loco pilot
-
విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణ హత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు. -
రైల్వే ట్రాక్‌పై ఆదమరిచి నిద్రపోయి.. లోకో పైలెట్ అప్రమత్తం కావడంతో
న్యూఢిల్లీ: ఓ ట్రైన్ లోకో పైలెట్ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది. రైల్వే ట్రాక్‌పై గొడుగు కింద ఆద మరిచి నిద్రపోతున్న ఓ వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డాడు.ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న ఓ ట్రైన్ లోకో పైలెట్ ట్రాక్‌పై నిద్రుస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ట్రైన్ ఆపాడు.అనంతరం ట్రైన్ దిగి సదరు వ్యక్తిని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. ఆదమరిచి నిద్రపోతున్న వ్యక్తికి మెలుకువ వచ్చిన వెంటనే పక్కకు వెళ్లాడు. ఆ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లోకో పైలట్ తన రైలును ఆపిన తర్వాత వ్యక్తి వద్దకు వెళుతున్న దృశ్యాల్ని చూడొచ్చు.ఇక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించలేదని, నిద్రపోయేందుకు అనువైన ప్రదేశం రైల్వే ట్రాక్ అని భావించి నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఆ వీడియోపై ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా.. మరో యూజర్ ఈ విషయంపై తీవ్రమైన విచారణ జరిపి సరైన రైల్వే భద్రతా నిబంధనలను అమలు చేయాలని కోరాడు. A person was sleeping on the railway track with an umbrella. Seeing this, the loco pilot stopped the train, Then he woke him up and removed him from the track. Then the train moved forward in Prayagraj UPpic.twitter.com/OKzOpHJeih— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2024 -
గొడుగు పట్టుకొని ట్రైన్ నడుపుతున్న లోకోపైలట్
-
‘మా ఆయన ఆత్మకు శాంతి చేకూరింది’
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆమధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనపై విచారణ అనంతరం గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్‌కుమార్ కుటుంబానికి ఊరట లభించింది. రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ (సీసీఆర్ఎస్)తన నివేదికలో జూన్ 17న జరిగిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్‌కుమార్ కారకుడు కాదని తేల్చి చెప్పారు. దీనిని విన్న అనిల్‌కుమార్ భార్య ఇప్పుడే తన భర్త ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొన్నారు.ఆ నాటి ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీసీఆర్ఎస్ నివేదిక వెలువడిన అనంతరం లోకో పైలట్ అనిల్ భార్య రోష్ణి కుమార్ మాట్లాడుతూ ‘రైలు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే నా భర్త ప్రమాదానికి కారకుడంటూ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ప్రారంభించకముందే నా భర్తను బాధ్యుడుగా చేయడాన్ని విని నేను షాక్ అయ్యాను. అయితే ఇప్పుడు రైల్వేశాఖ సరైన విచారణ జరిపి, తన భర్తను నిర్దోషిగా తేల్చినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని పేర్కొన్నారు.నాడు గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుండి ఢీకొన్న దరిమిలా రైల్వే బోర్డు చైర్పర్సన్ జయ వర్మ సిన్హాతో పాటు ఇతర రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి ఘటనలో మృతి చెందిన పైలట్ అనిల్ కుమార్, అతని సహాయకుడు కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంపై అధికారుల జరిపిన విచారణలో.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్నప్పటికీ, గూడ్స్ రైలు లోకో పైలట్‌ను ఆ సెక్షన్లో వెళ్లడానికి అనుమతించారని, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా అతనికి తప్పుడు సంకేతాలను పాస్ చేశారని సీసీఆర్ఎస్ ప్రాథమిక నివేదిక పేర్కొంది.ఆ సమయంలో గూడ్స్ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గూడ్సు రైలు పైలట్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెనుక భాగాన్ని గమనించి, అత్యవసర బ్రేకులు వేశాడు. దీంతో గూడ్సు రైలు వేగం నెమ్మదించి, అది కాంచన్‌జంగాను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఢీకొన్నదని తేలింది. ఇది అనిల్ అప్రమత్తతను తెలియజేస్తుందని నివేదికలో పేర్కొన్నారు.ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదిక అందిన దరిమిలా అనిల్ కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేశామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ విషయమై ఎన్ఎఫ్ఆర్ సీనియర్ అధికారి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెన్షన్ ఆర్డర్ కూడా జారీ అయ్యిందని, త్వరలో గ్రాట్యుటీ కూడా చెల్లించనున్నారన్నారు. మృతుని కుమారులు మైనర్లు అయినందున వారిలో ఒకరికి పెద్దయ్యాక రైల్వేలో ఉద్యోగం ఇవ్వనున్నారని తెలిపారు. -
నిర్ణీత వేగాన్ని అధిగమించిన రెండు రైళ్లు.. లోకోపైలట్లు సస్పెండ్!
భారతీయ రైళ్లు దేశంలోని లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఒక్కోసారి రైళ్లు నడిపే పైలట్ల పొరపాటు కారణంగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఉదంతం యూపీలో చోటు చేసుకుంది. నిర్ణీత వేగ పరిమితి కంటే అధిక వేగంతో రైళ్లను నడిపిన ఇద్దరు లోకో పైలట్లు (డ్రైవర్), రైలు సహాయకులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు, వారి సహాయకులపై రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించిన సెక్షన్లో 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతున్నందుకు వారిని సస్పెండ్ చేశారు. రైలు బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కారణంగా తాత్కాలిక వేగ పరిమితి అమలులో ఉన్న ఆగ్రా కాంట్‌కు సమీపంలోని జాజౌ- మణియన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు సిబ్బంది వేగంగా రైలును పోనిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆగ్రా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సంఘటనలో రైలు ఆగ్రా కాంట్ నుంచి గ్వాలియర్‌కు బయలుదేరిన తర్వాత గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వేగ పరిమితిని ఉల్లంఘించారు. మరో ఘటనలో కత్రా (జమ్మూ)- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య నడిచే మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ కూడా నిబంధనలను ఉల్లంఘించారు. ఈ సెక్షన్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల నది వంతెన మరమ్మతు పనుల కారణంగా గంటకు 20 కిలోమీటర్ల పరిమితిని నిర్ణయించారు.ఈ విషయమై ఆపరేషన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ వారు చెప్పిన సెక్షన్లో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించడం మరచిపోయి ఉండవచ్చు. అయినా ఇది రైలు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే చర్య. అందుకే రైల్వే శాఖ దీనిని సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సాధారణంగా ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం తదితర సందర్భాల్లో రైల్వేశాఖ ఆ రూట్లో వైళ్లే రైళ్లకు వేగ పరిమితులను విధిస్తుంది. -
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మరి రైలు ప్రయాణంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అటువంటి ఉదంతమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉదీ మోడ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు గ్రీన్ సిగ్నల్ కోసం అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్ ఆగ్రా డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి కారణాన్ని వివరించాలని స్టేషన్ మాస్టర్‌ను ఆదేశించారు.ఈ ఘటన గురించి ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఈ విషయంలో స్టేషన్ మాస్టర్‌కు ఛార్జ్ షీట్ జారీ చేశామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఘటన జరిగిన సమయంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపడానికి రైలులోని లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించారు.అరగంట తరువాత స్టేషన్ మాస్టర్ నిద్రనుంచి మేల్కొని రైలు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్యూటీలో ఉన్న ‘పాయింట్‌మెన్’ ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాడని, దీంతో ఆ సమయంలో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నానని ఆ స్టేషన్ మాస్టర్ తెలిపారు. -
నేరుగా వచ్చి ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, గుంటూరు:‘గుంటూరు నుంచి 12.05 గంటల ప్రాంతంలో తెనాలి స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకూ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పక్కన నిలబడిన యువతి ఒక్కసారిగా ట్రాక్ పైకి వచ్చేసింది. ఆమెను తప్పుకోమని అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేశా. అయితే అప్పటికే రైలు ఇంజన్ ఆమెకు తగిలింది. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ప్రయాణికుల సహకారంతో ట్రైన్ ఎక్కించుకుని తెనాలి స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌కు అప్పగించా’నని జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ విజయ్‌రామ్ జీఆర్పీ పోలీసులకు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు గీతాంజలి ఈ నెల ఏడున రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేయడం ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలుగుదేశం సోషల్ మీడియాలోనూ, అఫిషియల్ మీడియాలో కూడా ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలా కామెంట్స్ పెడుతున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు తోసేసి పరారు అయ్యారంటూ ఒక వీడియోలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా చూపిస్తూ మార్ఫింగ్ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని ఎడిట్ చేసి బయటకు వదిలినట్లుగా పోలీసుల విచారణలో స్పష్టం అయ్యింది. ఈ వీడియోను సర్క్యులేట్ చేసింది ఎవరు? అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేవిధంగానే తెలుగుదేశం సోషల్‌మీడియాలో బురదజల్లుతోంది. లోకోపైలెట్ ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం లేదని, ఆమె ఒక్కతే వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్పష్టం అవుతోది. అయినా తెలుగుదేశం చేస్తున్న తప్పుడు ఆరోç³ణల నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తెనాలి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసుబృందం బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ చుట్టుపక్కల వారిని విచారించింది. దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఆరా తీసింది. సోషల్‌మీడియా ట్రోలింగ్‌ల నేపథ్యంలో మృతి చెందినట్లు ఆమెకుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ట్రోలింగ్‌కు పాల్పడిన హ్యాండిల్స్‌ను గుర్తించి బాధ్యులను అదుపులోకి తీసుకునే దిశగా పోలీసు బృందాలు తమ విచారణ వేగవంతం చేశాయి. ఒక బీసీ మహిళను వేధించి ఆత్మహత్యకు పురికొల్పడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ట్రోల్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీలోనే కొందరు తప్పు పడుతున్నారు. నాడు రిషితేశ్వరిని ఇలాగే పొట్టన పెట్టుకున్నారు నాడు రిషితేశ్వరి నుంచి నేటి గీతాంజలి వరకూ పచ్చమూకల వికృత చర్యలకు బలైపోయిన వారే. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఎవరిని తీసుకున్నా వారికి ముందు నుంచి మహిళలంటే చిన్నచూపే. 2015లో గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ర్యాగింగ్‌కు గురై యూనివర్సిటీ వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన యూనివర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం వహించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావుతోపాటు అప్పుడు యూనివర్సిటీ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బలహీన వర్గాల విద్యార్థినికి న్యాయం చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వప్రయత్నించకపోగా న్యాయం కోసం ఉద్యమిస్తున్న వారిని అడ్డుకుంది. రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నాయనే కారణంతో ప్రభుత్వం, యూనివర్సిటీ ఉన్నతాధికారులు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను నిషేధించారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల బోర్డులను సైతం తొలగించారు. ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. విద్యార్థిని ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రజాసంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్యపై కథనాలు రాస్తున్నారనే అక్కసుతో కొందరు మీడియా ప్రతినిథులపై కేసులు నమోదు చేస్తామని కూడా బెదిరించారు. రాష్ట్రంలో బలహీన వర్గాల మహిళల ప్రాణాలకు రక్షణ లేదని రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వీడాలని అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాతోపాటు పలువురు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఆప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. బాబురావుపై చర్యలు తీసుకుందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి మార్చుకోలేదు. -
ప్రౌడ్ మూమెంట్
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో–పైలట్ అయిన కల్పన ధనవత్ సోషల్ మీడియా అట్రాక్షన్‌గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్ లోకో–పైలట్‌గా చేరింది. ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది. సెల్ఫోన్లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్ మూమెంట్: గర్ల్ ఫ్రమ్ పూలంబ్రీ బికమ్స్ ది ఫస్ట్ ఉమన్ లోకో–పైలట్ ఆఫ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఎక్స్చేంజింగ్ ఆఫ్ సిగ్నల్స్ బిట్వీన్ లోకో– పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో – పైలట్ ఆఫ్ జాల్నా–ముంబై ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో రైల్వేశాఖ పోస్ట్ చేసిన కదులుతున్న ట్రైన్ వీడియో కూడా ఆట్టుకుంటోంది. -
Vizianagaram: రైలు ప్రమాదంలో లోకో పైలెట్ మృతి
విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన సువ్వారి చిరంజీవి (36) మృతి చెందారు. ప్రమాదానికి గురైన రైలుకు ఆయన అసిస్టెంట్ లోకో పైలెట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమాద సంఘటన మీడియా ద్వారా తెలుసుకున్న తండ్రి సన్యాసిరావు, తల్లి అమ్మాజీ, గ్రామ పెద్దలు, బంధువులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. చిరంజీవికి మూడేళ్ల కిందట పెళ్లయ్యింది. భార్య జ్యోత్స్న, రెండేళ్ల కుమారుడు నవదీప్‌తో కలిసి విశాఖలో నివాసం ఉంటూ అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు కుశాలపురంలో నివాసముంటున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ట్రిపుల్ ఈలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన చిరంజీవి 2013లో అసిస్టెంట్ లోక్ పైలెట్‌గా ఎంపికయ్యాడు. జీవితంలో స్థిరపడి ఉద్యోగం చేస్తున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందించేవా రు. ఇప్పుడు అకస్మాత్తుగా బిడ్డ మరణ వార్త వినాల్సి రావడంతో వారు తల్లడిల్లిపోయారు. మృతదేహానికి విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుశాలపురంలో సోమవారం అంత్యక్రియలు చేశారు. -
లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగిన రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి ఎక్కి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడగా అందులో లోకోపైలట్ భాగోతం బయటపడింది. వీడియోలో ఢిల్లీ షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకోగానే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన తర్వాత కిందకు దిగాడు. అంతలో మరో లోకో పైలట్ సచిన్ విధులు నిర్వహించేందుకు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతో రైలులోకి ఎక్కాడు. వీడియో కాల్లో బిజీగా ఉన్న సచిన్ భుజానికున్న బ్యాగును తీసి ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు. ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు కదిలింది. मथुरा ट्रेन हादसे के समय मोबाइल देख रहा था ड्राइवर। CCTV से ट्रेन के प्लेटफॉर्म पर चढ़ने का राज खुला। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #MathuraJunction #TrainAccident #CCTV pic.twitter.com/muia6Zu2Gi — FirstBiharJharkhand (@firstbiharnews) September 28, 2023 ఇది గమనించకుండా సచిన్ వీడియో కాల్లో బిజీగా ఉన్నాడు. చూస్తుండగానే రైలు ప్లాట్‌ఫారంపైకి ఎక్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళా మాత్రం విద్యుదాఅఘాతానికి గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైలులోని ప్రయాణికులంతా రైలు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడి వారు. దీని కారణంగా మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచిన్ తోపాటు మరో నలుగురిని కూడా సస్పెండ్ చేసింది. यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl — iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023 ఇది కూడా చదవండి: పాముకాటుతో అటెండర్ మానస మృతి -
రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో..
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో మారుతి సర్కిల్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులోని ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. పట్టాలపై కారు నిలిపోవడాన్ని గూడ్స్ రైలు లోకో పైలట్ గమనించి వెంటనే వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ రైలు స్వల్పంగా ఢీకొట్టడంతో కారులో కొంతభాగం నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన కుటుంబంగా సమాచారం. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు.. -
ధైర్యంగా రైలుకు ఎదురెళ్లాడు.. ‘సంఘమిత్ర’కు ప్రమాదాన్ని తప్పించాడు
చీరాల: ఓవ్యక్తి అప్రమత్తతతో వ్యవహరించడంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం 7:15నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళుతూ పట్టాలు దాటుతున్న స్థానికుడు గద్దె హేమసుందరబాబు రైలు పట్టా విరగడాన్ని గమనించాడు. అదే సమయంలో చెన్నై వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోంది. వెంటనే రైలుకు ఎదురెళ్లి లోకో పైలెట్‌కు రైలు పట్టాలు చూపిస్తూ సైగలు చేస్తూ సంకేతాలు పంపించాడు. అప్రమత్తమైన లోకోపైలెట్ రైలు వేగం తగ్గించి రైలును నిలిపివేశాడు. అనంతరం రైలు పట్టా విరిగి ఉందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. చీరాల, బాపట్ల నుంచి వచ్చిన రైల్వే ఇంజనీరింగ్ అధికారులు విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా పెను ప్రమాదం నుంచి తప్పించిన హేమసుందరబాబును రైల్వే అధికారులతో సహా ప్రయాణికులు ప్రశంసించారు. ఘోర ప్రమాదాన్ని నివారించిన గద్దె హేమసుందరబాబు సాహసాన్ని అభినందిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆయనను ఘనంగా సత్కరించారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. -
ఒడిశా ప్రమాదం.. రైలు బండి నడిపే వారెక్కడ?
దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. ►కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ►అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. ►సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. ►కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? ►తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
Odisha Train Accident: ఆ దుర్ఘటనలో కీలకంగా ఆ లోకోపైలట్ చివరి మాటలు
ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతోనే గూడ్స్ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే లూప్లైన్లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకోపైలట్ గుణనిధి మొహంతి చెప్పారు. మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్ మొహంతి కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా. అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్విస్టెగేషన్(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం. #WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl — ANI (@ANI) June 4, 2023 (చదవండి: -
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతి
భువనేశ్వర్: ప్రమాదానికి గురైన కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్‌రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో రైలులోని బోగీలు గాల్లో ఎగిరి పక్క ట్రాక్‌పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టడంతో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఈ ఘోర ప్రమాదంలో 275 మంది అసువులు బాసారు. మరో వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఇదేం విచిత్రం.. కిలో మీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే?
కేరళలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లింది. కొంత దూరం వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్నలోకోపైలట్ దాదాపు కిలోమీటర్ వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను దింపాడు. ఈ వింత సంఘటన అలప్పుజ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది. షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు మావెలిక్కర, చెంగన్నూర్ మధ్యనున్న చెరియానాడ్ రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. కానీ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్లో రైలు ఎక్కాల్సినవాళ్లు.. ఇటు రైలు నుంచి దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. కాసేపటికి లోకో పైలట్‌కు వెనక స్టేషన్లో ప్రయాణికులు ఉన్న విషయం గుర్తొచ్చింది. దీంతో రైలును వెనక్కి నడిపాడు. 700 మీటర్లు రైలును వెనక్కిపోనిచ్చి స్టేషన్లో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. కాగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయినా రైలు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుందని వెల్లడించారు. అయితే చేర్యానాడ్ స్టేషన్లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉందని, ఇది లోకో పైలట్‌ని తప్పిదంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనే విషయంపై విచారిస్తామని చెప్పారు. చదవండి: Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్ -
మరో కొత్త రికార్డు..వందేభారత్ నడిపిన సురేఖ యాదవ్.. 5 నిమిషాల ముందే గమ్యస్థానానికి!
సాక్షి, ముంబై: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళ లోకోపైలట్‌గానూ సురేఖ యాదవ్ చరిత్ర సృష్టించారు. షోలాపూర్–ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో లోకోపైలట్ (డ్రైవర్)గా సురేఖ యాదవ్ విధులు నిర్వహించారు. షోలాపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం సీఎస్ఎంటీ దిశగా బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పగ్గాలను రైల్వే అధికారులు సురేఖకు అప్పగించారు. 34 సంవత్సరాలుగా భారతీయ రైల్వేలో వివిధ సేవలందిస్తున్న సురేఖ యాదవ్‌కు గూడ్స్ రైళ్లు, ప్యాసింజరు రైళ్లు నడిపిన అనుభవముంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న కల నెరవేరిందని, ఈ గౌరవం ఇచ్చినందుకు భారతీయ రైల్వేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. షోలాపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం టైంటేబుల్ ప్రకారం బయలుదేరిన ఈ రైలును సీఎస్ఎంటీకి ఐదు నిమిషాల ముందే చేర్చారు. ఇక్కడ ఆమెకు ఘన స్వాగత లభించింది. ఖండాలా–కర్జత్ మధ్య ఘాట్ సెక్షన్లో రైలు నడపడమంటే లోకోపైలట్‌కు కత్తిమీద సాములాంటిదే. ముఖ్యంగా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా వందేభారత్‌కు ప్రత్యేకంగా ఇంజిన్ ఉండదు. మధ్యలో అక్కడక్కడా మూడు చోట్ల పెంటాగ్రాఫ్‌తో కనెక్టివిటీ అయ్యే విద్యుత్ మోటార్లుంటాయి. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా రైలును నడిపిన సురేఖ.. ఐదు నిమిషాల ముందే గమ్యస్థానానికి చేర్చారు. 1996 నుంచి.. మహారాష్ట్ర సాతారా జిల్లాలోని సెయింట్ పాల్ స్కూల్లో చదువుకున్న సురేఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. 1989లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా నియమితులయ్యారు. శిక్షణ పూర్తిచేసుకుని 1996లో గూడ్స్ రైలు డ్రైవర్‌గా విధినిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2000లో మోటార్ ఉమెన్‌గా గౌరవం పొందారు. 2010లో ఘాట్ సెక్షన్లో రైలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తరువాత పుణే–ముంబై నగరాల మధ్య నడుస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు లోకోపైలట్‌గా ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించారు. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపడంలో కూడా సఫలీకృతం కావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. -
సనత్ నగర్ లో లోకో పైలట్ వాసవి అదృశ్యం
-
వీడని మిస్టరీ.. 50 రోజులైనా లభించని మహిళా లోకో పైలెట్ ఆచూకీ
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్లో అదృశ్యమైన లోకో పైలట్ వాసవి జాడ ఇంకా లభించలేదు. వాసవి ఆచూకీ కోసం పోలీసులు 50 రోజులుగా గాలిస్తున్నారు. ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు వంటి ఇతర గాడ్జెట్ ఇంట్లో పెట్టి వెళ్లడంతో ఆమె ఆచూకీ కనుగొనడం మరింత ఆలస్యం అవుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి సనత్‌నగర్‌లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ సాయంత్రం షాపింగ్ వెళ్తున్ననని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె అదృశ్యమైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటల సమయంలో ఇల్లు తెరిచి చూడగా, ఫోన్ రూమ్‌లోనే ఉంది. కానీ ఆమె లేదు. దీంతో తండ్రి భాస్కర్ రావు తన కూతురు అదృశ్యంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలదు. ఆమె కనిపిస్తే సనత్‌నగర్ ఎస్‌హెచ్‌వో 9490617132, ఎస్ఐ 8919558998 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. చదవండి: జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం -
రైలు ఆపి, ప్రాణం నిలిపి
యశవంతపుర: రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని గమనించిన లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. బెంగళూరు నుండి కుక్కే సుబ్రమణ్యరోడ్డు, పుత్తూరు మార్గంలో కారవారకు వెళ్తుండగా సరిమొగరు, ఎడమంగల స్టేషన్ల మధ్య రైలు వేగంగా వస్తోంది. అదే సమయంలో పట్టాలపై 45 ఏళ్ల వ్యక్తి ఉండటాన్ని దూరం నుంచి గమనించిన లోకోపైలెట్ అతని ప్రాణాలను కాపాడాలని రైలు వేగాన్ని తగ్గిస్తూ వచ్చాడు. అతని సమీపానికి వచ్చేలోపే రైలు పూర్తిగా వేగం తగ్గింది. అతనికి ఢీకొనగా చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ వెంటనే లోకోపైలెట్, టీసీ బాధితుడిని అదే రైలులో తీసుకుని పుత్తూరు రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రైల్వే సిబ్బంది అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ అని రూ. 17 వేలు టోపి) -
రైలు నుంచి జారి పడి విశ్రాంత లోకో పైలెట్ మృతి
పెనుకొండ: ప్రమాదవశాత్తు విశ్రాంత లోకో పైలెట్ రైలు కిందపడి మృతి చెందారు. వివరాలు.. కొత్తచెరువు మండలం గంగినేపల్లికి చెందిన రంగేనాయక్ (65) లోకో పైలెట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని హుబ్లీలో నివాసముంటున్న ఆయన మూడు రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి పెనుకొండ మండలం గోనిపేటకు వచ్చారు. సోమవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులతో కలిసి హుబ్లీకి వెళ్లేందుకు పెనుకొండ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కదులుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతుండగా అదుపుతప్పి ప్లాట్‌ఫాంపై పడ్డాడు. ఘటనలో ఛాతీకి బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. నీటి ట్యాంకులో మునిగి బాలుడి మృతి కళ్యాణదుర్గం: ప్రమాదవశాత్తు నీటి ట్యాంకులో మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన గీత, బ్రహ్మయ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు సిద్దు (10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ గ్రామ సమీపంలోని ఊర కొండపై ఉన్న నీటి ట్యాంక్‌లో తాడు సాయంతో ఈత కొడుతుండగా తాడు జారిపోయింది. దీంతో నీట మునిగి మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ట్యాంక్‌లో నుంచి సిద్దు మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: భార్య, అత్తపై కత్తితో దాడి) -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. లోకోపైలెట్ అప్రమత్తమైనప్పటికీ...
హుబ్లీ: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం హుబ్లీలో చోటు చేసుకుంది. రెండుకాళ్లు తెగిపోయి క్షతగాత్రుడు విషమ స్థితిలో హుబ్లీ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... మధ్యాహ్నం షాలీమార్ వాస్కోడిగామా రైలు హుబ్లీ స్టేషన్ వదిలిన నాలుగు నిముషాలకు హెగ్గేరి సమీపంలో వస్తుండగా ఓ వ్యక్తి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టాడు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటోంది. లోకో పైలెట్ రైలు వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అతని రెండు కాళ్లు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బాధితుడిని కిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రుడి వివరాలు తెలియల్సి ఉంది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: బ్లూవేల్ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య) -
గతంలో ఆ ఉద్యోగాలు పురుషులకే పరిమితం.. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది!
సాక్షి,బళ్లారి: ఇంటి నుంచి మింటి వరకు దూసుకెళ్తున్న నారీమణులు రైళ్లను కూడా నడిపిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన లోకోపైలెట్ ఉద్యోగాల్లో మహిళలు కూడా కొలువుదీరి సత్తా చాటుతున్నారు. మంగళవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుబ్లీ రేల్వే అధికారులు హుబ్లీ నుంచి గదగ్ మీదుగా కారటిగి వెళ్లే రైలు నిర్వహణను మహిళా సిబ్బందికే అప్పగించారు. లోకో పైలెట్, టీటీఈలు, పోలీసులు ఇతర సిబ్బంది మొత్తం 15 మంది మహిళలను నియమించి రైలు నడిపించారు. అంబికా అంకలిగి అనే మహిళా పైలెట్ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా 200 కిలోమీటర్ల మేర రైలును నడిపించారు. మహిళా దినోత్సవం రోజున రైలును నడిపే బాధ్యతలను తమకు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. -
రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్యాయత్నం.. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో..
ముంబై: ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పట్టాలపై అటు ఇటు తిరుగుతూ రైలు దగ్గరకు వస్తుండంటంతో ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నాడు. రెండు కాళ్లు పట్టాలపై ఉంచిన అతను.. రైలు దగ్గరకు రావడంతో తల తప్ప మిగతా శరీరమంతా పట్టాలపై ఉంచి పడుకున్నాడు. అయితే ట్రైన్‌ను నడుపుతున్న లోకో పైలెట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో రైలు కొంచెం దూరంలో పట్టాలపైనే ఆగిపోయింది. ఇది గమనించిన ప్లాట్ ఫాం వద్ద ఉన్న పోలీసులు వెంటనే అతడి వైపు పరుగెత్తారు. అతన్ని రక్షించి కుటుంబానికి అప్పజెప్పారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని శివ్డి స్టేషన్ సమీపంలో డిసెంబర్ 27న చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విటర్లో షేర్ చేసింది. మోటార్ మాన్ అద్భుతం చేశాడని, సకాలంలో అప్రమత్తమై వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగాడని పేర్కొంది. ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి ఈ పని చేయగలిగాడని పేర్కొంది. మీ ప్రాణం విలువైనది. ఇంటి వద్ద మీ కోసం ఎవరో ఒకరు వేచి చూస్తు ఉంటారని ట్వీట్ చేసింది. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు మోటార్ మాన్ చూపిన తెగువను అభినందిస్తున్నారు. ‘ఆ మోటర్ మ్యాన్ పేరు చెప్పలేదు. దయచేసి రియల్ హీరోల పేర్లు కూడా చెప్పండి. అందుకు వాళ్లు అర్హులు. ఆయుష్షు గట్టిగా ఉండటంతో వెంట్రుక వాసిలో గండం నుంచి తప్పి ప్రాణాలతో బయటపడ్డాడు. లోకో పైలట్ కొన్ని క్షణాలు ఆలస్యం చేసినా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: Viral Video: ఆమ్లెట్ వెయ్యబోతే పిల్లైంది! కోడి పిల్లలు ఇలా కూడా పుడతాయా.. मोटरमैन द्वारा किया गया सराहनीय कार्य : मुंबई के शिवड़ी स्टेशन पर मोटरमैन ने देखा कि एक व्यक्ति ट्रैक पर लेटा है उन्होंने तत्परता एवं सूझबूझ से इमरजेंसी ब्रेक लगाकर व्यक्ति की जान बचाई। आपकी जान कीमती है, घर पर कोई आपका इंतजार कर रहा है। pic.twitter.com/OcgE6masLl — Ministry of Railways (@RailMinIndia) January 2, 2022 -
Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస
వేగం, భద్రం.. అనే రెండు సమాంతర రైలు పట్టాలపైన నైరుతి రైల్వే అధికారులు ఆ రోజు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ను నడపవలసి వచ్చింది! జార్ఘండ్‌లోని టాటానగర్ నుంచి బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్‌కు ఆరు ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్ని నింపి ఆ రైలును లోకో పైలట్ శిరీషకు అప్పగించారు. గంటన్నరలో ఆ ప్రాణవాయువు గమ్యం చేరింది. కరోనా రోగులున్న హాస్పిటళ్లకు సమయానికి శ్వాసలా అందింది. అత్యంత కీలక సమయంలో ఆక్సిజన్ రైలును నడిపిన తొలి మహిళా పైలట్‌గా శిరీషను తన తాజా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత ప్రధాని ప్రశంసించారు. శనివారం రాత్రి బెంగళూరులోని ఆలిండియా రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్‌లో కూర్చొని ఉన్నారు శిరీష (31). ఏ క్షణమైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడేందుకు లైన్లోకి రావచ్చన్న ఆలోచన ఆమె గొంతును తడారేలా చేస్తోంది. నిముషాలు గడుస్తున్నాయి. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ‘‘నమస్తే శిరీషాజీ..’’ ఒక్కసారిగా ప్రధాని స్వరం! వెంటనే శిరీష ప్రతి నమస్కారం. తర్వాత వెంటనే ప్రధాని ప్రశ్నలు, శిరీష సమాధానాలు. ‘‘శిరీషాజీ.. ఈ కష్టకాలంలో నారీశక్తి దేశాన్ని నడిపిస్తోంది. ఇక మీరు... కరోనా పేషెంట్లకు అత్యవసరమైన ప్రాణవాయువును తీసుకుని రైలును వేగంగా నడుపుకుంటూ విజయవంతం గా గమ్యస్థానం చేరుకున్నారు. ఇందుకు మీకు అభినందనలు. అంతటి ఆత్మ స్థయిర్యం, స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మిమ్మల్ని అందుకు సంసిద్ధం చేయడానికి అవసరమైన బలాన్ని మీకు ఇచ్చింది ఎవరు? ఈ దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది. నాకు కూడా..! చెప్పండి శిరీషాజీ’’ అడిగారు ప్రధాని. ‘‘మా నాన్న, మా అమ్మ ..’’ శిరీష జవాబు. ‘‘ఆక్సిజన్ కోసం వేచి చూస్తున్న రోగుల కోసం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించుకుని వెళ్లడం అన్నది ఎంతలేదన్నా బాధ్యతతో కూడిన పని కదా. మీకెలా అనిపించింది?’’.. ప్రధాని. ‘‘రైల్వే అధికారులు అన్నీ సవ్యంగా ఉండేలా చూశారు. నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శిరీష సమాధానం.మొత్తం 2 నిముషాల 8 సెకన్లపాటు దేశ ప్రధానికి, దేశ పౌరురాలికి మధ్య స్ఫూర్తివంతమైన సంభాషణ నడిచింది. గంటన్నర పాటు 123 కి.మీ. దూరం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను జాగ్రత్త గా, వేగంగా నడపడం వంటిదే దేశ ప్రధానితో ఒక నిముషం పాటైనా మాటను నడిపించడం. మర్నాడు ప్రధాని ‘మన్ కీ బాత్’లో ఈ సంభాషణ ప్రసారం అయింది. ఆ సమయానికి శిరీష తల్లి వైజాగ్‌లోని తమ ఇంట్లో.. చుట్టుపక్కల వాళ్లతో కలిసి కూర్చొని తన కూతురు, ప్రధాని ముచ్చటించుకోవడాన్ని హృదయం ఉప్పొంగుతుండగా విన్నారు. శిరీష తండ్రి రామారావు మాత్రం వినలేకపోయారు. పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రెటరీగా ఆయన రిటైర్ అయ్యారు. కొంతకాలం క్రితమే కన్నుమూశారు. శిరీష నైరుతి రైల్వే ఉద్యోగి. బెంగళూరు డివిజన్లో లోకో పైలట్. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన ‘ఆల్ ఫిమేల్ క్రూ’ లో ప్రధాన పైలట్‌గా శిరీష గత వారం వార్తల్లోకి వచ్చారు. ఈ నెల 21 న జార్ఘండ్ నుండి బెంగళూరుకు ఆరు ట్యాంకర్లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలును గంటకు 80 కి.మీ వేగంతో శిరీష నడిపించుకుని వచ్చారు. ఆమెతోపాటు అసిస్టెంట్ లోకో పైలట్ అపర్ణ ఉన్నారు. రైలు బెంగళూరు చేరిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయెల్ శిరీష, ఆమె సహ పైలట్ దీక్షాదక్షతలను కొనియాడుతూ ‘‘ప్రాణవాయువును నడిపించుకుని వచ్చిన మహిళలు’’ అని ట్విట్టర్లో అభినందించారు. చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్! -
ఆక్సిజన్ తెచ్చింది
జార్ఖండ్ నుంచి ఒక రైలు బయలుదేరింది. అయితే అది మామూలు రైలు కాదు. ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’. దాదాపు 2000 కిలోమీటర్ల దూరం.... 27 గంటల ప్రయాణం. ముగ్గురు టీమ్. వారిలో లోకో పైలెట్ నీలిమా కుమారి కూడా ఉంది. ప్రాణాలు కాపాడే ప్రాణవాయువును తీసుకొని ఆఘమేఘాల మీద ఆమె బెంగళూరు చేర్చి ప్రశంసలు అందుకుంది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా దేశంలోకి చాలా కీలకమైన విషయంగా మారాయి. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల నుంచి ఆఘమేఘాల మీద ఆక్సిజన్‌ను చేరవేయడానికి భారత ప్రభుత్వం ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’లను మొదలెట్టింది. అంటే ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్న గూడ్స్ రైళ్లు ఇవి. వీటిని గమ్యానికి చేర్చడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. మామూలు గూడ్సు రైళ్లు అయితే ఆగినా, ఆలస్యమైనా పర్వాలేదు. కాని ఆక్సిజన్ రైలు మాత్రం సమయానికి చేరుకోవాల్సిందే. ఇటీవల అలా సమయానికి చేర్చి ప్రశంసలు అందుకున్న లోకో పైలెట్ (డ్రైవర్) నీలిమా కుమారి. జార్ఖండ్ నుంచి సోమవారం (మే 17) ఉదయం 7 గంటలకు జార్ఖండ్‌లోని జోలార్‌పేట్ డివిజన్ నుంచి 120 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. బెంగళూరు డివిజన్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఈ ట్రైనును గమ్యానికి చేర్చాలి. వారిలో సీనియర్ సిబ్బంది అయిన కుమార్ (బిహార్), వలి (కర్ణాటక) ఉంటే అసిస్టెంట్ డ్రైవర్‌గా నీలిమా కుమారికి బెంగళూరు డివిజన్ బాధ్యత అప్పజెప్పింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు మొదలయ్యాక మహిళా డ్రైవర్‌ను ఈ బాధ్యతకు ఉపయోగించడం ఇదే మొదటిసారి. బిహార్‌కు చెందిన నీలిమా కుమారి ఒక సంవత్సర కాలంగా బెంగళూరు డివిజన్లో లోకో పైలెట్‌గా పని చేస్తోంది. ఆమె వివాహిత. ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. జార్ఖండ్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చే బాధ్యత ను ఆమె సవాలుగా స్వీకరించింది. 100 కిలోమీటర్ల వేగంతో ముగ్గురు సిబ్బంది తమ భుజాల మీద ఉన్న బాధ్యతను సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 25 గంటలు నాన్‌స్టాప్‌గా రైలును నడపాలి. అందుకు సిద్ధమయ్యారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు చేరడానికి మధ్యలో సిగ్నళ్ల అంతరాయం లేకుండా లైన్లు క్లియర్ చేయబడ్డాయి. 100 కిలోమీటర్ల వేగంతో రైలు గమ్యానికి చేరాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగానే మధ్యలో ఒకటి రెండు చోట్ల తప్ప ముగ్గురూ కలిసి రైలును మరుసటి రోజు (మే 18) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరుకు చేర్చారు. ‘ఇది నాకెంతో సంతోషం కలిగించింది. కష్టాల్లో ఉన్నవారిని సకాలంలో ఆదుకునేందుకు మా రైలు సమయానికి చేరడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఆ పనిని సక్రమంగా చేయగలిగాను’ అని నీలిమా కుమారి అంది. సీనియర్ డ్రైవర్ కుమార్ ‘నా సర్వీసులో ఇంత ఉపయోగకరమైన డ్యూటీ ఎప్పుడూ చేయలేదు’ అనంటే మరో సీనియర్ డ్రైవర్ వలి ‘నేను రైలు మొదలైనప్పటి నుంచి గమ్యం చేరేంత వరకు ఇంజన్లో నిలబడే ఉన్నాను. కంటి మీద కునుకు వేయలేదు’ అన్నాడు. ఎందరో మహానుభావులు. అందుకే కరోనా బాధితులు సమయానికి సహాయం పొందగలుగుతున్నారు. కాకుంటే ఒక మహానుభావురాలు కూడా ఉండటం విశేషం కదా. -
రెడ్ సిగ్నల్ దాటిన రైలు: లోకో పైలట్ సస్పెండ్
పాట్నా: తూర్పు మధ్య రైల్వేలోని దానపూర్ డివిజన్ పరిధిలో ఓ రైలు ప్రమాద రెడ్ సిగ్నల్‌ను దాటి వెళ్లింది. టాటా నగర్-బౌండ్ దానపూర్ మధ్య ప్రయాణించే టాటా ఎక్స్‌ప్రెస్‌ను ఒక్కసారిగా ప్రమాద రెడ్ సిగ్నల్‌ను దాటి సుమారు 500 మీటర్లు ముందుకు ప్రయాణించింది. ప్రమాద రెడ్ సిగ్నల్‌ను నిర్లక్ష్యంగా దాటించిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌ను రైల్వే అధికారులు సస్పెండ్ చేసినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. సురక్షితమై రైలు ప్రయాణానికి సంబంధించి డేంజర్ సిగ్నల్స్‌పై నిర్లక్ష్యంగా వ్యహరించినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన జరిగన సమయంలో భారీ అలారం శబ్ధం వినిపించింది. సంబంధిత రైలు లోకో పైలట్‌ను రైల్వే అధికారులు అదుపులో తీసుకున్నారు. చదవండి: రక్తపోటు మందుతో దీర్ఘాయువు? లోకో పైలట్ మద్యం సేవించి రైలు నడిపారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రమాద సిగ్నల్‌ను దాటడం నేరంగా కింద పరిగణించబడుతుందని, కొన్నిసార్లు ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన పేలవమైన బ్రేక్స్ ఉండటం వల్ల జరిగిందా? లేదా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ నిర్లక్ష్యంగా రైలును ప్రమాద సిగ్న్‌కు ముందే నిలిపివేయడం మర్చిపోయారా? అనేది విచారణలో తేలనున్నది. ఇటువంటి సంఘటనలను రైల్వే చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, ప్రయాణికులు రక్షణ కోసం రైలు సిగ్నల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిన ప్రోటోకాల్ ఉంటుందని చీఫ్ పీఆర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంఘటన చోటు చేసుకున్న సందర్భాల్లో ఎంత దూరం ప్రమాద సిగ్నల్‌ను రైలు క్రాస్ చేసిందో పరిశీలించాల్సిన బాధ్యత రైలు పర్యవేక్షకులు, స్టేషన్ మాస్టర్ ఉంటుందన్నారు. అదే విధంగా ఘటనకు గల కారణాలను స్టేషన్ మాస్టర్.. లోకో పైలట్‌ను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. రైలు ప్రయాణం తిరిగి ప్రారంభించడానికి ముందు ఘటనకు సంబంధిదంచిన అన్ని వివరాలను నోట్ చేసుకోవాలని పేర్కొన్నారు. -
వజ్రాల బండి.. అంతా మహిళలేనండి
ఈ నెల 6న శుక్రవారం ఒడిశాలోని ఖుర్దారోడ్ స్టేషన్ నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరిన గూడ్సు రైలు బండి అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలాస స్టేషన్ చేరుకుంది. మర్నాడు మళ్లీ ఉదయం 5.45 గంటలకు పలాసలో బయల్దేరి అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఖుర్దారోడ్డు స్టేషన్‌కు చేరుకుంది. ఈస్టుకోస్టు రైల్వే వారి గూడ్సు రైలు బండి అది. ఏమున్నాయ్ అంతగా ఆ రైలు బండిలో! వజ్రాలా.. ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నారు! వజ్రాలకన్నా విలువైనవే ఉన్నాయి. అయితే రైల్లో లేవు. రైలు నడుపుతున్న వాళ్లలో ఉన్నాయి. వాళ్లలో ఉన్నది వజ్ర సంకల్పం! 20 గంటల పాటు 400 కి.మీ.ల దూరం ఆ గూడ్సును నడిపినవారు ముగ్గురూ మహిళలే. గతంలో మహిళలు గూడ్సు బళ్లు్ల నడపలేదని కాదు. పక్కన పురుషులు కూడా ఉండేవారు. మహిళలే తమకు తాముగా, పురుషులు పక్కన లేకుండా గూడ్సు బండిని నడపడం ఇదే మొదటిసారి. లోకో పైలెట్ మున్నీ టిగ్గా, అసిస్టెంట్ లోకో పైలట్ రాజేశ్వరీ బిస్వాల్, గార్డు రేవతి సింగ్.. మూసివేసిన కంటెయినర్ల లోడ్‌తో ఉన్న ఈ బండిని నడిపారు. వివిధ స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లు ఇచ్చే సిగ్నల్స్‌కి అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకుంటూ విజయవంతంగా ప్రయాణం సాగించారు. ‘‘క్యారేజ్ బండ్లను నడపడం ఎవరికైనా కాస్త కష్టమైన పనే. అయితే మగాళ్లకు దీటుగా మేము మా శక్తిని నిరూపించుకున్నాం’’ అన్నారు టిగ్గా (35). ఆమెది ఒడిశాలోని సుందర్ఘర్ జిల్లా. ఐటిఐలో మెకానికల్ గ్రేడ్ని పూర్తి చేశాక 2011లో అసిస్టెంట్ లోకో పైలట్‌గా చేరి, 2016లో లోకో పైలట్ అయ్యారు. అసిస్టెంట్ లోకో పైలట్ రాజేశ్వరి (26) కూడా తాము సాధించిన ఈ విజయానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నడిపిన తొలి మహిళా రైలులో పైలట్‌కు సహాయకురాలిగా ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’’ అని ఆమె సంబరపడుతున్నారు. సాటి మహిళలకు స్ఫూర్తినిచ్చే సవాళ్లను నేనెంతో ఆనందగా స్వీకరిస్తాను’’అని కూడా అంటున్న రాజేశ్వరిది ఒడిశాలోని జంగత్సింగ్‌పూర్ జిల్లా.ఖుర్దారోడ్ రైల్వే డివిజన్లో 20 మంది మహిళా లోకో పైలట్లు, 19 మంది అసిస్టెంట్ లోకో పైలట్లు (స్త్రీ, పురుషులు కలిపి) ఉన్నారు. ‘‘మహిళలు తాము చేపట్టిన పని ఎంత కష్టమైనదైనా తేలిగ్గా చేసేస్తారు’’ అని డివిజనల్ మేనేజర్ శశికాంత్ సింగ్ అంటున్నారు. -
లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ చంద్రశేఖర్‌ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లోకోపైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్‌కు చెందిన లెక్చరర్ శేఖర్(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు. -
లోకోపైలెట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
ఆ ఆరింటిలోనే!
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్ ఏమరుపాటు వల్లే కాచిగూడ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణంగా నగరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో రైలు 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆటోమేటిక్‌గా సిగ్నల్ పడుతుంది. దాంతో రైలు ముందుకు వెళ్తుంది. కానీ 6 ప్రధాన స్టేషన్లలో మాత్రం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. ఈ ఆరింటిలో స్టార్టింగ్ సిగ్నల్ అందితేనే రైలు ముందుకు కదులుతుంది. సోమవారం కాచిగూడ స్టేషన్లో 2 నిమిషాలు ఆగిన ఎంఎంటీఎస్ స్టార్టింగ్ సిగ్నల్ వెలగకుండానే బయలుదేరింది. ఆ సమయంలో అదే ట్రాక్‌పై వస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హోమ్ సిగ్నల్ పడింది. ఇది గమనించకుండానే ఎంఎంటీఎస్ దూసుకురావడంతో ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొట్టింది. ఇదంతా కాచిగూడ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో 30 సెకన్ల వ్యవధిలో జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రేటర్లో మొత్తం 45 కిలోమీటర్ల పరిధిలో 26 స్టేషన్ల మీదుగా ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 20 స్టేషన్లు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉండగా... ఆరింటిలో మాత్రం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. అంటే లోకోపైలెట్‌కు గ్రీన్ సిగ్నల్ అందితే తప్ప ముందుకు వెళ్లడానికి వీల్లేదు. హోమ్ సిగ్నలింగ్ ఎక్కడెక్కడ? సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్‌నుమా, లింగంపల్లి, నాంపల్లి, హఫీజ్‌పేట్ స్టేషన్లలో ఎంఎంటీఎస్‌తో పాటు ఇతర రైళ్ల రాకపోకల కోసం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంది. పది ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్ స్టేషన్లో ఒక దానిపైనున్న రైలు బయలుదేరితే తప్ప మరో దానికి అవకాశం లభించదు. కంట్రోల్ సెంటర్ రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ద్వారా రైళ్లకు ప్లాట్‌ఫామ్‌లను కేటాయిస్తారు. సికింద్రాబాద్‌తో పాటు మిగతా 5 స్టేషన్లలోనూ ఇదే విధంగా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. కాకినాడ, విశాఖ నుంచి వచ్చే పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించడం వల్ల అక్కడ రైళ్లు హోమ్ సిగ్నలింగ్‌పై ఆధారపడి రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ తర్వాత నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లు. ఇక్కడ పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ఉంటాయి. అలాగే మహబూబ్‌నగర్, కర్నూల్, ఉందానగర్ నుంచి వచ్చే రైళ్లతో ఫలక్‌నుమా రద్దీగా ఉంటుంది. హఫీజ్‌పేట్ మీదుగా కొన్ని రైళ్లను మళ్లిస్తారు. దీంతో ఈ ఆరు హోమ్ సిగ్నలింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆయా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో ‘స్టార్టింగ్’ సిగ్నల్ అందితే తప్ప ముందుకు కదలడానికి అవకాశంఉండదు. 2నిమిషాల సమయం నేచర్‌క్యూర్ ఆస్పత్రి, బోరబండ, బేగంపేట్, జామై ఉస్మానియా, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, ఉప్పుగూడ తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ ద్వారా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్లలో కేవలం ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలే ఉంటాయి. దీంతో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సిగ్నల్ వస్తుంది. లోకోపైలెట్లు సిగ్నల్ కోసం ఎదురు చూడకుండానే 2 నిమిషాలు ఆగిన తరువాత వాకింగ్ స్పీడ్‌తో రైలును కదిలిస్తారు. ఆటోమేటిక్‌గా సిగ్నల్ అందుతుంది. దీంతో రైలు వేగాన్ని పెంచేస్తారు. నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇదే పద్ధతిలో రాకపోకలు సాగిస్తున్నాయి. వేగం ఎక్కువే... సాధారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు 25 కేవీ విద్యుత్ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పాత రైళ్లకు వన్ ఫేజ్ విద్యుత్ మోటార్ పని చేస్తుండగా.. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎంఎంటీఎస్ రైళ్లకు (టెటీస్కోపిక్ కోచ్‌లు ఉన్నవి) త్రీ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రైళ్లు బయలుదేరిన క్షణాల్లోనే వేగాన్ని అందుకుంటాయి. ‘కాచిగూడలో ప్రమాదానికి కారణమైన ట్రైన్ కూడా టెటీస్కోపిక్ కోచ్‌లతో కూడి, త్రీ ఫేజ్ మోటార్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో హంద్రీని ఢీకొనే సమయానికి కనీసం 50 కిలోమీటర్ల వేగంతో ఉండి ఉంటుంది. ఆ సమయంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్ 10 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా లూప్లైన్లో ట్రాక్ మారుతుండడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. -
లోకోపైలెట్‌పై కేసు
కాచిగూడ స్టేషన్లో సిగ్నల్‌ను గమనించకుండా వెళ్లి హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్పీఎఫ్ అధికారులు, కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కోలుకున్న తర్వాత అధికారులు వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై దక్షిణమధ్య రైల్వే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. రైళ్ల రాకపోకలు షురూ... ప్రమాదం జరిగిన అనంతరం చేపట్టిన పునరుద్ధరణ పనులు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మొదట సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం సుమారు 2గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్లింది. తర్వాత పలు ప్యాసింజర్ రైళ్లు వెళ్లాయి. సాయంత్రం 7:05 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన కాచిగూడ–మైసూర్ (12785) ఎక్స్‌ప్రెస్ రాత్రి 10:05 గంటలకు వెళ్లింది. అలాగే కాచిగూడ–యశ్వంత్‌పూర్ (17603) ఎక్స్‌ప్రెస్ రాత్రి 9:05 గంటలకు బదులు రాత్రి 11:05 గంటలకు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో అన్ని ట్రాక్‌లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోలకు మార్గం సుగమమైంది. ఇక ప్రమాద ఘటన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా నడిచాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు మాత్రమే రా>కపోకలు సాగించాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సాధారణ రోజుల్లో 1.5 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించకుంటుండగా... మంగళవారం 80వేల మంది వరకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సెలవు దినం కావడం కూడా ఇందుకు మరో కారణం. -
లోకోపైలట్ ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నాంపల్లి కేర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. ఎంఎంటీఎస్ కేబిన్‌లో ఇరుక్కొనిపోవడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుష్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కిడ్నీ దెబ్బతినడంతో డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిందని, ఇప్పటికిప్పుడు సర్జరీ చేసే పరిస్థితి లేనందున ప్రధాన విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ శరీరమంతా గాయాలతో నిండి ఉందని, పక్కటెముకలు విరిగాయని చెప్పారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమన్నారు. మరోవైపు రైలుప్రమాదంలో గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. బేబి సుష్మిత సహా సాజిద్ అబ్దుర్ రషీద్ షేక్, పి. శేఖర్, రాజ్‌కుమార్, పి.బాలేశ్వరమ్మ, మహ్మద్ ఇబ్రహీంకు వైద్యసేవలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం రైల్వేలో చేరిన చంద్రశేఖర్... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య సలై, కుమారుడు ఇమ్మాన్యుయెల్ రాజ్ (3) ఉన్నారు. 15 రోజుల క్రితం మరో బాబు పుట్టాడు. భార్య, పిల్లలు ఏలూరులో ఉన్నారు. -
మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్ 8 గంటల ఉత్కంఠ... ప్రమాదంలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్‌బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్సిటీ రైలు ఇంజిన్‌ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు. 11.15 గంటలకు లోకోపైలట్‌కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు. సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు. సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్షీట్ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి. సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. రియల్ హీరో ‘నిశాంత్’ ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్‌ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్‌పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్‌కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్‌ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. -
డ్యూటీ ముగిసిందని.. రైలును మధ్యలోనే ఆపేశాడు
సాక్షి, చెన్నై: తన డ్యూటీ ముగిసిందంటూ లోకో పైలెట్ మార్గమధ్యంలో గూడ్స్ రైలును ఆపేసిన ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నేలబొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో పైలెట్ ముత్తురాజ్ కిందకు దిగేశాడు. తన డ్యూటీ సమయం ముగిసి అరగంట అవుతున్నా వేరే లోకో పైలెట్ రాలేదని, ఇక తాను రైలును ముందుకు నడపనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బ్యాగ్‌ను సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఎంతకూ రైలు ముందుకు కదలకపోవడం, గేటు తెరుచుకోకపోవడంతో వాహనచోదకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే గేట్‌మెన్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. సుమారు గంట పాటు గూడ్స్ రైలు అక్కడే ఆగడంతో శీర్గాలి – పుంగనూరు మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వైర్లెస్ సెట్ ద్వారా ముత్తురాజ్‌తో మాట్లాడారు. మైలాడుదురై జంక్షన్ వరకు గూడ్స్ నడపాలని కోరడంతో ఎట్టకేలకు ముత్తురాజ్ గూడ్స్‌ను ముందుకు కదిలించాడు. -
చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే..
సాక్షి, సిటీబ్యూరో :సాహసమే శ్వాసగా.. ఆశయమే ఊపిరిగా లక్ష్య సాధనలో ఎదురైన సవాళ్లు, ప్రతిసవాళ్లను సమర్థంగా ఎదుర్కొని అమ్మాయిలు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవాలి. ఆడపిల్లలు వంటింటి కుందేలు కాదు... ప్రయత్నిస్తే, సాహసం చేస్తే వారితో కాని పని ఏదీ ఉండదు. పురుషులకు ధీటుగా ఏదైనా సాధించే సత్తా అమ్మాయిల సొంతం. అవకాశాలు ఎవరో ఇస్తారని, ఏదో చేస్తారని ఆశపడడం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీరవనితల లక్షణం. చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం, లక్ష్యసాధనలో ఓసారి విఫలమైనా, పలుమార్లు ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవిత పాఠం. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. ఇక మెట్రోలో లోకో పైలెట్‌గా ఎంపికై జాబ్‌లో జాయిన్ అవుతానన్నా ఓకే అన్నారు. ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే అంచెలంచెలుగా ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. డేరింగ్, డాషింగ్ స్పిరిట్‌తో సాగిపోతూ లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా ఫిలాసఫి. నేను అమ్మాయిలకు ఇచ్చే సందేశం ఇదే. నేనూ బాధితురాలినే... ప్రొఫెసర్ కె.సర్వమంగళగౌరి పని ఏదైనా పనే. ఇది మగవాళ్ల పని, అది ఆడవాళ్ల పని అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. నిజానికి ఈ పని విభజనతోనే మహిళలపై వివక్ష మొదలవుతోంది. పురుషులు, మహిళలు ఇద్దరూ సమానమేననే భావన నేటితరం పిల్లల్లో కల్పించినప్పుడే ఆడవాళ్లకు గౌరవం దక్కుతుంది. సాటి మహిళగా నేనూ కొన్ని సందర్భాల్లో వివక్ష ఎదుర్కొన్నాను. సమస్యఎదురైనప్పుడు సాహసంతో ఎదుర్కోవాలే గానీ.. చతికిలపడకూడదనే సత్యాన్ని బోధించిన మా నాన్న కాశీసోమయాజుల సుబ్రమణ్యం ఇచ్చిన స్ఫూరి ్తతో వివక్షను ఎదుర్కొన్నాను. ధైర్యంగా నలుగురి ముందు నిలబడగలిగాను. ఇప్పటికీ ఇండిపెండెంట్‌గా బతకడానికే ఇష్టపడుతుంటాను. బాస్‌తో గొడవ మాది గుంటూరు. అక్కడే చదివాను. మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను. ఆ తర్వాత 1986–2013 వరకు ఏపీ స్టడీ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లోనూ పని చేశాను. స్టడీ సర్కిల్లో పనిచేస్తున్న సమయం లోనే ఓసారి వివక్ష విషయంలోనే మా బాస్‌తో గొడవైంది. అప్పట్లో ఆయనపై ఫిర్యాదు కూడా చేశాను. ధైర్యంగా సమస్యను దుర్కొన్నాను. ఈ వివక్ష పోవాలంటే ముందు పని విభజన పోవాలి. అప్పుడే మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఆడపిల్లలకు ప్రస్తుతం చాలా స్వేచ్ఛ ఉంది. కానీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు వివరించాలి. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ ఉండదు. -
మెట్రోరైల్ తొలిరైడ్‌కు పర్యవేక్షకురాలిగా గ్రీష్మ
-
విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక
విజయవాడ: విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం కొత్త సంఘ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా సంఘ్ డివిజనల్ కార్యదర్శి బండ్రెడ్డి వెంకట చలపతిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ లోకో పైలెట్ విధులు నిర్వహించడం కత్తి మీదసాము లాంటిదన్నారు. పదవీ విరమణ చేసి నేడు వారంతా ఆత్మీయంగా కలవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా లోకోపైలెట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఈ సందర్భంగా సంఘ్ డివిజనల్కార్యదర్శి చలపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ్కేంద్ర కమిటీ సభ్యుడు యడ్ల నాగేంద్రబాబు, ఆరోగ్య కార్యదర్శి బి.సత్యనారాయణ, తిరుమలరావు, ప్రకాశ్ పాల్గొన్నారు. -
విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక
విజయవాడ: విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం కొత్త సంఘ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా సంఘ్ డివిజనల్ కార్యదర్శి బండ్రెడ్డి వెంకట చలపతిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ లోకో పైలెట్ విధులు నిర్వహించడం కత్తి మీదసాము లాంటిదన్నారు. పదవీ విరమణ చేసి నేడు వారంతా ఆత్మీయంగా కలవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా లోకోపైలెట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఈ సందర్భంగా సంఘ్ డివిజనల్కార్యదర్శి చలపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ్కేంద్ర కమిటీ సభ్యుడు యడ్ల నాగేంద్రబాబు, ఆరోగ్య కార్యదర్శి బి.సత్యనారాయణ, తిరుమలరావు, ప్రకాశ్ పాల్గొన్నారు. -
విరిగిన రైలు పట్టా: తప్పిన ప్రమాదం
నెల్లూరు(మనుబోలు): రైలు పట్టా విరగడాన్ని సకాలంలో లోకో పైలట్(డ్రైవర్) గుర్తించడంతో పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలపరిధిలోని కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని యలమంద కాలువ వద్ద 149-15 కిలోమీటర్‌లోని అప్‌లైన్‌లో వేకువ జామున 4:00ల ప్రాంతంలో రైలుపట్టా విరిగింది. ఆ సమయంలో విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలు నడక శబ్ధంలో తేడాను గుర్తించి రైలును ఆపేశాడు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిదానంగా ఎలాగో దానిని దాటించి రైలు పోనిచ్చాడు. అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది. యుద్ధప్రాతిపదికన పట్టాకు మరమ్మతులు చేశారు. ఈ సమయంలో వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. పట్టా విరిగిన చోట వంతెన కూడా ఉండడంతో ఈ విషయాన్ని డ్రైవర్ సకాలంలో గుర్తించకపోతే పెద్దప్రమాదం జరిగేదని సిబ్బంది తెలిపారు.