
తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ ముఖ్యతారలుగా వి. రామకృష్ణ దర్శకత్వంలో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి. ప్రవీణ్‌కుమార్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘దర్పణం’. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు కథ చెప్పిన విధానం ఇంప్రెస్ చేసింది. మంచి ప్రేమకథ. ఎటువంటి ఆటంకం లేకుండా సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. వైజాగ్, అరకు లొకేషన్స్‌లో పాటల చిత్రీకరణ జరిపాం. డిసెంబర్‌లో ఆడియోను, సినిమా ను జనవరిలోనూ విడుదల ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు ప్రవీణ్ కుమార్. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కేశవ్ దేశాయ్, క్రాంతి కిరణ్, సంగీతం: సిద్దార్థ్ సదాశివుని, కెమెరా: సతీష్ ముత్యాల.
Comments
Please login to add a commentAdd a comment