darpanam
-
ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా
‘‘నాది నల్గొండ జిల్లా. మా నాన్నగారు రిటైర్డ్ స్కూల్ టీచర్. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ‘ఆర్య’ సినిమా చూసి హీరో కావాలని నిర్ణయించుకుని బరువు తగ్గాను. ఆ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా’’ అని తనిష్క్ రెడ్డి అన్నారు. ఎలక్సియస్, శుభంగి పంత్ హీరోయిన్లుగా తనిష్క్ రెడ్డి హీరోగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్పణం’. క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తనిష్క్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ ఐదుగురు, దునియా, చక్కిలిగింత’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అల్లు అర్జున్‌గారితో ‘ఐయామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది నా మూవీ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. ‘సకల కళావల్లభుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ఆ చిత్రం తర్వాత ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న టైమ్‌లో రామకృష్ణగారు కలిసి, ముందుగా ఇంటర్వెల్ సీన్ చెప్పారు. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. అద్భుతంగా ఉంది. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. చివరికి దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది కథాంశం. సినిమా మొత్తం హత్య నేపథ్యంలో ఉంటుంది. ద్వితీయార్ధం ట్విస్ట్‌లతో భయపెడుతుంది. ఈ సినిమా మర్డర్ మిస్టరీకి సంబంధించిన క్లూ అద్దంలోనే కనిపిస్తుంది. అందుకే ‘దర్పణం’ అనే టైటిల్ పెట్టాం. మంచి టెక్నీషియన్స్ ఉంటే తక్కువ బడ్జెట్ లో సినిమా ఎంత బాగా తీయొచ్చు అనడానికి మా సినిమా ఒక ఉదాహరణ. ప్రస్తుతం క్రైమ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. ప్రేమకథతో ఓ సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్‌తో మరో సినిమా చేయబోతున్నాను. డిసెంబర్ నుంచి ఈ చిత్రాల షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’ అన్నారు. -
ఏం జరుగుతుంది?
తనిష్క్ రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్పణం’. శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ జోనర్లో ఇటీవల వచ్చిన సినిమాలు విజయం సాధించాయి. వాటి తరహాలోనే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లో మా సినిమా తెరకెక్కింది. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. క్రాంతి కిరణ్‌గారి సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు. క్రాంతి కిరణ్ వెల్లంకి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు మించి మా చిత్రంలో మంచి కథాంశం ఉంది. రామకృష్ణ మేకింగ్ మా చిత్రానికి మంచి అసెట్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. -
సెప్టెంబర్ 6న ‘దర్పణం’
తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దర్పణం'. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి విశేష స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని సెప్టెంబర్6న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ..‘ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ చిత్రం దర్పణం. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. నిర్మాత క్రాంతి కిరణ్ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము.. దర్శకుడు రామకృష్ణ మేకింగ్ ఈ చిత్రానికి మంచి అసెట్ అవుతుంది. అందరు సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు మించి ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం' అని ధీమా వ్యక్తం చేశారు. -
ఏం జరుగుతుంది?
తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్పణం’. శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వస్తోన్న చిత్రమిది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌ని చివరి నిమిషం వరకూ క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. నటీనటులు, క్రాంతి కిరణ్‌గారి సహకారం మరచిపోలేనిది’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ సినిమాలను మించి మా సినిమా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన∙ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్ పనుల్లో ఉంది. మా చిత్రానికి అందరి సహకారం కావాలి’’ అని క్రాంతి కిరణ్ వెల్లంకి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: సిద్థార్ధ్, సదాశివుని. -
కామెడీ దెయ్యం కాదు
తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్, శుభాంగి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దర్పణం’. రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ పతాకాలపై క్రాంతికిరణ్ వెల్లంకి, వి.ప్రవీణ్ కుమార్ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వినోదం ఉండదు. కామెడీ దెయ్యం సినిమా కాదు. ఇది సస్పెన్స్ చిత్రం. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ఉంటుంది. కేశవ్‌గారి ద్వారా నాకు పరిచయమయిన క్రాంతిగారు చాలా సహకారం అందించారు’’ అన్నారు. ‘‘ఇది నా మొదటి చిత్రం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు క్రాంతికిరణ్ వెల్లంకి. ‘‘సకల కళావల్లభుడు’ తర్వాత నేను నటించిన చిత్రమిది. ఇందులో థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలు ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు తనిష్క్‌రెడ్డి. ‘‘ఈ కథ విన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది’’ అని మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల. -
గ్రామీణ నేపథ్యంలో...
‘‘దర్పణం’ సినిమా ఫేమ్ తనిష్క్‌రెడ్డి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్, సింహా ఫిలిమ్స్ పతాకాలపై అనిల్‌కుమార్ గుంట్రెడ్డి నిర్మిస్తున్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. జనవరి 3నుంచి పార్వతీపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నాం. ఆస్ట్రేలియాలో కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. తనిష్క్ కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమవుతుందనడంలో సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సుమన్, వినోద్‌కుమార్, చిన్నా, పృధ్వీ, జీవా, ఉత్తేజ్, అనంత్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయి చరణ్, కో–ప్రొడ్యూసర్స్: శ్రీకాంత్, త్రినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: చిన్నా, నాగేంద్రమ్మ. -
మంచి ప్రేమకథ
తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ ముఖ్యతారలుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి. ప్రవీణ్‌కుమార్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘దర్పణం’. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు కథ చెప్పిన విధానం ఇంప్రెస్ చేసింది. మంచి ప్రేమకథ. ఎటువంటి ఆటంకం లేకుండా సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. వైజాగ్, అరకు లొకేషన్స్‌లో పాటల చిత్రీకరణ జరిపాం. డిసెంబర్లో ఆడియోను, సినిమా ను జనవరిలోనూ విడుదల ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు ప్రవీణ్ కుమార్. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కేశవ్ దేశాయ్, క్రాంతి కిరణ్, సంగీతం: సిద్దార్థ్ సదాశివుని, కెమెరా: సతీష్ ముత్యాల. -
స్వచ్ఛమైన ప్రేమ
తనిష్‌రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘దర్పణం’. వి. చిన శ్రీశైలం యాదవ్ ఆశీస్సులతో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్ (వెంకట్ యాదవ్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎన్. శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. చిన శ్రీశైలం యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మాత ప్రవీణ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మంచి ప్రేమకథా చిత్రం. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. దర్శకుడు రామకృష్ణ కథ చెప్పిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నవీన్ యాదవ్, సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని, సహనిర్మాత కేశవ్ దేశాయ్, తనీష్‌రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్, రచయిత శివశక్తిదత్తా, నటుడు కాదంబరి కిరణ్, కెమెరామెన్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సహనిర్మాతలు: కేశవ్ దేశాయ్, క్రాంతి కిరణ్ వెల్లంకి.