పేద ముస్లింలకు ఉచిత వివాహాలు
Published Tue, Jul 4 2017 12:27 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
కల్లూరు (రూరల్): పేద ముస్లిం యువతీ, యువకులకు సెప్టెంబర్ మొదటి వారంలో ఉచితంగా సామూహిక వివాహాలు చేయనున్నట్లు ఆవాజ్ కమిటీ నగర అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఇస్మాయిల్, పి.ఇక్బాల్ హుస్సేన్, షరీఫ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఆల్‌హజ్ ఖ్వాజా అబ్దుల్ గఫూర్‌సాహెబ్, ఖమృన్నీసాబేగంలు నిరుపేద బాలికల మ్యారేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివాహాలు జరపనున్నామన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకున్న ముస్లింలు ఆగస్టు 2,3వ తేదీలలోపు దరఖాస్తులతో పాటు వధూవరుల పాస్‌పోర్టు సైజు నాలుగు ఫొటోలు, రేషన్, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలను చిత్తారివీధిలోని ఆవాజ్ కమిటీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9948025509, 9000069147,9391610937,9440739794 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement