ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతోనే గూడ్స్ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే లూప్‌లైన్‌లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకోపైలట్ గుణనిధి మొహంతి చెప్పారు.
మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్ మొహంతి కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా.
అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్విస్టెగేషన్(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం.
#WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl
— ANI (@ANI) June 4, 2023
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment