అంజలి ప్రేమలేఖ | Itlu Anjali Movie First Look Launch | Sakshi
Sakshi News home page

అంజలి ప్రేమలేఖ

Published Thu, Jan 25 2018 1:33 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Itlu Anjali Movie First Look Launch  - Sakshi

కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, నవీన్‌

కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, అనంత్, సైదులు వెంకీ, అవినాష్‌ ముఖ్యతారలుగా నవీన్‌ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇట్లు..అంజలి’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘హీరోకి నటనలో పట్టు ఉంది. నాయిక కూడా జాతీయ స్థాయిలో భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. నవీన్‌ బాగా తెలుసు.

ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అన్నారు. ప్రేమలేఖ ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అన్నారు నవీన్‌ మన్నేల. ఈ సినిమాకు కెమెరా: వీకే రామరాజు, సంగీతం: కార్తీక్‌ కొడగండ్ల, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌. ఆర్ట్‌: ఎస్వీ మురళి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement