ఏమో.. ఏదైనా జరగొచ్చు | Sivaji Raja Son to debut As Hero | Sakshi
Sakshi News home page

ఏమో.. ఏదైనా జరగొచ్చు

Published Wed, Apr 10 2019 3:44 AM | Last Updated on Wed, Apr 10 2019 3:44 AM

Sivaji Raja Son to debut As Hero - Sakshi

నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా నటించిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సాషాసింగ్‌ కథానాయిక. రమాకాంత్‌ దర్శకత్వంలో ఉమాకాంత్‌ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు, డిజిటల్‌ పోస్టర్‌ను పసుపులేటి రామారావు రిలీజ్‌ చేశారు. రమాకాంత్‌ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథ, కథనాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. ఓ సిటీలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగా వచ్చాయి.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొత్తవారి దర్శకత్వంలో సినిమా చేస్తే కథ కొత్తగా ఉంటుందనే నమ్మకంతో రమాకాంత్‌ దర్శకత్వంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. యువతరానికి కనెక్ట్‌ అయ్యే చిత్రమిది’’ అన్నారు శివాజీరాజా. ‘‘కథ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. మా నాన్నగారు గర్వపడే సినిమా చేశా. కెమెరామెన్‌ సమీర్‌ రెడ్డిగారు మంచి విజువల్స్‌ ఇచ్చారు’’ అన్నారు విజయ్‌రాజా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement