‘నేను నేలపై నిద్రిస్తా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు’ | Mamata Banerjee Only Opposing Procedure: Ramdev | Sakshi
Sakshi News home page

‘నేను నేలపై నిద్రిస్తా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు’

Published Sun, Dec 4 2016 9:02 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

Mamata Banerjee Only Opposing Procedure: Ramdev

కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి ఆమె మనసులో కేంద్రం తీసుకున్నది మంచినిర్ణయమే అని ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమె అం‍గీకరించారని, కానీ, దాని అమలు విధానాన్ని మాత్రమే ఆమె వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. నల్లధనం దేశంపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మమత కూడా అంగీకరించిందని అన్నారు.

‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు చేస్తున్న తీరునే ఆమె వ్యతిరేకిస్తున్నారని నాకనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. విమర్శించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది’ అని రాందేవ్‌ అన్నారు. మమతా చాలా సాధరణమైన జీవితం గడుపుతారని ప్రశంసించారు. ‘నేను నేలపై పడుకుంటాను. ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారు. హవాయ్‌ చెప్పులు వేసుకుంటారు. ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ అనుమానించాల్సిన పనిలేదు. మావోయిస్టులకు, ఉగ్రవాదులకు నల్లడబ్బు ద్వారానే నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఆమె కూడా అంగీకరించారు’ అని మమత అన్నారు. మరోపక్క, 2012లోనే నేటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అంగీకరించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement