CM Mamata Banerjee
-
పెళ్లి వేడుకలో సీఎం స్టెప్పులు.. వైరల్
కోల్కత్తా: రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కళాకారులతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ నృత్యంలో మహిళలతో కలిసి పాదం కలిపారు. ఆమెనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాజకీయాలతో పాటు వ్యక్తిగత వ్యాపకాలుగా ఆమెకు పుస్తకాలు రాయడం.. పెయింటింగ్ వేయడం తదితర ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు సంప్రదాయ నృత్యం చేసి ప్రజలను అలరిస్తుంటారు. తాజాగా ఓ సామూహిక వివాహ వేడుకలో ఆమె కళాకారులతో కలిసి నృత్యం చేయడం ఆకట్టుకుంది. అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ మంగళవారం సామూహిక వివాహాలు జరిపింది. ఈ వేడుకగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరై ఆ కొత్త జంటలను ఆశీర్వదించారు. అనంతరం అక్కడ గిరిజన యువతులు చేస్తున్న సంప్రదాయ నృత్యం చూసి అక్కడకు వెళ్లారు. దరువుగా అనుగుణంగా బెంగాల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఆ పక్కనే మరో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని సీఎం మమత కళాకారులతో కలిసిపోయారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా ఈలలు.. చప్పట్లతో మార్మోగించారు. మమతాబెనర్జీ ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో నృత్యం చేస్తూ ఆకట్టుకుంటారు. బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. టీఎంసీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ విధంగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే మమతా బెనర్జీ రాజకీయ వ్యూహం సిద్ధం చేస్తున్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న మమత ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
మమత X గవర్నర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో గవర్నర్ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మమత మండిపడ్డారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అధికారిక ప్రకటనలను, లోగోలను వాడరాదని గవర్నర్‌ను కోరారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తూ గవర్నర్ ధన్కర్ గత వారం ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. వీటికి బదులిస్తూ సీఎం మమతా బెనర్జీ శనివారం గవర్నర్‌కు 14 పేజీల లేఖ రాశారు. ‘ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖ, అందులో వాడిన భాష, భావం, తీరు అనూహ్యం. నాపైన, మా మంత్రులు, అధికారులనుద్దేశించి మీరు వాడిన భాష ఏమాత్రం తగినది కాదు’అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ఆచరించకుండానే ఆయన రాజ్యాంగ విలువలను బోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు బలం ఉన్నంత వరకు ఇలాంటివి చేయడం మినహా గవర్నర్‌కు అధికారాలేవీ లేవన్నారు. సంక్షోభ సమయంలో అధికారం చెలాయించేందుకు ఆయన చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామన్నారు. -
వైద్యుల సమ్మె సమాప్తం
కోల్‌కతా: బెంగాల్లో గత ఏడు రోజులుగా వైద్యులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 31 మంది వైద్యుల బృందం మధ్య చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రుల్లో నోడల్ అధికారిని నియమించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా తామంతా విధుల్లో చేరుతామని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్యకళాశాలలో గత సోమవారం ఇద్దరు డాక్టర్లపై ఓ రోగి బంధువులు దాడిచేయడంతో బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగారు. సమావేశంపై ‘హైడ్రామా’.. సీఎం మమత, వైద్యుల మధ్య భేటీ విషయమై హైడ్రామా నడిచింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా లేకుండానే వైద్యులతో సమావేశం కావాలని మమత నిర్ణయించారు. అయితే ఇందుకు వైద్యులు, జూనియర్ డాక్టర్ల గవర్నింగ్ బాడీ నిరాకరించింది. మీడియా ఉంటే తప్ప చర్చలకు రాబోమని, ప్రభుత్వం చెబుతున్న వీడియో రికార్డింగ్ తమకు సమ్మతం కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ భేటీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ సర్కారు రెండు ప్రాంతీయ వార్తాచానళ్లను అనుమతించింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదున్నర గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో భద్రత, మౌలిక వసతులు సహా వైద్యులు లేవనెత్తిన అనేక సమస్యలను మమత సావధానంగా విన్నారు. ఆగిపోయిన వైద్య సేవలు బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో వైద్యులు నలుపురంగు బ్యాడ్జీలు ధరించి, మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలియజేశారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని 40,000 మందికిపైగా వైద్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గోవాలో డాక్టర్లు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడులో నల్లటి బ్యాడ్జీలు, హెల్మెట్లు ధరించిన వైద్యులు మానవహారాలుగా ఏర్పడి నిరసనను తెలియజేశారు. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో వైద్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ వైద్యుల సమ్మె గురించి తెలియని ప్రజలు ఆసుపత్రుల వద్ద తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రికో నోడల్ అధికారి ఈ సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత కోసం ఓ నోడల్ అధికారిని నియమించాలని సీఎం మమత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్లపై దాడులు జరిగితే సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పోలీస్ అధికారులపైనే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేసే నోడల్ అధికారులను ఎంపిక చేయాలన్నారు. వీరు స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళతారని మమత తెలిపారు. ఆసుపత్రిలో అందరికీ కనిపించేలా ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వైద్యులపై దాడి చేయకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడ్డారు. -
ఫ్రంట్ వెనుక ఏముంది?
త్రికాలమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తలపెట్టిన మూడవ (ఫెడరల్) ఫ్రంట్ నిర్మాణం సాధ్యమేనా? అటువంటి ఫ్రంట్ లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో మూడు రోజులు మకాం పెట్టి శరద్ పవార్ సహా ముఖ్యులైన ప్రతిపక్ష నాయకులందరితోనూ సమాలోచనలు జరిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. సోనియాతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, తరచూ మాట్లాడుకుంటూ ఉంటామనీ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉన్నదని అంటూనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో కాంగ్రెస్ కూడా ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబం ధం లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఆలోచనకు ఇది భిన్నమైనది. తన ప్రతిపాదనను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో కేసీఆర్ మొట్టమొదట సమాలోచన జరిపింది మమతా బెనర్జీతోనే. ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్ళి ఆమెతో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉండటం అనివార్యమని చెప్పడం కేసీఆర్ దౌత్యానికి ప్రతికూలం. అయినప్పటికీ కేసీఆర్ వచ్చే వారం ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. మమత వ్యూహం మమత చెప్పిన మతలబు ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీనే ప్రధానంగా పోటీలో ఉండాలి. ఇతర ప్రతిపక్షాలు సదరు ప్రధాన పార్టీకి సహకరించాలి. వివిధ రాష్ట్రాలలో పరిస్థితులను గమనించినట్లయితే ఈ వ్యవహారం మమతా బెనర్జీ ఊహిస్తున్నంత సరళమైనది కాదని అర్థం అవుతుంది. రెండు ప్రాంతీయ పార్టీలు సమ ఉజ్జీలుగా ఉన్న రాష్ట్రాలు–తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖాముఖీ తలపడే రాష్ట్రాలు–రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. బీజేపీతో ఒకటి లేదా రెండు ప్రాంతీయ పార్టీలు తలపడుతున్న రాష్ట్రాలు–ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఢిల్లీ. కాంగ్రెస్‌ని ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పరిగణిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, గోవా, అసోం, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్, పంజాబ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఒకటి లేదా రెండు ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల ప్రమేయం లేకుండా కేవలం మూడో ఫ్రంట్‌కు చెందిన పక్షాలు మాత్రమే మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేసి ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి సవ్యంగా బదిలీ అయితే ఉత్తరప్రదేశ్‌లో సగానికి పైగా లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటాయి. బిహార్‌లో బీజేపీ, జేడీ(యు) కలిసి పోటీ చేసినా ఆర్జేడీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అత్యధిక స్థానాలు డీఎంకేకి లభిస్తాయి. ఏఐడీఎంకే, కమల్ హాసన్ పెట్టిన కొత్త పార్టీ, రజనీకాంత్ పెడతారో లేదో తెలియని పార్టీ, ఇప్పటికే ఉన్న చిన్నాచితకా పార్టీలు డీఎంకే జైత్రయాత్రని నిలువరించలేవన్నది విశ్లేషకుల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌కి తిరుగులేదు, తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోకపోతే టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది. తెలంగాణలో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నడుమే. బీజేపీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు. ప్రొఫెసర్ కోదండరాం పార్టీ నెలకొల్పినా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చరు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీ టీడీపీ అని మమతా బెనర్జీ మాటల సందర్భంలో అన్నారు. ఆమెకు క్షేత్రవాస్తవికత తెలి యదు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఎక్కువ లోక్‌సభ స్థానాలు లభిస్తాయని టీడీపీ సమర్థకులు సైతం చెప్పలేరు. అక్కడ జాతీయ పార్టీలు రెండూ బలంగా లేవు. వైఎస్సార్సీపీ ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. అధికారంలో ఉన్న కారణంగా టీడీపీ పట్ల ప్రతికూలత ఉన్నది. జనసేన నిర్మాణ దశలోనే ఉంది. ఒడిశాలో బీజేపీ ఎంత ప్రయత్నించినా బిజూ జనతాదళ్పైన ఆధిక్యం సాధించలేకపోవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీలు అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉన్న ఈ రాష్ట్రాలలో–యూపీ (80), బిహార్ (40), తమిళనాడు (39), పశ్చిమబెంగాల్ (42), ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), ఒడిశా (21)– మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 264. ఈ స్థానాలలో సగానికి పైగా ప్రాంతీయ పార్టీలకు లభించినా కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇవి కాకుండా మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ, జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కర్ణాటకలో జేడీ(ఎస్), ఢిల్లీలో ఆప్, పంజాబ్‌లో అకాలీదళ్, ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని స్థానాలు ప్రాంతీయ పార్టీలకు రావచ్చు. అన్నీ కలిపితే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌కు 150 స్థానాలు లభించడం గగనం. బీజేపీ, కాంగ్రెస్ నేరుగా తలబడే రాష్ట్రాలలో–మధ్యప్రదేశ్ (28), ఛత్తీస్‌గఢ్ (11), రాజస్థాన్ (25), గుజరాత్ (26),ఉత్తరాఖండ్ (5), హిమాచల్ ప్రదేశ్ (4)అరుణాచల్‌ప్రదేశ్ (2)– 75 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోని ఈ రెండు ఫ్రంట్లలో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ప్రస్తుత కూటమి నుంచి బయటికి వచ్చి మూడో ఫ్రంట్‌లో చేరదు. కేరళలో ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకుంటున్న బీజేపీ ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఆశించడం దురాశ. ఇటువంటి పరిస్థితులలో బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాని పని. మూడో ఫ్రంట్ వృధాప్రయాసేనా? ఈ మాత్రం లెక్కలు కేసీఆర్‌కు తెలియవా? తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు కనుక బీజేపీని వ్యతిరేకించాలి. అసలు బీజేపీ అధినాయకత్వం పురమాయిస్తేనే కేసీఆర్ రంగంలోకి దిగారనీ, ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మూడో ఫ్రంట్ పనికి వస్తుందనీ రేవంత్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు చేసే ఆరోపణలకు ఆధారాలు లేవు. మరి మూడో ఫ్రంట్ ఆలోచన దేనికోసం? తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ని ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబెట్టడానికా? ఢిల్లీ దండయాత్రలో తనతోపాటు పలుకున్నవారిని కూడా తీసుకువెళ్తే కేటీఆర్‌కు అడ్డులేకుండా పోతుందనా? తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో పోరాడుతున్నాడంటే తెలంగాణ ప్రజల గుండెలు పొంగి టీఆర్ఎస్పై సమధికోత్సాహంతో ఓట్ల వాన కురిపిస్తారనే అంచనా ఫ్రంట్ ప్రతిపాదన వెనుక ఉన్నదా? పోటీతత్వం పోటెత్తినప్పుడు ఎత్తులూ, పైఎత్తులతో రాజకీయాలు రసకందాయంలో పడతాయి. ఒకే బడిలో చదివిన సహాధ్యాయులు ఇద్దరి మధ్య నువ్వా–నేనా అన్న ధోరణిలో స్పర్ధ చోటు చేసుకున్నప్పుడు రాజకీయ ఉష్ణోగ్రత పెరి గిపోతుంది. ఎవరు ఏ వ్యూహం రచించినా తమ ప్రయోజనాలే ప్రధానం. 1983–84 నుంచి 2001 వరకూ తెలుగుదేశం పార్టీలో సహచరులైన నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ సన్నిహితులు. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దింపిన నాటకీయ సన్నివేశంలో కేసీఆర్ చంద్రబాబు వెంటే ఉన్నారు. ఆనక మంత్రి పదవి కాదని, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవితో సర్దుకోవాలని చెప్పడంతో కేసీఆర్ తిరుగుబాటు చేయవలసి వచ్చింది. ప్రజల హృదయాలలో నిద్రాణంగా ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తట్టిలేపారు. తెగించి పార్టీ స్థాపించారు. అనంతరం జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన కారణంగా రాజదండం ధరించే అవకాశం చంద్రబాబుకు రెండు దశాబ్దాల కిందటే లభించింది. కేసీఆర్ పదమూడు సంవత్సరాలు మహోద్యమానికి సారధ్యం వహించి, తెలంగాణ రాష్ట్రం సాధించి, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతబట్టి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన విధానంలో హస్తిమశకాంతరం ఉంది. ఎన్‌టి రామారావు 1994 ఎన్నికలలో ఘనవిజయం సాధించి సంపాదించిన అధికారాన్ని అక్రమంగా హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడికీ, ఉద్యమ కెరటంపై ఉప్పెనలా వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్వపక్షం చేసి సాధికారికంగా ప్రభుత్వం నెలకొల్పిన కేసీఆర్‌కీ పోలిక లేదు. పదేళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తూ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకొని దర్జాగా వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఓటుకు నోటు కేసు అనే అస్త్రంలో విజయవాడకు పరుగులు తీయించడం ద్వారా పోటీ రాజకీయంలో చంద్రబాబుపైlకేసీఆర్ ఆధిక్యం చాటుకున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ నాలుగేళ్ళుగా తెలంగాణలో కేసీఆర్‌ను రాజకీయంగా సవాలు చేయగల పరిస్థితిలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేవు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో కాంగ్రెస్‌లో కాస్త చలనం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రికి గట్టి పోటీ ఇస్తున్నారు. పాదయాత్రలో రోజు విడిచి రోజు జరుగుతున్న బహిరంగసభలకు వేల సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా హాజరుకావడం చంద్రబాబుకు ఆందోళన కలి గిస్తున్నది. ఎన్డీఏ భాగస్వామ్యాన్ని వదులుకోలేకా, ప్రత్యేకహోదా ఉద్యమంతో జగన్మోహన్రెడ్డికి ప్రజామోదం పెరగడాన్ని చూస్తూ ఊరుకోలేక చంద్రబాబు సతమతం అవుతున్న దశలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనే నినాదంతో జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్ళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమాలోచనలు జరిపారు. అంతలోనే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేసిన జగన్మోహన్రెడ్డి కార్యాచరణ ప్రకటించడం ఆరంభించారు. మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించుకున్నప్పుడు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రిమండలిలోనే ఉన్నారు. కాళ్ళ కింద నేల కదిలిపోతోందని గ్రహించిన చంద్రబాబు ఇద్దరు మంత్రులనూ ఉపసహరించుకుంటూ ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించేందుకు చంద్రబాబు ఎందువల్లనో సంకోచిస్తున్నారనే అభిప్రాయం జనసామాన్యంలో బలపడుతున్న దశలో వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తానని అసెంబ్లీలో అన్నారు. తెల్లవారగానే ఆదరాబాదరాగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి తోట నరసింహం చేత అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. పోటీ రాజకీయం ఫలితం. లోగడ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పని చేసిన అనుభవం, ప్రతిపక్షాలతో సంబంధాలు ఉన్న కారణంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ కంటే ఎక్కువ ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశం చంద్రబాబుకి ఉంది. తెలంగాణ వాదానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన ధీరుడుగా కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. పాత పరిచయాలను పునరుద్ధరించి, ప్రతిపక్ష నేతలతో చర్చలు కొనసాగించాలని కేసీఆర్ ప్రయత్నం. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదనే స్పష్టత చంద్రబాబుకి ఉంది. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కువ హాని చేసిందనే మాట పదేపదే అంటున్నది అందుకే. బీజేపీని కాంగ్రెస్ కంటే పెద్ద విలన్‌గా చిత్రించడంలోని పరమార్థం అదే. బీజేపీతో రెండు విడతల పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో ఇంతకాలం రహస్యంగా సాగించిన సంబంధాలను బహిర్గతం చేసి పొత్తు కుదుర్చుకుంటే అవకాశవాద రాజకీయం పరాకాష్ఠకు చేరుతుంది. - కె. రామచంద్రమూర్తి -
గూర్ఖాల ఆగ్రహం
ఇది ఆధిపత్యాలను ప్రశ్నించే కాలం. అవతలివారి మనోభావాలతో, ఆకాంక్షలతో సంబంధం లేకుండా చిత్తానుసారం పెత్తనం చలాయిస్తామంటే జనం సహించే పరిస్థితి లేదు. సామాజిక మాధ్యమాల ప్రభావం విస్తరించడంవల్ల కావొచ్చు... రాజకీయ చైతన్యం పెరుగుతోంది. ప్రజలు దేన్నయినా నిలదీస్తున్నారు. తమ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ బాహాటంగా వ్యక్తంచేస్తున్నారు. ఈ సంగతి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియదనుకోలేం. అధికార భాషపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు నెలలక్రితం హిందీ అమలుకు సంబంధించి చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినప్పుడు తీవ్రంగా వ్యతి రేకించినవారిలో ఆమె కూడా ఉన్నారు. కానీ తమ రాష్ట్రం వరకూ వచ్చేసరికి అచ్చం ఆ మాదిరే వ్యవహరించి ప్రశాంతంగా ఉన్న బెంగాల్ ఉత్తరభాగంలోని డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో చిచ్చుపెట్టారు. డార్జిలింగ్తోసహా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పదో తరగతి వరకూ బెంగాలీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో ఉద్యమం రాజుకుంది. దాన్ని చల్లార్చే ఉద్దేశంతో మమత ఆ నగరంలో రాష్ట్ర కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తే వీధులన్నీ రణరంగాన్ని తలపించాయి. వేలాదిమంది ఉద్యమకారులు ఒక ప్రభుత్వ కార్యా లయానికి నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. వేలాదిమంది టూరిస్టులు ప్రాణాలు అరచేతబట్టుకుని అక్కడినుంచి రావాల్సివచ్చింది. చివరకు పారా మిలిటరీ దళాలు రంగప్రవేశం చేశాయి. సోమ వారం నుంచి నిరవధిక బంద్ మొదలైంది. దాదాపు 14 లక్షలమంది జనాభా గల డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో అత్యధికులు నేపాలీ భాష మాట్లాడతారు. భిన్న సంస్కృతి, భాష ఉన్న తమపై ‘బయటి వ్యక్తుల’ పెత్తనం సహించబోమని వందేళ్లక్రితమే అప్పటి బ్రిటిష్ పాలకులకు గూర్ఖాలు తేల్చిచెప్పారు. పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించడానికుద్దేశించిన మింటో–మార్లే కమిటీకి 1907లోనే కొండ ప్రాంతవాసుల పేరిట ఇందుకు సంబం ధించిన వినతిపత్రాన్నిచ్చారు. అనంతరకాలంలో సైతం ఆ డిమాండు వినిపిస్తూనే ఉంది. ఆ సమస్యపై రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం చర్చ జరిగింది. డార్జిలింగ్, సిక్కిం ప్రాంతాలతో ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1947లో ఆనాటి కమ్యూనిస్టు పార్టీ కోరింది. 80వ దశకం చివరిలో సుభాష్ ఘీషింగ్ ఆధ్వర్యాన గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(జీఎన్ఎల్ఎఫ్) ఏర్పడి ఉద్యమం ప్రారంభించింది. అది ఉధృతరూపం దాల్చి హింస చెలరేగాక డార్జిలింగ్ జిల్లా ప్రాంతానికి గూర్ఖా కొండప్రాంత మండలిని 1988లో ఏర్పాటుచేశారు. 2011లో జీజేఎం చేసిన పోరాట ఫలితంగా అది గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనాసంస్థ(జీటీఏ)గా మారింది. డార్జిలింగ్ ప్రాంతానికి సంబంధించిన ఏ అంశంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం జీటీఏను సంప్ర దించాల్సి ఉంటుంది. బెంగాలీ భాషను తప్పనిసరి చేసే అంశంలో మమత ఆ పని చేయలేదు. డార్జిలింగ్ ప్రాంతంలో బెంగాలీని రుద్దే ఉద్దేశం లేదని, అక్కడ యధా విధిగా నేపాలీ భాషే కొనసాగుతుందని మమత వివరణ ఇవ్వకపోలేదు. కానీ అప్ప టికే ఆలస్యమైంది. నిజానికి భాషా సమస్య తక్షణ ఆగ్రహావేశాలకు కారణం కావొచ్చుగానీ అదే మూల కారణం కాదు. డార్జిలింగ్ కొండ ప్రాంతాలను గత కొన్నేళ్లుగా వేధిస్తున్న అనేకానేక సమస్యలపై జనంలో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఆ రూపంలో పెల్లుబికింది. వీటికితోడు జీజేఎంకూ, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య దూరం పెరగడం, చివరికి అవి శత్రుపక్షాలుగా మారడం వల్ల కూడా ఆ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. తమను దెబ్బతీసే ఉద్దేశంతో గూర్ఖాలాండ్ అభి వృద్ధిని అడ్డుకుంటున్నారని జీజేఎం ఆరోపిస్తుంటే... సమృద్ధిగా నిధులిచ్చింది తానే నని మమత చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్–జీజేఎంల మధ్య ఆరేళ్లక్రితం చెలిమి ఏర్పడినప్పుడు ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు తాను అనుకూలమని మమత ప్రకటించారు. కానీ అధికారంలోకొచ్చాక దాని సంగతి ఎత్తడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ఎస్ఎస్ అహ్లూ వాలియాకు జీజేఎం మద్దతిచ్చి ఆయనను గెలిపించింది. అప్పటినుంచీ తృణ మూల్–జీజేఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. జీజేఎంను బలహీ నపర్చడం కోసం డార్జిలింగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడగొట్టి మమత ప్రభుత్వం కలింపాంగ్ జిల్లానూ, కలింపాంగ్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జీజేఎం బెంగాలీ భాషపై తీసుకున్న నిర్ణయాన్ని ఆసరా చేసుకుని ఉద్యమం లేవనెత్తింది. డార్జిలింగ్ కొండ ప్రాంతాలు నిజంగా అభివృద్ధి చెంది ఉంటే, అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించి ఉంటే ఇదంతా టీఎంసీ–జీజేఎం తగువుగా మిగి లిపోయేది. కానీ ఉత్తరప్రాంత బెంగాల్ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యం. ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆ ప్రాంతంలో టీ ఎస్టేట్లు అధికం. అవి సక్రమంగా పనిచేస్తే ఉపాధికి లోటుండదు. కానీ ఆ టీ ఎస్టేట్లు నానాటికీ కుంచించుకుపోతున్నాయి. కొన్ని మూతబడుతున్నాయి. చేతినిండా పని ఉన్నచోట కూడా వేతనాలు అంతంతమాత్రం. పర్యవసానంగా వేలాది కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. వీటన్నిటినీ పట్టించుకోవడానికి బదులు జీజేఎంను ఎలా బలహీనపర్చాలా అన్న అంశంపైనే మమత దృష్టి కేంద్రీకరించారు. డార్జిలింగ్ కొండ ప్రాంత సమస్యలపై నిజంగా అవగాహన ఉండి ఉంటే ఆమె బెంగాలీ భాషను రుద్దడం మాట అటుంచి కొత్త జిల్లా ఏర్పాటు యోచనే చేసి ఉండేవారు కాదు. ఇప్పుడు ఆ ప్రాంతమంటే తనకు ప్రత్యేకాభిమానమని చాటుకోవడం కోసం డార్జి లింగ్లో కేబినెట్ సమావేశాన్ని జరిపారు. మౌలిక సమస్యల పరిష్కారానికి కనీస ప్రయత్నం చేయనప్పుడు ఇలాంటివి పెద్దగా అక్కరకు రావు. ఇప్పటికైనా రాజకీయా లకు అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధికి మమత ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. దానికి మించి ప్రత్యేక గూర్ఖాలాండ్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. -
మా రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ: బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలింభిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల కింద తమ రాష్ట్రానికి 10 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 10,459 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదల చేయాల్సిందిగా మోదీని కోరానని సమావేశానంతరం మమత చెప్పారు. నిధులను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. పశ్చిమబెంగాల్ సమస్యల గురించి ప్రధానితో మమత చర్చించారు. బంగ్లాదేశ్‌తో తీస్తా నీటి పంపిణీకి సంబంధించి సత్వర పరిష్కారం కనుగొంటామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. -
'దాడులొద్దు.. నన్ను అరెస్టు చేసి కక్ష తీర్చుకోండి'
కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం కాదని, అలా చేయొద్దని ఒకేసారి తనను అరెస్టు చేసి వారికున్న రాజకీయ కక్ష మొత్తం తీర్చుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే దేవుళ్లు అని, వారు ఉన్నారు కాబట్టే నేడు ప్రధాని నరేంద్రమోదీ అయినా, దేశమైనా ఉందని సవాల్ చేసి చెబుతున్నానన్నారు. అలాగే, తమిళనాడు సీఎస్ రామమోహన రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన తీరును ఆమె తప్పుబట్టారు. ఒక రాష్ట్రంలోని అధికారి అవినీతికి పాల్పడితే కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలని చెప్పారు. కానీ, వాళ్లు అలా చేయలేదని, తమిళనాడు సీఎస్ ఇంటిపై దాడులు జరిగిన తీరు రాజ్యాంగ విరుద్ధం అని ఆమె అన్నారు. ఇలాంటి కేంద్రం చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 'గతంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ సెక్రటరీపై కూడా ఇలాగే దాడులు చేసి వేధించారు. ఎందుకు నైతిక విలువలు పక్కకు పెట్టి ప్రవర్తిస్తున్నారు? సాంకేతికంగా ఎందుకు వెళ్లడం లేదు. ఇదంతా సమాఖ్య విధానానికి భంగం కలిగించడమే. ఎందుకు వారంతా అమిత్ షా లాంటివారి ఇళ్లపై దాడులు చేయడం లేదు. అవినీతి ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. అయితే, కేంద్ర సంస్థలు మాత్రం విలువలు పాటించి సివిల్ సర్వీసెస్ ను కూడా అవమానిస్తున్నాయి. తగిన కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వాన్ని తప్పకుండా విశ్వాసంలోకి తీసుకొని, అతడిని పదవిలో నుంచి తొలగించి లభించిన సమాచారం ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేగానీ ఇలా చేయకూడదు' అంటూ మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘నా పని నేను చేస్తా.. వాళ్లేమన్నా అనుకోని’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతునే ఉంది. ముఖ్యమంత్రి మమత విషయంలో తాను అన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని గవర్నర్ త్రిపాఠి అన్నారు. ’నేనేం చెప్పానో ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. వాళ్లకిష్టమొచ్చింది(మమతా బెనర్జీ తదితరులు) మాట్లాడుకోని. నేను నా విధులు నిర్వర్తిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆర్మీని రాజకీయం చేయొద్దు.. విమర్శలు చేయకూడదు’ అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో శనివారం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బెంగాల్లో టోల్ గేట్ల వద్ద ఆర్మీని మోహరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి స్పందిస్తూ ‘ఆర్మీ లాంటి బాధ్యతాయుతమైన వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు’ అని అన్నారు. అనంతరం మమత స్పందిస్తూ ‘గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన ఎనిమిది రోజులుగా నగరంలో లేరు. ఏదైనా మాట్లాడేముందు అన్ని వివరాలను సరిచూసుకోవాల్సింది. ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరం’ అన్నారు. దీనికి ప్రతిగా తన మాటలకు కట్టుబడి ఉంటానని గవర్నర్ అన్నారు. -
‘నేను నేలపై నిద్రిస్తా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు’
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి ఆమె మనసులో కేంద్రం తీసుకున్నది మంచినిర్ణయమే అని ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమె అంగీకరించారని, కానీ, దాని అమలు విధానాన్ని మాత్రమే ఆమె వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. నల్లధనం దేశంపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మమత కూడా అంగీకరించిందని అన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు చేస్తున్న తీరునే ఆమె వ్యతిరేకిస్తున్నారని నాకనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. విమర్శించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది’ అని రాందేవ్ అన్నారు. మమతా చాలా సాధరణమైన జీవితం గడుపుతారని ప్రశంసించారు. ‘నేను నేలపై పడుకుంటాను. ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారు. హవాయ్ చెప్పులు వేసుకుంటారు. ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ అనుమానించాల్సిన పనిలేదు. మావోయిస్టులకు, ఉగ్రవాదులకు నల్లడబ్బు ద్వారానే నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఆమె కూడా అంగీకరించారు’ అని మమత అన్నారు. మరోపక్క, 2012లోనే నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అంగీకరించారని చెప్పారు. -
మోదీపై మరోసారి మమత నిప్పులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిది మన్ కీ బాత్ కాదని, అది మోదీకి బాత్ అని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆదివారం నాటి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు కష్టాలు 50 రోజులు ఉంటాయని తాను ముందే చెప్పానని, దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని మరోసారి అన్నారు. నల్ల డబ్బున్న వారే తన నిర్ణయంతో కంగారు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మమత ట్విట్టర్ లో స్పందించారు. ముందు నుంచే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె మోదీపై నిప్పులు చెరిగారు. ’ఉపశమన చర్యలు చేపట్టాల్సిందిపోయి కక్ష పూరిత చర్యలకు ప్రచారానికి, వ్యాపారానికి అనుకూలంగా మీరు చేస్తున్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధిని నిర్మూలించారు. మాకు అభివృద్ధి కావాలి.. సాంకేతిక పరిజ్ఞానం కావాలి. కానీ, అది ఒక్క వర్గానికి మాత్రమే దక్కేలా కాదు. మిమ్మల్ని, మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మేం నమ్మం.. అవి ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే పనికొస్తాయి. ఈ దేశంలోని మహిళలంతా మీకు తగిన బదులు ఇచ్చి తీరుతారు. వీళ్లంతా భరతమాత ముద్దు బిడ్డలు’ అంటూ ఆమె ట్వీట్ల వర్షం కురిపించారు. -
సింగూరు భూములు వాపస్
పట్టాలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం మమత సింగూరు: పశ్చిమబెంగాల్లోని సింగూరులో టాటా నానో కారు ప్లాంటు కోసం పదేళ్ల కిందట సేకరించిన భూమిని సీఎం మమతాబెనర్జీ బుధవారంఆయా భూముల రైతులకు తిరిగి అప్పగించారు. పట్టాలు, పరిహారానికి సంబంధించిన చెక్కలను బుధవారమిక్కడ పంపిణీ చేశారు. అదే సమయంలో.. రాష్ట్రంలో ఆటోమొబైల్ ప్లాంటు స్థాపించాలనుకున్న ఏ సంస్థనైనా ఆహ్వానిస్తామంటూ పరోక్షంగా టాటా పరిశ్రమకు సందేశమిచ్చారు. 2006లో టాటా నానో ప్రాజెక్టు కోసం అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం జరిపిన భూసేకరణపై రైతుల ఆందోళనకు మమత సారథ్యం వహించడం తెలిసిందే. ఆ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందని, అది ప్రజోపయోగం కోసం జరిపిన భూసేకరణ కాదని, యజమానులకు 12 వారాల్లోగా తిరిగి అప్పగించాలని సుప్రీంకోర్టు గత ఆగస్టులో తీర్పివ్వడం విదితమే. మమత.. 9,117 మంది రైతులకు పట్టాలు, 806 మందికి పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. భూమిని తిరిగి ఇస్తానన్న తన హామీని అమలు చేయటం పట్ల సంతోషంగా ఉందన్నారు. అలాగే.. ఇప్పటివరకూ నిరుపయోగంగా ఉన్న భూమిని తిరిగి సాగులోకి తెచ్చుకోవటం కోసం రైతులకు రూ. 10,000 చొప్పున నగదూ ఇస్తామన్నారు. అదే సమయంలో.. ‘మాకు పరిశ్రమలు కావాలి. కానీ బలవంతపు భూసేకరణ ద్వారా కాదు’ అని పేర్కొన్నారు. ‘మీరు ఆలోచించండి. గోల్తోర్(మిడ్నాపూర్ జిల్లాలో) 1,000 ఎకరాలు ఇస్తాం. టాటాలు లేదా బీఎండబ్ల్యూ ఎవరైనా ఆటో పరిశ్రమ స్థాపించాలనుకుంటే.. స్వాగతం’ అని అన్నారు. భూమి మళ్లీ తమకు సొంతం కావడంతో సింగూరు రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం నుంచి పట్టాలు అందుకున్న రైతులు నృత్యం చేశారు. -
మమతకు ఈసీ షోకాజ్ నోటీసులు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిబంధనలు ఉల్లంఘించారం టూ ఈసీ గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కోల్‌కతాలో మాట్లాడుతూ... అసన్సోల్ పేరి ట కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటూ మమత వాగ్దానంపై షోకాజ్ పంపామన్నారు. దీనిపై మమత స్పందిస్తూ.. ‘నాకేది ఇష్టమో అదే చెప్పా.. మళ్లీ అదే చెప్తా.. నాకు వ్యతిరేకంగా మీరెం చెయగలరో చేయండి’ అని అన్నారు. -
45 సీట్లు ప్లీజ్.. 30 కంటే సీన్లేదు!
డీఎంకే- కాంగ్రెస్‌ల మధ్య పీటముడి చెన్నై: తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. కనీసం తమకు 45 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టబడుతుండగా, అన్ని ఇవ్వలేమనిడీఎంకే తేల్చిచెప్పింది. 63 సీట్లు ఇవ్వాలంటూ శుక్రవారం డీఎంకే అధినేత కరుణానిధితో భేటీలో ఆజాద్, వాస్నిక్‌లు డిమాండ్ చేశారు. 30 కి అటూ ఇటుగా ఇస్తామని చర్చల అనంతరం కాంగ్రెస్‌కు డీఎంకే తెలిపింది. ఈ బేరంపై చెన్నైలో సీనియర్ నేతలతో ఆజాద్, వాస్నిక్‌లు చర్చించారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం 45 సీట్లకు తగ్గకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మూడు నాలుగు సీట్లు తగ్గినా అంగీకరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. కాగా 54 మందితో బీజేపీ తమిళనాడులో తొలి జాబితా విడుదల చేసింది.