స్వచ్ఛమైన ప్రేమ | darpanam telugu movie shooting hyderabad | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమ

Published Mon, Aug 28 2017 12:43 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

స్వచ్ఛమైన ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమ

తనిష్‌రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘దర్పణం’.  వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌ యాదవ్‌) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎన్‌. శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ ఇచ్చారు. చిన శ్రీశైలం యాదవ్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నిర్మాత ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక మంచి ప్రేమకథా చిత్రం. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. దర్శకుడు రామకృష్ణ కథ చెప్పిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నవీన్‌ యాదవ్, సంగీత దర్శకుడు సిద్ధార్థ్‌ సదాశివుని, సహనిర్మాత కేశవ్‌ దేశాయ్, తనీష్‌రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్, రచయిత శివశక్తిదత్తా, నటుడు కాదంబరి కిరణ్, కెమెరామెన్‌ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సహనిర్మాతలు: కేశవ్‌ దేశాయ్, క్రాంతి కిరణ్‌ వెల్లంకి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement