
ఫైట్ మాస్టర్ పృథ్వీ శేఖర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘క్లూ’. ‘ద జర్నీ బిగిన్స్’ అనేది ఉపశీర్షిక. సబీనా జాస్మిన్, శుభాంగి పంత్, సంజనా నాయుడు హీరోయిన్లు. రమేష్ రాణా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పణలో ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ పతాకంపై సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మించిన ‘క్లూ’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రమేష్ రాణా, సుభాని అబ్దుల్ మాట్లాడుతూ– ‘‘త్వరలో మా సినిమా ఫస్ట్ లుక్, పాటలు రిలీజ్ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ కృష్ణ, ఎస్. శ్రీనివాస్, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధు నారాయణన్.
Comments
Please login to add a commentAdd a comment