Mass marriages
-
గిన్నిస్ పెళ్లిళ్లు
జైపూర్: రాజస్తాన్ పెళ్లిళ్లలో రికార్డు సాధించింది. కేవలం 12 గంటల్లో 2 వేలకు పైగా జంటలకు ముడిపెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. బారన్లో ఈ సామూహిక వివాహ కార్యక్రమం మే 26న జరిగినట్టుగా గిన్నిస్ వరల్డ్ బుక్ అధికారులు వెల్లడించారు. శ్రీ మహవీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా కార్యక్రమంలో హిందువులు, ముస్లిం జంటలు కూడా ఒక్కటయ్యారు. 2013లో 24 గంటల్లో 963 పెళ్లిళ్లు జరిపి యెమన్ పేరిట ఉన్న ఈ రికార్డుని బద్దలు కొడుతూ కేవలం 12 గంటల్లోనే 2,413 మంది జంటలకి వివాహం జరిపించారు. అప్పటికప్పుడు ఈ పెళ్లిళ్లను అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించారు. -
ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకేసారి 220 జంటలు ఒక్కటైన అపురూప దృశ్యం ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆవిష్కృతమైంది. ఎంజేఆర్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల మహోత్సవం కన్నులపండువగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.కేశవరావు, పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకులు కల్యాణం నిర్వహించగా.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ముత్యాల పందిరి, పురోహితుల ఆధ్వర్యంలో 220 కొత్త జంటలు ఒకే వేదిక ద్వారా ఒక్కటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వధూవరులకు కంకణాలను అందజేశారు. కొత్తజంటలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. సామూహిక వివాహాలకు హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు. సంపాదనలో సగం పేదలకే.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంపాదించిన దాంట్లో సగం పేదల కోసం ఖర్చు చేయాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ఎంపీ కె.కేశవరావు అన్నారు. ఎమ్మెల్యే సొంతంగా రూ.3 కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనకు అవకాశం వస్తే అనాథలు, బడుగు, బలహీనులకు వివాహాలు జరిపిస్తానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ సమక్షంలో ఒక్కటైన 551 జంటలు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో 551 జంటలు ఒక్కటయ్యాయి. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి తన ఆశీస్సులు అందించారు మోదీ. ఈ సందర్భంగా బంధువుల ఒత్తిడితో ప్రత్యేకంగా ఇంటి వద్ద విందు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని నూతన వధూవరులను కోరారు మోదీ. అందుకు ఖర్చు చేసే డబ్బులను తమ పిల్లల కోసం అట్టిపెట్టుకోవాలని సూచించారు. కొత్త జంటలతో కలిసి ఫోటోలు దిగారు మోదీ. వారితో కాసేపు ముచ్చటించారు. భవనగర్ సిటీలోని జవహార్ మైదానంలో ‘పాపా ని పారీ లగ్నోత్సవం 2022’ పేరుతో సామూహిక వివాహాలు జరిపించారు. ఈ మాస్ వెడ్డింగ్ వేడుకల్లో 551 జంటలు ఒక్కటయ్యాయి. తండ్రిని కోల్పోయిన 551 మంది యువతులకు ఈ సామూహిక వివాహ వేదికగా పెళ్లిళ్లు జరిపించారు నిర్వాహకులు. డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వరాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఉదయం వల్షాద్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశలో డిసెంబర్ 1న 89, రెండో దశలో డిసెంబర్ 5న 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. Live: PM Shri @narendramodi attends mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat https://t.co/c0PJ3oQqM3 — BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022 Gujarat | Prime Minister Narendra Modi attends mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, in Bhavnagar https://t.co/Bwt1tD7FMw pic.twitter.com/4tjrf6Q9iy — ANI (@ANI) November 6, 2022 ఇదీ చదవండి: తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్ -
పెళ్లి వేడుకలో సీఎం స్టెప్పులు.. వైరల్
కోల్కత్తా: రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కళాకారులతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ నృత్యంలో మహిళలతో కలిసి పాదం కలిపారు. ఆమెనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాజకీయాలతో పాటు వ్యక్తిగత వ్యాపకాలుగా ఆమెకు పుస్తకాలు రాయడం.. పెయింటింగ్ వేయడం తదితర ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు సంప్రదాయ నృత్యం చేసి ప్రజలను అలరిస్తుంటారు. తాజాగా ఓ సామూహిక వివాహ వేడుకలో ఆమె కళాకారులతో కలిసి నృత్యం చేయడం ఆకట్టుకుంది. అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ మంగళవారం సామూహిక వివాహాలు జరిపింది. ఈ వేడుకగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరై ఆ కొత్త జంటలను ఆశీర్వదించారు. అనంతరం అక్కడ గిరిజన యువతులు చేస్తున్న సంప్రదాయ నృత్యం చూసి అక్కడకు వెళ్లారు. దరువుగా అనుగుణంగా బెంగాల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఆ పక్కనే మరో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని సీఎం మమత కళాకారులతో కలిసిపోయారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా ఈలలు.. చప్పట్లతో మార్మోగించారు. మమతాబెనర్జీ ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో నృత్యం చేస్తూ ఆకట్టుకుంటారు. బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. టీఎంసీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ విధంగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే మమతా బెనర్జీ రాజకీయ వ్యూహం సిద్ధం చేస్తున్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న మమత ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా.. ఒక్కటైన 165 జంటలు
సాక్షి, నాగర్‌కర్నూల్: వేదమంత్రాల సాక్షిగా ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు పి.రాములు, కొత్త ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, భీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బాద్మీశివకుమార్, జెడ్పీ ఛైర్మన్ పెద్దపల్లి పద్మావతి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జేసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు జక్కా రఘునందన్‌రెడ్డి, బైకాని శ్రీనివాస్‌యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం 165 జంటల వివాహాలు జరిపిస్తున్నట్లు భావిస్తున్నానన్నారు. సామూహిక వివాహాలు ఒకే రోజులో సాధారణంగా కాకుండా పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల పెళ్లిళ్లు చేసినట్లుగా అంగరంగవైభవంగా నాలుగురోజుల పాటు పేదల వివాహాలు జరిపించడం గొప్ప విషయమన్నారు. బతుకునిచ్చిన సమాజానికి, పేదలకు ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో మర్రి జనార్దన్‌రెడ్డి సేవలు చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ఎంజేఆర్ ట్రస్ట్ ఛైర్మన్ మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాదవసేవ అనే కోణంలో పుట్టిందే ఎంజేఆర్ ట్రస్ట్ అని అన్నారు. పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 165 జంటలకు పెళ్లి రోజునే కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, గాయకుడు సాయిచంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి, డిజిటల్ వీడియోగ్రఫి, కోలాటం తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే నూతన వధూవరులకు కనీస అవసరాలైన వస్తు సామగ్రిని కూడా అందజేశారు. ఈ వివాహాలకు జిల్లా వ్యాప్తంగా 20వేల మందికిపైగా ప్రజలు తరలివచ్చారు. -
ఇస్తెమాకు పోటెత్తిన జనం!
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఏపీలోని కర్నూలు నగర శివారు నన్నూరు టోల్గేట్ వద్ద నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు శనివారం జనం పోటెత్తారు. దేశ విదేశాల నుంచి ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు హాజరవుతున్న వారికి సేవలందించేందుకు స్థానిక ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. శనివారం హజ్రత్‌జీతో పాటు మౌలానా జంషేద్, మౌలానా యూసుఫ్, ముఫ్తి షాజాద్, భాయ్ ఇక్బాల్ హఫీజ్, మౌలానా ముస్తఖీమ్, మౌలానా సయీద్, మౌలానా షౌకత్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇస్తెమా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీరోజు మగ్రిబ్ నమాజ్ తర్వాత హజ్రత్‌జీ బయాన్ ఉంటుందని తెలిపారు. నేడు సామూహిక వివాహాలు ఆదివారం సాయంత్రం అసర్ నమాజు తర్వాత ఇస్తెమాయీ షాదియాన్ (సామూహిక వివాహాలు) నిర్వహించనున్నట్లు ఇస్తెమా కమిటీ సభ్యులు తెలిపారు. హజ్రత్‌జీ సమక్షంలో రెండు వందలకు పైగానే నిఖాలు జరుగుతాయని తెలిపారు. -
పేద ముస్లింలకు ఉచిత వివాహాలు
కల్లూరు (రూరల్): పేద ముస్లిం యువతీ, యువకులకు సెప్టెంబర్ మొదటి వారంలో ఉచితంగా సామూహిక వివాహాలు చేయనున్నట్లు ఆవాజ్ కమిటీ నగర అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఇస్మాయిల్, పి.ఇక్బాల్ హుస్సేన్, షరీఫ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఆల్హజ్ ఖ్వాజా అబ్దుల్ గఫూర్సాహెబ్, ఖమృన్నీసాబేగంలు నిరుపేద బాలికల మ్యారేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివాహాలు జరపనున్నామన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకున్న ముస్లింలు ఆగస్టు 2,3వ తేదీలలోపు దరఖాస్తులతో పాటు వధూవరుల పాస్‌పోర్టు సైజు నాలుగు ఫొటోలు, రేషన్, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలను చిత్తారివీధిలోని ఆవాజ్ కమిటీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9948025509, 9000069147,9391610937,9440739794 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
ఊరంతా పందిరి
లోక కల్యాణం జంట ఒక్కటైతే... అది కళ్యాణం. అనేక జంటలు ఒక్కటైతే... అది లోకకళ్యాణం. ఒకరు తింటే... భోజనం. అనేక మంది తింటే... అది విందుభోజనం. విందులు మితిమీరితే... వృథా. వృథాలను అరికడితే... కనువిందు. అలాంటి కను‘విందు’లు కనిపించే కమనీయ కళ్యాణ దృశ్యాలను చూతము రారండి. పెళ్లి చేసినా.. ఇల్లు కట్టినా.. ఈ రోజుల్లో జీవితకాలపు ఆర్థిక భారం! కారణం.. ధరలు, ఆర్భాటాలు రెండూ ఆకాశాన్ని అంటడమే! వ్యవసాయం తప్ప వేరే ఉపాధి లేని ఊళ్లల్లో పెళ్లిళ్లు అంటే ఈసురోమనే స్థితే! దీన్ని అధిగమించడానికి ఓ ఉపాయం కనిపెట్టింది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం.. నర్సాపూర్. అదే సామూహిక వివాహాలు. నిన్న మొన్న కాదు.. 33 ఏళ్ల కిందటే! వివరాలు.. నర్సపూర్ ఓ మారుమూల పల్లెటూరు. ఊరంతటికీ వ్యవసాయమే ఆధారం. ముప్ఫైమూడు ఏళ్ల కిందట... వానల్లేక.. పంటలు పండక.. రైతులంతా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారు. కరువులో అధికమాసం లాగా.. పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లు! తిండికే లేదంటే పెళ్లేం చేస్తారు? ఈ సమస్యనెలాగైనా పరిష్కరించాలని ఊరిపెద్దలు రాంచందర్ తిడ్కె, శామ్‌రావు కెంద్రే, బాబూరావు ముండే, రామ్రావు ముస్లే, ద్రువ ముండే ఏకమయ్యారు. ఆలోచించి సామూహిక వివాహాలే ఏకైక మార్గమని తేల్చారు. 22 జంటలతో మొదలు... పెద్దల చూపిన మార్గం గ్రామస్తులందరికీ నచ్చింది. వివాహాల కోసం ఒక్కో జంటకు రెండువేల రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే కొందరు ఆ రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని స్థోమతలో ఉన్నారు. వాళ్ల నుంచి డబ్బు వసూలు చేయలేదు. అలా 1984, మేలో మొత్తం 22 జంటలకు వివాహాలు జరిపించారు. అప్పటినుంచి కాలం కలిసొచ్చి పంటలు మెండుగా పండినా.. కరువు వచ్చినా.. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా సామూహిక వివాహాలకు నర్సాపూర్ వేదిక అయింది. ఆనవాయితీగా మార్చింది. యేటా పదిహేను జంటలకు తగ్గకుండా పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఏప్రిల్, మేనెలల్లోనే ముహూర్తాలు పెట్టుకుంటారు. 1996లో 32 జంటలకు పెళ్లి జరిపించారు. ఈ ఏడాది 16 జంటలను ఒకింటి వారిని చేశారు. ఇప్పటి వరకు ఈ సామూహిక వివాహాల ద్వారా దాదాపు ఏడువందల జంటలు ఒక్కటయ్యాయి. ధనిక, పేద తేడాలేదు సామూహిక వివాహల్లో పేద, ధనిక అనే తేడా ఉండదు. పెళ్లికి పేదవారు తమకు తోచినంత ఇవ్వచ్చు. సామూహిక వివాహాల ముహూర్తపు తేదీని గ్రామపెద్దలు రెండు నెలల ముందే ప్రకటిస్తారు. ఆ తేదీకల్లా గ్రామస్తులు తమ కూతుళ్ల, కొడుకుల పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటారు. పెళ్లి కార్యక్రమాలు, భోజనాలు అన్నీ ఒకే వేదిక దగ్గర జరుగుతాయి. ఈ పెళ్లిళ్లకు బంధువులను గ్రామస్తులే ఆహ్వానిస్తారు. పెళ్లిపత్రికల మీద కూడా ఆహ్వానితులనే స్థానంలో గ్రామస్తులు అనే ఉంటుంది. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారి బస, భోజన ఏర్పాట్లన్నీ గ్రామస్తులే చూసుకుంటారు. పెళ్లిళ్లకు మూడు రోజుల ముందు నుంచే బంధువులతో ఊరు కళకళలాడుతుంటుంది. నేతల హల్చల్.. సామూహిక వివాహాలకు నేతల రాక 1984 నుంచీ ఉంది. మొదటిసారిగా అప్పటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డిని గ్రామస్తులు ఆహ్వానించారు. అప్పటినుంచి ప్రతి ఏటా జరిగే ఈ వివాహాలకు అధికార, ప్రతిపక్ష నాయకులు పోటీపడి మరీ ఈ పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. పోలీసులకూ స్ఫూర్తి.. నర్సపూర్‌లో జరుగుతున్న సాముహిక వివాçహాలను పోలీసులు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా 2002లో ఇచ్చోడ పోలీసులు గిరిజన సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి 106 గిరిజన జంటలకు వివాహం చేశారు. తాళిబొట్టు తో పాటు బట్టల జతలూ అందించారు. జిల్లాలోని చాలా చోట్ల... ఈ సంప్రదాయం ఒక్క నర్సాపూర్‌కే పరిమితవలేదు. జిల్లాలోని చాలాచోట్ల కొనసాగుతోంది. మరాఠీ సంప్రదాయ గ్రామాలైన నవేగావ్, దర్మంపూరితో పాటు ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, థాంసీ, భీమ్‌పూర్, పార్డీతోపాటు పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహిస్తాం ఆ రోజుల్లో వరస కరువును దృష్టిలో పెట్టుకొని పెండ్లి ఖర్చు తగ్గించడానికి సామూహిక వివాహాలను ఏర్పాటు చేశాం. ఈ జంటల్లో చాలా మంది మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. – రాంచంద్ర తిడ్కె, గ్రామ పెద్ద అదే సంప్రదాయమైంది.. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు సామూహిక వివాహాల్లో తమ పిల్లల పెండ్లి చేయడం అనవాయితీగా వస్తోంది. ఊరంతా కలిసి పెండ్లి పనులు చూస్తాం. మా స్ఫూర్తిని అనేక గ్రామాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – ద్రువ ముండే పాలుపంచుకుంటాం 1991లో నా పెళ్లి సామూహిక వివాహ మహోత్సవంలోనే జరిగింది. సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరం యేటా జరిగే ఈ పెళ్లిళ్లలో పాల్గొంటాం. పెళ్లి పనుల్లో పాలుపంచుకుంటాం. మా పెళ్లి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం. – విజయ్ ముస్లే (సాముహిక వివాహలో పెండ్లిచేసుకున్న వ్యక్తి ) -
అంబులెన్స్‌లో ప్రేమ వివాహం
బెంగళూరు(కర్ణాటక) : ప్రమాదాల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడే అంబులెన్స్ ఓ ప్రేమ వివాహానికి వేదికగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి. చిత్రదుర్గ జిల్లాకు చెందిన నేత్రావతి, గురుస్వామి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. జూన్ 5న చిత్రదుర్గ కోటలో జరిగిన సామూహిక వివాహాల్లో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లి.. కోటను సందర్శిస్తుండగా నేత్రావతిప్రమాదవశాత్తు జారి పడింది. వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఆమెను చికిత్స కోసం అంబులెన్స్‌లో చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ముందే అనుకున్న ముహూర్తానికే వివాహం చేసుకోవాలన్న ఆమె నిర్ణయానికి కట్టుబడి పెళ్లికుమారుడు గురుస్వామి అంబులెన్స్‌లోనే తాళి కట్టాడు. నేత్రావతి నిర్ణయానికి విలువనిచ్చిన గురుస్వామిని స్థానికులు అభినందించారు. -
అందరికీ ఆదర్శంగా నిలిచిన మంత్రి!
బెంగళూరు: ఉన్నవాళ్లూ లేనివాళ్లూ అందరూ ఖర్చుకు వెనకాడకుండా అతిగా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసే ఈ రోజులలో ఓ మంత్రి తన కుమార్తె వివాహాన్ని అతి నిరాడంబరంగా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా నిర్వహించారు. తన కుమార్తె కోసం దాచిన మొత్తంతో సామూహిక వివాహాలను నిర్వహించారు. అదే వేదికపై తన కుమార్తె వివాహాన్ని సైతం జరిపించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ కుమార్తెను కూడా అందరూ అభినందించారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు. చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం. -
ఆదర్శం
సామూహిక వివాహాల్లో మంత్రి ఆంజనేయ కుమార్తె పెళ్లి హాజరైన సీఎం, మంత్రులు, మఠాధీశులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు. చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం. -
వైభవంగా సాముహిక వివాహాలు
తానూరు, న్యూస్‌లైన్ : మండలంలోని ఝ రి(బి) గ్రామంలో ఉన్న మహదేవ్ ఆలయ ప్రాంగణంలో శనివారం సామూహిక వివాహా లు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన ఏడు జంటలకు ఒకే వేదికపై వివాహం జరిపించారు. సామూహిక వివాహాలతో ఖర్చు తగ్గుతుందని గ్రామస్తులు నిర్ణయిం చారు. మూడేళ్లుగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. వేడుకలకు బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపటేల్, మాజీ మండల అధ్యక్షుడు బాసెట్టి రాన్న, ముథోల్ ఎమ్మెల్యే సతీమణి రేవతి, నాయకులు చంద్రకాంత్యాదవ్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.