Do You Know How Many Grandchildren Have Chiranjeevi - Sakshi
Sakshi News home page

Chiranjeevi: ‘మెగా’ మనువరాళ్లు ఎంతమందో తెలుసా?

Published Tue, Jun 20 2023 4:38 PM | Last Updated on Wed, Jun 21 2023 7:12 AM

Do You Know How Many Grandchildren Have Chiranjeevi - Sakshi

పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్‌ చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు మెగా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి అయితే మరోసారి తాత అయినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. తమకెంతో ఇష్టమైన మంగళవారం రోజు పాప పుట్టడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు.

ఇదిలా ఉంటే చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనువరాళ్లు ఉన్నారు. రామ్‌ చరణ్‌-ఉపాసన కూతురి రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో ఒకరి పేరు సమర, మరొకరిపేరు సంహిత. వీరిద్దరు అంటే చిరంజీవికి చాలా ఇష్టం.

(చదవండి : మెగా మనవరాళ్లు.. రేర్ ఫోటోలు)

ఇక చిన్న కూతురు శ్రీజకు కూడా ఇద్దరు కూతుళ్లే. నివృతి అనే అమ్మాయి పుట్టాక మొదటి భర్తతో విడిపోయింది శ్రీజ. ఆ తర్వాత కళ్యాణ్‌ దేవ్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దకి ఓ ఆడబిడ్డ జన్మించింది. పేరు నవిష్క. ప్రస్తుతం ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చిరంజీవి ఇద్దరు కూతుళ్లకి ఇద్దరి చొప్పున మొత్తం నలుగురు ఆడపిల్లలే జన్మించారు. ఇక ఇప్పుడు రామ్‌ చరణ్‌-ఉపాసన జంట కూడా ఓ ఆడబిడ్డకే జన్మనివ్వడంతో చిరంజీవికి మొత్తం ఐదుగురు మనువరాళ్లు వచ్చారు.

(చదవండి: సుధాకర్‌ కొడుక్కి అండగా మెగాస్టార్‌, ఆ బాధ్యత చిరంజీవిదేనట!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement