
సాక్షి, చిలకలగూడ: ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ ఠాణా పరిధిలోని పార్శిగుట్టకు చెందిన గట్టు నిఖిత (23), జాన నాగమణి (23) వేర్వేరు కారణాలతో అక్టోబరు 29న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో అదృశ్యమైన యువతుల కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫూటేజీలు, సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌లను పరిశీలిస్తున్నామని తెలిపారు.
చదవండి: కిరాణా దుకాణానికి వెళ్తున్నానని చెప్పి..సచిన్‌గిరి అనే వ్యక్తికి ఫోన్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment