సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్‌లో అదృశ్యమైన లోకో పైలట్ వాసవి జాడ ఇంకా లభించలేదు. వాసవి ఆచూకీ కోసం పోలీసులు 50 రోజులుగా గాలిస్తున్నారు. ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు వంటి ఇతర గాడ్జెట్ ఇంట్లో పెట్టి వెళ్లడంతో ఆమె ఆచూకీ కనుగొనడం మరింత ఆలస్యం అవుతోంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి సనత్‌నగర్‌లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ సాయంత్రం షాపింగ్ వెళ్తున్ననని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె అదృశ్యమైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటల సమయంలో ఇల్లు తెరిచి చూడగా, ఫోన్ రూమ్‌లోనే ఉంది. కానీ ఆమె లేదు.
దీంతో తండ్రి భాస్కర్ రావు తన కూతురు అదృశ్యంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలదు. ఆమె కనిపిస్తే సనత్‌నగర్ ఎస్‌హెచ్‌వో 9490617132, ఎస్ఐ 8919558998 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
చదవండి: జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం
Comments
Please login to add a commentAdd a comment