కోల్‌కత్తా: రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కళాకారులతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ నృత్యంలో మహిళలతో కలిసి పాదం కలిపారు. ఆమెనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాజకీయాలతో పాటు వ్యక్తిగత వ్యాపకాలుగా ఆమెకు పుస్తకాలు రాయడం.. పెయింటింగ్ వేయడం తదితర ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు సంప్రదాయ నృత్యం చేసి ప్రజలను అలరిస్తుంటారు. తాజాగా ఓ సామూహిక వివాహ వేడుకలో ఆమె కళాకారులతో కలిసి నృత్యం చేయడం ఆకట్టుకుంది.
అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ మంగళవారం సామూహిక వివాహాలు జరిపింది. ఈ వేడుకగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరై ఆ కొత్త జంటలను ఆశీర్వదించారు. అనంతరం అక్కడ గిరిజన యువతులు చేస్తున్న సంప్రదాయ నృత్యం చూసి అక్కడకు వెళ్లారు. దరువుగా అనుగుణంగా బెంగాల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఆ పక్కనే మరో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని సీఎం మమత కళాకారులతో కలిసిపోయారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా ఈలలు.. చప్పట్లతో మార్మోగించారు. మమతాబెనర్జీ ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో నృత్యం చేస్తూ ఆకట్టుకుంటారు.
బెంగాల్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. టీఎంసీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ విధంగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే మమతా బెనర్జీ రాజకీయ వ్యూహం సిద్ధం చేస్తున్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న మమత ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment