ఆర్థిక వ్యవస్థ మందగించొచ్చు: రాష్ట్రపతి
ఆర్థిక వ్యవస్థ మందగించొచ్చు: రాష్ట్రపతి
Published Thu, Jan 5 2017 5:55 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. నల్లధనాన్ని అరికట్టి, అవినీతిపై పోరాటం కోసం ఉద్దేశించిన పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ఆయన చెప్పారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అయితే.. ఈ నిర్ణయం వల్ల పేదలు ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకు మనమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు. దీర్ఘకాలంలో అంచనావేస్తున్న ఫలితాలు రావాలంటే తాత్కాలికంగా ఈ ఇబ్బందులు తప్పవని కూడా ఆయన తెలిపారు.
Advertisement
Advertisement