
నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నా!
– రామ్‌చరణ్
‘‘రామారావుగారు 43 ఏళ్లుగా సినిమా జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఆయన అనుభవమంత లేదు నా వయసు. ఆయన గురించి నేనేం చెప్పగలను. ఇప్పటివరకూ నేను కూడా చూడని నాకు సంబంధించిన విషయాలు ఈ బుక్‌లో చూసి హ్యాపీ ఫీలయ్యా. నా లైబ్రరీలో నంబర్‌వన్ బుక్‌గా నిలుస్తుంది’’ అన్నారు రామ్‌చరణ్. చిరంజీవిపై ప్రముఖ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘మెగా చిరంజీవితం సినీ ప్రస్థానం 150’ పుస్తకాన్ని శనివారం రామ్‌చరణ్ విడుదల చేశారు. తొలి ప్రతిని దర్శకులు వీవీ వినాయక్‌కి అందజేశారు. పసుపులేటి రామారావు మాట్లాడుతూ – ‘‘స్వయంకృషితో ఎలా పైకి రావొచ్చు అనేదానికి చిరంజీవిగారు నిదర్శనం.
25 రోజుల్లో ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి అల్లు అరవింద్‌గారు నైతికంగా ఎంతో మద్దతు ఇచ్చారు. దాసరిగారు ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ రాసిచ్చారు. సీనియర్ జర్నలిస్టులు చిరంజీవిగారిపై రాసిన ఆర్టికల్స్ ఈ పుస్తకంలో ఉంటాయి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి సినీ ప్రయాణంలో అన్ని కోణాల్ని ఈ బుక్‌లో ప్రస్తావించి ఉంటారని ఆశిస్తున్నా’’ అన్నారు అల్లు అరవింద్. ఈ కార్యక్రమంలో నిర్మాత సి.కల్యాణ్ పాల్గొన్నారు.