
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.
(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)
పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ)