45 సీట్లు ప్లీజ్.. 30 కంటే సీన్‌లేదు!
డీఎంకే- కాంగ్రెస్‌ల మధ్య పీటముడి
చెన్నై: తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. కనీసం తమకు 45 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టబడుతుండగా, అన్ని ఇవ్వలేమనిడీఎంకే తేల్చిచెప్పింది. 63 సీట్లు ఇవ్వాలంటూ శుక్రవారం డీఎంకే అధినేత కరుణానిధితో భేటీలో ఆజాద్, వాస్నిక్‌లు డిమాండ్ చేశారు. 30 కి అటూ ఇటుగా ఇస్తామని చర్చల అనంతరం కాంగ్రెస్‌కు డీఎంకే తెలిపింది.
ఈ బేరంపై చెన్నైలో సీనియర్ నేతలతో ఆజాద్, వాస్నిక్‌లు చర్చించారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం 45 సీట్లకు తగ్గకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మూడు నాలుగు సీట్లు తగ్గినా అంగీకరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. కాగా 54 మందితో బీజేపీ తమిళనాడులో తొలి జాబితా విడుదల చేసింది.