
తీరొక్క పూలతో చేసే బతుకమ్మ పండగ అంటే ఆడబిడ్డలకు చెప్పలేనంత సంబరం. ఆడపిల్లలకే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండగను వేడుకగా చేసుకుంటారు. నిన్న(అక్టోబర్ 22) సద్దుల బతుకమ్మ.. ఆ రోజు అంతా పెద్ద బతుకమ్మలు చేసి, దాని చుట్టూ చేరి ఆడిన త్వాత వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా అని సాగనంపారు.
బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో మెగా ఫ్యామిలీ
సామాన్యులేనా సెలబ్రిటీలు సైతం బతుకమ్మను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ పండగను రెట్టింపు సంతోషంగా జరుపుకుంది. క్లీంకార పుట్టిన తర్వాత ఇదే తొలి బతుకమ్మ పండగ కావడం విశేషం. సేవ సమాజ్ బాలికా నిలయంలో చిన్నారులతో కలిసి వేడుక చేసుకున్నాఉ. ఉపాసన కూడా వారితో కలిసి బతుకమ్మ ఆడటమే కాకుండా క్లీంకారను ఎత్తుకుని వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
కుటుంబం బలాన్నిస్తుందంటూ పోస్ట్
'జనాలు నాకు శక్తినిస్తే, కుటుంబం బలాన్నిస్తుంది. ఎంతో ప్రత్యేకమైన దసరా పండగ రోజు అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని మనలో నింపుకుందాం.. సానుకూల దృక్పథాన్ని పెంచుదాం. మా అమ్మమ్మ ఆచరించే సాంప్రదాయాలను దసరా సజీవంగా ఉంచుతోంది. బాలికా నిలయంలో దసరా వేడుక చేసుకుని సంతోషాన్ని పంచుకున్నాం' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment