Chiranjeevi Explains Ram Charan And Upasana Daughter Name Klin Kaara Konidela Hidden Meaning - Sakshi
Sakshi News home page

Klin Kaara Konidela: మెగా ప్రిన్సెన్స్ పేరు వెనక సీక్రెట్.. మీనింగ్ అదేనా?

Published Fri, Jun 30 2023 4:32 PM | Last Updated on Fri, Jun 30 2023 4:55 PM

Ram Charan Daughter Name Klin Kaara Hidden Meaning - Sakshi

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు పుట్టిన పాపాయికి పేరు పెట్టేశారు. 'క్లీంకార కొణిదెల' అని నామకరణం చేశారు. అలానే బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిన తర్వాత పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోని తాత అయిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన మనవరాలి పేరు వెనక సీక్రెట్ కూడా ఆయనే బయటపెట్టేశారు. 

పేరు వెనక సీక్రెట్
రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

పాప డీటైల్స్ ఇవే
రామ్ చరణ్- ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన 11 ఏళ్లకు అంటే గతేడాది ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఉపాసన చెప్పుకొచ‍్చింది. ఆ తర్వాత కూడా ఉపాసన బేబీ బంప్ తో చాలాసార్లు బయట కనిపించింది. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసనకు డెలివరీ అయింది. ఇప్పుడు పుట్టిన పాపకు పేరు పెట్టారు. దీంతో మెగాఫ్యాన్స్ ఈ పేరుని వైరల్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement