pasupuleti Rama Rao
-
పసుపులేటి రామారావుకు చిరంజీవి నివాళి
-
సీనియర్ జర్నలిస్ట్ రామారావు మృతి
సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు (70) ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పసుపులేటి రామారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పని చేశారు. పాత్రికేయుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఆయనది. తొలుత విశాలాంధ్ర విలేకరిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. నంబర్ వన్, సంతోషం వంటి పలు వారపత్రికల్లోనూ చేశారు. సినిమాలకు పీఆర్వోగానూ వ్యవహరించారు. దాసరి నారాయణరావు, టి.కృష్ణ, యస్వీఆర్, చిరంజీవి, సావిత్రి, శ్రీదేవి.. వంటి సినీ దిగ్గజాలపై పుస్తకాలు రచించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభ¯Œ బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటే శ్లతో పాటు ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇంటర్వ్యూలు చేశారు. వాటిలో కొన్నింటిని ‘నాటి మేటి సినీ ఆణిముత్యాలు’ పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కల్యాణ్ నాగ చిరంజీవి ఉన్నారు. రామారావు మృతికి సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. నటుడు చిరంజీవి, దర్శకులు రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సీవీ రెడ్డి, పోకూరి బాబూరావు, అచ్చిరెడ్డి, నటుడు మాదాల రవి తదితరులు పసుపులేటి రామారావు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. నటులు పవన్ కల్యాణ్, నాని, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్, దర్శకులు హరీష్ శంకర్, కొరటాల శివ తదితరులు సంతాపం తెలి పారు. రామారావు అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. రామారావుగారి వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం.. ఆయనన్నా నాకూ అంతే అభిమానం. లేకలేక పుట్టిన ఆయన కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్) కలిసి వచ్చేలా కల్యాణ్ నాగ చిరంజీవి అని పేరు పెట్టారు. ఆయన మోకాలికి ఆపరేషన్ చేయించడం కోసం డాక్టర్ని కూడా సంప్రదించాం. అయితే తన అక్కయ్యకు ఆరోగ్యం బాగాలేదని, తర్వాత చేయించుకుంటానని అన్నారు. ఆయన్ను నీతికి, నిజాయతీకి, నిబద్ధతకు మరో రూపంలా చూస్తా. రామారావుగారి కుటుంబానికి అండగా ఉంటాను. – నటుడు చిరంజీవి నాకు సన్నిహితుడైన రామారావుగారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పట్నుంచి ఆయనతో స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్‌కి వచ్చాక కూడా అంతే సాన్నిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచి.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్నోసార్లు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం తీరని లోటు. – నటుడు మోహన్‌బాబు -
రామారావు నా ఆత్మబంధువు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పసుపులేటి రామారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. ఆయన డ్రిగీ వరకు చదువుకున్నారు. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. మొదట విశాలాంధ్ర, తర్వాత జ్యోతిచిత్ర పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేసారు. ప్రస్తుతం సంతోషం సినీ పత్రిక తరపున పనిచేస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమొహన్, మురళీ మోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇప్పటి తరం హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలతో పాటు 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులను ఇంటర్వ్యూలు చేశారు. వీటిలో ఎంపిక చేసిన కొన్నింటిని నాటి మేటి సినీ ఆణిముత్యాలు అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. పసుపులేటి రామారావు మరణం పట్ల తెలుగు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉంటా: చిరంజీవి తనకు ఎంతో ఆత్మీయుడైన రామారావు మరణం పట్ల చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సీనియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని అన్నారు. ‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికి నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: రాజమండ్రి ప్రయాణం) -
ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా
‘‘డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అని అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా.’’ అని నటి అనసూయ అన్నారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. బేబి గాయత్రి రెడ్డి సమర్పణలో బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నా ఫేవరెట్ హీరో. ఆయన సినిమా (‘మన్మథుడు 2’ ఈ నెల 9న విడుదల కానుంది) పోస్టర్, నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్‌కి చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీపడటం కాదు. కథనం, మన్మథుడు 2 సినిమాల జానర్స్ కూడా వేరు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఒకే ఒక పాట ఉంది. సతీష్ కెమెరా వర్క్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. రోషన్ మంచి సంగీతం ఇచ్చారు’’ అని అన్నారు. ‘‘సెలవులు కలిసి రావడం, దగ్గర్లో మరో విడుదల తేదీ లభించకపోవడంవల్లే ఈ నెల 9న మా సినిమాను విడుదల చేస్తున్నాం. పెద్ద చిత్రంతో పోటీపడాలని కాదు. అనసూయ నటన ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘మన్మథుడు 2’ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రచారం చేస్తున్నాం. నైజాంలో ‘దిల్’ రాజుగారు విడుదల చేయడం హ్యాపీ’’ అన్నారు రాజేష్. ‘‘భాగమతి’ తర్వాత ఆ స్థాయి పాత్ర ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చింది’’ అని ధనరాజ్ అన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్. విజయ చౌదరి. -
ఏమో.. ఏదైనా జరగొచ్చు
నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సాషాసింగ్ కథానాయిక. రమాకాంత్ దర్శకత్వంలో ఉమాకాంత్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, డిజిటల్ పోస్టర్‌ను పసుపులేటి రామారావు రిలీజ్ చేశారు. రమాకాంత్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథ, కథనాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. ఓ సిటీలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొత్తవారి దర్శకత్వంలో సినిమా చేస్తే కథ కొత్తగా ఉంటుందనే నమ్మకంతో రమాకాంత్ దర్శకత్వంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. యువతరానికి కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు శివాజీరాజా. ‘‘కథ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. మా నాన్నగారు గర్వపడే సినిమా చేశా. కెమెరామెన్ సమీర్ రెడ్డిగారు మంచి విజువల్స్ ఇచ్చారు’’ అన్నారు విజయ్‌రాజా. -
శ్రీదేవి గొప్పతనం అది
‘‘ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా ఇండియాలోనే ఒక నంబర్ 1 స్టార్‌గా ఎదిగిన శ్రీదేవిగారిపై రామారావుగారు పుస్తకం రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్ రామారావుగారితోనే ఆగిపోతాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ అయిపోయారు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. రకుల్‌ప్రీత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రథమప్రతిని మాదాల రవి అందుకున్నారు. తొలిప్రతిని శివాజీరాజా కొనుగోలు చేశారు. యువకళావాహిని–సియోటెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘అతిలోకసుందరి అనే టైటిల్ ఒక్క శ్రీదేవిగారికే సూట్ అవుతుంది. ఇండియాలో సూపర్‌స్టార్ శ్రీదేవిగారు. దురదృష్టవశాత్తు ఆమె మనకు దూరమయ్యారు. కానీ ఎప్పటికీ గుర్తు ఉంటారు. శ్రీదేవిగారిపై పుస్తకం రాసిన రామారావుగారికి శుభాకాంక్షలు’’ అన్నారు రకుల్. దర్శక–నిర్మాత– నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారు మరణించినప్పుడు ప్రపంచమంతా కన్నీరు కార్చింది. ఆమె గొప్పతనం అలాంటిది. ఆమెపై పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి సెల్యూట్’’ అన్నారు. సినిమాల సెన్సార్ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ– ‘‘నా సినిమా సెన్సార్ సమస్య వల్ల ఓసారి ముంబై వెళ్లాను. శ్రీదేవిగారు ఏ తెలుగువారు అక్కడ కనిపించినా ఆత్మీయంగా మాట్లాడేవారు. నన్ను అక్కడ చూశారు. ‘బాగున్నారా? ఏంటి.. ఇలా వచ్చారు’? అన్నారు. ‘సెన్సార్ ఇబ్బందుల్లో పడ్డాను’ అన్నాను. ‘మీ విప్లవ సినిమాలు బాగుంటాయి. నాకు కూడా అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది’ అన్నారు. ఇప్పుడు ఆ శ్రీదేవిగారు ఉంటే.. సెన్సార్ పరంగా ఇప్పుడు ఏవేం జరుగుతున్నాయో చూసి కన్నీరు పెట్టుకునేవారు. ఎంత దుర్మార్గమండి.. రామ్‌గోపాల్ వర్మగారు ఓ సినిమా (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఉద్దేశించి) తీశారు. సెన్సార్ చేయరా? ఎవరెవరో వచ్చి ఎగిరిపడితే ఆపేస్తారా? పోసానిగారు ఓ సినిమా (‘ముఖ్యమంత్రిగారూ మీరు మాట ఇచ్చారు’ చిత్రాన్ని ఉద్దేశించి) చేశారు. దాన్ని సెన్సార్ చేయరా? అసలేం జరుగుతోంది. ఏం ప్రజాస్వామ్యం ఇది? సెన్సార్‌బోర్డ్ వాళ్లు చెబుతారా ఏ సినిమా చూడచ్చో, ఏది చూడకూడదో. ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే ఎలా? ఎన్.టీ రామారావుగారి మీద ‘మండలాదీశుడు’ సినిమా తీస్తే... ‘రామారావుగారూ.. మీ గురించి ఇలా తీశారు’ అంటే.. ‘మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు. తిట్టినా చూస్తారు బ్రదర్’ అన్నారు. అదీ ఆయన సంస్కారం. 1962లో మనకు, చైనాకు యుద్ధం వచ్చిన సమయంలో నెహ్రూగారి విధానాలను తప్పుపడుతూ జర్నలిస్ట్, కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు వేశారు. కొందరు రాజకీయనాయకులు ఆర్కే లక్ష్మణ్‌పై వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘‘కళాకారులు, జర్నలిస్టులు ప్రజలపక్షం. మనం వారి వాదనలను వినాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి’’ అని నెహ్రూ అన్నారు. ఇప్పుడేంటండీ.. మనం సినిమా తీస్తాం. సెన్సార్ ఆగిపోవడమా? అమరావతి వెళ్లి వివరణ ఇచ్చుకోవడమా? ఎవరో కోర్టుకు వెళితే సినిమాను ఆపేయాలా? అలాంటప్పుడు సెన్సార్ బోర్డ్ పర్పస్ ఏంటి? ఇలాంటి సెన్సార్ విధానాన్ని ముక్తకంఠంతో ఖండించాలి’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారు పాత్రికేయులను బాగా గౌరవించేవారు’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
చాటింగ్‌తో చీటింగ్
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి. వెంకటేశ్ జూన్ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాటలు రిలీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్ ఆవిష్కరించారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాట్సప్, ఫేస్బుక్ ఐడీస్లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది’’ అన్నారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్ హెరాస్మెంట్, అన్‌మెచ్యూర్డ్ మైండ్స్‌తో ఏ విధంగా మోసపోతున్నారు? అమ్మాయిలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? అనే నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు రహమాన్. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: ప్రేమ్ కుమార్. -
అంజలి ప్రేమలేఖ
కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, అనంత్, సైదులు వెంకీ, అవినాష్ ముఖ్యతారలుగా నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇట్లు..అంజలి’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘హీరోకి నటనలో పట్టు ఉంది. నాయిక కూడా జాతీయ స్థాయిలో భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. నవీన్ బాగా తెలుసు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అన్నారు. ప్రేమలేఖ ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అన్నారు నవీన్ మన్నేల. ఈ సినిమాకు కెమెరా: వీకే రామరాజు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. ఆర్ట్: ఎస్వీ మురళి. -
నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నా!
-
నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నా!
– రామ్‌చరణ్ ‘‘రామారావుగారు 43 ఏళ్లుగా సినిమా జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఆయన అనుభవమంత లేదు నా వయసు. ఆయన గురించి నేనేం చెప్పగలను. ఇప్పటివరకూ నేను కూడా చూడని నాకు సంబంధించిన విషయాలు ఈ బుక్‌లో చూసి హ్యాపీ ఫీలయ్యా. నా లైబ్రరీలో నంబర్‌వన్ బుక్‌గా నిలుస్తుంది’’ అన్నారు రామ్‌చరణ్. చిరంజీవిపై ప్రముఖ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘మెగా చిరంజీవితం సినీ ప్రస్థానం 150’ పుస్తకాన్ని శనివారం రామ్‌చరణ్ విడుదల చేశారు. తొలి ప్రతిని దర్శకులు వీవీ వినాయక్‌కి అందజేశారు. పసుపులేటి రామారావు మాట్లాడుతూ – ‘‘స్వయంకృషితో ఎలా పైకి రావొచ్చు అనేదానికి చిరంజీవిగారు నిదర్శనం. 25 రోజుల్లో ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి అల్లు అరవింద్‌గారు నైతికంగా ఎంతో మద్దతు ఇచ్చారు. దాసరిగారు ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ రాసిచ్చారు. సీనియర్ జర్నలిస్టులు చిరంజీవిగారిపై రాసిన ఆర్టికల్స్ ఈ పుస్తకంలో ఉంటాయి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి సినీ ప్రయాణంలో అన్ని కోణాల్ని ఈ బుక్‌లో ప్రస్తావించి ఉంటారని ఆశిస్తున్నా’’ అన్నారు అల్లు అరవింద్. ఈ కార్యక్రమంలో నిర్మాత సి.కల్యాణ్ పాల్గొన్నారు.