Clue
-
Odisha Train Accident: ఆ దుర్ఘటనలో కీలకంగా ఆ లోకోపైలట్ చివరి మాటలు
ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతోనే గూడ్స్ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే లూప్లైన్లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకోపైలట్ గుణనిధి మొహంతి చెప్పారు. మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్ మొహంతి కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా. అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్విస్టెగేషన్(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం. #WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl — ANI (@ANI) June 4, 2023 (చదవండి: -
ఆ పేలుడు ఘటనలో క్లూ... ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ
Pizza order gave Firs Clue: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పిజ్జా ఆర్డరే వాళ్లకు అసలైన క్లూ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ కార్యాలయం పై దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఇంటెలిజెన్స్ అధికారి పిజ్జా డెలివరీ కోసం బయటకు వెళ్లినట్టు తెలిసింది. అతను గేటు నుంచి బయటకు రాగనే కార్యాలయానికి సమీపంలో ఆగి ఉన్న తెల్లటి మారుతి స్విఫ్ట్ కారును ఆ అధికారి గమనించాడు. అతను పిజ్జాతో లోపలికి వెళ్లిన మరు క్షణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఈ కారుపై దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్‌లను, సుమారు 7 వేల మొబైల్ డంప్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటర్నేషనల్ బోరర్ (ఐబీ) సమీపంలో డ్రోన్‌తో చిన్న సైజు ఆర్పీజీని పడేసి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అతను గతంలో చేసిన దాడులన్ని సరిహద్దు అవతల నుంచే ప్లాన్ చేసేవాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ డ్రోన్లు ఒక పెద్ద సవాలని, వాటిని ఆపడానికి ఒక పద్ధతి ఉంటేగానీ ఇలాంటి ఘటనలను ఆపడం అసాధ్యం అని చెప్పారు. పైగా ఈ దాడి అధికారులను ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా దృష్టి సారించేలా చేసింది. ఇటీవల కాలంలో పంజాబ్‌లో ఇలాంటి ఘటను మూడు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవడం: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు) -
ప్రయాణం ఆరంభం
ఫైట్ మాస్టర్ పృథ్వీ శేఖర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘క్లూ’. ‘ద జర్నీ బిగిన్స్’ అనేది ఉపశీర్షిక. సబీనా జాస్మిన్, శుభాంగి పంత్, సంజనా నాయుడు హీరోయిన్లు. రమేష్ రాణా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పణలో ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ పతాకంపై సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మించిన ‘క్లూ’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రమేష్ రాణా, సుభాని అబ్దుల్ మాట్లాడుతూ– ‘‘త్వరలో మా సినిమా ఫస్ట్ లుక్, పాటలు రిలీజ్ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ కృష్ణ, ఎస్. శ్రీనివాస్, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధు నారాయణన్. -
ప్రయాణం ఆరంభం
పృథ్వీశేఖర్ హీరోగా రమేష్ రాణా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘క్లూ’. ‘జర్నీ బిగిన్స్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక. యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎస్ అండ్ ఎమ్ క్రియేషన్స్ పతాకాలపై సుభాణి అబ్దుల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇందులో పృథ్వీశేఖర్ రిస్కీ ఫైట్స్ చేశారు. రమేష్ రాణా కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటారు. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకుండా సినిమాలు చేసే సుభాణి వంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ మంచి సంగీతం ఇచ్చారు. పాటలు యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు. ‘‘మా చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ లోగోను విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు. ఈ 2020లో మరో మూడు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం’’ అన్నారు సుభాణి అబ్దుల్. -
నేను మీకు తెలుసా!
పట్టుకోండి చూద్దాం ఆ చిన్న కాలనీ ఒకప్పుడు ప్రశాంతతకు, పచ్చదనానికి మారుపేరులా ఉండేది. అయితే కాలంతో పాటు ఆ కాలనీలోనూ మార్పులు వచ్చాయి. ప్రశాంతత కరువైంది. పచ్చదనం తరిగిపోయింది. సరిగ్గా నెల రోజుల నుంచి ఆ కాలనీలో ఏదో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే, దొంగతనం జరిగిన ఇంట్లో దొంగోడు ఏదో ఒక వస్తువును వదిలి వెళుతున్నాడు. అంటే... ఒక రకంగా దీన్ని ‘క్లూ’ అనుకోవచ్చు. దీంతో పాటు ఒక తెల్లకాగితంపై... ‘నేను మీకు తెలుసు. పట్టుకోండి చూద్దాం. ఇట్లు సుపరిచితుడు’ అని ప్రింట్ చేసిన అక్షరాలు కనిపిస్తాయి. ఒక ఇంట్లో కీ చైన్. ఒక ఇంట్లో బెల్ట్. ఒక ఇంట్లో పెన్. ఒక ఇంట్లో... పాత గొడుగు... ఏ ఇంట్లో దొంగతనం జరిగినా ఆ ఇంట్లో ఒక వస్తువును వదిలి వెళుతున్నాడు. దొంగోడిది విపరీత మనస్తత్వం అనే విషయాన్ని పోలీసులు అర్థం చేసుకున్నారు. దొంగల్లో రకరకాలు ఉంటారు. ఉన్నదంటూ ఏమీ లేదు... అని దొంగతనం చేసేవాడు ఒకడు. ఉన్నది కాస్తా సరిపోవడం లేదు... అని దొంగతనం చేసేవాడు ఒకడు. రాత్రికి రాత్రి కోటీశ్వరుడై పోవాలని దొంగతనం చేసేవాడు ఒకడు. ఇవి కాకుండా... కేవలం ‘ఎగ్జైట్మెంట్’ కోసం చేసేవాడు ఒకడు. దొంగ చివరి కేటగిరికి చెందినవాడు అనే విషయం తెలియకనే తెలుస్తుంది. ఎందుకంటే... మిగిలిన దొంగలెవరూ... ‘క్లూ’ వదిలి ‘నన్ను పట్టుకోండి చూద్దాం’ అని సవాలు విసురరు. దొంగోడు పరాయి రాష్ట్రం వాడు కాదు... పక్కాగా ఈ కాలనీ వాడేననేది ఒక అనుమానం. ఎందుకంటే... ‘నేను మీ అందరికీ తెలిసిన వాడినే’ అనే అచ్చు అక్షరాలు దొంగతనం జరిగిన ఇంట్లో కనిపించాయి. ‘క్లూ’లు అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈ దొంగతనాలు చేస్తున్నవాడు వృత్తి దొంగ కాదు. ఇతరులను ఉడికించడానికి, సవాలు విసరడానికి చేస్తున్న పని. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు ఎవరైనా కాలనీలో ఉన్నారా? అని పోలీసులు ఎంక్వ్యేరీ చేశారు. దీనివల్ల కూడా ఫలితం కనిపించలేదు. తాజాగా ఒక సీనియర్ ఇంజనీర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ సారి మాత్రం దొంగ ఎలాంటి వస్తువులు వదిలి వెళ్లలేదు. గోడపై మాత్రం... వంకర టింకరగా ఇలా రాశాడు. ‘12’ 1..................2 3..................3 6...................2 11.................1 దీంతో పాటు టేబుల్ క్యాలెండర్లో ఉన్న జనవరి అనే ఇంగ్లీష్ అక్షరాల్లో ‘అ’ను రౌండప్ చేశాడు. పది నిమిషాలు ఆలోచించిన తరువాత ఇన్స్పెక్టర్ నరసింహకు... ఏదో తట్టింది. ఇక్కడ ‘క్లూ’ ఏమిటో కాదు... గోడ మీది రాత, టేబుల్ క్యాలెండర్. వీటి సహాయంతో దొంగోడి పేరు ‘అరుణ్’ అనే విషయాన్ని కనిపెట్టాడు. ‘‘అరుణ్ అనే పేరుతో ఈ కాలనీలో ఎంతమంది ఉన్నారు అనేది ఎంక్వ్యేరీ చేయండి’’ అని సిబ్బందిని ఆదేశించాడు ఇన్స్పెక్టర్ నరసింహ. కాలనీ మొత్తంలో 8 మంది అరుణ్‌లు ఉన్నారు. అందులో ముగ్గురు చిన్న పిల్లలు. నలుగురు విదేశాల్లో ఉన్నారు. ఇక ఒక్కడు మాత్రం... కాలనీలో అందరికీ సుపరిచితుడు. ఈ అరుణ్... కాలనీలో సంఘసేవ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. అందుకే... ఈ అరుణ్ అందరికీ తెలుసు. పోలీసులు అరుణ్‌ని అరెస్ట్ చేసి నిజాలు కక్కించారు. అరుణ్ ‘ఎగ్జైట్మెంట్’ కోసం దొంగతనాలు చేశాడా? ‘అవసరం’ కోసం చేశాడా? అనేది వేరే విషయం. ఇంతకీ... గోడ మీద ఉన్న అంకెలు, క్యాలెండర్ ఆధారంగా దొంగోడి పేరు ‘అరుణ్’ అనే విషయాన్ని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? Ans :- 12-మొత్తం నెలలు. 1-2 అంటే... మొదటి నెల january లో ‘2’వ అక్షరం a 3-3 అంటే... మూడో నెల march లో ‘3’వ అక్షరం r 6-2... ఆరో నెల june లో ‘2’వ అక్షరం u 11-1... పదకొండో నెల november లో ‘1’వ అక్షరం n -
‘కూపన్’తో కూపీ లాగారు..
దొంగలను పట్టించిన గీకి పడేసిన రీచార్జ్ కార్డు సేమియూ పెట్టి నగలు ఎత్తుకెళ్లిన కేసులో కీలకంగా పని చేసిన క్లూ చిక్కుముడి విప్పిన ఎస్సై రవీందర్ వరంగల్ క్రైం : చిన్న క్లూ.. అదిఎంతటి పెద్ద కేసునైనా ఛేదించేందుకు పోలీసులకు ఒక్కో సందర్భంలో ఉపయోగపడొచ్చు. ఎంతటి నేరస్తుడైనా నేరానికి పాల్పడే హడావుడిలో ఏదో ఒకటి జారవిడుచుకుంటాడు.. చివరికి నేరస్తుడు వాడిపడేసిన పనికిరాని వస్తువు కూడా పోలీసులకు దారి చూపుతుంది. ఇటీవల వరంగల్ నగరంలోని శివనగర్‌లో వృద్ధదంపతులకు సేమియా ఇచ్చి నగలు ఎత్తుకెళ్లిన దొంగల విషయంలోనూ ఇదే జరిగింది. గదిలో తమకు సంబంధించిన ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు తీసుకెళ్లడంతో కేసు మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారిన సమయంలో అక్కడే వాకిట్లో లభించిన గీకి పారేసిన రీచార్జ్ కూపన్ తిరుగులేని ఆధారాన్నిచ్చింది. కూపన్ సాయంతోనే పోలీసులు కూపీ లాగి నిందితులను పట్టుకోగలిగారు. కేసు వివరాల్లోకి వెళితే.. శివనగర్‌లో వృద్ధ దంపతులకు సేమియాలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఇళ్లు గుల్ల చేసిన విషయం తెలిసిందే. భార్యాభర్తల పేరుతో వారింట్లో 20 రోజుల క్రితం అద్దెకు దిగిన వారిద్దరు ఈ నెల 12న రాత్రి తమ పెళ్లి రోజని నమ్మించి యజమానులైన వృద్ధ దంపతులకు సేమియాలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వారు మత్తులోకి జారగానే ఒంటిమీదున్న నగలతో పాటు టీవీ, డీవీడీ, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారు తమ వస్తువులను చీపురుపుల్లతో సహా తీసుకెళ్లారు. వారు తమ సెల్‌నంబర్లు, అడ్రస్ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్లూ దొరికిందిలా... ముందస్తు పథకం ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంట్లో వదలకుండా తీసుకెళ్లిన దొంగ దంపతులు హాయిగా తమ స్వగ్రామం చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. నగరంలో కొత్త తరహాలో దొంగతనం జరగడంతో పోలీసులు దొంగల ఆచూకీ తెలుసుకోవడానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఆధారాల కోసం వారు కిరాయికి ఉన్న ఇంట్లో అంతా వెతికారు. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి చిన్న క్లూ దొరికింది. అదేమిటంటే గీకి పారేసిన చిన్న రీచార్జ్ కూపన్. సదరు దొంగ తన సెల్లో బాలెన్స్ కోసం రీచార్జ్ కూపన్‌ను సమీపంలోని ఒక షాపు నుంచి కొనుగోలు చేశాడు. ఆ రీచార్జ్ కార్డులోని బాలెన్స్ వేసుకుని కార్డును ఇంటి ఆవరణలోనే పడేశాడు. ఇది పోలీసుల కంట పడింది. కూపన్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సదరు కంపెనీ సెంటర్ సాయంతో రీచార్జ్ కార్డ్‌లోని అంకెల ఆధారంగా అవి ఏ నంబర్‌కు రీచార్జ్ అయ్యాయో తెలుసుకున్నారు. తర్వాత సెల్‌నంబర్‌ను టవర్ లొకేషన్‌కు పెట్టారు. టవర్ లొకేషన్ చూపించిన విధంగా పోలీసులు సదరు దొంగ దంపతులు గుంటూరు జిల్లాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక బృందం వారి ఆచూకీ కోసం గుంటూరుకు వెళ్లింది. స్థానిక పోలీసులకు విషయం చెప్పి తమ పనిలో నిమగ్నమయ్యారు. టవర్ లొకేషన్ ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల కేంద్రంలోని సీతమ్మవారి పేటలో వారు ఉన్నట్లు సెల్ లొకేషన్ చెబుతోంది. అయితే వారిని గుర్తుపట్టేందుకు పోలీసులు స్థానికంగా చూసిన వారిని తీసుకెళ్లారు. సీతమ్మవారిపేటలో మద్యం కోసం దొంగ బార్ షాపునకు రాగా అతడిని గుర్తించిన శివనగర్ వాసి పోలీసులకు చూపించాడు. తర్వాత దొంగ ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అతడిని అనుసరించారు. సంపన్నుల కాలనీలో ఉంటున్న ఆ దొంగలను పట్టుకునేందుకు చూస్తుండగానే వారు మళ్లీ దొంగతనం చేయడానికి వరంగల్‌కు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని వెంబడించి గవిచర్ల వద్ద పట్టుకుని విచారించారు. తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్న దొంగలు చోరీ సొత్తును అప్పగించారు. విచారణలో వారిద్దరు అసలు దంపతులు కారని, దొంగతనం కోసం ఒకటై ఇదే వృత్తిగా కొనసాగుతున్నట్లు తెలిసింది. నేర పరిశోధనలో ఇటీవల మిల్స్‌కాలనీ సెకండ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ విశేషంగా కృషి చేసి అధికారుల మెప్పుపొందారు. -
కిల్లర్స్
-
క్లూ 8th December 2014
-
క్లూ..! 1st Dec 2014
-
క్లూ 11th August 2014
-
అతడు..ఆమె క్రైమ్
-
క్లూ..
-
క్లూ...
-
క్లూ