పూజలో పాల్గొన్న మెగా వారసురాలు.. ఉపాసన పోస్ట్ వైరల్! | Mega Princess Klim Kaara Celebrates varalaxmi pooja with Upasana | Sakshi
Sakshi News home page

Klim Kaara: అమ్మతో కలిసి తొలిసారిగా పూజలో క్లీంకార.. సోషల్ మీడియాలో వైరల్!

Published Fri, Sep 1 2023 7:57 PM | Last Updated on Fri, Sep 1 2023 8:35 PM

Mega Princess Klim Kaara Celebrates varalaxmi pooja with Upasana - Sakshi

మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు మెగాస్టార్ రివీల్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టడంతో పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం తన బిడ్డతో కలిసి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఎ‍ప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.

(ఇది చదవండి: గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన‍్ని తలపిస్తున్న షారుక్ సౌధం! )

తాజాగా తన ముద్దుల కూతరు క్లీంకారతో కలిసి తొలిసారిగా వరలక్ష‍్మీ పూజలో పాల్గొన్న ఫోటోను షేర్ చేసింది. ఇంతకు మించి మరేది అడగలేను.. క్లీంకారతో మొదటి వరలక్ష‍్మీ వ్రతం పూజ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో క్లీంకార ఫేస్ కనపడకుండా కవర్‌ చేసింది ఉపాసన. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మా చిట్టి తల్లి కామెంట్స్ కూడా పెడుతున్నారు.

మరికొందరేమో క్లీంకార ఫేస్ చూడాలని ఆసక్తిగా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. కాగా.. ఇటీవలే ఒంటరి మహిళల కోసం అపోలో ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉచిత సేవలందిస్తున్నట్లు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement