ఒకరికి పెళ్లి చేయడమే చాలా ఖరీదైన మారిన ప్రస్తుత రోజుల్లో 17 పెళ్లిళ్లంటే మాటలా అనుకున్నాడో ఏమోగానీ రెండంటే రెండు రోజుల్లో వరుసపెట్టి మనవళ్లు, మనవరాళ్లకు సామూహిక వివాహ వేడుక జరిపించాడు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ వివాహాలు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ పెద్దాయన పేరు రాజస్థాన్‌లోని నోఖా మండలం లాల్‌మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్. ఆయన గ్రామపెద్ద కూడా. సుర్జారామ్ వారసులు ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఈయనకు 17 మంది మనవళ్లు, పెళ్లికి ఎదిగి ఉన్నారు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో పన్నెండు మంది మనవరాలు, ఐదుగురు మనవళ్లు పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా విశేషమే.
అంతేకాదు వీరందరికీ కే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. బంధుమిత్రుల సమక్షంలో ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్ల ముళ్ల వేడుక కాస్తా ముగించాడు.ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్ కార్డ్‌తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. ఒకే కుటుంబంలో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment