టాలీవుడ్ మెగాస్టార్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. ఇప్పటికే ఆయనకు 2006లో పద్మ భూషణ్ అవార్డు వరించింది. తాజాగా ఆయనకు పద్మవిభూషణ్ రావడంతో మెగాస్టార్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.
తాజాగా ఆయన కోడలు ఉపాసన ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేస్తూ మరోసారి మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవితో పాటు ఐదుగురు మనవరాళ్లుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. అందులో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పిల్లలు సమారా, సంహితతో పాటుగా శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. కానీ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు. మొఖం స్పష్టంగా కనిపించకుండా బ్లర్ చేసి ఉంచారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు.
తన మామయ్య చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ఇలా తెలిపారు. చిరంజీవి అంటే కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. దాతృత్వంలోనూ ఆయన ముందుంటాడు. జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాకు స్ఫూర్తిని ఇచ్చాడు. చిరంజీవికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్‌తో సత్కరించారని ఉపాసన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment