గిన్నిస్‌ పెళ్లిళ్లు | 2143 couples marry in mass wedding in Rajasthan | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ పెళ్లిళ్లు

Published Mon, Jun 12 2023 6:16 AM | Last Updated on Mon, Jun 12 2023 6:17 AM

2143 couples marry in mass wedding in Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ పెళ్లిళ్లలో రికార్డు సాధించింది. కేవలం 12 గంటల్లో 2 వేలకు పైగా జంటలకు ముడిపెట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కింది. బారన్‌లో ఈ సామూహిక వివాహ కార్యక్రమం మే 26న జరిగినట్టుగా గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ అధికారులు వెల్లడించారు.

శ్రీ మహవీర్‌ గోశాల కళ్యాణ్‌ సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా కార్యక్రమంలో హిందువులు, ముస్లిం జంటలు కూడా ఒక్కటయ్యారు. 2013లో 24 గంటల్లో 963 పెళ్లిళ్లు జరిపి యెమన్‌ పేరిట ఉన్న ఈ రికార్డుని బద్దలు కొడుతూ కేవలం 12 గంటల్లోనే 2,413 మంది జంటలకి వివాహం జరిపించారు. అప్పటికప్పుడు ఈ పెళ్లిళ్లను అధికారికంగా రిజిస్టర్‌ కూడా చేయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement