ఏడుస్తుండడాన్ని గమనించిన దీనారాణి వారిని ఇంట్లోని అరుగుపై కూర్చోబెట్టి భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత వారు క్షణాల్లో అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. కొద్దిసేపటి తర్వాత చూడగా ఇంట్లోని హ్యాండ్ బ్యాగ్ కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫూటేజీని పరిశీలిస్తున్నారు. -
ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
-
ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
చిలకలగూడ: ఆమె కోట్ల రూపాయలకు అధిపతి.. కానీ దేవుని ప్రసాదంతో కడుపు నింపుకోవాల్సిన దైన్య స్థితి. చిన్నతనంలో తన చేతి గోరుముద్దలు తిన్న బిడ్డలు... వృద్ధాప్యంలో ఆదరించకపోవడంతో పదిహేనేళ్లుగా ఆలయం చెంతనే ఆశ్రయం పొందుతోంది. కష్టాలు భరించలేని ఆ తల్లి చివరకు తనకు రావాల్సిన ఆస్తి కోసం కొడుకులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మెట్టుగూడకు చెందిన కిమాబాయి పునేరియా (72). బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన ద్వారకదాసు, కిమాబాయి పునేరియాలు భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తితోపాటు వ్యాపారంలో రూ.కోట్ల విలువైన చర, స్థిరాస్థులను సంపాదించిన ద్వారకదాసు 2001లో మృతిచెందాడు. అప్పటికే భార్య కిమాబాయితో పాటు బిడ్డలకూ ఆస్తిని సమానంగా పంచి పెట్టాడు. భర్త మరణంతో కిమాబాయికి సమస్యలు మొదలయ్యాయి. ఒత్తిడి చేసి ఆస్తిని చేజిక్కించుకున్న కుమారులు ఆనక అమ్మ ముఖం చూసేందుకు నిరాకరించారు. కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆ తల్లి యాదగిరిగుట్టకు వెళ్లి దైవసేవలో గడుపుతోంది. భక్తులు పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకుంటోంది. కుమారులు జల్సాలు చేస్తుంటే...రూ.కోట్లకు అధిపతినైన తానెందుకు కష్టాలు పడాలని భావించింది. తన ఆస్తి ఇవ్వాలని కోరుతూ మెట్టుగూడలో కుమారులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు బుధవారం సాయంత్రం ధర్నాకు దిగింది. ‘నా ఆస్తి ఇస్తే... ఇటువంటి కుమారుల చేతిలో బాధ పడుతున్న తల్లుల కోసం ఏర్పాటు చేసే వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలకు విరాళంగా అందజేస్తానని కిమాబాయి మీడియాకు తెలిపింది. «సన్నిహితుల సలహాతో ధర్నా విరమించి... కుమారులపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని ఆస్తులపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని... కొంతమంది కావాలనే తమ తల్లితో కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆమె కుమారులు తెలిపారు. -
కుప్పకూలిన పురాతన భవనం : ఇద్దరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ పురాతన భవనం సోమవారం రాత్రి కుప్పకూలిపోయి.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిలకలగూడ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడ 1940 సమయంలో నిర్మించిన ఓ పాత భవనంలో ఒక చికెన్ షాపు, మరో జిరాక్స్ షాపు ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయంలో జిరాక్స్ షాపును యజమాని మూసేసి వెళ్లిపోయాడు. చికెన్ దుకాణం తెరిచే ఉంది. రాత్రి 9.45 సమయంలో ఆ భవనం పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికెన్ దుకాణంలో ఉన్న దాని యజమాని అక్బర్(30), వాజిద్ (25) శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి, గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. బోనాల పండుగ సందర్భంగా తొట్టెల ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో.. ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది భయాందోళనకు గురయ్యారు. -
వాషింగ్ మెషిన్ షాక్: ఇద్దరు మృతి
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పీఎస్ పరిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక వారాసిగూడ ముంతాజ్ కేఫ్ సమీపంలోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో దుస్తులు ఉతుకుతున్న మహిళ కు షాక్ తగిలింది. ఇది గమనించిన ఆమె కొడుకు తల్లి ప్రాణాలు రక్షంచబోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పూజా సామాగ్రికని వెళ్లి యువతి అదృశ్యం
చిలకలగూడ (హైదరాబాద్) : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన గోవిందకుమార్ కుమార్తె మనీషా (19) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పూజా సామగ్రి తెస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో సోదరుడు సంజయ్‌కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మనీషా ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
'చైన్ స్నాచర్ దొరికిపోయాడు'
హైదరాబాద్: మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించిన దుండగుడి యత్నాన్ని ఆ మహిళ తిప్పికొట్టింది. అరుపులతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. దీంతో వారు అతడిని పట్టుకుని కటకటాల పాలు చేశారు.ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ. జయశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బౌద్ధనగర్‌కు చెందిన పి.శ్రీలక్ష్మి (37) ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి, కుమార్తెతో కలసి షాపింగ్ చేసుకుని నడిచి ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వారాసిగూడ ప్రాంతానికి చెందిన హమీద్ (21) ద్విచక్రవాహనంపై వచ్చి శ్రీలక్ష్మి మెడలోని బంగారు మంగళ సూత్రాన్ని గట్టిగా పట్టుకుని, తెంపేందుకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని ఆమె అడ్డుకుని, గట్టిగా కేకలు వేశారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే హమీద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
మొబైల్ షాపులో భారీ చోరీ
-
సికింద్రాబాద్ లో భారీ చోరీ
సికింద్రాబాద్: సికింద్రాబద్ లోని చిలకడగూడలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఓ మొబైల్ షాప్ లో శుక్రవారం అర్థరాత్రి ఈ దొంగతనం చోటుచేసుకుంది. షాపు వెనుక భాగంలో గోడ బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులోని రూ. 5 లక్షల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన షాపు యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నలుగురు వ్యక్తుల కిడ్నాప్ కలకలం..
సికింద్రాబాద్: నగరంలోని చిలకడగూడలో నలుగురు కిడ్నాప్ అవ్వడం కలకలం సృష్టించింది. నిన్న జరిగిన కిడ్నాప్ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుర్తు తెలియని దుండగులు అంజలి, లక్ష్మీ, నరసింహారావు, శ్రవణ్ అనే వ్యక్తులను కిడ్నాప్ చేశారని సమాచారం. ఈ వ్యవహారానికి నిందితులు ఓ టాటా సుమోను ఉపయోగించినట్లు తెలుస్తోంది. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభించింది. చిలకలగూడ, దూద్‌బావి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులు గీత (05), శ్రీకాంత్ (03), స్రవంతి (08) అదృశ్యం అయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీవ్ర గాలింపు చర్యల అనంతరం చిన్నారులను నాంపల్లిలో శనివారం ఉదయం గుర్తించారు. గుర్తు తెలియని మహిళలు చిన్నారులను అపహరించి తీసుకెళ్లి వారి దగ్గరున్న బంగారు నగలను తీసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. -
ప్రియురాలి ఒత్తిడి, విషం తాగిన వివాహితుడు
చిలకలగూడ : ‘పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా..’ అంటు ప్రియురాలు పెట్టిన ఒత్తిడి భరించలేక ఆమె తెచ్చిన విషం తాగిన వివాహితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన పీఎల్వీ సత్యనారాయణ (35) ప్రైవేటు ఉద్యోగి. శ్రద్ధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. సత్యనారాయణ పనిచేస్తున్న కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్న జయతో పరిచయం ఏర్పడింది. ఇరువురు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. జయ తనను పెళ్లి చేసుకోవాలని సత్యనారాయణను ఒత్తిడి చేసేది. ఈ విషయమై పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి వచ్చిన జయ ‘పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా’ అంటు బెదిరించింది. భార్య శ్రద్ధ ఎదుటే ప్రియురాలు ఒత్తిడి చేయడం భరించలేని సత్యనారాయణ.. ఆమె తెచ్చిన విషం బాటిల్‌ను గుంజుకుని గొంతులో పోసుకున్నాడు. క్షణాల్లో నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో భార్య శ్రద్ధ అతన్ని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సత్యనారాయణ మృతి చెందాడు. మృతుని సోదరుడు గోవిందరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
-
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలు ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడుతూ ఈరోజ ఉదయం కన్నుముసింది. సీతాఫల్మండి చిలకలగూడకు చెందిన ఫాతిమాను గత నెల 29న నలుగురు యువకులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే.