Chiranjeevi, Jr Ntr Tweet About Ram Charan And Upasana Konidela Baby, Tweets Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi:మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. చిరంజీవితో పాటు ఎన్టీఆర్‌ ట్వీట్‌

Published Tue, Jun 20 2023 10:42 AM | Last Updated on Wed, Jun 21 2023 7:11 AM

Chiranjeevi And Jr Ntr Tweet About Ram Charan Baby - Sakshi

ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చారు. తల్లీబిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

(ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్‌ చేస్తున్న ఫ్యాన్స్‌)

ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం !! నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీతో పాటు మా అందరికి ఆనందాన్ని పంచావ్‌. రామ్‌ చరణ్‌, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు. మమ్మల్ని గ్రాండ్‌ పేరంట్స్‌ను చేశావు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్ను కోట్లాది మంది మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు  ఆశీర్వదిస్తారు'.  అని ట్విట్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ఎన్టీఆర్‌ ట్వీట్‌

రామ్‌ చరణ్‌- ఉపసాన దంపతులకు పాన్‌  ఇండియా స్టార్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌ ద్వారా విషెస్‌ తెలిపాడు. 'తల్లిదండ్రుల క్లబ్‌లోకి మీ ఇద్దరికీ స్వాగతం. ఈ సమయంలో బేబీ గర్ల్‌తో మీరు గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దేవుడ మీ ముగ్గురికి ఆపారమైన సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని తెలిపాడు.

(ఇదీ చదవండి: మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement