grandchildren
-
17మందికి ఒకేసారి పెళ్లి..ఒకే శుభలేఖ.. హాట్ టాపిక్‌గా తాతగారు
ఒకరికి పెళ్లి చేయడమే చాలా ఖరీదైన మారిన ప్రస్తుత రోజుల్లో 17 పెళ్లిళ్లంటే మాటలా అనుకున్నాడో ఏమోగానీ రెండంటే రెండు రోజుల్లో వరుసపెట్టి మనవళ్లు, మనవరాళ్లకు సామూహిక వివాహ వేడుక జరిపించాడు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ వివాహాలు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెద్దాయన పేరు రాజస్థాన్‌లోని నోఖా మండలం లాల్‌మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్. ఆయన గ్రామపెద్ద కూడా. సుర్జారామ్ వారసులు ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఈయనకు 17 మంది మనవళ్లు, పెళ్లికి ఎదిగి ఉన్నారు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో పన్నెండు మంది మనవరాలు, ఐదుగురు మనవళ్లు పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా విశేషమే. అంతేకాదు వీరందరికీ కే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. బంధుమిత్రుల సమక్షంలో ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్ల ముళ్ల వేడుక కాస్తా ముగించాడు.ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్ కార్డ్‌తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. ఒకే కుటుంబంలో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. -
ఆ పాప నా మనవరాలే : బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబ వ్యవహారంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయన ఎట్టకేలకు తెర దించారు. నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేళ్ల చిన్నారి తన మనవరాలేనని అంగీకరించారు. ఆ పాప తన ఏడవ మనవరాలని ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ నా కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్‌లకు 2018లో కలిగిన సంతానమే చిన్నారి నేవీ. హంటర్, లండెన్లు తమ కుమార్తె క్షేమం కోసం వారిద్దరి మధ్య సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో చెప్పారు. ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదని, కుటుంబ వ్యవహార మని స్పష్టం చేశారు. నేవీతో పాటుగా తమ మనవలు, మనవరాళ్లు అందరికీ అంతా మంచి జరగాలని తాను, జిల్ బైడెన్ కోరుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు. నేవీ రాబర్ట్స్ పెంపకం బాధ్య తలపై తల్లి లండెన్ రాబర్ట్ కోర్టుకెక్కిన సమయంలో వారిద్దరి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన కోర్టు నేవీ తండ్రి హంటర్ బైడెనేనని నిర్ధారించింది. హంటర్ బైడెన్ 2021లో తాను రాసిన పుస్తకంలో లండెన్తో సంబంధం గురించి రాశారు. డ్రగ్స్‌కు బానిసగా ఉన్న సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని ఆ తర్వాత ఆమెని మర్చిపోయానని ఆ పుస్తకంలో రాశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పాప బాధ్యతను తాను కూడా తీసుకున్నానని అందులో రాసుకొచ్చారు. ఇంత జరిగినా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చిన్నారి నేవీని మనవరాలిగా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. -
చిరంజీకి ఎంతమంది మనువరాళ్లు ఉన్నారో తెలుసా?
పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు మెగా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే మరోసారి తాత అయినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. తమకెంతో ఇష్టమైన మంగళవారం రోజు పాప పుట్టడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనువరాళ్లు ఉన్నారు. రామ్ చరణ్-ఉపాసన కూతురి రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో ఒకరి పేరు సమర, మరొకరిపేరు సంహిత. వీరిద్దరు అంటే చిరంజీవికి చాలా ఇష్టం. (చదవండి : మెగా మనవరాళ్లు.. రేర్ ఫోటోలు) ఇక చిన్న కూతురు శ్రీజకు కూడా ఇద్దరు కూతుళ్లే. నివృతి అనే అమ్మాయి పుట్టాక మొదటి భర్తతో విడిపోయింది శ్రీజ. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దకి ఓ ఆడబిడ్డ జన్మించింది. పేరు నవిష్క. ప్రస్తుతం ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చిరంజీవి ఇద్దరు కూతుళ్లకి ఇద్దరి చొప్పున మొత్తం నలుగురు ఆడపిల్లలే జన్మించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఓ ఆడబిడ్డకే జన్మనివ్వడంతో చిరంజీవికి మొత్తం ఐదుగురు మనువరాళ్లు వచ్చారు. (చదవండి: సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!) Welcome Little Mega Princess !! ❤️❤️❤️ You have spread cheer among the Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023 -
ఫండ్స్‌ను మనవళ్లకు గిఫ్ట్ ఇవ్వొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
నేను గ్రోత్ ఆప్షన్ బదులు ఐడీసీడబ్ల్యూ (నెలవారీ) ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? ఈ విషయలో పన్ను బాధ్యతలు ఎలా ఉంటాయి? – అభినవశ్రీ మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే ఇనకమ్ ఇస్ట్రిబ్యషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ (ఐడీసీడబ్ల్య) ప్లాన్‌కు దూరంగా ఉండండి. దీనికి బదులు గ్రోత్ ప్లాన్ ఎంపిక చేసుకోండి. ఐడీసీడబ్ల్యూ ప్లాన్ పన్ను పరంగా మెరుగైనది కాదు. గ్రోత్ ప్లాన్ పన్ను పరంగా మెరుగైన సాధనం. గ్రోత్ ప్లాన్‌లో పెట్టుబడులపై రాబడులు అన్నీ ఫండ్ వద్దే ఉంటాయి. దీంతో వాటిపైనా రాబడితో కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. అదే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ అన్నది పెట్టుబడి, రాబడుల్లో కొత భాగాన్ని ఫండ్ సంస్థ తిరిగి చెల్లించడం. స్టాక్స్‌లో అయితే డివిడెండ్ వరకే ఇన్వెస్టర్లకు నేరుగా చెల్లిచడం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్లు అన్నవి తప్పుడు పదంతో ఇంత కాలం కొనసాగాయి. అందుకే ఇటీవలే డివిడెండ్ పేరును ఐడీసీడబ్ల్యూగా మార్చారు. డివిడెండ్లు చెల్లించిన వెంటనే ఫండ్ ఎన్ఏవీ అంతే మేర తగ్గుతుంది. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్లు మీ పన్ను ఆదాయానికి తోడవుతాయి. మీ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒక ఏడాదిలో డివిడెండ్ ద్వారా రూ. 5,000కు మించి ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో మీ పెట్టుబడి ఫండ్ సంస్థతోనే ఉంటుంది. కానీ, వాస్తవంగా చూస్తే చెల్లించే డివిడెండ్‌పై పన్ను పడుతుంది. కనుక పన్ను పరంగా అంత సమర్థమైనది కాదు. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ ఎంత చెల్లించాలన్నది ఫండ్ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇందులో ఇన్వెస్టర్లకు పాత్రకు ఉండదు. మీకు క్రమం తప్పకుండా ఫండ్స్ పెట్టుబడుల నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, అందుకు గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకోవడం మెరుగైనది. దీనివల్ల ఎంత కాలానికి ఎంత చొప్పున కావాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. కనుక ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌తో పోలిస్తే గ్రోత్ ప్లాన్ చాలా మెరుగైనది. మీ పెట్టుబడులపై మీరు నియంత్రణ కలిగి ఉంటారు. నా కుమారుడు మరణించాడు. జాయింట్ హోల్డర్‌గా ఉండడంతో ఫండ్స్ యూనిట్లు నాకు సంక్రమించాయి. వీటిని నా కుమారుడి పిల్లలకు బదిలీ చేయాలని అనుకుంటున్నాను. సాధ్యపడుతుందా? – విష్ణు కుమార్ మీ పేరుతో ఉన్న ఫండ్ యూనిట్లను మీ మనవళ్లు, మనవరాళ్లకు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఫండ్స్ యూనిట్లు అనేవి గిఫ్ట్‌గా ఇవ్వడానికి, మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. అయితే మీ మనవళ్ల పేరిట ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు మీరు ముందుగా మీ పేరుతో ఉన్న ఫండ్స్ పెట్టుబడులు మొత్తాన్ని వెనక్కి తీసుకోండి. మీ మనవళ్ల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే ప్రస్తుత పెట్టుబడులను వెనక్కి తీసుకుని, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయండి. అప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లే స్వయంగా వారి బ్యాంకు ఖాతా నుంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీరు వారికి సాయం అందించొచ్చు. ఒకవేళ మీ మవనళ్ల వయసు 18 ఏళ్లలోపు ఉంటే వారి తల్లి లేదంటే కోర్టు నియమించిన గార్డియన్‌కు పెట్టుబడులు బదలాయించొచ్చు. ఆ పని వారే చేస్తారు. మరో మార్గంలో ప్రస్తుతం మీ పేరుతో ఉన్న పెట్టుబడులను కొనసాగిస్తూ, నామినీగా మీ మనవళ్లు, మనవరాళ్లను పేర్కొనాలి. ఎవరికి ఎంత శాతం అనేది నిర్ణయించొచ్చు. అప్పుడు యూనిట్ హోల్డర్‌కు ఏదైనా జరిగితే అవి వారి పేరిట బదిలీ అవుతాయి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పిల్లలను తాత ముత్తాతలతో విడదీయలేం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘తాత ముత్తాతలు, అమ్మమ్మ నానమ్మలు.. తమ మనవళ్లు, మనవరాళ్లను కలవకుండా ఉండలేరు. పిల్లలంటే తల్లిదండ్రులకే కాదు.. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు కూడా ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో తాతముత్తాతల పాత్ర కూడా ముఖ్యమైనదే. పిల్లల సంరక్షణ అంటే ఒక్క డబ్బుతో ముడిపడిందే కాదు.. పలు దృక్కోణాల్లో చూడాలి. తండ్రి/తల్లి బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలిగినంత మాత్రాన అది పూర్తిగా పరిగణించబడదు. జీవితంలో దగ్గరి వ్యక్తుల, తమకు ఇష్టమైన వారి జీవన విధానాన్ని అనుసరిస్తూ చిన్నారులు వ్యక్తిగా ఎదుగుతారు. ప్రతి బిడ్డ సంతోషకరమైన బాల్యానికి అర్హులు. తాత–తల్లిదండ్రుల ఉనికి నుంచి మనుమలు పొందే ప్రేమ, ఆప్యాయత, భద్రత నిస్సందేహంగా ముఖ్యమైనవి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి’అని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య(ఓ చిన్నారి తల్లి) మరణించడంతో నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ చిన్నారి ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటోంది. చిన్నారిని తన సంరక్షణకు ఇవ్వాలంటూ నల్లగొండకు చెందిన 56 ఏళ్ల మహిళ(చిన్నారి అమ్మమ్మ) జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, మనవరాలిని చూసేందుకు తనకు అనుమతి ఇవ్వడం లేదని, ఇచ్చేలా ఆమె తండ్రిని ఆదేశించాలని కోరుతూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున కె.సీతారాం, ప్రతివాది తరఫున పి.విజయ్‌కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి అనుబంధాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో అత్త, అల్లుడి వివాదాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలేదు.వారి వివాదాలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపకూడదు. అమ్మమ్మ తాతయ్యల పట్ల ద్వేషంతో పెంచితే పాప కచ్చితంగా మంచి మనిషిగా పరిణామం చెందదు. ఇది జీవితకాల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అమ్మమ్మ తన మనవరాలిని వారానికి ఒకసారి కలవడానికి అనుమతి ఇస్తున్నాం’అని ఆదేశించింది. చదవండి: Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు.. -
తాత కోర్కెను తీర్చిన మనవళ్లు
సాక్షి ముంబై : పిల్లల కోరికలను తల్లిదండ్రులతోపాటు వారి నానమ్మలు, తాతయ్యలు తీర్చడం సాధారణంగా చూస్తుంటాం. కాని మహారాష్ట్రలో తాత కోరికను తీర్చి ఇద్దరు మనవళ్లు డాక్టర్ నందకుమార్ గోడ్గే, అడ్వకేట్ అవినాష్ గోడ్గేలు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కాడు. ఇప్పటివరకు సినీ హీరోలు, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులతోపాటు వివాహవేడుకలలో వధూవరులు హెలికాప్టర్లో రావడం చూసి ఉంటాం. కాని తమ నానమ్మ చహాబాయి గోడ్గే, తాత (అబ్బ) దేవరామ్ గోడ్గేల కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని పుణే నుంచి అహ్మద్‌నగర్ జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. దేవరామ్ గోడ్గే 88వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ వినూత్న బహుమతిని వారికి అందించారు. పుణే నుంచి అహ్మదనగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలోని చించోలి గురవ్ గ్రామం వరకు హెలికాప్టర్లో తీసుకెళ్లారు.అయితే దీనికి ముందు ఆ గ్రామ సమీపంలోని ఓ మైదానాన్ని శుభ్రపరిచి హెచ్ ఆకారంలో రాశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామప్రజలు అందరు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందరు చూస్తుండగానే మంగళవారం ఉదయం ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం విని్పంచింది. అందరు ఒక్కసారిగా మైదానం వద్దకి పరుగులుతీశారు. ఇలా మునుపెన్నడు హెలికాప్టర్‌ను ఇంత దగ్గరగా చూడని అనేక మంది గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఇంటికి సమీపంలో దిగిన హెలిక్యాప్టర్ ల్యాండింగ్ అయిన ప్రాంతం నుంచి ఇంటి వరకు వారిని బ్యాండు మేళాలతో ఇంటికి తీసుకెళ్లారు. మరిచిపోలేని ఆనందాన్నిచ్చారు.. తన మనవళ్లు చివరి వయసులో జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చారంటూ దేవరామ్ గోడ్గే మీడియాకు తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ నందకుమార్ పెళ్లి సమయంలో ఏనుగుపై ఊరేగింపు చేయాలని కోరడంతో ఆయన తాత ఎనుగును తీసుకొచ్చి ఊరేగించారు. దీంతో పలు మార్లు ఏదో సందర్భంగా అన్న తాను అన్న మాటలను గుర్తు ఉంచుకుని తనను నా భార్యను హెలిక్యాప్టర్‌లో తిప్పడమే గాక, తమ ఊరి వరకు తీసుకొని వచ్చారన్నారు. -
లండన్‌లో నవాజ్ షరీఫ్ మనవళ్లు అరెస్ట్
-
దీనావస్థలో భీం వారసులు
వీరి కుటుంబాల పరిస్థితి దయనీయం వెలుగులోకి భీం మనుమరాళ్లు.. కూలీ పనితో కుటుంబాల పోషణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వేడుకోలు కెరమెరి : నిజాం సర్కార్‌తో పోరాటం సాగించిన గిరిజన యోధుడు కుమ్రం భీం తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఆశయం కోసం పోరాడిన యోధుడిని ఎందరో స్మరించుకుంటున్నారు. కుమ్రం భీం త్యాగాలను ప్రభుత్వం గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారకపనులు చేపడుతోంది. కానీ ఆయన వారసులు మాత్రం దీనవస్థలో ఉన్నారు. నిన్నటివరకు భీం మనుమడు సోనేరావు, మనుమరాలు సోంబాయిలే తెలుసు. కానీ మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం తెలియదు. వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. చేతిలో పనిలేదు. వారికున్న సాగుభూమిలో పంటదిగుబడి లేకపోవడంతో పూటగడవడం కష్టంగా మారింది. వారి జీవన స్థితిగతులపై సాక్షి ప్రత్యేక కథనం. వారసత్వం పై అలసత్వం ‘కుమ్రం భీం’కు ఇద్దరు సంతానం. కుమారుడు మాధవరావు, కూతురు రత్తుబాయి. మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్రావు వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామం. భీం కుమారుల పరిస్థితి బాగు ఉన్నా.. చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమెకు ముగ్గురు కూతుర్లు. ఒకరు సోంబాయి జోడేఘాట్‌లో, మరొకరు ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారిలో, ఇంకొకరు కుమ్రం కాసుబాయి సాకడ గ్రామంలో ఉంటున్నారు. స్ఫూర్తిదాతగా నిలిచారు భీం గొప్పవ్యక్తి..ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గు ర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొ క్కనుంది. ఆయన త్యాగానికి గుర్తించిన సర్కార్.. జోడేఘాట్‌ను అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషిచేస్తోంది. కానీ, ఆయన వారసుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైన మా బతుకులు బాగుపడతాయంటే అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదంటు భీం మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన చెందుతున్నారు. జంగుబాయి గృహం పునాదులకే పరిమితం మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కు మ్రం జంగుబాయి నివసిస్తోంది. వీరికి పెంకుటి ల్లు దిక్కు. పదేళ్ల కిందట మంజూరైన ఇంది ర మ్మ గృహం పునాదులకే పరిమితమైంది. పాలక ప్రభుత్వాలు మారుతున్న వీరి బతుకుల్లో వెలు గు లేకుండాపోయింది. వీరిని పట్టించకున్న నా థుడే లేడు. ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి ఆదుకోవాల్సిన పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో వారు ఆ ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోసారి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఎలాంటి సాగుభూమి కూడా లేకపోవడంతో కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా, ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో రోజుకు రూ. 100తో వంట మనిషిగా పనిచేస్తోంది. భీం వారసురాలైన ఈమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసహాయం అందలేదు. ఈమె, భర్త జంగు, కళ్లు కనిపించవు. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పెళ్లి అయింది. కనిపించని ఆర్థిక సహాయం మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న భీం చిన్న మనుమరాలు కుమ్రం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైన బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్నా మూడెకరాల సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబపోషణ భారమైంది. ఇప్పటికి శావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది. భీంతో సంబంధం ఉన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. భర్త భీం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎల్లుది కూడా అదే గతి మండలంలోని కొఠారిలో ఉంటున్న మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇదే. మూడెకరాల సాగుభూమి ఉన్నప్పటికి రాళ్లురప్పలతో కూడుకుంది. ప్రతీ సంవత్సరం అప్పు చేసి వేలకువేలు వెచ్చిస్తున్నప్పటికి దిగుబడి రావడం లేదు. ఖరీఫ్‌లో వ్యవసాయం చేస్తుండగా మిగిలిన రోజుల్లో కూలీ పని దిక్కు. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు. పట్టించుకోని అధికారులు ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులకు కలిసి నివేదనలు సమర్పించిన స్పందించిన దాఖలాలు లేవు. ఐటీడీఏ నుంచి రుణం అందలేదు. ఎడ్డు జతలు కావాలని గతంలో దరఖాస్తులు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇళ్లు లేవు, వ్యవసాయ భూములు లేవు, ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం చేసిన త్యాగాలను గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారక పనులు చేపడుతున్నప్పటికి భీం వారసుల పరిస్థితి మాత్రం కడు దయనీయంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి తమను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కుమ్రం భీం పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి రుణం ఇవ్వాలి. - ఆడ జంగుబాయి. కొఠారి ఎడ్ల జతలివ్వాలి వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం సాగుభూమి అందించాలి. సోనేరావుకు ఇచ్చిన ట్లే ఆర్థిక సహాయం ఇవ్వాలి. - చహకటి ఎల్లు, కొఠారి భూమి పంచివ్వాలి మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నాడు. అది అందరికి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి నాలుగు ఎకరాల భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి. - కుంరం కాసుబాయి, సాకడ