
హైదరాబాద్ చరిత్రలోనే కోకాపేట భూముల ధరలు రికార్డ్ బద్దలవుతున్నాయి. కోకాపేట నియోపోలీస్ భూములు వేలంలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ప్లాట్ నెం.10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అక్కడ ఎకరాకు అత్యధికంగా రూ.100 కోట్లకుపైనే వేలం పలికింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా కోకాపేట వైపు చూసింది. ఈ వేలం అనంతరం మెగాస్టార్ చిరంజీవి పేరు ఒక విషయంలో వైరల్ అవుతుంది.
(ఇదీ చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు.. ఏడ్చేసిన ధనరాజ్)
చిరంజీవికి కోకాపేటలో ల్యాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. గతంలో రాఖీ పండగ కానుకగా తన చెల్లెలు ఇద్దరికీ కోకాపేట భూములను రాసి ఇచ్చేలా సురేఖ చేసిందని ఆయన చెప్పారు. చిరంజీవి కొన్ని ఏళ్ల క్రితం వ్యవసాయం చేయడం కోసం అక్కడ కొంత భూమిని కొన్నారు. ఐతే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు.
అయితే ఆ భూమిలోని కొంత మొత్తాన్ని తన ఆడబడుచులకు ఇద్దామని సురేఖ సలహా ఇచ్చారని ఆయన గతంలో తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో సురేఖానే భూమి రిజిస్ట్రేషన్ పనులు చేయించారని ఆయన చెప్పారు. చిరంజీవికి రాఖీ కట్టిన సమయంలో గిఫ్ట్‌గా ఆ భూమి తాలూకా ఆస్థి పత్రాలను చెల్లెళ్లకు సురేఖ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవినే మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు. చెల్లెళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చిన సమయంలో అక్కడ ఎకరం భూమి సుమారు రూ. 30 కోట్లుగా ఉండేది.
ఇదే నిజం అయితే..
కోకాపేటలో చిరంజీవికి సుమారు 20 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగేది. ఆయన కొన్న సమయానికి ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేదు. అలాంటి సమయంలో వ్యవసాయం చేసేందుకు కొంత భూమిని ఆయన కొన్నారు. ఇప్పుడు నగరం విస్తరిస్తుంది. దీంతో సిటీకి అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అలా కోకాపేటలోని చిరంజీవికి చెందిన భూమలు ఇప్పుడు భారీ ధరనే పలకనున్నాయి.
(ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి)
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు చిరంజీవికి అక్కడ 20 ఎకరాల భూమి ఉంటే దాని విలువ రూ. 1500 కోట్ల పైమాటే. ఇదంతా రామ్ చరణ్ తనయ క్లీంకార వచ్చిన వేళా విశేషం అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి కూడా క్లీంకార జాతకం చాలా బాగుందని, తను ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి వృద్ధి చెందుతుందని చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment