shubhangi pant
-
ప్రయాణం ఆరంభం
ఫైట్ మాస్టర్ పృథ్వీ శేఖర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘క్లూ’. ‘ద జర్నీ బిగిన్స్’ అనేది ఉపశీర్షిక. సబీనా జాస్మిన్, శుభాంగి పంత్, సంజనా నాయుడు హీరోయిన్లు. రమేష్ రాణా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పణలో ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ పతాకంపై సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మించిన ‘క్లూ’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రమేష్ రాణా, సుభాని అబ్దుల్ మాట్లాడుతూ– ‘‘త్వరలో మా సినిమా ఫస్ట్ లుక్, పాటలు రిలీజ్ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ కృష్ణ, ఎస్. శ్రీనివాస్, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధు నారాయణన్. -
ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా
‘‘నాది నల్గొండ జిల్లా. మా నాన్నగారు రిటైర్డ్ స్కూల్ టీచర్. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ‘ఆర్య’ సినిమా చూసి హీరో కావాలని నిర్ణయించుకుని బరువు తగ్గాను. ఆ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా’’ అని తనిష్క్ రెడ్డి అన్నారు. ఎలక్సియస్, శుభంగి పంత్ హీరోయిన్లుగా తనిష్క్ రెడ్డి హీరోగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్పణం’. క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తనిష్క్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ ఐదుగురు, దునియా, చక్కిలిగింత’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అల్లు అర్జున్‌గారితో ‘ఐయామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది నా మూవీ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. ‘సకల కళావల్లభుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ఆ చిత్రం తర్వాత ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న టైమ్‌లో రామకృష్ణగారు కలిసి, ముందుగా ఇంటర్వెల్ సీన్ చెప్పారు. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. అద్భుతంగా ఉంది. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. చివరికి దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది కథాంశం. సినిమా మొత్తం హత్య నేపథ్యంలో ఉంటుంది. ద్వితీయార్ధం ట్విస్ట్‌లతో భయపెడుతుంది. ఈ సినిమా మర్డర్ మిస్టరీకి సంబంధించిన క్లూ అద్దంలోనే కనిపిస్తుంది. అందుకే ‘దర్పణం’ అనే టైటిల్ పెట్టాం. మంచి టెక్నీషియన్స్ ఉంటే తక్కువ బడ్జెట్ లో సినిమా ఎంత బాగా తీయొచ్చు అనడానికి మా సినిమా ఒక ఉదాహరణ. ప్రస్తుతం క్రైమ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. ప్రేమకథతో ఓ సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్‌తో మరో సినిమా చేయబోతున్నాను. డిసెంబర్ నుంచి ఈ చిత్రాల షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’ అన్నారు. -
బంధాలు మళ్లీ గుర్తొస్తాయి
‘‘నీకోసం’ సినిమా నాకు బాగా నచ్చింది. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఊహించని మలుపులతో కథ సాగుతుంది. ఈ చిత్రంతో అవినాష్ వంటి మరో ప్రతిభావంతుడైన దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. అరవింద్ రెడ్డి, అజిత్ రాధారామ్ హీరోలుగా, çశుభాంగి పంత్, దీక్షితా పార్వతి హీరోయిన్లుగా అవినాష్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీకోసం’. రాజలింగం సమర్పణలో అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అవినాష్ కోకటి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రివ్యూ చూసిన పెద్దలందరూ సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. మర్చిపోయిన లేదా వదిలేసిన బంధాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి’’ అన్నారు. ‘‘అందరం కొత్తవాళ్లమే అయినా చాలా కొత్తదనం ఉన్న కథతో వస్తున్నాం’’ అన్నారు అరవింద్ రెడ్డి. ‘‘మా సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు అజిత్ రాధారామ్. ‘‘ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీనివాస్ శర్మ. శుభాంగి పంత్, దీక్షితా పార్వతి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: శివక్రిష్ణ యెడుల పురమ్. -
అప్పడాల చిన్నోడు హీరో అయ్యాడు
‘‘ఇట్లు అంజలి’ సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా తనతో పాటు టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీ కార్తికేయ హీరోగా, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు అంజలి’. ఓమా ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాట్రైలర్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే శ్రీ కార్తికేయ చక్కని నటన కనబరచినట్లు తెలుస్తోంది. తనకు ఈ సినిమా హీరోగా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. దర్శక–నిర్మాత నవీన్ మన్నేల మాట్లాడుతూ– ‘‘ప్రేమలేఖ’ ఆధారంగా సాగే వైవిధ్యమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్స్ కన్నా మా సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలమ్మే కుర్రాడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బాలనటుడిగా చాలా సినిమాలు చేశా. హీరోగా ఇది నా తొలి సినిమా’’ అని శ్రీ కార్తికేయ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల, హిమాన్షీ, శుభాంగి పంత్ మాట్లాడారు. -
రెండు జంటల ప్రేమకథ
‘‘ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టవు. ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకులు అప్డేట్ అవుతూ ప్రేమ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు. అలా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’’ అని నిర్మాత అల్లూరమ్మ (భారతి) అన్నారు. అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో అవినాష్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. తీర్థసాయి ప్రొడక్షన్స్ పతాకంపై అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘తొలితొలిగా...’ పాటను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘ఈ పాట చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారాయన. ‘‘రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇది. ఎంటరై్టన్మెంట్ తగ్గకుండానే ప్రేమకథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. లవ్‌స్టోరీలో ఎమోషన్స్‌కు ఎప్పుడూ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ అంశాలు మా చిత్రంలో ఉంటాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని అవినాష్ కోకటి అన్నారు. సుదర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం: శ్రీనివాస్ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్ రెడ్డి, అల్లూరి రెడ్డి. ఏ. -
అంజలి ప్రేమలేఖ
కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, అనంత్, సైదులు వెంకీ, అవినాష్ ముఖ్యతారలుగా నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇట్లు..అంజలి’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘హీరోకి నటనలో పట్టు ఉంది. నాయిక కూడా జాతీయ స్థాయిలో భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. నవీన్ బాగా తెలుసు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అన్నారు. ప్రేమలేఖ ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అన్నారు నవీన్ మన్నేల. ఈ సినిమాకు కెమెరా: వీకే రామరాజు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. ఆర్ట్: ఎస్వీ మురళి. -
స్వచ్ఛమైన ప్రేమ
తనిష్‌రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘దర్పణం’. వి. చిన శ్రీశైలం యాదవ్ ఆశీస్సులతో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్ (వెంకట్ యాదవ్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎన్. శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. చిన శ్రీశైలం యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మాత ప్రవీణ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మంచి ప్రేమకథా చిత్రం. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. దర్శకుడు రామకృష్ణ కథ చెప్పిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నవీన్ యాదవ్, సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని, సహనిర్మాత కేశవ్ దేశాయ్, తనీష్‌రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్, రచయిత శివశక్తిదత్తా, నటుడు కాదంబరి కిరణ్, కెమెరామెన్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సహనిర్మాతలు: కేశవ్ దేశాయ్, క్రాంతి కిరణ్ వెల్లంకి.