
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. చరణ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ఆయన మిత్రులు కూడా విషెష్ తెలిపారు. చిరుత నుంచి తన జర్నీని ప్రారంభించిన ఈ మగధీర బాక్సాఫీస్ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌తో రచ్చ చేశాడు. తాజాగా గేమ్ ఛేంజర్‌గా విఫలం అయినప్పటికీ మరోసారి దర్శకుడు బుచ్చి బాబుతో రంగస్థలంపైకి 'పెద్ది' చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. నేడు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌పై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి కూడా ఇలా స్పందించారు.
‘నా ప్రియమైన రామ్ చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే.. ‘పెద్ది’ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నటుడిగా మరో కొత్త కోణం తెరపైకి రానుంది. సినిమా ప్రేమికులు, అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను'... చిరంజీవి
నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని.. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.. ఎన్టీఆర్
నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు మరింత ప్రేమతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. పెద్ది పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది.... దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ రామ్ చరణ్.. క్లీంకారతో పాటు ఉపాసనతో ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నా... కాజల్ అగర్వాల్