ramdev baba
-
నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
యోగాగురు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో పతంజలి ఆహార ఉత్పత్తి నాణ్యతా పరీక్షలో విఫలమవడంతో పితోర్‌ఘర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్ ప్రధాన మార్కెట్లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఎలైచి సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన తర్వాత, సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసు పంపింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు. -
సుప్రీం ఆగ్రహం.. మరోసారి యాడ్‌తో క్షమాపణలు చెప్పిన పతంజలి
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘షరతులు లేని బహిరంగ క్షమాపణ’ పేరుతో యాడ్ ఇచ్చారు. ఈ కేసులో పతంజలి పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. ముందుగా సోమవారం కూడా క్షమాపణలు కోరుతూ యాడ్స్ఇచ్చారు.కాగా కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన ప్రకటనల వివాదంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు పలుమార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. మంగళవారం విచారణ సందర్భంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు చెప్పినా.. ‘ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. కోర్టుకు చెప్పినట్లే నేడు పెద్ద సైజులో యాడ్ ఇచ్చారు.సంబంధిత వార్త: నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా? -
నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా?
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ‘‘ ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా?. అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘ మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారు’ అని రోహత్గీ చెప్పారు. ‘ ఖర్చు ఎంతయింది అనేది మాకు అనవసరం’ అని జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. దీంతో సోమవారం నాటి ప్రకటనల వివరాలను రెండ్రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్ల ధర్మాసనం ఆదేశించింది. ఇలాగే తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సంబంధింత మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ‘‘ ఈ కంపెనీల తప్పుడు ప్రకటనలు వల్లే ఆయా సంస్థల ఉత్పత్తులను చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు, వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. -
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
కోర్టు ధిక్కారం.. బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు తమ ఎదుట స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు విధించింది. పతంజలి ఆయుర్వేదం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు(యాడ్స్)జారీ చేసిన క్రమంలో కోర్టు ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమైనట్లు కోర్టు తెలిపింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రసారం చేస్తుందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు హిమా కోహ్లీ, అమానుల్లాతో కూడిన ద్విసభ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రామ్‌దేవ్‌పై సుప్రీం తీవ్ర స్థాయిలో మండిపడింది. గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ కేసులో స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడమే కాకుండా.. కోర్టు ధిక్కారానికి సంబంధించి ఆయనపై ఎందుకు చర్చలు చేపట్టకూడదో వివరించాలని కోరింది. విచారణ సందర్భంగా బాబా రామ్‌దేవ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని కోర్టు ధిక్కార నోటీసుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. తమ క్లయింట్ అయిన రామ్‌దేవ్ బాబాను కోర్టుకు హాజరు కావాలని కోరింది. రామ్‌దేవ్‌తోపాటు పతాంజలి ఆయుర్వేదిక్ ఎండీ ఆచార్య బాలకృష్ణను కూడా కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో బాబా రామ్‌దేవ్‌ను పార్టీగా చేర్చవద్దని రోహత్గీ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరినీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేయబోమని కూడా తెలిపింది. కాగా ఫిబ్రవరి 27న రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులకు సంబంధించి పతంజలి ఆయుర్వేదం అందించే మందులపై ప్రకటనలను ప్రచురించకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. ఈ మేరకు పతంజలి ఆయుర్వేద్ ఎంపీ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు ధిక్కార నోటీసు జారీ చేసింది. అయినా పతంజలి కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీం సీరియస్‌గా వ్యవహరించింది. -
Patanjali: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్‌దేవ్
ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోపతి ముందులను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత బాబా రామ్‌దేవ్ అల్లోపతి ‘డాక్టర్ల ముఠా’ తన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాబా రామ్‌దేవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, సనాతన విలువలకు వ్యతిరేకంగా కొందరి వైద్యుల బృందం ప్రచారం చేస్తోంది. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, కీళ్లనొప్పులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల సమస్యలు వంటివాటికి పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పతంజలి మందుల ద్వారా వ్యాధులు నయం అయ్యాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం ద్వారా మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి ఎన్నో వ్యాధులను నయం చేస్తున్నాం. సుప్రీంకోర్టు, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మేము నిజంగానే తప్పుగా ప్రచారం చేస్తే జరిమానా విధించండి. వైద్యుల బృందం అన్నట్లుగా మేము నిరాధార ఆరోపణలు చేసినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. శతాబ్దాలుగా ఉన్న యోగా, నేచురోపతి, ఆయుర్వేద వైద్యాలపై గత ఐదేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలు, ప్రీ, పోస్ట్ క్లినికల్ ట్రయల్స్, ప్రోటోకాల్‌లను కలుపుకొని పతంజలి 500 అధ్యయనాలు నిర్వహించింది’ అని రామ్‌దేవ్ అన్నారు. ఇదీ చదవండి: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు అల్లోపతి ఔషధాలకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు పతంజలిని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు తీవ్రంగా పరిగణించనున్న కోర్టు ప్రతి తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ.1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. -
యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Ramdev Land Rover Defender 130: యోగా గురువు ,పతంజలి ఆయుర్వేదానికి చెందిన రామ్‌దేవ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారా? దాదాపు 1.5 కోట్ల విలువైన కారును డ్రైవ్ చేస్తున్నవీడియో ఒకటి ప్రస్తుం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు నడుపుతూ రామ్‌దేవ్ దర్జా ఒలకబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన ఇతర లగ్జరీకార్ల కలెక్షన్స్, పతంజలి సంపద హాట్‌టాపిక్‌గా నిలిచింది. లగ్జరీ కార్ల కలెక్షన్ యోగా గురు రామ్‌దేవ్ కార్ల కలెక్షన్ కూడా ఆసక్తికరం. మహీంద్రా XUV700, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ ఎవోక్ , జాగ్వార్ XJLలాంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. మహీంద్రా నుంచి ల్యాండ్ రోవర్ కి ప్రమోట్ అయ్యారంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు బాబా రామ్‌దేవ్ ఎప్పుడూ భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.రామ్‌దేవ్‌బాబా నేతృత్వంలోని పతంజలి మార్కెట్ క్యాప్ రూ. 46,000కోట్లు. (చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!) వీడియోలో కనిపిస్తున్న ఎస్యూవీ సెడోనా రెడ్ కారును రాందేవ్ కొన్నారా అనేది స్పష్టత లేదు. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్130 రేంజ్-టాపర్ అండ్ బిగ్గెస్ట్ కారు. కాగా సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ డిఫెండర్ 130 2023 ఎడిషన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయింది. డెలివరీలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వెర్షన్‌గా కొనసాగింపుగా తీసుకొచ్చిన డిఫెండర్ 130 అదే వీల్‌బేస్‌ను కలిగి ఉంది, అయితే కంపెనీ వెబ్సైట్ ప్రకారం, బాడీ 340 మిమీ పొడవు ఉంటుంది. మూడు వరుస సీట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్,మెమరీ ఫంక్షన్లతో కూడిన 14-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా లాంటి ఇతర ఫీచర్లున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్) View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) -
దూసుకుపోతున్న పతంజలి గ్రూప్ ఏకంగా లక్ష కోట్లు టార్గెట్
-
రాందేవ్ బాబా సేవలు ప్రశంసనీయం: అమిత్ షా
హరిద్వార్: భారతీయ వేద విద్య, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించేందుకు రాందేవ్ బాబా చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. హరిద్వార్‌లోని యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ సన్యాస్ దీక్షా మహోత్సవం సందర్భంగా ఆయన పతంజలి యూనివర్సిటీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ‘‘గడిచిన పాతికేళ్లలో యోగ, ఆయుర్వేద, స్వదేశీ పరిశ్రమకు రాందేవ్ బాబా గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు అదే స్పూర్తితో విద్యా రంగంపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో పతంజలి గ్రూప్ దేశాభివృద్ధికి ఎంతోగానూ తోడ్పడుతుంది’’ అని అన్నారు. పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డు ద్వారా ప్రాచీన విద్యను నేటి తరానికి అందించి ఉత్తమ సమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని రాందేవ్ బాబా తెలిపారు. -
అదానీ, అంబానీలపై రామ్‌దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా తాజాగా కార్పొరేట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే కేటాయిస్తున్నారని, కానీ తమ లాంటి వారు అందరికీ మేలు చేసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, తన సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు గోవాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ బాబా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను హరిద్వార్ నుంచి వచ్చి మూడు రోజులుగా ఇక్కడ ఉంటున్నాను. నా సమయం విలువ అదానీ, అంబానీ, టాటా, బిర్లాల కంటే ఎక్కువ. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తారు. కానీ మా లాంటివారు అలా కాదు’ అని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది. ఆచార్య బాలకృష్ణ తన నైపుణ్యంతో పతంజలి సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించారని అభినందించారు. పతంజలి వంటి సంస్థలతో భారత్ పరమ వైభవశాలిగా మారుతుందన్నారు. -
మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు.. రామ్‌దేవ్ బాబా క్షమాపణలు
మహిళలు దుస్తులు ధరించకపోయినా అందంగా ఉంటారని యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా పంపింది. దీంతో రామ్‌దేవ్ బాబా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో మాట్లాడుతూ నోరు జారారు రామ్‌దేవ్ బాబా. మహిళలు చీరకట్టులోనైనా, సల్వార్ సూట్లోనైనా అందంగా కన్పిస్తారని, తన దృష్టిలో వాళ్లు దుస్తులు లేకపోయినా బాగుంటారని అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. దీనిపై మహిళా నేతలు సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. వివాదం మరింత ముదురుతుందని భావించి రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. రామ్‌దేవ్ బాబా మహిళల దుస్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన పక్కనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత, సీఎం ఎక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగానూ వివాదాస్పదమైంది. రామ్‌దేవ్ అసలు మనస్తత్వం ఏంటో భయటపడిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ మండిపడింది. దుస్తుల ప్రస్తావన ఎందుకు? యోగా క్యాంప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు సల్వార్ సూట్లు ధరించారు. యోగా అనంతరం వెంటనే సమావేశం నిర్వహించడంతో వారు చీర కట్టుకునేందుకు సమయం కూడా లేకపోయింది. దీంతో వారంతా సల్వార్ సూట్‌లోనే మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై మాట్లాడుతూ రామ్‌దేవ్ నోరుజారారు. "Women look good even without clothes."#Ramdev's sexist comment sitting besides #AmruthaFadanavis. pic.twitter.com/FwPMH8yY1w — Sanghamitra Bandyopadhyay (@AITCSanghamitra) November 26, 2022 చదవండి: భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి.. -
మహిళలకు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహిళలందరికీ రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సునీతారావు డిమాండ్ చేశారు. రాందేవ్‌బాబా వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం గాంధీభవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో మహిళానేతలు రాందేవ్‌బాబా దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం రాందేవ్‌బాబాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
మహిళలపై రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై: యోగా గురు రామ్‌దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం జరిగిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'మహిళలు చీరకట్టులో అందంగా కన్పిస్తారు. సల్వార్ సూట్స్‌లోనూ బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా దష్టిలో వాళ్లు అసలు దుస్తులు ధరించకపోయినా అందంగానే ఉంటారు.' అని రాందేవ్ బాబా నోరుపారేసుకున్నారు. రామ్‌దేవ్ బాబా పాల్గొన్న ఈ కర్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా హాజరయ్యారు. వాళ్ల సమక్షంలో రామ్‌దేవ్ బాబా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇది రాజకీయంగానూ దుమారం రెపే సూచనలు కన్పిస్తున్నాయి. రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ తీవ్రంగా ఖండించారు. రామ్‌దేవ్ బాబా అసలు మనస్తత్వం ఏంటో బయటపడిందని విమర్శలు గుప్పించారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తోందన్నారు. చదవండి: కొలీజియం పరాయి వ్యవస్థ -
రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
-
ఐదు పతంజలి ఔషధాలపై నిషేధం ఎత్తివేత
డెహ్రాడూన్: పతంజలి ఔషధాలు ఐదింటిపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆయుర్వేద, యునాని సర్వీసెస్ లైసెన్సింగ్ అధికారి పతంజలి ఔషధ ఉత్పత్తి సంస్థ దివ్య ఫార్మసీకి ఒక లేఖ రాస్తూ, ‘పొరపాటున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని వివరించారు. గత వారం లైసెన్సింగ్ అథారిటీ ‘తప్పుదోవ పట్టించే ప్రకటనలు’ కారణంగా చూపుతూ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీని ఆదేశించింది. బీపీగ్రిట్, మధుగ్రిట్, థైరోగ్రిట్, లిపిడొమో, ఐగ్రిట్ గోల్డ్ ట్యాబ్లెట్లు ఇందులో ఉన్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’.. బాబా రామ్‌దేవ్‌కు హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కోవిడ్‌పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా రామ్‌దేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అని పేర్కొన్నారు జస్టిస్ అనుప్ జైరాం భంభాని. మరోవైపు.. పతాంజలి కరోనిల్‌ను సవాల్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్. ఎలాంటి ట్రయల్స్, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్‌దేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్‌పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఇదీ చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
రుచీ సోయా ఎఫ్‌పీవో ఓకే, కేటుగాళ్లకు చెక్‌పెట్టిన సెబీ!
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ ఎఫ్‌పీవో పూర్తయ్యింది. ఇష్యూకి రూ. 650 ధరను ఖరారు చేసింది. అయితే 97 లక్షల బిడ్స్ ఉపసంహరణకు లోనయ్యాయి. షేరుకి రూ. 615–650 ధరలో రూ. 4,300 కోట్ల సమీకరణకు కంపెనీ ఎఫ్‌పీవో చేపట్టింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అవసరమైతే ఇన్వెస్టర్లు బిడ్స్‌ను ఉపసంహరించేందుకు వీలు కల్పించమని కంపెనీని ఆదేశించింది. షేర్ల విక్రయంపై అయాచిత ఎస్ఎంఎస్లు సర్క్యులేట్కావడంతో సెబీ అనూహ్యంగా స్పందించింది. దీంతో ఈ నెల 28న ముగిసిన ఇష్యూలో భాగంగా 30వరకూ బిడ్స్ ఉపసంహరణకు రుచీ సోయా అవకాశమిచ్చింది. బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని రుచీ సోయా ఎఫ్‌పీవో కోసం 4.89 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 17.6 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం రూ. 650 ధరను ఖరారు చేసింది. గత వారం ఈ సంస్థలకు 1.98 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 1,290 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మహాకోష్, సన్‌రిచ్, రుచీ గోల్డ్, న్యూట్రెలా బ్రాండ్లు పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచీ సోయా సొంతం. రుచీ సోయా షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 937 వద్ద ముగిసింది. -
నోరు ముయ్.. నీకు అన్నీ చెప్పాలా: బాబా రాందేవ్
ఛండీగఢ్: యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రామ్‌దేవ్ బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు 2014లో బాబా రామ్ దేవ్ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్, రూ. 300 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఓ మీడియా విలేకరి గతంలో బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలపై ప్రశ్నించారు. దీంతో బాబా రామ్ దేవ్ సహనం కోల్పోయి లైవ్‌లోనే బెదిరించారు. తాజాగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరి, రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అవును, ఇప్పుడు ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలు అడగకండి.. నేనేమీ మీ కాంట్రాక్టర్‌ను కాదు.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..’’ అన్నారు. ఇంతో సదరు విలేకరి మరోసారి ప్రశ్నించగా.. అతడిపై రామ్ దేవ్ సీరియస్‌గా చూస్తూ..‘‘ నేను, ఆ వ్యాఖ్య చేశాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు)? నోరు మూసుకో. మళ్లీ అడగకు.. ఇలా మాట్లాడకు.. మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అందుకు ఒప్పుకుంటాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. దీంతో గత తొమ్మిది రోజులలో లీటరుకు రూ. 5లకు పైగా పెరిగాయి. Yoga Guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. @ndtv pic.twitter.com/kHYUs49umx — Mohammad Ghazali (@ghazalimohammad) March 30, 2022 -
సూర్య నమస్కారంతో సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ: యోగా, ధ్యానం మన జీవితంలో అంతర్భాగం కావాలని కేంద్రమంత్రి శర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హార్ట్‌ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హార్ట్‌ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శర్భానంద హాజరయ్యారు. యోగా గురు రామ్‌దేవ్ బాబా, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..75 కోట్ల సూర్య నమస్కారాలు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కమ్లేష్ డి.పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా అకాడమీని స్థాపించడం ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుందని అన్నారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా సాధన చేయాలని, అలాంటి వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
హైదరాబాద్ వేదికగా.. 75 కోట్ల సూర్య నమస్కారాలు!
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా సరికొత్తగా 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ జరగబోతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జరిగే ఈ ఆన్లైన్ చాలెంజ్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. నందిగామ మండలంలోని కన్హా విలేజ్‌లో ఉన్న కన్హా శాంతి వనంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 3న మొదలై ఫిబ్రవరి 20 వరకు కార్యక్రమం కొనసాగనుంది. హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్ తదితర జాతీయ స్థాయి సంస్థలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాయి. రామ్‌దేవ్ బాబాతో పాటు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగానే అథెంటిక్ యోగా బుక్ ఆవిష్కరణ, హార్ట్ ఫుల్ నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి శంకుస్థాపన కూడా జరగనుంది. చదవండి: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపు.. మందు, బీర్లు తెగ లాగించేశారు.. 21 రోజులు.. రోజుకు 13 సర్కిల్స్ చాలెంజ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులు క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ 12 సూర్య నమస్కారాల సర్కిల్‌ను రోజుకు 13 సార్లు చొప్పున సాధన చేస్తారు. ఫిబ్రవరి 20లోపు వీలును బట్టి 21 రోజుల్లో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసిన వారికి నిర్వాహకులు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. 30 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేలా.. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలు ఈ 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్‌లో పాల్గొననున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేసేందుకు కృషి జరుగుతోంది. చదవండి: సర్కారు తప్పిదాలతోనే విద్యుత్ మోత! -
రాందేవ్ బాబాకే గురువులా ఉన్నాడుగా..!
Viral Video Man Called As Father Of Ramdev Baba Bends His Body: యోగా గురువు రాందేవ్ బాబా వేసే కొన్ని ఆసనాలు చూస్తే.. ఈయన ఒంట్లో స్ప్రింగ్‌లున్నాయా ఏంటి నిపించకమానదు. చాలా సులభంగా.. ఇంకా చెప్పాలంలే విల్లులా శరీరాన్ని వంచుతాడు. నిత్యం యోగా సాధనతో ఇది సాధ్యమవుతుంది. (చదవండి: video viral: విదేశి యువకుడితో వృద్ధుడి అదిరిపోయే డ్యాన్స్!) తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. వీడేవడో.. రాందేవ్ బాబాకే గురువులా ఉన్నాడు.. శరీరాన్ని ఒంచడంలో ఆయనను మించిపోయాడు అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (చదవండి: రామ్‌దేవ్‌బాబాకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు) వీడియోలో ఉన్న వ్యక్తిది ఏ దేశం.. ఎక్కడ దీన్ని షూట్ చేశారు.. అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. వీడియోలో ఓ వ్యక్తి తన శరీరాన్ని విల్లు మాదిరి వంచుతూ.. రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ.. అందరిని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. అతడి విన్యాసాలు చూసిన వారంతా.. ఫాదర్ ఆఫ్ రాందేవ్ బాబా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు! -
భారత్-పాక్ మ్యాచ్‌పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
Baba Ramdev Sensational Statement Over India, Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఇవాళ జరగనున్న ఫై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పక్క దేశంలో ఉగ్ర క్రీడ పేట్రేగిపోతుంటే.. క్రికెట్ ఆడడమేంటని ప్రశ్నించాడు. క్రికెట్, ఉగ్రక్రీడ రెండూ ఒకేసారి ఆడలేరని.. ఇలా చేయడం జాతి ప్రయోజనాలకు, రాజ ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నాడు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు క్రికెట్ ఆడడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. India-Pakistan match against ‘Rashtradharma,’ says @yogrishiramdev | #T20WorldCup #Cricket #WorldCupT20 #IndiaVsPakistan Read full story - https://t.co/vSzFrHTraV pic.twitter.com/ZzWtsKvpsm — IndiaToday (@IndiaToday) October 24, 2021 కాగా, దేశంలో ఉగ్రదాడులు అను నిత్యం ఏదో ఒక చోట జరుగుతూ ఉంటే భారత్-పాక్‌లు క్రికెట్ మ్యాచ్ ఆడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రుల దగ్గరి నుంచి సామాన్యుల వరకు మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: Virat Kohli: ఐదారుగురు ఆటగాళ్లు నవ్వుతూ ఉన్నంత మాత్రాన... -
రామ్‌దేవ్ బాబాకు భారీ షాక్: నేపాల్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు, పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబాకు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్ మందును భూటాన్ నిలిపివేయగా.. తాజాగా నేపాల్ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. భూటాన్ గతంలోనే కరోనిల్‌పై నిషేధం విధించింది. తాజాగా నేపాల్ సోమవారం ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‌దేవ్ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కోనవడంలో కరోనిల్ విఫలం చెందిందని గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కరోనిల్ మందును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్ కిట్‌లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది. దీంతో ఆ కిట్‌ను పంపిణీ చేయడం నిలిపివేసింది. కరోనిల్‌కు ప్రత్యామ్నాయ మందులకు నేపాల్ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది. కరోనిల్ కిట్‌ను పతాంజలి సంస్థ రూపొందించింది. ఈ మందును 2020 జూన్ 23వ తేదీన విడుదల చేశారు. ఈ మందు కరోనా కట్టడిలో విఫలం చెందిందని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆ మందుకు డిమాండ్ లేకుండాపోయింది. అయితే పతాంజలి సంస్థ మాత్రం తమ కరోనిల్ కిట్‌ను లక్షల్లో విక్రయించినట్లు తెలిపింది. చదవండి: పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్ చదవండి: రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే -
రామ్‌దేవ్‌బాబాకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు యోగా గురు రామ్‌దేవ్‌బాబాకు గురువారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోషియేషన్ దాఖలు చేసిన దావాపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయం వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. కాగా, కొరోనిల్ టాబ్లెట్‌పై రామ్‌దేవ్‌బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ డీఎంఏ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. కొరోనిల్‌తో కరోనా తగ్గుతుందా లేదా అన్నది నిపుణులు తేల్చాలి.. కొరోనిల్‌కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. అంతకు కొద్దిరోజుల క్రితం ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎమ్ఏ) రామ్‌దేవ్ బాబాపై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. ఆయన అల్లోపతిపై తప్పుడు, అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్లో పేర్కొంది. ఆమోదింపబడ్డ పద్ధతిలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై, ఉపయోగిస్తున్న మందులపై తరచూ.. ఉద్దేశ్యపూర్వకంగా ఆయన నిరాధార, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. -
రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే
సాక్షి, ఢిల్లీ/ హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో అల్లోపతి వైద్యం పని చేయడం లేదని.. వైద్యులు విఫలమయ్యారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం నల్ల దినంగా (బ్లాక్ డే) వైద్యులు రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి.. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నె తదితర ప్రాంతాల్లో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోషల్ మీడియాలో కూడా రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. #ArrestRamdev అనే హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ట్విటర్, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి, వైద్యారోగ్య మంత్రులను విజ్ఞప్తులు పంపుతున్నారు. చదవండి: బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు చదవండి: రామ్‌దేవ్ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి -
రాందేవ్ బాబా వ్యాఖ్యలపై 1న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యాన్ని తప్పుపడుతూ యోగా గురు రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై జూన్ ఒకటో తేదీన బ్లాక్‌డేగా పాటించి, నిరసన తెలుపుతామని రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాందేవ్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌వోఆర్‌డీఏ శనివారం ట్విట్టర్లో పేర్కొంది. ఇందుకు నిరసనగా జూన్ 1వ తేదీన బ్లాక్‌డేగా పాటిస్తూ విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలుపుతామని తెలిపింది. ఇప్పటికే ఎఫ్‌వోఆర్‌డీఏ రాందేవ్‌పై రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా కూడా వేసింది. అల్లోపతి వైద్యులు, వైద్యంపై ఇటీవల రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. (చదవండి: రాజాకు సతీవియోగం) -
రాందేవ్ బాబా వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా
-
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
అల్లోపతిపై రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హర్షవర్థన్
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి.. కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్ ఇచ్చిన వివరణ కూడా సరిపోదన్నారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్ లేఖ రాశారు. కోవిడ్ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయన్నారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే .. మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక , మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్‌దేవ్ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోండి!
న్యూఢిల్లీ : యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ యాక్షన్(ఐఎమ్ఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి మందులపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. యోగా గురుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో... యోగా గురు రామ్‌దేవ్ బాబా అల్లోపతి మందులను పనికి రాని వాటిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది. గతంలోనూ ఆయన డాక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారని, వండర్ డ్రగ్స్ విడుదల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ముందే డాక్టర్లను హంతకులన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పటికీ, రామ్‌దేవ్ ఆయన సహచరుడు బాలక్రిష్ణ జీలు అనారోగ్యం పాలైనప్పుడు అల్లోపతి వైద్యమే చేయించుకుంటున్నారని తెలిపింది. తప్పుడు, నిరాధార ఆరోపణలు, ప్రకటనలు చేస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ‘‘ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్’’ కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని, విచారణకు ఆదేశించాలని కేంద్ర ఆరోగ్య శాఖను డిమాండ్చేసింది. చదవండి : పిచ్చి పీక్స్ అంటే ఇదే.. స్వీటు కోసం 200కి.మీ.. నెగిటివ్ రిపోర్టు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ -
రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా?
న్యూఢిల్లీ: యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామదేవ్ బాబాను అరెస్టు చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. కరోనా విరుగుడుకు పతంజలి సంస్థ నుంచి ‘కొరొనిల్’ మందును తయారు చేసి ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల సమయంలో కొరొనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికెట్ ఉందని చెప్పి రామ్‌దేవ్ బాబా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రజలను మోసం చేయాలని చూసిన యోగా గురును అరెస్టు చేయాలని పలు ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్య ప్రతాప్ సింగ్ సైతం ఆయనను అరెస్టు చేయాలని న్యూఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. ‘డియర్ ఢిల్లీ పోలీసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ పేరుతో కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా? ఇది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలి. దీనికి కఠిన చర్యలు ఉండేలా చూడాలి’ అంటూ ట్విటర్ వేదికగా కోరారు. కాగా ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్ బాబా కొరొనిల్ మందును విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో స్పష్టం చేసింది. Dear @DelhiPolice will you #ArrestRamdev for misguiding millions of people on the name of WHO certification? This is international fraud, Strictest action should be ensured. — Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) February 22, 2021 చదవండి: కొరొనిల్’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్ -
కొరొనిల్’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబా రూపొందించిన కరోనా మందు ‘కొరొనిల్’ ప్రమోషన్‌పై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్- ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని మందుపై ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. రామ్‌దేవ్ బాబా మందుపై కేంద్ర మంత్రులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. తప్పుడు, అశాస్త్రీయ మందును ప్రజల ముందుకు ఎలా తీసుకొస్తారని నిలదీసింది. కరోనాకు విరుగుడుగా పతాంజలి సంస్థ రూపొందించిన ‘కొరొనిల్’ మందును ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో తెలిపింది. అయితే దీనిపై సోమవారం భారత వైద్యుల సంఘం స్పందించింది. కొరొనిల్ మందును తాము ఎలాంటి పరీక్షలు చేయలేదని భారత వైద్య సంఘం (ఐఎంఏ) తెలిపింది. తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా ఎలా గుర్తించినట్లు రామ్‌దేవ్ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ముందు పచ్చి అబద్ధాలు రామ్‌దేవ్ బాబా చెప్పారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా చెప్పిన ప్రకటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పందించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. కరోనాను ఏ సంప్రదాయక మందుకు తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. వైద్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఎలా సమర్ధిస్తారని మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించిన మందును ఒక వైద్యుడిగా ఉన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఎలా సమర్ధించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ తీసుకొచ్చిన ఆ మందుకు అంత సామర్థ్యం ఉంటే రూ.32వేల కోట్లు ఖర్చు చేసి ఎందుకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఐఎంఏ డిమాండ్ చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అయితే ఈ మందు కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేసే మందుగా అమ్మాలని అప్పట్లో ఆయుశ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. The Indian Medical Association issues a strongly worded statement on the Patanjali shenanigans and calls it a shame on the behalf of the Health Minister. pic.twitter.com/0kAHBkycGI — Abhishek Baxi (@baxiabhishek) February 22, 2021 -
కరోనాకు మందు కనిపెట్టలేదు: పతంజలి
డెహ్రాడూన్: మహమ్మారి కరోనాకు మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసిన ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు తాజాగా యూటర్న్ తీసుకున్నారు. తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్ తయారు చేయలేదంటూ మాట మార్చారు. ‘కరోనా కిట్’ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు కరోలిన్ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి కంపెనీ గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్(పతంజలి ప్రధాన కేంద్రం)లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు కలిగి ఉన్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా, వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ పేర్కొంది.(పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం) ఈ క్రమంలో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ రాందేవ్ బాబా, పతంజలి చైర్మన్ బాలకృష్ణపై పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనిల్ ప్రకటనలను భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్ మందుకు అనుమతించామని పేర్కొంది. ఈ క్రమంలో కరోలిన్ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఉత్తరాఖండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ పతంజలి సంస్థకు నోటీసులు జారీచేసింది.(మార్కెట్లోకి కరోనా ఔషధం..!) ఈ విషయంపై మంగళవారం స్పందించిన కంపెనీ.. ‘‘‘కరోనా కిట్’ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు. దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్ టాబ్లెట్, దివ్య అను టేల్ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్ చేస్తున్నాం. కరోనిల్ కిట్ అనే కిట్‌ను విక్రయించడం లేదు. అంతేకాదు.. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపాం. కేవలం ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాల గురించి మాత్రమే వెల్లడించాం. మనుషులపై ప్రయోగించినపుడు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు’’ అని పేర్కొంది. అయితే అది దగ్గు మందా లేదా మరే ఇతర ఔషధమా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. -
రామ్‌దేవ్ బాబా (యోగా గురువు) రాయని డైరీ
వరానిదేముందీ, నేను కాకపోతే దేవుడు అనుగ్రహిస్తాడు. వరాన్ని అందుకునే చేతులకే.. శక్తి ఉండాలి. శక్తి లేకపోతే వరమిచ్చిన దేవుడు గానీ, ఈ రామ్‌దేవ్ బాబా గానీ వరాన్ని వెనక్కు తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. వరం అందుకోడానికి చేతులకు మాత్రమే శక్తి ఉంటే సరిపోదు. అది వరం అని గుర్తించే మనోశక్తి కూడా ఉండాలి. ఎందరికి ఉంది ఈ దేశంలో వరాన్ని గుర్తించే మనోశక్తి. వరం.. ‘మేడ్ బై దేవుడు’ అని ప్యాక్ మీద ఉన్నా, దేవుడి వరానికి అమెరికా వాళ్ల ఎఫ్.డి.ఎ. ఆమోదం ఉందా అని చూస్తారు. దేవుడిచ్చిన వరం జనంలోకి వెళ్లడానికి తిప్పలు పడటంలో అసహజం ఏమీ లేదు. ఆయన ఎక్కడో పైన ఉంటాడు. కింద ఉండే ఈ రామ్‌దేవ్‌కి కూడా ఇన్ని తిప్పలేమిటి చిన్న మెడిసిన్‌ని వరంలా విక్రయించుకోడానికి! మూడు నెలలుగా ఎవరూ ఖాళీగా లేరు. ఎవరికి తోచిన వరాన్ని వారు ప్రసాదించే పనిలో ఉన్నారు. మాస్కుల వరం, పాలూ పండ్లూ కూరగాయల వరం, ఉడకేసిన బియ్యం వరం, ఉప్మా ప్యాకెట్ల వరం, టికెట్లు తీసి బస్సులు, రైళ్లు ఎక్కించే వరం.. ఇలా వరాలిచ్చే వారితో ఈ భూమి నిండి పోయింది. ఇక వరాలు తీసుకునేవారికి చోటెక్కడ ఉంటుంది?! ఆచార్య బాలకృష్ణ వచ్చి కూర్చున్నాడు. ‘‘వరాలు ఎక్కువై ఈ మూర్ఖపు జనులకు వరం విలువ తెలియకుండా పోయింది బాబాజీ. మన కరోనిల్ కిట్లను ఐదు వందల నలభై ఐదు రూపాయలకే వరంగా ఇస్తున్నా ఎవరూ చెయ్యి పట్టడం లేదు. ఎవరైనా వరానికి ధరేంటని అనుమానంగా చూస్తారు. వీళ్లు వరాన్నే అనుమానంగా చూస్తున్నారు’’ అన్నాడు. అతడి చేతిలో కరోనిల్ కిట్ ఉంది. దానిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ‘‘కోరుకోని వరం లభిస్తే ఎవరైనా ఆనందించకుండా ఎలా ఉండగలరో అర్థం కావడం లేదు ఆచార్యా’’ అన్నాను. అర్థం కావడం లేదని ఆచార్యతో అన్నాను కానీ, బొత్తిగా అర్థం కాకుండా ఏమీ లేదు. కోరుకోని వరం కోరుకున్న చోటు నుంచి రావాలని వీళ్లంతా కోరుకుంటున్నారు. వీళ్లకు రెమ్‌డెసివిర్ కావాలి. రామ్‌దేవ్‌బాబా వద్దు. ‘‘ఆచార్యా.. మన కిట్ల మీద ‘టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ ఫ్రం పతంజలి’ అని కాకుండా.. ‘అప్రూవ్డ్ బై.. ఎఫ్.డి.ఎ.’ అని వేయించడానికి వీలవుతుందా?’’ అని అడిగాను. ‘‘రెండు విధాలుగా వీలుకాకపోవచ్చు’’ అన్నాడు! వీలుకాకపోవడం అన్నది ఒక విధంగా వీలు కాకపోయినా, రెండు విధాలుగా వీలుకాక పోయినా.. చివరికి వీలు కాకపోవడం ఒక్కటే మిగులుతుంది. ‘‘వీలయ్యే విధానాలు ఏమైనా ఉంటే చెప్పండి ఆచార్యా..’’ అని అడిగాను. ‘‘వీలు కాని విధాలను కొట్టేసుకుంటూ పోతే, వీలయ్యే విధానం ఎక్కడైనా పట్టుబడొచ్చు బాబాజీ’’ అన్నాడు. నా సహచరుడు అతడు. ఆయుర్వేద ఆచార్యుడు. నేను హర్యానా నుంచి వస్తే, అతడు హరిద్వార్ నుంచి వచ్చాడు. నాది యోగా, అతడిది ఫార్మసీ. అతడు శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని శాలువాగా కప్పుకుని కుర్చీలో ఆసీనుడై ఒక చేత్తో పుస్తకాన్ని, ఒక చేత్తో బాల్ పెన్ను పెట్టుకుని ఉంటే çపరిశోధనావస్థలో ఉండే యోగీశ్వరుడిలా ఉంటాడు. ‘‘వీలవని ఆ రెండు విధానాలేమిటి ఆచార్యా..’’ అని అడిగాను. ఆచార్య బాలకృష్ణ మాట్లాడలేదు. ‘‘చెప్పండి.. ఆచార్యా..’’ అన్నాను. ‘‘వీలవనివి తెలుస్తూ ఉండి, వీలయ్యేవి ఏవో తెలియనప్పుడు.. వీలయ్యేవి ఏమిటో ముందు తెలుసుకుని అప్పుడు వీలవని వాటిని కొట్టేసుకుంటూ పోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను బాబాజీ’’ అన్నాడు!! తెలియని ఆసనమేదో తెలియకుండా పడిపోయినట్లనిపించింది. -
పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారికి మందు కనుగొన్నామని యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ప్రకటించడం, తాము కనిపెట్టిన ‘కరోలిన్’ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి రాందేవ్ బాబా హరిద్వార్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పడంపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రయోగాలు జరపాలన్నా, మందులు విడుదల చేయాలన్నా ముందుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరంటూ ఏప్రిల్ 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఓ నోటీసును జారీ చేసింది. (రాందేవ్ బాబా కరోనా డ్రగ్‌కు ‘మహా’ షాక్) ఇదే విషయమై కేంద్ర ఆయుష్ శాఖను మీడియా సంప్రతించగా, కరోనా మందులకు సంబంధించి పతంజలి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేసింది. అయితే పతంజలి కంపెనీ కరోనాకు మందు కనిపెట్టిన విషయంగానీ, దాని విడుదలకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు చేసిన విషయంగానీ తమ దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ అమాయకత్వం ప్రదర్శించింది. కరోనా (కోవిడ్–10) నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, రోగ నియంత్రణ శక్తికి, దగ్గు నివారణ మందులకు లైసెన్స్ తీసుకుందని కరోలిన్ మందుల విక్రయానికి అనుమతించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్ మందుకు అనుమతించామని ఆ ప్రభుత్వం తెలిపింది. కరోలిన్ మందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు పరిశీలించి పతంజలి కంపెనీకి నోటీసులు జారీ చేస్తామంది. మహారాష్ట్ర ప్రభుత్వమైతే కరోలిన్ మందులను రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. (ఆవనూనె, నిమ్మకాయతో కరోనాకు చెక్) ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన డ్రగ్ నియంత్రణ సంస్థ ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ ఇప్పటివరకు స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. కరోలిన్ మందు అమ్మకాలను నిషేధిస్తూ తక్షణం ఉత్తర్వులు జారీ చేయాల్సిన డ్రగ్స్ నియంత్రణ సంస్థ మౌనం పాటించడం అర్థరహితం. అమెరికా, యూరప్ దేశాల్లో లైసెన్స్ నిబంధనలను మందుల కంపెనీలు ఉల్లంఘించినట్లయితే వేల కోట్ల రూపాయల జరిమానాలు విధించడమే కాకుండా ఆ కంపెనీ లైసెన్స్లన్నింటిని రద్దు చేస్తారు. విదేశీ చట్టాలను పక్కన పెడితే కరోనా మందులకు సంబంధించి ఎవైరైనా, ఏ సంస్థ అయినా సాధారణ ప్రకటనలుగానీ, వాణిజ్య ప్రకటనలుగానీ విడుదల చేసినట్లయితే ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఏప్రిల్‌లో విడుదల చేసిన తన స్టేట్మెంట్లో ఆయూష్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ చట్టాన్ని ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టుల మీద కూడా ప్రయోగించింది. పతంజలి తన కరోలిన్ మందుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు చేస్తున్నా, రాందేవ్ బాబా టీవీల్లో స్వయంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చెబుతున్నా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల విమర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టినా ‘కరోలిన్’ మందుకు సంబంధించి పతంజలి కంపెనీ నిర్వహించిన ట్రయల్స్ నమ్మశక్యంగా లేవు. కరోనా లక్షణాలు స్వల్పంగా, ఓ మోస్తారుగా ఉన్న వంద మంది రోగులపై కరోలిన్ మందును ప్రయోగించామని, వారిలో 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ ప్రకటించింది. కరోనా లక్షణాలున్న వారిపై ప్రయోగించామని చెప్పారు. (24గంటల్లో.. 16,922 కరోనా కేసులు) అయితే వారికి వాస్తవంగా కరోనా ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి పరీక్షలు జరపలేదు. కరోనా లేకున్నా చాలామంది దగ్గు, దమ్ముతో బాధ పడుతుంటారు. ఆ విషయాన్ని పతంజలి కంపెనీ ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతర్జాతీయ, భారతీయ ప్రమాణాల ప్రకారం ఏ మందు ట్రయల్స్‌ను నిర్వహించాలన్నా కనీసం 220 మందిపై నిర్వహించాల్సి ఉంటుంది. పతంజలి మందులకు సంబంధించి గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఏ కేసులో కూడా రాందేవ్ బాబాను అరెస్ట్ చేయలేదు. లైసెన్స్‌ల రద్దుకు సంబంధించి కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
రాందేవ్ బాబా కరోనా డ్రగ్‌కు ‘మహా’ షాక్
ముంబై : కరోనా మహమ్మారికి రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద విడుదల చేసిన కొరోనిల్ డ్రగ్‌ను మహారాష్ట్రలో అనుమతించబోమని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో కృత్రిమ మందుల అమ్మకాలను అనుమతించమని రాందేవ్ బాబాను హెచ్చరించారు. కొరోనిల్ ఔషధం పనితీరును అథ్యయనం చేసేందుకు పూర్తిస్ధాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారా అనేది నిమ్స్, జైపూర్ నిగ్గుతేల్చాలని అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ట్వీట్ చేశారు. కొరోనిల్ ప్రకటనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధించడాన్ని మంత్రి స్వాగతించారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా, శాంపిల్ పరిమాణం వివరాలు, నమోదు వివరాలు లేకుండా కరోనాకు మందు కనుగొన్నామని పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. (చదవండి : కోవిడ్‌కి పతంజలి ఔషధం) -
అప్లికేషన్లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు
న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు తెచ్చిన కరోనిల్, స్వాసరి మందులపై ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి సంస్థను బుధవారం ఆదేశించింది. ఇటీవల మందుల తయారీ, మార్కెటింగ్ గురించి సంస్థ పెట్టుకున్న అప్లికేషన్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, పతంజలి ఆ అప్లికేషన్ లో కరోనా మందు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ‘పతంజలి అప్లికేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి, దగ్గు, జ్వరానికి మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. వాళ్లకు కోవిడ్–19 కిట్ ను తయారు చేసే అనుమతి ఎలా వచ్చిందో నోటీసులు పంపి తెలుసుకుంటాం’ అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద డిపార్టు మెంట్ లైసెన్సింగ్ ఆఫీసర్ వెల్లడించారు.(ప్రతి ఇంటికి కరోనా పరీక్షలు!) జైపూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎన్ఐఎంఎస్)తో కలిసి కరోనా చికిత్సకు మందులు కనుగొన్నట్లు పతంజలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థను ప్రమోట్ చేస్తున్న రామ్ దేవ్ బాబా స్వయంగా తానే రెండు మందులను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. కరోనిల్, స్వాసరి మందులను ఢిల్లీ, అహ్మదాబాద్, మీరట్ లలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశామని పతంజలి చెప్పింది. (హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!) పతంజలి మందులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నివివరణ కోరినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. కరోనిల్, స్వాసరి మందులను పరిశీలించి, ఆమోదించే వరకూ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దని సంస్థను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. -
కోవిడ్‌కి పతంజలి ఔషధం
హరిద్వార్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వ్యాధిని మట్టుబెట్టే మందును కనుగొన్నట్లు యోగా గురువు రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద ఔషధ కంపెనీ ప్రకటించింది. ‘కరోనిల్, శ్వాసరి’అనే ఈ ఔషధాలు కోవిడ్‌ని ఏడు రోజుల్లో నయం చేస్తాయని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ ఔషధం వివరాలను తమకు సమర్పించాలనీ, దీనిపై ఎటువంటి ప్రకటనలు చేయరాదని పతంజలి సంస్థను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్, శ్వాసరి అనే రెండు ఆయుర్వేద మందులూ వెంటిలేటర్‌పై ఉన్న వారు మినహా ఇతర కోవిడ్ పేషెంట్లపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలిచ్చాయని రామ్‌దేవ్ హెర్బల్ మెడిసిన్ కంపెనీ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా (సీటీఆర్ఐ) అనుమతితో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు రామ్‌దేవ్ వెల్లడించారు. అన్ని ప్రొటోకాల్స్ని అనుసరించి, నియంత్రిత వైద్యపరీక్షల ఆధారంగా, హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ సెంటర్, జైపూర్‌లోని ప్రైవేటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ ఔషధాన్ని అభివృద్ధి పరిచినట్టు తెలిపారు. పతంజలి యాంటీ కోవిడ్ టాబ్లెట్, దివ్య కరోనిల్ ట్యాబ్లెట్‌ను తులసి, అశ్వగంధ, తిప్పతీగలతో తయారుచేశారు. ఈ ఔషదాన్ని 15 నుంచి 80 ఏళ్ల వారు వాడవచ్చునని పతంజలి ఔషధ సంస్థ సూచించింది. కరోనిల్‌తోపాటు, శ్వాసరి, అను టెల్ మందులను వాడాల్సి ఉంటుంది. వచ్చే సోమవారం నుంచి మొబైల్ యాప్ ద్వారా ఈ మందుల కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చన్నారు. రూ.545 ఖరీదైన ఈ కరోనా కిట్‌లో 30 రోజులకు సరిపడా మందులు ఉంటాయి. -
మార్కెట్లోకి కరోనా ఔషధం..
హరిద్వార్ : ఆయుర్వేదిక్ ఉత్పత్తుల దిగ్గజం పతంజలి రూపొందించిన కరోనా ఔషధం కొరోనిల్‌ను యోగా గురు రాందేవ్ బాబా మంగళవారం హరిద్వార్‌లో విడుదల చేశారు. కరోనావైరస్కు వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని, కరోనా చికిత్సకు ఈరోజు తాము తొలి ఆయుర్వేద ఔషధం కొరోనిల్‌ను అభివృద్ధి చేశామని రాందేవ్ బాబా పేర్కొన్నారు. దాదాపు 100 మంది రోగులపై తాము క్లినికల్ పరీక్షలు నిర్వహించగా 65 శాతం మందికి మూడురోజుల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని చెప్పారు.ఏడు రోజుల్లో వంద శాతం మంది రోగులు కోలుకున్నారని వెల్లడించారు. తమ ఔషధం నూరు శాతం రికవరీ రేటు, సున్నా శాతం మరణాల రేటును కలిగిఉందని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 రోగుల చికిత్సలో ఉపయోగించే ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పతంజలి అన్ని శాస్త్రీయ నిబంధనలను పాటించిందని చెప్పారు. పతంజలి పరిశోధనా కేంద్రం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సహకారంతో పరిశోధన చేపట్టామని పతంజలి పేర్కొంది. కోవిడ్-19 చికిత్స కోసం పలు వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్న సమయంలో ఆయుర్వేద ఔషధం అందుబాటులోకి వచ్చింది. పలు వ్యాక్సిన్లు మానవ పరీక్షలపై కీలక దశకు చేరుకున్నాయి. ఆస్ర్టాజెనెకా, మొడెర్నా, ఫిజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్, సనోఫి, బయోఎన్‌టెక్, కాన్సినో బయోలాజిక్స్ వంటి పలు సంస్ధలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. చదవండి : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం -
‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’
సాక్షి, న్యూఢిల్లీ: ఎవరైనా నిమిషం పాటు శ్వాసను అదుపుచేయగలిగితే వారికి కరోనా లేనట్టేనని ప్రముఖ యోగ గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. శనివారం ఈ-ఎజెండా ఆజ్‌తక్ ప్రత్యేక సెషన్లో పాల్గొన్న రామ్‌దేవ్ కరోనా లక్షణాలు ఉన్నవారు కానీ, లేని వారు కానీ ఒక నిమిషం పాటు శ్వాసను ఆపగలిగితే వారికి కరోనా లేనట్టేనని తెలిపారు. కరోనా వైరస్‌కి ప్రత్యేకమైన ప్రాణాయామం ఉందని దానిని ఉజ్జయ్ అంటారన్నారు. ఈ ఉజ్జయ్ ప్రాణాయామంలో నోటిని మూసి ముక్కుద్వారా శ్వాస తీసుకొని దానిని కొంచెం సేపు ఉంచి నెమ్మదిగా విడుదల చేయాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా కరోనా ఉందో లేదో స్వయంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు 30 సెకన్ల పాటు శ్వాసను ఆపగలిగితే చాలని కరోనా లేదని నిర్థారించుకోవచ్చన్నారు. మిగిలిన వారు ఒక నిమిషం పాటు శ్వాసను కట్టడి చేయాలన్నారు. దీంతో పాటు ఆవ నూనెను ముక్కు రంధ్రంలో వేసుకోవడం ద్వారా అక్కడ కరోనా వైరస్ ఉంటే కడుపులోకి వెళ్లి ఉదరంలో ఉండే ఆమ్లాల కారణంగా చనిపోతుందన్నారు. (లాక్డౌన్ కారణంగా డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య) ఇక శరీరంలో ఆక్సిజన్ తగ్గడం కూడా అనేక జబ్బులకు కారణమని రామ్‌దేవ్ బాబా అన్నారు. ఇది సైన్స్ ద్వారా కూడా నిరూపితమైందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే యోగ చేయాలని సూచించారు. యోగ చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అంతర్భాగాలన్ని శక్తిమంతమవుతాయని, దీని ద్వారా మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోగలమని రామ్‌దేవ్ తెలిపారు. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు 24,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 775 మంది కరోనా బారిన పడి మరణించారు. (162 మంది జర్నలిస్టులకు కరోనా టెస్ట్...) -
‘మోదీ-షా బతికుండటం సోనియాకు ఇష్టం లేదు’
లక్నో: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీపై ప్రముఖ యోగా గరువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు బతికిఉండటం వారిద్దరికీ ఇష్టం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమిత్ షాను చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టించారని, ఆయన జైల్లోనే చనిపోవాలని వారు కోరుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అమిత్ షాను జైలుపాలు చేసిన నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు కూడా అదేగతి పట్టిందని అన్నారు. తాను జైలుకు పోతానని చిదంబరం కలలో కూడా ఊహించి ఉండరని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. నోయిడాలో మంగళవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
రాందేవ్ ‘బాలకృష్ణ’కు అస్వస్థత
డెహ్రాడూన్: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు అత్యంత సన్నిహితులు, పతంజలి ఆయుర్వేద సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పతంజలి యోగాపీఠం సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తల తిరగడం, ఛాతిలో నొప్పి రావడంతో బాలకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ అత్యవసర విభాగపు వైద్యులు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారని సమాచారం. ఆచార్య బాలకృష్ణ నేపాల్ సంతతికి చెందిన భారతీయ బిలియనీర్. -
రాహుల్ యోగా చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగ చేసే వారికి మంచి రోజులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి కారణం ఏమిటనేది కూడా రాందేవ్ బాబా తనదైన శైలిలో విశ్లేషించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యోగా చేయకపోవడంతోనే ఆ పార్టీకి ఎన్నికల్లో పరాభవం ఎదురైందని అన్నారు. ‘మోదీజీ బహిరంగంగానే యోగా చేస్తారు..నెహ్రూ, ఇందిరా గాంధీలు కూడా యోగా చేస్తారు..కానీ వారి వారసుడు (రాహుల్) యోగా చేయరు..అందుకే ఆయన రాజకీయాలు నిష్ఫలమయ్యాయి..ఎవరైతే యోగా చేస్తారో వారికి అచ్చేదిన్ ఎదురవుతాయ’ని రాందేవ్ పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నారని కితాబిచ్చారు. మరోవైపు ఏడాది కిందట రాహుల్, సోనియా నిత్యం యోగాను అభ్యసిస్తారని, రాహుల్‌తో తనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గత ఏడాది ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ రాందేవ్ బాబా పేర్కొనడం గమనార్హం. -
‘మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ బాబా జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందేనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రామ్‌దేవ్ బాబా జనాభాను తగ్గించేందుకు మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతోపాటు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పేర్కొనడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘రాజ్యాంగ విరుద్ధమైన విషయాలు మాట్లాడేవారిని నిలువరించడానికి ఎలాంటి చట్టాలు లేవు. అయినా రామ్‌దేవ్ బాబా ఆలోచనలకు ఎందుకంత ప్రాధాన్యం దక్కుతుంది? రామ్‌దేవ్ బాబా పొట్టతో చేసినట్టో లేక కాళ్లు ఆడించినట్టో కాదు. అలా అయితే మూడో సంతానం కాబట్టి మోదీ కూడా తన ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది’అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. -
మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందే : ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్‌బాబా జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. తాజాగా రామ్‌దేవ్ బాబా జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మరో 50ఏళ్లలో భారత దేశ జనాభా 150కోట్లను మించకూడదని అన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని అభిప్రాయపడ్డారు. ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్న ఆయన మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతో పాటూ వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని రామ్‌దేవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ది మూడో బిడ్డకు అందకుండా చూడాలని చెప్పారు. మతంతో సంబంధం లేకుండా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాలని రామ్‌దేవ్ బాబా సూచించారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. 'స్పష్టమైన రాజ్యాంగ విరుద్ధమైన విషయాలు మాట్లాడేవారిని నిలువరించడానికి ఎలాంటి చట్టాలు లేవు. అయినా రామ్‌దేవ్ బాబా ఆలోచనలకు ఎందుకంత ప్రాధాన్యం దక్కుతుంది? రామ్ దేవ్ బాబా పొట్టతో చేసినట్టో లేక కాళ్లు ఆడించినట్టో కాదు. అలా అయితే మూడో సంతానం కాబట్టి నరేంద్రమోదీ కూడా తన ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది' అని అసదుద్దీన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. There is no law preventing people from saying downright unconstitutiona things, but why do Ramdev’s ideas receive undue attention? That he can do a thing with his stomach or move about his legs shouldn’t mean @narendramodi lose his right to vote just because he’s the 3rd kid https://t.co/svvZMa4aZy — Asaduddin Owaisi (@asadowaisi) May 27, 2019 -
‘మూడో బిడ్డను కంటే ఓటు హక్కు రద్దు చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : జనభాను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఆదివారం ఆయన హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏ మతానికి చెందిన వారైనా సరే అధిక సంతానాన్ని కనకూడదని ఆయన సూచించారు. ‘భారత జనాభా మరో 50 ఏళ్ల పాటు 150 కోట్లకు మించకూడదు. అంతకు మించి జనాభాకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మనం సిద్ధంగా లేము. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి. ఒక వేళ వారు మూడో బిడ్డను కంటే.. ఆ బిడ్డను ఓటు హక్కుకు దూరం చేసేలా చట్టం రూపొందించాలి. అలాగే, అతడు\ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. ఎటువంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాందేవ్ సూచించారు. అలాగే మన దేశంలో గోవధలపై పూర్తిగా నిషేధం విధించాన్నారు. అలాంటప్పుడే ఆవుల అక్రమ రవాణాదార్లు, గోరక్షకులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగిపోతాయని రాందేవ్ వ్యాఖ్యానించారు. -
ఆయన చేతిలోనే దేశం భద్రం : బాబా రాందేవ్
జోధ్‌పూర్ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతిలోనే దేశం భద్రంగా ఉంటుందని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు. మోదీని ఓడించడానికి దేశ వ్యతిరేక శక్తులు కోట్ల రూపాయలను సమకూర్చుతున్నాయన్నారు. బుధవారం బీజేపీకి మద్దతుగా జైపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా భారత ఎన్నికలపైనే దృష్టిసారించింది. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దని దేశ వ్యతిరేక శక్తులు, ముస్లిం, క్రిస్టియన్ దేశాలు కోట్ల రూపాయలను సమకూర్చుతున్నాయి. అసలు మోదీ ఏం తప్పు చేశారు? దేశం సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. దేశ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్వప్రయోజనాల కోసం పని చేయలేదు. ఆయనకు కుటుంబం లేదు. సొంత ఇల్లు లేదు. అలాంటి మోదీకి మనమంతా మద్దతుగా నిలవాలి. అతని చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. సైనికులు, మహిళలు, రైతులు అందరికి రక్షణ, భరోసా ఉంటుంది.’ అని బాబా రాందేవ్ ప్రజలకు సూచించారు. -
‘సన్యాసులకు భారతరత్న ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న’ ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.(ప్రణబ్‌దా భారతరత్న ) గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు కనీసం ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం దరదృష్టకరం. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నా’ అని రాందేవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘బ్యాంక్లున్నది విజయ్ మాల్యా లాంటి వారి కోసం కాదు’
ముంబై : మోదీ నాయకత్వం మీద, విధానాల గురించి జనాలకు ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ అందరిలాంటి వారు కాదు. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారా’ అని అడగ్గా.. ఇలాంటి రాజకీయ ప్రశ్నలకు సమాధనం ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నారు రామ్‌దేవ్. అయన మాట్లాడుతూ.. ఒక విషయం అయితే చెప్పగలను.. మోదీ నాయకత్వం, విధానల పట్ల జనాలకు ఇంకా నమ్మకం ఉంది. మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయరు అంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమీ మాత్రమే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగల్గుతుందని పేర్కొన్న రాందేవ్.. ఈ సందర్భ్ంగా నల్లధనం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల ధనం సమానంగా ఉంది. అయితే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బును ఏం చేయాలి అని. ఈ మొత్తాన్ని వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ఉత్పత్తి రంగాలకు కేటాయిస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారిందని తెలిపారు. అయితే మరిన్ని సంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు కూడా ఇందుకు సహాకారం తెలపాలని కోరారు. సాయం కావాలని బ్యాంకుకు వచ్చిన వారిలో విజయ్ మాల్యా ఎవరో.. నిజాయతి పరుడు ఎవరో గుర్తించగలగే సామార్థ్యం బ్యాంక్‌లకు ఉండాలని తెలిపారు. ఎందుకంటే బ్యాంకులున్నది నిజాయతిపరుల కోసం కానీ విజయ్ మాల్లా లాంటి వారి కోసం కాదని వ్యాఖ్యానించారు. -
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే..
హరిద్వార్ : జనాభా నియంత్రణపై నిత్యం మాట్లాడే బ్రహ్మచారి. యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి మరో సూచన చేశారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న దంపతుల ఓటు హక్కు రద్దు చేయాలని రాందేవ్ పేర్కొన్నారు. ఈ దేశంలో పెళ్లి చేసుకోని తనలాంటి సన్యాసులను గౌరవించాలని, పెళ్లి చేసుకుని ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లల్ని కనే జంటల ఓటింగ్ హక్కులను రద్దు చేయడం మేలని సూచించారు. ఆదివారం హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో సహచరులను ఉద్దేశించి బాబా రాందేవ్ ఈ వాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో పది మంది సంతానాన్ని కనేందుకు సైతం మన వేదాలు అనుమతించాయని, ఇప్పటికే దేశ జనాభా 125 కోట్లు దాటిన క్రమంలో ప్రస్తుతం అధిక సంతానం మనకు అవసరం లేదన్నారు. భార్యా పిల్లలు లేకుండా తాము ఎంత సుఖంగా ఉంటామో చూడాలని రాందేవ్ చమత్కరించారు. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాం
శంషాబాద్: పతంజలి సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వెయ్యిమంది నిరుద్యోగులకు పంపిణీదారులు, సేల్స్మెన్లుగా ఉపాధి కల్పిస్తున్నట్లు యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు పతంజలి సంస్థ ఉద్యోగులు, అభిమానులు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన విదేశీ సంస్థల పెత్తనం ఇప్పుడు వ్యవసాయరంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. లక్షల కోట్ల రూపాయల భారత దేశ ధనం విదేశాలకు పోతోందన్నారు. దేశ ప్రజల్లో స్వదేశీ వస్తువుల వాడకంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించే చైతన్యవంతమైన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. -
కింభో కథ కంచికేనా ?
స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి సంస్థ డిజిటల్ రంగంలోనూ తన సత్తా చాటాలనుకుంది. వాట్సాప్‌కి ఈ స్వదేశీ యాప్‌తో సవాల్ విసురుతున్నాం అంటూ కొత్త మెసేజింగ్ యాప్ కింభోను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారత్ మాట్లాడుతోంది అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్ ప్రవేశపెట్టి 24 గంటలు తిరగక ముందే దాని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా కింభో అదృశ్యమైంది. ఈ యాప్‌కి ఏ మాత్రం సెక్యూరిటీ లేదన్న విమర్శలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎందుకు తొలగించారు ? కింభో యాప్ తయారీదారులు పతంజలి కమ్యూనికేషన్స్ దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. పూర్తి స్వదేశీ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ మెసెంజర్ యాప్‌లో పాకిస్తాన్ నటీమణి మావ్రా హోకేన్ ఫోటోను వాడడం ఇబ్బందికరంగా మారింది. అదీ కాకుండా కింభో యాప్ బోలో అన్న యాప్‌కి మక్కీకి మక్కీ కాపీ అంటూ ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తాయి. ఇది స్వదేశీ యాప్ కాదు కాపీ క్యాట్ అంటూ రెండు యాప్‌ల స్క్రీన్షాట్లు పక్క పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల్లో ట్రాల్ కావడంతో దీనిని ప్రస్తుతానికి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ కనిపించకపోవడంపై కింభో సాంకేతిక బృందం వివరణ ఇచ్చింది. తాము ఊహించని దానికంటే అధికంగా స్పందన రావడంతో సర్వర్లు అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ ట్వీట్ చేసింది. కింభో ఒక భద్రతా విపత్తు : ఫ్రెంచి నిపుణులు కింభో యాప్ వచ్చిన ఒక్క రోజులోనే దాని చుట్టూ ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. భద్రతాపరంగా అదొక పైఫల్యాల పుట్ట అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కింభో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని ఫ్రెంచి సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఎలియట్ ఆల్డర్సన్ కింభో యాప్‌ని ఒక పెద్ద జోక్ అంటూ అభివర్ణించారు..‘ కింభో యాప్ నిండా సాంకేతిక లోపాలే ఉన్నాయి. దీనిని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇది అచ్చంగా బోలో అన్న అప్లికేషన్‌కు కాపీలా ఉంది. అంతేకాదు కింభో యాప్ బోలోమెసేంజర్.కామ్‌కి రిక్వెస్ట్ కూడా పంపుతోంది‘ అని అల్డర్సన్ ట్వీట్ చేశారు. ఈ యాప్‌ని వినియోగించే ప్రతీ ఒక్కరికీ తాను యాక్సెస్ అయి వారి మెసేజ్‌లు చదవగలుగుతున్నానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. కింభో ఎలా ఉంది ? కింభో అచ్చంగా వాట్సాప్‌ని తలపించేలా ఉంది. మెసేజింగ్, ఆడియా చాట్, వీడియో కాలింగ్, గ్రూప్స్ ఏర్పాటు, ఫోటోలు వీడియోల షేరింగ్, స్టిక్కర్స్, క్వికీస్, గ్రాఫిక్స్ ఇలా అన్ని రకాల ఫీచర్లతో వాట్సాప్‌ను పోలి ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇంతే కాకుండా సెలిబ్రిటీలను ఫాలో అయ్యే కొత్త ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు. కింభో అంటే సంస్కృతంలో ఎలా ఉన్నారు ? ఏంటి కొత్త విషయాలు ? అని అర్థం. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ యాప్‌కి అందరూ అడిగే మొట్టమొదటి కుశల ప్రశ్న ఎలా ఉన్నారు అన్న అర్థం వచ్చేలా కింభో అన్న పేరు పెట్టారు. ఇక లోగో దగ్గర్నుంచి మిగిలినవన్నీ ఇంచుమించుగా వాట్సాప్ మాదిరిగానే ఉన్నాయి. భారత్‌లో మొట్టమొదటి మెసేజింగ్ యాప్ ఇదే.. ‘ఇది మన స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. వాట్సాప్‌ను సవాల్ చేసేలా ఈ యాప్ డిజైన్ చేశాం.‘ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. తిజరావాలా ట్వీట్ చేశారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడంతో దీని కథ ఇక కంచికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వాట్సాప్ డౌన్లోడ్లు 100 కోట్లు దాటిపోవడంతో, ఎంత స్వదేశీ రంగు పూసినా ఏ మెసేజింగ్ యాప్‌కి వాట్సాప్‌ని ఎదుర్కొనే సత్తా సమీప భవిష్యత్‌లో ఉండదనే అభిప్రాయమైతే వినిపిస్తోంది. -
రాందేవ్ ‘కింబో’ యాప్ మహా డేంజర్..!
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్‌కు కిల్లర్‌గా, బాబా రాందేవ్ స్వదేశీ యాప్ అంటూ తీసుకొచ్చిన ‘కింబో’ యాప్‌తో ప్రమాదమేనట. అందుకే ఈ యాప్‌ను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేశారు. ఐఫోన్ కంపెనీ కూడా తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను తొలగించింది. కేవలం గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్‌లో మాత్రమే కాక, కింబో పేజీ యాప్‌లో కూడా ఇది ఓపెన్ కావడం లేదు. దానిలోకి లింక్స్‌ను క్లిక్ చేస్తే, ఎర్రర్ చూపిస్తోంది. అయితే ఎందుకు కింబో యాప్‌ను గూగుల్, ఆపిల్లు తమ సంబంధిత స్టోర్లలో డిలీట్ చేశాయో స్పష్టమైన కారణం తెలియడం లేదు. కానీ డెవలపర్లు మాత్రం ఈ యాప్ ప్రమాదకరమని, బగ్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఒక ట్విటర్ యూజర్, కింబో యాప్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశాడు. దానిలో స్వదేశీ యాప్, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్ కూడా వాడుతుందని పేర్కొన్నాడు. భారతీయుల కోసం భారతీయులు రూపొందించిన ఈ స్వదేశీ యాప్‌లో పాకిస్తానీ నటి ఫోటో కనిపించడం ఏమిటి? అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఆధార్ సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలున్నాయనిద ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ ఇలియట్ ఆండర్సన్ అన్నారు. ఈ యాప్ చాలా బగ్స్‌తో కూడుకుని ఉందని, యూజర్లు ఈ యాప్ వాడుతూ పంపించుకున్న మెసేజ్‌లన్నీ తాను యాక్సస్ చేయగలుగుతున్నానని పేర్కొన్నారు. పతంజలి కమ్యూనికేషన్స్ కూడా ఈ బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోనే కింబో యాప్‌ను డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ యాప్ మొత్తం ఒక జోక్‌గా అభివర్ణించారు. ‘ఓకే, నేను ఇక్కడితో ఆపుతున్నా. కింబో ఆండ్రాయిడ్ యాప్ అనేది భద్రతా విపత్తు. యూజర్ల మెసేజ్‌లన్నీ నేను యాక్సస్ చేయగలను. ఈ కింబోయాప్ పెద్ద జోక్. ఈ సమయంలో దీన్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటేనే మేలు’ అని ఇలియట్ ట్వీట్ చేశారు. ఇది బోలో మెసెంజర్‌ను కాఫీ చేసిందనే ఆరోపణలతో కూడా కింబోను ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. కింబోయాప్ మరో అప్లికేషన్ కాపీ పేస్టని, వీటి స్క్రీన్షాట్లు, వివరాలు అన్నీ సమానంగా ఉన్నాయి అని ఇలియట్‌తో పాటు మరో ట్విటర్ యూజర్ కూడా ట్వీట్ చేశాడు. -
ఇక పతంజలి సిమ్ కార్డులు..!
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ సిమ్ కార్డ్ చూసుంటాం. వొడాఫోన్, ఐడియా, జియో ఇలా వివిధ కంపెనీలకు చెందిన సిమ్ కార్డ్‌ల గురించి మనకు తెలుసు. రానున్న రోజుల్లో పతంజలి సిమ్ కార్డ్‌లనూ చూడబోతున్నాం. నిజమే!! యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ కంపెనీ... త్వరలో సిమ్ కార్డుల్ని తీసుకొస్తోంది. ‘స్వదేశీ సమృద్ధి’ పేరిట ఈ సిమ్‌లను బాబా రామ్‌దేవ్ మార్కెట్లోకి విడుదల చేశారు కూడా. పతంజలి సంస్థ సిమ్ కార్డ్ సేవల కోసం ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్తో జట్టుకట్టింది. సిమ్ల ఆవిష్కరణతో పతంజలి టెలికం రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లయింది. పతంజలి ప్రస్తుతం ఫుడ్, ఆయుర్వేద్ మెడిసిన్, కాస్మటిక్స్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ విభాగాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే Patanjaliayurved.net ప్రారంభంతో ఈ–కామర్స్‌లోకి కూడా ప్రవేశించింది. పతంజలి డైవర్సిఫికేషన్ ప్రణాళికలు? ఎలక్ట్రిక్ వెహికల్స్, స్టీల్, మొబైల్ చిప్ తయారీ కంపెనీలు తమ మద్దతును కోరినట్లు పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. కొన్ని కంపెనీలు భాగస్వామ్యాన్ని ఆశిస్తే, మరికొన్ని ఆర్థిక సహాయాన్ని కోరాయన్నారు. అయితే తాము ఇప్పటికీ డైవర్సిఫికేషన్‌కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తామని, అలాగే ఇక్కడి సంస్థలతోనే జతకడతామని తెలిపారు. ‘స్టీల్, ఎలక్ట్రిక్ వెహికల్, యాంటి– రేడియేషన్ మొబైల్ చిప్ సహా దాదాపు అన్ని రంగాలకు చెందిన తయారీదారులు మమ్మల్ని సంప్రతించారు. మేం అన్ని వ్యాపారాలూ చేయలేం. మా బిజినెస్‌కు ఏమైతే అనుకూలమో వాటినే చేస్తాం’ అని వివరించారు. అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్ కొనుగోలుతో పతంజలి.. సోలార్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ కొనుగోలు రేసులోనూ ముందుంది. ఆఫర్ ధరను రూ.4,300 కోట్లకు పెంచింది. ఇది అదానీ గ్రూప్ ఆఫర్ కంటే 30 శాతం అధికం. ఈ ఆఫర్లపై చర్చించడానికి రుచి సోయా రుణ దాతల కమిటీ రేపు(బుధవారం) సమావేశం కావచ్చు. పతంజలి ప్రధాన బిజినెస్ ప్యాకేజ్డ్ కన్సూమర్ గూడ్స్. కంపెనీకి రిటైల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ (ఆయుర్వేద్) విభాగాల్లోనూ కార్యకలాపాలున్నాయి. కంపెనీ షాంపు, టూత్‌పేస్ట్ నుంచి బిస్కట్లు, నూడిల్స్, బియ్యం, గోధుమ వరకు చాలా ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఇతర విభాగాల్లోకి ఎందుకంటే.. పతంజలి ఆదాయాల వృద్ధి రేటు నిలిచిపోయింది. రెట్టింపు అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల కారణంగా కంపెనీకి సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం దాదాపు 2016–17 ఏడాది మాదిరిగానే ఉంది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.10,561 కోట్లు. అందుకే పతంజలి డైవర్సిఫికేషన్‌కు ప్రాధాన్యమిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బీ2బీ, బీ2సీ వ్యాపారాల మధ్య చాలా వ్యత్యాసాలుంటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇవీ... సిమ్ కార్డు విశేషాలు ♦ తొలిదశలో పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందే స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల ప్రయోజనాలను పొందగలరు. ఈ స్కీమ్ గనక విజయవంతమైతే... వీటిని సామాన్య ప్రజలకూ అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా సంస్థ తెలిపింది. ♦ స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల ద్వారా అర్జించిన లాభాలను దేశ ప్రజల సంక్షేమానికి వినియోగిస్తామని పతంజిలి పేర్కొంది. ♦ సిమ్ కార్డులను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తెచ్చిన తర్వాత.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్ తీసుకున్నవారు పతంజలి ప్రొడక్టులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. అలాగే ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా ప్రయోజనాలూ ఉంటాయి. ♦ స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్‌పై రూ.144 రీచార్జ్‌తో అపరిమిత కాల్స్, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. ఈ ప్యాక్ వాలిడిటీ మాత్రం వెల్లడి కాలేదు. ♦ బీఎస్ఎన్ఎల్కు చెందిన ఐదు లక్షల కౌంటర్ల ద్వారా త్వరలో వినియోగదారులు పతంజలి సిమ్ కార్డులను పొందొచ్చని రాందేవ్ బాబా చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది. -
టెలికాం మార్కెట్లోకి పతంజలి బ్రాండు
-
జియోకు పోటీనా? పతంజలి సిమ్ కార్డులు
హరిద్వార్ : టెలికాం మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు గట్టి పోటీ వచ్చేసింది. దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్ బాబా పతంజలి బ్రాండు ఆదివారం టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను రాందేవ్ బాబా లాంచ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంలో ఈ సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు. రిలయన్స్ జియో కూడా తొలుత తన జియో సిమ్ కార్డును లాంచ్ చేసినప్పుడు, ఉద్యోగులకే మొదట దాని ప్రయోజనాలను అందజేసింది. అనంతరం కమర్షియల్‌గా మార్కెట్లోకి లాంచ్ అయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పతంజలి లాంచ్ చేసిన ఈ సేవలు పూర్తిగా మార్కెట్లోకి వచ్చిన అనంతరం, ఈ కార్డులతో పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. కేవలం 144 రీఛార్జ్‌తో దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకునే సౌకర్యం, 2జీబీ డేటా ప్యాక్, 100 ఎస్ఎంఎస్లను కంపెనీ ఆఫర్ చేయనుంది.వాటితో పాటు ప్రజలకు ఈ సిమ్ కార్డులపై వైద్య, ప్రమాద, జీవిత బీమాలను పతంజలి అందించనుంది. బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ నెట్వర్క్’ అని ఈ సందర్భంగా రాందేవ్ అన్నారు. పతంజలి, బీఎస్ఎన్ఎల్ ఇరు కంపెనీల ఉద్దేశ్యం కూడా దేశ సంక్షేమమేనని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న ఐదు లక్షల కౌంటర్లలో, పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డులు ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పతంజలితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంపై బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునిల్ గార్గ్ ఆనందం వ్యక్తం చేశారు. -
జిన్నా ఫొటో అంత ముఖ్యమా!: రాందేవ్
పట్నా: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో వివాదంగా మారిన మహ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా స్పందించారు. ముస్లింలు చిత్ర పటాలకు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వరని, కానీ జిన్నా ఫొటోకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. బిహార్‌లోని ప్రతిష్టాత్మక నలందాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా వారి దేశానికి గొప్పవ్యక్తి కావచ్చు. భారతదేశ ఐక్యత, సమగ్రతను నమ్మేవారు జిన్నాను ఆదర్శ వ్యక్తిగా భావించకూడదు. ముస్లిం మతస్తులు విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రాధాన్యత ఇవ్వరు. అందులో భాగంగానే జిన్నా చిత్రపటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని’ పేర్కొన్నారు. కాగా మే 3న యూనివర్సిటీ విద్యార్థులకు, హిందూత్వ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 28 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. -
ప్రపంచ వేదికపై రామ్‌దేవ్ శిష్యుల మ్యాజిక్
సాక్షి, న్యూఢిల్లీ : దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రదర్శించే అవకాశం దక్కింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో నిత్యం ఒత్తిడికి గురయ్యే నేతలకు యోగా పాఠాలతో ఉపశమనం కలిగించనున్నారు. వారికి పతంజలి యోగా గురువులు.. ఆచార్య భరద్వాజ్, ఆచార్య స్మిత్ యోగాసనాలు నేర్పించనున్నారు. ఈ విషయాన్ని యోగా గురువు బాబా రామ్‌దేవ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రతినిధి బృందంలో భాగస్వాములైన ఈ ఇద్దరు యోగా గురువులు వచ్చేవారం నుంచి పాఠాలు మొదలుపెడతారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా సుమారు 70 మంది ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ దేశాలకు చెందిన ఉన్నతశ్రేణి బ్యాంకర్లు ఇందులో భాగం కానున్నారు. ప్రపంచ వేదికపై భారత సౌరభం: రమేశ్ అభిషేక్ భారత సంస్కృతి, వారసత్వాలతోపాటు సాధించిన విజయాలు, భారతీయ వంటకాల రుచులు, యోగాను ప్రదర్శించేందుకు, దానికి ప్రచారం కల్పించేందుకు ప్రపంచ ఆర్ధిక వేదికను వినియోగించుకోనున్నామని పారిశ్రామిక విధాన, ప్రచార సారథి రమేశ్ అభిషేక్ చెప్పారు. చైనా తర్వాత ప్రపంచ ఆర్థికవ్యవస్థను అత్యంత ప్రభావితం చేయగలిగే శక్తి భారత్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో హాజరయ్యేందుకు ప్రధాని మోదీ కూడా బయలుదేరారు. 1997లో అప్పటి ప్రధాని హెచ్. డి. దేవెగౌడ పాల్గొనగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత ఎకానమీ 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణమించిన నేపథ్యంలో మోదీ దావోస్ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. ఎయిర్‌బస్, హిటాచి, ఐబీఎమ్ వంటి దాదాపు 60 ప్రధాన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఐదు రోజులపాటు జరగనున్నఈ సదస్సులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి సురేశ్ ప్రభు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతోపాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మోదీ కేవలం ఒక్కరోజు మాత్రమే అక్కడ బస చేయనున్నారు. -
వెయ్యి స్టోర్లు.. 500 కోట్ల ఆదాయం
ముంబై: ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌కి చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ శ్రీశ్రీ తత్వ... తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆన్లైన్లో పరిమిత స్థాయిలో ఉన్న లావాదేవీలను మరింత పెంచుకునేందుకు ఆన్లైన్ రిటైల్ సంస్థ బిగ్‌బాస్కెట్‌తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ఏడాది ఆఖరుకల్లా 1,000 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ అరవింద్ వర్చస్వి తెలిపారు. ఫ్రాంచైజీ విధానంలో ప్రారంభించే ఈ స్టోర్స్ కోసం ఫ్రాంచైజీ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీశ్రీ తత్వ మార్ట్, శ్రీశ్రీ తత్వ వెల్నెస్ ప్లేస్, శ్రీశ్రీ తత్వ హోమ్ అండ్ హెల్త్ పేరిట మూడు రకాల స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అరవింద్ తెలిపారు. మార్ట్‌లో ఆహారోత్పత్తులు, హోమ్ కేర్ ఉత్పత్తులు ఉంటాయని, వెల్నెస్ ప్లేస్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులతో పాటు హెల్త్‌కేర్ నిపుణులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారాయన. ఇక, హోమ్ అండ్ హెల్త్ బ్రాండ్ స్టోర్స్‌లో రోజువారీ ఉపయోగించే అన్ని ఉత్పత్తులు, ఔషధాలతో పాటు ఆయుర్వేద వైద్యులు కూడా ఉంటారని తెలియజేశారు. కంపెనీ ప్రస్తుతం 33 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఈ ఏడాది ప్రధానంగా లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, రష్యా, తూర్పు యూరప్, మధ్యప్రాచ్య ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ తెలియజేశారు. యోగా గురు రాందేవ్ బాబాకి చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా.. పలు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
హరిద్వార్ టు హర్ ద్వార్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి తమ దూకుడును మరింత పెంచింది. తన ఉత్పత్తులతో దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీలకు దడ పుట్టిస్తున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆన్లైన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపింది. ఇకపై హరిద్వార్ నుంచి హర్ ద్వార్ దాకా (హరి ద్వారా నుంచి ప్రతి గుమ్మం దాకా) అని తమ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పలు ప్రముఖ ఇ-రీటైలర్లు , అగ్రిగేటర్లతో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీంతో ఇక మీదట ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఇతర ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి యోగా గురు రాం దేవ్ మంగళవారం న్యూఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ల్,షాప్ క్లూస్, బిగ్ బాస్కేట్, నెట్ మెడ్, వన్ ఎంజీ అఫీషియల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. పలు గృహా అవసరాలతోపాటు, ఆయుర్వేద మందులు, పానీయాలు లాంటి పలు రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల సోలార్ ఉత్పత్తులపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఉత్పత్తులు ఇప్పటికే ఇతర విక్రయదారుల ద్వారా అనేక ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో లభ్యమవుతున్నప్పటికీ ఇపుడిక ఇకపై ఒక క్రమపద్ధతిలో కస్టమర్ల ముంగిళ్లకు అందుబాటులోకి రానున్నాయి. Now world class Patanjali products will be available from Haridwar to Har Dwar, just on a click #PatanjaliOnline pic.twitter.com/phhiiFIyuc — Swami Ramdev (@yogrishiramdev) January 16, 2018 -
సానిటరీ ప్యాడ్స్‌పై పతంజలి దృష్టి
న్యూఢిల్లీ : రాందేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలి ప్రొడక్ట్స్ రోజురోజుకు తన ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంటూపోతోంది. ఇప్పటికే వివిధ రకాల మార్కెట్లపై దృష్టి సారించిన పతంజలి గ్రూప్ తాజాగా ఆరోగ్యకరమైన న్యాప్కిన్లు, డైపర్ల తయారీపై ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఈ రంగంలో రూ. 16వేల కోట్ల మార్కెట్ సాధిస్తామని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే గుప్తా తెలిపారు. 2006లో మొదటిసారి హెర్బల్ ఉత్పత్తులతో ప్రస్థానం ప్రారంభించిన పతంజలి గ్రూప్.. ఆ తర్వాత న్యూడిల్స్, కాస్మోటిక్స్, పిల్లలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా పతంజలి స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్ జాబితాలో గత సంవత్సరం 45వ స్థానంలో ఉన్న పతంజలి గ్రూప్ ఈ ఏడాది 19వ స్థానంలో నిలిచింది. -
పసుపు బోర్డు ఏర్పాటుకు నిరంతర పోరు..
సాక్షి, నిజామాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఇదే విషయంపై కేంద్రానికి రాందేవ్ బాబా లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన లేఖ వల్ల పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. చాలామంది ముఖ్యమంత్రి, జాతీయ నేతలు కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పసుపు రైతులకు మేలు జరిగే ఈ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గత కొంతకాలంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీల ద్వారా ఎంపీ కవిత కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవలి హరిద్వార్ వెళ్లిన కవిత, పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను రాందేవ్ బాబాకు వివరించారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అసోం, కేరళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా కాగా పసుపు పండించే రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు మద్దతు ధర నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ...రాందేవ్ బాబా లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు ఆయన ఈ లేఖ రాశారు. -
ఒప్పందం
నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ భూముల్లో ప్రతిష్టాత్మకమైన పతంజలి గ్రూపు ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. బుధవారం ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు పతంజలి సీఎండీ రాందేవ్ బాబా, సీఈవో బాలకృష్ణతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనం తరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పతంజలి గ్రూప్ బాధ్యులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పతంజలి గ్రూపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రైతులు తమ పంట ఉత్పత్తులన్నీ ఒకే చోట అమ్ముకునేందుకు వీలుంది. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా పతంజలి కంపెనీవారికి అమ్ముకోవచ్చు. ముఖ్యంగా పసుపు రైతులకు కష్టాలు తీరుతాయి. ఆర్మూర్: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్ వారి ఆహారశుద్ధి కేంద్రాన్ని ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ భూముల్లో ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గల పతంజలి కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు పతంజలి సీఎండీ రామ్‌దేవ్ బాబా, సీఈవో ఆచార్య బాలకృష్ణతో బుధవారం సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం పతంజలి గ్రూప్ బాధ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం పసుపు ఉత్పత్తిలో దేశంలోనే మంచి స్థానంలో ఉండటంతో పాటు నాణ్యమైన పసుపు ఇక్కడ పండుతుండటంతో ఆయుర్వేద, ఆహార ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్న పతంజలి గ్రూప్‌ను ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ కవిత స్వయంగా రామ్‌దేవ్ బాబా వద్దకు వెళ్లి గతేడాది నవంబర్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ కవిత ఆహ్వానంమేరకు గతేడాది నవంబర్ 15న జిల్లాకు వచ్చిన పతంజలి గ్రూప్ సీఈవో బాలకృష్ణ ఆర్మూర్ ప్రాంతంలో, నందిపేట మండలం లక్కంపల్లిలో పర్యటించి ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హరిద్వార్‌లోని రామ్‌దేవ్ బాబాతో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రాథమికంగా ఎంవోయూ చేసుకునేందుకు అధికారులతో రావాల్సిందిగా ఎంపీ కవితను కోరారు. దీంతో ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఎస్ ఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, నందిపేట మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు హరిద్వార్‌కు వెళ్లారు. హరిద్వార్‌లో తమ పరిశ్రమలలో వస్తు ఉత్పత్తి కేంద్రాలు, ప్యాకింగ్ యూనిట్లు, పరిశోధన విభాగాలు, మందుల తయారీ కేంద్రాలను ఎంపీ కవితతో పాటు వచ్చిన బృందానికి చూపించారు. యువతకు ఉపాధి అవకాశాలు.. లక్కంపల్లిలో పతంజలి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ (ఆహార శుద్ధి కర్మాగారం)లో పసుపు, మిర్చి, మక్కలు, సోయాబీన్ తదితర సుగంధ ద్రవ్య, తృణ ధాన్యాలను సేకరించి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన ధాన్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు. లక్కంపల్లిలో పరిశ్రమ ఏర్పాటు చేయడంతో పతంజలి వారికి కావాల్సిన పసుపు, మిర్చి, సోయాబీన్, మక్కలు తదితర నాణ్యతతో కూడిన పంటలు పెద్దఎత్తున ఒకే చోట లభించనున్నాయి. అలాగే ఈ పరిశ్రమ ఏర్పాటుతో రైతులు కూడా లబ్ధి పొందనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాంత రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా కంపెనీకి అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పసుపు రైతులకు మంచిరోజులు.. జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. వాణిజ్య పంట అయిన పసుపునకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఔషధాల తయారీ, కాస్మోటిక్స్‌ల తయారీలో పసుపును ఉపయోగిస్తుంటారు. జిల్లాలో రైతులు జూన్‌లో పసుపు పంటను విత్తుతారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది. రైతులు పాటించే మెరుగైన యాజమాన్య పద్ధతులను బట్టి ఎకరానికి 12 నుంచి 20 క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. రైతులు వ్యయ, ప్రయాసలకోర్చి పండించిన పంటను నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్లో పంటను అమ్ముతుంటారు. దీంతో రవాణా ఖర్చులు రైతులకు అదనంగా పడుతున్నాయి. పసుపు పంటను పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఏటా ఆర్థికంగా నష్టపోతున్నారు. పతంజలి పరిశ్రమల ఏర్పాటుతో పసుపు రైతుల కష్టాలు తీరి మంచిరోజులు రానున్నాయి. రైతులకు మేలు.. – ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఇప్పటికే పసుపు పండించే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాం. పతంజలి ఉత్పత్తుల కోసం పసుపు కొనుగోలు, పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సైతం లభించనున్నాయి. -
రాందేవ్ శిష్యురాలికి ఫత్వా
రాంచీ : యోగా శిక్షణ తక్షణం ఆపాలంటూ రఫియా నాజ్‌కు ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. ఒక ముస్లింగా జన్మించి.. యోగా శిక్షణ ఎలా ఇస్తావంటూ మత సంస్థలు ఆమెను ప్రశ్నించాయి. యోగా ట్రయినింగ్ ఇవ్వడం తక్షణం ఆపాలని.. లేదంటే ప్రాణాలకు హాని తప్పదని సదరు సంస్థలు రఫియా నాజ్‌ను హెచ్చరించాయి. ముస్లింల సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రఫియాకు కట్టుదిట్టమైన భద్రతను జార్ఖండ్ ప్రభుత్వం కల్పించింది. మత సంస్థల హెచ్చరికలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రధానకార్యదర్శి సంజయ్ కుమార్ స్పందించారు. రఫియాకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. రఫియా నాజ్‌కు ఆమె కుటుంబ సభ్యులకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుల్దీప్ ద్వివేదీ తెలిపారు. రఫియా నాజ్ పలు సందర్భాల్లో యోగా గురు రామ్‌దేవ్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె యోగా మెళుకువలు నేర్పేవారు. -
క్రాకర్స్ బ్యాన్పై రాందేవ్ బాబా మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్ పరధిలో దీపావళి రోజున టపాసుల కాల్చడంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పుపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఉన్నత న్యాయస్థాన నిర్ణయాన్ని పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురు రాందేవ్ బాబా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఓ ప్రత్యేక సమాజాన్ని మాత్రమే టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కేవలం హిందూవులను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. హిందూ పండుగలపై మాత్రమే నిషేధం విధించడం చాలా తప్పు అని అన్నారు. ప్రతిదాన్ని న్యాయ దిశగా తీసుకెళ్లడం సరియైనదేనా? అని ప్రశ్నించారు. తాను స్కూళ్లను, యూనివర్సిటీలను నడిపిస్తున్నానని, అక్కడ చేతితో పట్టుకుని కాల్చే బాణాసంచాలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఎక్కువ ఆర్భాటాలకు పోయి చేసే టపాసులను తాము సపోర్టు చేయడం లేదని, ఈ నిషేధం కేవలం పెద్ద పెద్ద టపాసులపై ఉండాలన్నారు. ఇదేవిషయంపై యోగా గురు, శశి థరూర్‌పై కూడా మండిపడ్డారు. థరూర్ లాంటి ఒక తెలివైన మనిషి ఇలా మాట్లాడకూడదన్నారు. పటాకుల నిషేధాన్ని సపోర్టు చేస్తూ.. టపాసులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయంటూ థరూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై రాందేవ్ బాబా స్పందించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో టపాసులను అమ్మకూడదని సుప్రీంకోర్టు అక్టోబర్ 9న తీర్పు ఇచ్చింది. నవంబర్ 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. -
ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు ‘పతంజలి’
న్యూఢిల్లీ: పతంజలి బ్రాండ్ వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల విలువకు ఎదుగుతుందని ఆ సంస్థ అధినేత రామ్‌దేవ్ బాబా అన్నారు. కొత్త విభాగాల్లోకి కంపెనీ ప్రవేశించనుందని, సమీకృత ఆహార పార్కులు, తయారీ కేంద్రాలు వీటిలో ఉన్నాయని చెప్పారు. రానున్న రెండేళ్లలో రూ.లక్ష కోట్ల విలువ తయారీ సామర్థ్యాలు కంపెనీకి ఉంటాయన్నారు. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ అనుకుంటోంది. మార్కెట్ సైజు రూ.10 లక్షల కోట్లకు పైగా ఉన్న పలు విభాగాల్లో ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని, వీటిలో రానున్న మూడు నుంచి ఐదేళ్లలో 10–20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు. 2016–17లో పతంజలి టర్నోవర్ రూ.10,561 కోట్లుగా ఉంది. డెనిమ్, తాగునీరు, సెక్యూరిటీ సేవల్లోకి అడుగు పెడుతోంది. -
జిహాద్ అనే మకిలిని తొలగించొచ్చు: రామ్‌దేవ్
న్యూఢిల్లీ: కశ్మీర్ వ్యాలీలో కల్లోలం సృష్టిస్తున్న వారి బుర్రల్లోని ఆలోచన మారాలంటే యోగా చేయాలని యోగా గురు రామ్‌దేవ్ బాబా సూచించారు. యోగా మనిషి మెదడును అదుపు చేస్తుందని, మానవ మృగాలుగా మారకుండా అడ్డుకుంటుందని చెప్పారు. యోగాలో పరిణితి సాధించిన ఏ ఒక్కరూ కూడా ఉగ్రవాదం వైపు అడుగులు వేయలేదని చరిత్ర చెబుతోందని అన్నారు. వ్యాలీలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన పిల్లలకు సమాజంలోని అన్ని విషయాలను బోధపడేలా చెప్పాలని సూచించారు. అన్ని రకాల మతాల గురించి, వాటి వైవిధ్య భరితమైన చరిత్రల గురించి వారికి వివరించినప్పుడే భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుందని అన్నారు. వ్యాలీలో అశాంతిని నింపుతున్న ఉగ్రవాదుల గుంపునకు యోగా నేర్పించడం ద్వారా వారి మనసుకు అంటుకున్న జిహాద్ అనే మకిలిని తొలగించొచ్చని తాను నమ్ముతున్నట్లు ఇండియా టీవీ కాన్క్లేవ్లో చెప్పారు. చైనా వస్తువులను భారతీయులు స్వచ్చందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న చైనా దేశానికి చెందిన వస్తువులను బహిష్కరించడంలో తప్పేమీ లేదని అన్నారు. త్వరలో జమ్మూకశ్మీర్‌లో పతంజలి యూనిట్‌ను స్ధాపించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం 150 ఎకరాల స్ధలాన్ని సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన యువతకు అందులో ఉద్యోగవకాశాలు కల్పిస్తానని చెప్పారు. -
‘అక్కడ చనిపోయి ఏడుస్తుంటే రాందేవ్‌తో యోగా’
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో రైతులంతా ఏడుస్తుంటే ఆయన ఏం చక్కా యోగాగురువు రాందేవ్ బాబాతో కలిసి యోగాలో పాల్గొనడం ధుమారం రేపుతోంది. ఓపక్క మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయి పెద్ద వివాదం అవుతుండగా ఆ విషయం ఏమీ పట్టనట్లు ఉన్న ఆయన బిహార్‌లోని మోతిహారీలో ఓ ప్రాంతంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాందేవ్‌తో కలిసి పాలుపంచుకున్నారు. ఇప్పుడా విషయం విమర్శలకు తావిస్తోంది. మూడు రోజుల కార్యక్రమంగా రాందేవ్ ఇక్కడ యోగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల మృతి విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర విమర్శలు పేలుతున్న విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లోనే రైతులు చనిపోయారని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాత్రం పోలీసులకు రైతుల మరణానికి సంబంధం లేదంటూ సమస్య తీవ్రతను దాటవేశారు. -
తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!
పతంజలి ఆయుర్వేద పేరుతో మార్కెట్లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతోపాటు కేఎఫ్‌సీ, సబ్వే రెస్టారెంట్లను కూడా టార్గెట్ చేసేలా ఉన్నారు. కొత్తగా రెస్టారెంటు వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి.. అసలైన భారతీయ వంటకాలను అందించడం ద్వారా వాటి వ్యాపారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఓపెన్ చేయాలని పతంజలి గ్రూపు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని రాందేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే టూత్ పేస్టు నుంచి రకరకాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి.. వాటికి మంచి ఆదరణ కూడా పొందిన పతంజలి సంస్థ.. ఇప్పుడు మూలికలు, ప్రత్యేకంగా శరీరానికి మేలుచేసే పదార్థాలతో కూడిన ఆహారాన్ని భారతీయులకు అందించాలని భావిస్తోంది. పతంజలి బిస్కట్ల లాంటి వాటికి ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఫుడ్ రీటైలింగ్‌లోకి అడుగుపెడితే కచ్చితంగా మిగిలినవాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలమన్న విశ్వాసాన్ని పతంజలి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం రీటైల్ వ్యాపారంలో 57 శాతం వాటా ఆహార ఉత్పత్తులదే. 2025 నాటికి ఈ మార్కెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ. 71 లక్షల కోట్లు అవుతుందని అంచనా. డామినోస్ పిజ్జా లాంటి చాలామంది ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్నారు. అయినా అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెట్టి మరీ ఆహార వ్యాపారాన్ని కొల్లగొట్టాలన్నది రాందేవ్ వ్యూహంలా కనిపిస్తోంది. భారతీయులకు అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఎందుకని.. ఆహారంతో పాటే ఆరోగ్యాన్ని కూడా ఇస్తే మంచిది కదా అని ఆయన అంటున్నారు. ఆహార పదార్థాలు, పౌష్టిక పదార్థాలు, సౌందర్య సాధనాలు.. వీటన్నింటికీ ఉన్నట్లే రీటైల్ ఫుడ్ చైన్లకు కూడా మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నారు. -
అమర సైనికుల పిల్లలకు రాందేవ్ స్కూలు
రాందేవ్ బాబా అనగానే ముందుగా మనకు యోగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత వేల కోట్లలో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. కానీ.. ఆయనలోని మరో కోణం ఇప్పుడు వెలుగు చూసింది. అమరులైన సైనికుల పిల్లల కోసం తాను ఈ ఏడాది 'పతంజలి ఆవాసీయ సైనిక్ స్కూల్' ఒకదాన్ని ప్రారంభిస్తానని రాందేవ్ ప్రకటించారు. ఇందులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పిల్లలకు ఉచితంగా చదువు చెబుతామని అన్నారు. ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ స్కూలు ఏర్పాటు కానుంది. గురువారం నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో రాందేవ్ బాబా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉన్న ఆస్తిని చారిటీ కోసం ఖర్చు చేయాలన్న లక్ష్యమే పతంజలి బృందాన్ని ముందుకు నడిపిస్తోందని ఆయన తెలిపారు. రాబోయే ఒకటి రెండేళ్లలో పతంజలి దేశంలోనే అతిపెద్ద బ్రాండు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు లాభాలు సాధించడం మాత్రమే లక్ష్యం కాదని.. నాణ్యమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులతో ప్రజలకు సేవ చేయాలన్నదే ధ్యేయమని రాందేవ్ వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మరణించిన 25 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లల చదువులకు అయ్యే ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని ఇటీవలే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా ప్రకటించాడు. शहीदों के बच्चों के लिए पतंजलि आवासीय स्कूल की शुरुआत होगी #ProsperityForCharity pic.twitter.com/oQmgsQJoBs — Swami Ramdev (@yogrishiramdev) 4 May 2017 -
బాబా రాందేవ్ అడిగితే కాదంటారా?
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో బహిరంగ రహస్యమే. అందుకనే నరేంద్ర మోదీ బుధవారం హరిద్వార్‌లోని పతంజలి ఆశ్రమంలో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్‌ను స్వయంగా ప్రారంభించారు. దేశం కోసం రాందేవ్ బాబా చేస్తున్న కషిని కూడా ఆయన ప్రశంసించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేసినందుకు రాందేవ్ బాబాకు మోదీ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రుణం తీర్చుకుంటోంది. బాబా ప్రాణాలకు అంతగా ముప్పు లేకపోయినప్పటికీ 2014, నవంబర్ నెలలో ఆయనకు మోదీ ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. హరిద్వార్‌లోని ఆయన ఫుడ్ పార్క్‌కు, యోగా ఆశ్రమానికి పారా మిలటరీ భద్రతను కల్పించింది. అక్కడ 35 మంది సీఐఎస్ఎఫ్ సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ప్రైవేటు రంగానికి అత్యంత అరుదైన పరిస్థితుల్లోనే ఈ సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పిస్తారన్న విషయం తెల్సిందే. బాబాకు కల్పిస్తున్న ఈ భద్రతకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఏటా 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఆ సంస్థతో టైఅప్ పెట్టుకుంటున్నట్లు 2016, ఆగస్టులో డెఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ప్రకటించింది. దేశంలోని పిల్లల్లో పౌష్టికాహారలోపాన్ని సరిదిద్దేందుకు అవసరమైన మందుల తయారీకి రాందేవ్ బాబాతో సంయుక్తంగా ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్వాల్ ఓరమ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ సూచన మేరకు ఆ రాష్ట్రంలోని అన్ని చౌక దుకాణాల్లో పతంజలి ఉత్పత్తులను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీలు, హెర్బల్ పార్కులు, యూనివర్శిటీలు, స్కూళ్లు, గోశాలలు....ఇలా ఎన్నో ఏర్పాటు చేసేందుకు కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లో అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. పతంజలి యోగా పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు అండమాన్‌లో ఏకంగా ఓ దీవినే ఉచితంగా ఇస్తానని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. ఆవు ఉత్పత్తుల అమ్మడం ద్వారా ఇప్పటికీ అధిక లాభాలను ఆర్జిస్తున్న రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ ఎప్పటి నుంచో దీనిపై దష్టిని కేంద్రీకరిస్తోంది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ అమ్ముడుపోతున్న వాటిల్లో ప్రధానమైనది ఆవు నెయ్యి. ఇప్పుడు ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయ్ల్ను కూడా అమ్ముతున్నారు. క్యాన్సర్ సహా అన్ని రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఆవు మూత్రంలో ఉన్నాయని ప్రచారం చేసిన రాందేవ్ బాబా నెలకు ఐదువేల లీటర్ల ఆవు మూత్రాన్ని సరఫరా చేయాలంటూ 2008లో ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. నెలకు మూడు వేల లీటర్ల చొప్పున ఇప్పటి వరకు రెండు లక్షల లీటర్లకుపైగా గో మూత్రాన్ని సేకరించారు. గోధాన్ ఆర్క్, సంజీవని వటి, పాంచ్గవ్యా సోప్, కాయ్కల్ప్ ఆయిల్, శుద్ధి ఫినాయిల్ ఉత్పత్తుల్లో గో మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఆవుల క్రాస్ బ్రీడింగ్‌ను అభివద్ధి చేసేందుకు ఓ రెసెర్చ్ సెంటర్‌ను ఉత్తరాఖండ్‌లోనే ఏర్పాటు చేయాలనుకున్న బాబా అక్కడి బీజేపీ ప్రభుత్వంతోని ఉప్పందం కూడా కుదుర్చుకున్నారు. మరెందుకో ఇప్పుడు హరిద్వార్‌లో ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ పార్టీతో, ఆ పార్టీ ప్రభుత్వాలతో వున్న సంబంధాలను ఉపయోగించుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని బాబా రాందేవ్ విస్తరించుకుంటూ పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశంలో గోరక్షణ ఉద్యమం కూడా ఆయన రహస్య ఉపదేశంతోనే వచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మూడువేల కోట్ల రూపాయలు దాటిని ఆయన వ్యాపార సామాజ్య్రం పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు విస్తరిస్తుందని ఓ ఇంటర్వ్యూలో బాబానే చెప్పుకున్నారు. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని, ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ ఇప్పటి వరకు పతంజలి సంస్థపై దాదాపు 90 కేసులు దాఖలయ్యాయి. ఓ కేసులో 11 లక్షల జరిమానా కూడా పడింది. బీజేపీ ప్రభుత్వాలు ఇంత బహిరంగంగా సహాయ సహకారాలు అందించడం ఒక్క బాబా విషయంలోనే జరిగిందేమో. -
రాందేవ్‌కు యాక్సిడెంటా? వైరల్ ఫొటోలు!
దేశంలో ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రాందేవ్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి. ప్రమాదంలో గాయపడిన ఆయనను స్ట్రెచర్ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఫేస్బుక్, వాట్సాప్‌లలో షేర్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ కథనాలు, ఫొటోలూ బూటకమని తేలింది. ప్రస్తుతం రాందేవ్ బాబా హరిద్వార్‌లో సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఫొటోమార్ఫింగ్ చేసిన ఫొటోలతో ఎవరో కావాలనే ఫేస్బుక్, వాట్సాప్‌లలో ఈ ప్రచారం చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఈ వదంతులను నమ్మొద్దని వారు చెప్తున్నారు. -
‘నేను నేలపై నిద్రిస్తా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు’
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి ఆమె మనసులో కేంద్రం తీసుకున్నది మంచినిర్ణయమే అని ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమె అంగీకరించారని, కానీ, దాని అమలు విధానాన్ని మాత్రమే ఆమె వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. నల్లధనం దేశంపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మమత కూడా అంగీకరించిందని అన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు చేస్తున్న తీరునే ఆమె వ్యతిరేకిస్తున్నారని నాకనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. విమర్శించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది’ అని రాందేవ్ అన్నారు. మమతా చాలా సాధరణమైన జీవితం గడుపుతారని ప్రశంసించారు. ‘నేను నేలపై పడుకుంటాను. ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారు. హవాయ్ చెప్పులు వేసుకుంటారు. ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ అనుమానించాల్సిన పనిలేదు. మావోయిస్టులకు, ఉగ్రవాదులకు నల్లడబ్బు ద్వారానే నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఆమె కూడా అంగీకరించారు’ అని మమత అన్నారు. మరోపక్క, 2012లోనే నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అంగీకరించారని చెప్పారు. -
వాళ్లను విపక్షాలే పంపిస్తున్నాయి: రాందేవ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో విమర్శలు చేస్తున్న విపక్షాలపై యోగా గురువు రాందేవ్ బాబా ఎదురుదాడికి దిగారు. బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్దకు ప్రతిపక్ష పార్టీలు... తమ వ్యక్తులను పంపించి, రద్దీని సృష్టిస్తోందంటూ విమర్శలు చేశారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల చలామణీని రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్నిరాందేవ్ బాబా మరోసారి ప్రశంసించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కరోనరీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా కీర్తిస్తోంది, దీని వల్ల అక్రమ వ్యాపారాలు, అవినీతి, ఆర్థికనేరాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అవినీతి, నల్లధనం, తీవ్రవాదం అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు కూడా సహకరించాలని రాందేవ్ బాబా కోరారు. యుద్ధ సమయంలో శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతూ వారం, పదిరోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటారని, అలాంటిది దేశం కోసం మనం ఆ మాత్రం కూడా చేయలేమా అంటూ ప్రశ్నించారు. అయితే కొంతమంది వ్యక్తులు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్నారని, కేంద్రం చర్యతో వాళ్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. అలాగే యోగాతో పాటు ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు. -
పెద్ద నోట్ల రద్దుపై రాందేవ్ బాబా..
-
బ్రహ్మచారినని.. వీసా ఇవ్వలేదు
-
బ్రహ్మచారినని.. వీసా ఇవ్వలేదు
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శిష్యులతో పాటు, రూ. 4,500 కోట్ల పతంజలి సామ్రాజ్యానికి ఏకైక అధిపతి అయిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఒకప్పుడు అమెరికా వీసా తిరస్కరించిందట. ఆయనకు బ్యాంకు అకౌంటు లేదని, బ్రహ్మచారి కావడం వల్ల వీసా రాలేదట. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి ఏకంగా పదేళ్ల పాటు అమలులో ఉండేలా వీసాను అందించి మరీ స్వయంగా అగ్రరాజ్యమే ఆయనను ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్న విషయం తెలిసిందే. తనకు అమెరికా వీసా తిరస్కరించిన విషయాన్ని రాందేవ్ బాబా గ్లోబల్ ఇన్వెస్టర్ సద్సులో చెప్పారు. తొలిసారి తాను అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకోగా.. వాళ్లు తిరస్కరించారన్నారు. ఎందుకని కారణం అడిగితే, మీకు బ్యాంకు ఖాతా లేదని, మీరు పెళ్లి చేసుకోలేదని చెప్పారన్నారు. బహుశా ఇవి కాక వాళ్లకు వేరే ఏవో కారణాలు ఉండి ఉంటాయని, అవేంటో చెప్పాలని తాను ఎంతగా అడిగినా వాళ్లు మాత్రం అప్పట్లో వీసా ఇవ్వలేదని చెప్పారు. అయితే ఏ సంవత్సరంలో ఈ ఘటన జరిగిందీ ఆయన చెప్పలేదు. అనిల్ అంబానీ, గోపీచంద్ హిందూజా లాంటి బడా పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి నాయకులఉ పాల్గొన్న వేదికను ఆయన పంచుకున్నారు. స్వామీజీలు ఎప్పుడూ అంతర్జాతీయ పౌరులు అవుతారని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పతంజలి గ్రూపు రూ. 500 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపిస్తోంది. -
'తదుపరి టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్'
భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అద్భుతమని.. ఇక మనవాళ్ల తదుపరి లక్ష్యం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కావాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. పాకిస్థాన్‌కు మొట్టమొదటిసారిగా చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పామని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చించడం అంటే పంది ఎదుట ముత్యాలు చల్లడం లాంటిదని ఘాటుగా విమర్శించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదన్న పాక్ వాదనను ఖండిస్తూ.. పాకిస్థాన్ ఎప్పుడూ అబద్ధాలకోరేనని అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడినుంచి తరలించి, వేరేచోట ఖననం చేసిన తర్వాత అంతర్జాతీయ మీడియాను అక్కడకు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వం వద్ద సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన గట్టి ఆధారాలు, వీడియో ఫుటేజి ఉన్నాయని, కానీ దాన్ని బయట పెట్టడం అనేది మన వ్యూహాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప నాయకుల డిమాండ్ల గురించి పట్టించుకోకూడదన్నారు. దాడులే జరగకపోతే... తాము దీటుగా స్పందిస్తామని ఇమ్రాన్ ఖాన్ లాంటి రాజకీయ తాబేదారులు ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించారు. పాకిస్థాన్‌లోని యువతరాన్ని చదివించడానికి భారతీయులంతా కొద్దికొద్దిగా విరాళాలు ఇవ్వాలని, కనీసం వాళ్లకు అక్షరాస్యత వస్తేనైనా ఉగ్రవాద భూతం వాళ్ల బుర్రల్లోంచి వదులుతుందని రాందేవ్ బాబా అన్నారు. పాకిస్థాన్‌లో అలాంటి చొరవ మొదలైతే.. దానికి పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుందన్నారు. భారతీయులు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, చైనా నుంచి వెన్నుపోటు తప్ప ఏమీ రాలేదని ఆయన చెప్పారు. అమెరికా వాళ్లు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్లుగానే మనవాళ్లు కూడా దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేయాలని రాందేవ్ సూచించారు. వాళ్లను సజీవంగా తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. వీళ్లద్దరికీ మోక్షం కల్పించాలని అన్నారు. వాళ్ల చావుతో ప్రపంచం మొత్తానికి శాంతి లభిస్తుందని, ఇలా చేసినందుకు మోదీని కలకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. కేవలం తమ బూట్లు నాకేవాళ్లు, తమను పొగుడుతూ పాటలు పాడేవాళ్లను మాత్రమే పాకిస్థాన్ స్వాగతిస్తుందని.. వాళ్లు ఇప్పటికే మన సినిమాలను, మన నటులను బహిష్కరించినప్పుడు.. మనం మాత్రం ఎందుకు వాళ్ల నటులు, వాళ్ల సినిమాలను బహిష్కరించకూడదని ప్రశ్నించారు. నటులేమీ ఉగ్రవాదులు కారు కదా అని సల్మాన్ అంటున్నారు గానీ.. అసలు వాళ్లను ఉగ్రవాదులుగా ఎవరు అభివర్ణించారని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్‌కు సరిహద్దు అవతల కూడా మార్కెట్ ఉంది కాబట్టి, దాని గురించి ఆయనకు అంత బాధ ఉంటే పాకిస్థాన్ వెళ్లి అక్కడ భారతీయ సినిమాల మీద నిషేధం ఎత్తేయించాలని డిమాండ్ చేశారు. -
వారిపై ఉక్కుపాదం మోపాలి: బాబా రాందేవ్
నాగపూర్: జమ్ముకశ్మీర్‌లో ఆందోళనలు చేపడుతున్న వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకోవాలని యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి సూచించారు. కశ్మీరీ ప్రజలు 90 శాతం మంది శాంతిని కోరుకుంటున్నారని.. మిగిలిన వారు మాత్రమే సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. ఆదివారం నాగపూర్‌లో మీడియాతో మాట్టాడుతూ.. అశాంతికి కారణమౌతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని రాందేవ్ బాబా కోరారు. జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, అవి ఫలితం దిశగా ఉండాలని బాబా రాందేవ్ సూచించారు. భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, నూతన పథకాల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన బాగుందని కితాబిచ్చారు. -
రూ.25 వేల కోట్లతో రాందేవ్ బాబా వర్సిటీ!
హ్యూస్టన్: యోగా గురువు రాందేవ్ బాబా దేశంలో రాకెట్ వేగంతో దూసుకువెళుతున్నారు. యోగా కార్యక్రమ నిర్వహణలో అగ్రభాగాన ఉన్న ఆయన ఇక వాణిజ్య విభాగంలో కూడా దూసుకెళ్లారు. ఇక తాజాగా ఆయన విద్యారంగంవైపు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో రాందేవ్ బాబా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే 1,500 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేసి ఉంచారట. దాదాపు లక్షమంది విద్యార్థులకు వివిధ విభాగాల ద్వారా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ఆయన ఈ వర్సిటీని స్థాపించనున్నారట. హ్యూస్టన్‌లో ఈ నెల 23న నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాందేవ్ త్వరలోనే ఢిల్లీకి అతి సమీపంలో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తరహాలో వరల్డ్ క్లాస్ వర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం ఆయన రూ.25,000 కోట్లు వెచ్చించనున్నారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి విలువలతో విద్యను బోధించారో అలాంటి విద్యనే ఇక్కడే బోధిస్తామని రాందేవ్ చెప్పారు. గురుకుల విద్యకు ప్రాణంపోయాలని తాను ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మానవ వనరుల శాఖకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. -
పంచె పైకి కట్టి.. రాందేవ్ ఫుట్‌బాల్
యోగా గురువు రాందేవ్ బాబా ఏం చేసినా వెరైటీగానే చేస్తారు. తాజాగా ఆయన కొంతమంది స్టార్ ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలైన స్వచ్ఛభారత్ మిషన్, బేటీ బచావో- బేటీ పఢావో కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. ఇందు కోసం బాలీవుడ్ తారలు, పార్లమెంటేరియన్లు కలిసి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ అడగా, అందులో తాను సైతం అంటూ.. రాందేవ్ తన పంచె పైకి కట్టుకుని ఫుట్‌బాల్ ఆడారు. ఆల్ స్టార్స్ ఫుట్ బాల్ క్లబ్బు జట్టులో రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, డినో మోరియా, సిద్దార్థ మల్హోత్రా తదితరులుండగా... ఆ జట్టుకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించాడు. ఇక పార్లమెంటేరియన్ల జట్టుకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కెప్టెన్‌గా వ్యవహరించారు. టీఎంసీ ఎంపీ, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ, బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ, కమలేష్ పాశ్వాన్ సతీష్ గౌతమ్, భోలా సింగ్, ఐఎన్ఎల్డీ ఎంపీ దుష్యంత చౌతాలా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఆడారు. ఆధునిక్ అనే ఓ ప్రైవేటు గ్యాలరీ ఏర్పాటుచేసిన ఈ ఆటను చూసేందుకు 200 రూపాయల నుంచి 800 రూపాయల వరకు టికెట్లు పెట్టారు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆ రెండు పథకాల ప్రచారానికి విరాళంగా ఇచ్చారు. ఈ రెండు కార్యక్రమాల్లో దేనికీ రాందేవ్ విరాళం ఇవ్వకపోయినా.. ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన తారలు, నాయకులకు మాత్రం పతంజలి ఆయుర్వేద వారి ఎనర్జీ డ్రింకులు, స్నాక్స్ అందించారు. -
‘50వేల కోట్ల నల్లధనం అపోహే’
న్యూఢిల్లీ: భారత్ నుంచి విదేశాలకు తరలిన నల్లధనం దాదాపు రూ. 50 వేల కోట్లు ఉంటుందనేది కేవలం అపోహ మాత్రమేనని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) విభాగం నల్లధనంపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి ఆదివారం విన్నవించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ షా ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పడింది. వాషింగ్టన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎటువంటి లాభాపేక్షా లేని గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటెగ్రిటీ(జీఎఫ్ఐ) సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల నల్లధనంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం తెలిసిందే. 2004 నుంచి 2013 వరకు భారత్ నుంచి ఇతర దేశాలకు తరలిన నల్లధనం విలువ 50 వేల కోట్లకు పైగానే ఉంటుందని జీఎఫ్ఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నల్లధనం వివరాలను రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం జీఎఫ్ఐని కోరింది. జీఎఫ్ఐ వెల్లడించిన వివరాలు సరిగా లేవని, ప్రకటించిన సమాచారానికి ఇచ్చిన వివరాలకు తారతమ్యాలున్నాయని డీఆర్ఐ సుప్రీంకు స్పష్టం చేసింది. కేంద్రం విఫలం: యోగా గురు రాందేవ్ చండీగఢ్: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో తనతోపాటు దేశప్రజలు అసంతృప్తిగా ఉన్నారని యోగా గురు రాందేవ్‌బాబా వ్యాఖ్యానించారు. చట్టసభ సభ్యులు ఈ అంశంపై పార్లమెంట్లో చర్చిస్తే.. తామెవరమూ వీధుల్లో మాట్లాడాల్సిన అవసరం రాదని స్పష్టం చేశారు. అదేసమయంలో అవినీతి లేకుండా కేంద్రప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని ప్రశంసించారు. -
రాందేవ్ బాబాకు వరాలపై వరాలు
న్యూఢిల్లీ: ముక్కు మూసుకొని యోగా చేసుకునే బక్కపల్చని రాందేవ్ బాబాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరాల మీద వరాల వర్షం కురిపిస్తోంది. నాగపూర్‌లోని 600 ఎకరాల స్థలాన్ని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగ పీఠానికి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్థలంలో రాందేవ్ బాబా ఆరెంజ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారట. 2010లో హిమాచల్‌లోని అప్పటి బీజేపీ ప్రభుత్వం 28 ఎకరాల స్థలాన్ని కేవలం 17 లక్షల రూపాయలకు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు దక్కుతున్న వరాలు అన్నీ ఇన్నీ కావు. అండమాన్‌లో ఓ యోగా రిసార్ట్ ఏర్పాటు చేయడం కోసం కేంద్రంలో షిప్పింగ్ శాఖ మంత్రిగా పని చేస్తున్న గడ్కారి ఏకంగా ఓ దీవినే రాసిచ్చారు. ఆయనకు ఇప్పటికే స్కాట్లాండ్లో పీస్ ఐలాండ్ అనే 900 ఎకరాల దీవి ఉంది. దీన్ని 2009లో ఓ ఎన్ఆర్ఐ జంట బహుమతిగా ఇచ్చింది. 2015, ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగా సంబంధిత ఛారిటబుల్ ట్రస్టులను పన్నుల నుంచి మినహా ఇస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రాందేవ్ బాబాను దృష్టిలో పెట్టుకొనే ఈ వరాన్ని ప్రకటించారనడంలో సందేహం లేదు. బాబా కంపెనీలు వందల కోట్ల రూపాయల లాభాలను గడిస్తున్నా ప్రధాని ప్రకటించిన పన్ను మినహాయింపులను ఉపయోగించుకోవడం ఆయన కంపెనీల్లో ఛారిటీ ఎంతుందో తెలుస్తోంది. అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డంగా వాడుకుంటున్న రాందేవ్ బాబా ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ను సమాంతరంగా వైదిక్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేస్తానని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమ్మతి కూడా ఉందని గత అక్టోబర్ నెలలో స్వయంగా ప్రకటించారు. అది ఈ ఏడాదిలో కార్యరూపం దాలుస్తుందని కూడా ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తానన్న కాదన్న రాందేవ్ బాబా జెడ్ క్యాటగిరీ భద్రతను స్వీకరించారు. మంత్రికి ఇద్దరు గన్‌మెన్‌లుంటే ఈయనకు ఇప్పుడు 20 మంది గన్మెన్లు ఉన్నారు. విమానాశ్రయాల్లో ఎలాంటి తనికీ లేకుండా వెళ్లేందుకు అనుమతించే జాబితాలో తన పేరును చేర్చాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశంలో ఖాదీ మార్కెటింగ్ వ్యవస్థను కూడా తనకే అప్పగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ కోరిక తీరాల్సి ఉంది. పతంజలి యోగా పీఠానికి చెందిన కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి టైఅప్ కోసం ప్రతిష్టాకరమైన డీఆర్డీవో కూడా ముందుకు వచ్చిందంటే ప్రభుత్వంపై ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం అవుతుంది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసినందుకే ప్రభుత్వం ఆయనకు ఇన్ని వరాలను ఇస్తుందా? అన్న విషయం స్పష్టం కావాలి. కాషాయరంగు గోచితో కనిపించే రాందేవ్ బాబా కంపెనీలకు 2015 సంవత్సరానికి రెండువేల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చినట్లు కంపెనీ రిటర్న్స్ తెలియజేస్తున్నాయి. -
యోగా మాంత్రికుడితో అందాల భామ
-
ఏపీ ఎమ్మెల్యేలకు రాందేవ్ పాఠాలు
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యోగా పాఠాలు నేర్చుకోనున్నారు. వారికి ఒకరోజు యోగా పాఠాలు, ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి చెప్పేందుకు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా రానున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 20న జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కాలంలోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. మరోపక్క, ఆంధ్రప్రదేవ్ అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 17 నుంచి 22 వరకు ఏపీ శాసన సభా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల కాలంలోనే ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకోసం ఒకరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని పెడుతున్నారు. -
సల్మాన్ ట్వీట్లపై విమర్శలు
న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా జాతి వ్యతిరేక చర్యలను సమర్థిస్తే వారిని తప్పకుండా శిక్షించాలని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానవత్వం పేరిట జాతికి వ్యతిరేకంగా ప్రవర్తించినా అది తప్పే అవుతుందని అన్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే సరైన సమయం ఇదే అని రాందేవ్ తెలిపారు. ఇంకా ఎవరేమన్నారంటే... * రేపు నేను ఈ విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళతాను. లోక్‌సభలో సల్మాన్ ట్వీట్ల అంశాన్ని లేవనెత్తుతాను. ...కిరిత్ సోమయా, బీజేపీ ఎంపీ * ఇలాంటి అంశాలకు మనం విలువ ఇవ్వొద్దు. ఇదే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. సల్మాన్ ఏమన్నా కోర్టు తీర్పును ప్రశ్నించాడా? ...ఉద్దవ్ ఠాక్రే, శివసేన చీఫ్ * మేం ఉరి శిక్షను వ్యతిరేకించాం. దోషి తప్పకుండా శిక్షించబడాలి. కానీ అదే సమయంలో ఉరిశిక్షను కాస్త తగ్గించాలి. డీ రాజా, సీపీఐ నేత యాకూబ్‌ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని సల్మాన్ పలు వ్యాఖ్యలతో ట్వీట్ చేయడంతో దానిపై ఈ ధుమారం రేగింది. -
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం
అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఏడు రైఫిల్స్, భారీగా లాఠీలు కనిపించాయని, వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని గర్వాల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ చెప్పారు. ఫుడ్ పార్కులో ప్రైవేటు గార్డులుగా పనిచేస్తోన్న ఏడుగురిని కూడా పోలీసులు అరెస్టుచేశారు. హరిద్వార్‌లోని పతంజలి హెర్బల్ ఫుడ్స్ అండ్ హెర్బల్ పార్కు నుంచి వివిధప్రాంతాలకు మందులు సరఫరాచేసే విషయంలో స్థానిక ట్రాలీ యూనియన్ నాయకులు, ఫుడ్ పార్కు సిబ్బందికి మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటు పోలీసులు అరెస్టుచేసిన రాందేవ్ సోదరుడు రాంభరత్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఆత్మరక్షణలో భాగంగానే పార్కు సిబ్బంది ట్రాలీ యూనియన్ నాయకులపై ప్రతిదాడి చేయాల్సివచ్చిందని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రాంభరత్ను ఈ కేసులో ఇరికించారని రాందేవ్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ మీడియాతో అన్నారు. -
పద్మ అవార్డుల కోసం లాబీయింగ్: రాందేవ్
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డుల కోసం లాబీయింగ్ చేస్తారని, ఆ విషయం అందరికీ తెలుసని ఆయన అన్నారు. రాజకీయ పరిచయాలు ఉన్నవాళ్లకే ఆ అవార్డులు వస్తాయన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లకు మాత్రమే ఈ అవార్డులు రావడం సాధ్యమని చెప్పారు. పద్మభూషణ్ నుంచి పద్మశ్రీ వరకు అన్ని అవార్డులు మంచి వాళ్లకు.. వాళ్లు వాళ్లు ఆయా రంగాల్లో సాధించిన విజయాలకు అనుగుణంగా ఇస్తారనే ప్రపంచం అంతా అనుకుంటుంది గానీ, లాబీయింగ్ చేసేవాళ్లకు మాత్రమే ఇవి దక్కుతాయని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాందేవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ ఏడాది తనకు ఇవ్వజూపిన పద్మ అవార్డును రాందేవ్ తిరస్కరించిన విషయం తెలిసిందే. -
'పుత్రజీవక్కు మగబిడ్డకు సంబంధంలేదు'
-
మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు
న్యూఢిల్లీ: పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన తన సంస్థకు చెందిన మగబిడ్డ మందుపై వివరణ ఇచ్చారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ పుట్టడానికి సంబంధమే లేదని అన్నారు. తనపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కొందరు ఇలా చేస్తున్నారని, బురద జల్లే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్ర జీవక్ మందు తింటే మగ బిడ్డనే జన్మిస్తాడని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. గురువారం జరిగిన రాజ్యసభ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ త్యాగి పుత్రజీవక్ మెడిసిన్ నిషేధించాలని, దాని ఉత్పత్తి దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు కూడా ఆయనకు తోడవడంతో ఈ విషయం రాజ్యసభలో దుమారం రేపింది. -
'సేవచేయడానికే దేవుడు నన్ను బతికించాడు'
-
'సేవచేయడానికే దేవుడు నన్ను బతికించాడు'
ఖాట్మండు: ఇంత పెద్ద భూకంపం తరువాత దేవుడు నన్ను బతికించాడంటే మరింత సేవచేయమే అర్ధం అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. భూకంప బాధితులకు సాధ్యమైనంత సాయం చేసేందుకు మరి కొద్ది కాలం తాను నేపాల్‌లోనే ఉంటానన్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు బాబా చెప్పారు. నేపాల్‌లో నిన్న సంభవించిన భారీ భూకంపం నుంచి రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఆయన శిక్షణ ఇచ్చే వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే, ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. -
తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా
-
తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా
నేపాల్‌లో వచ్చిన పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. రాందేవ్ బాబా ఉన్న వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా మాత్రం తృటిలో తప్పించుకున్నారు. -
సన్యాసం చాలు.. పదవులొద్దు!!
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా ఆఫర్‌ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు. తాను సన్యాసిగానే ఉంటాను తప్ప.. పదవులేవీ వద్దన్నారు. తన గౌరవార్థం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సోనేపట్‌లో ఏర్పాటుచేసిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. ''నేను సన్యాసిని. మానవాళికి సేవచేయడం ఒక్కటే నా ఏకైక లక్ష్యం. నేను ఎలాంటి మంత్రి పదవులు, హోదాల కోసం ఆశించడం లేదు. బాబా గాను, ఫకీరుగానే ఉండిపోవాలనుకుంటున్నాను'' అని ఆయన చెప్పారు. అయితే, రాందేవ్ బాబాకు మంత్రి హోదా, అందుకు సంబంధించిన గౌరవ మర్యాదలు కల్పించాలంటే న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చని హర్యానా ప్రభుత్వం అనుమానించింది. అందుకే సోమవారం సాయంత్రమే చేయాల్సిన ప్రకటనను కూడా ఆపేసింది. కాగా, రాందేవ్ బాబాను ప్రసన్నం చేసుకోడానికి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. -
రాందేవ్‌బాబాకు క్యాబినెట్ మంత్రి హోదా
వివాదాస్పద యోగా గురు రాందేవ్ బాబాకు హర్యానా ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి హోదాను కల్పించింది. ఇప్పటికే హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగున్న ఆయనకు మంత్రి హోదా కల్పిస్తున్న విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాందేవ్ పర్యవేక్షణలో యోగా, ఆయుర్వేద విద్యను అభివృద్ధి చేయనున్నట్లు, ఈ మేరకు పాఠ్యాంశాల్లో యోగా పాఠాలను చేర్చడంతోపాటు స్కూళ్లు, గ్రామాల్లో యోగశాలలు నిర్మించనున్నట్లు విజ్ పేర్కొన్నారు. మరోవైపు మత సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
'జర్నలిస్టుగా మాత్రమే కలిశా'
న్యూఢిల్లీ : లష్కరే తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు. తన భేటీ వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పాకిస్తాన్లో హాఫీజ్ సయీద్‌తో జర్నలిస్ట్, రాందేవ్ బాబా అనుచరుడు వేదప్రతాప్ వైదిక్ కలవటంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై వేద్ ప్రతాప్ వైదిక్ పై విధంగా స్పందించారు. కాగా ఈ భేటీపై ప్రతిపక్షాలు సోమవారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసాయి. వారి భేటీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసినా విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విదేశీ వ్యవహారాల శాక మంత్రితో ప్రకటన చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
రాజ్యసభలో హఫీజ్-వేద్ ప్రతాప్ భేటీపై రగడ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో రాజ్యసభ సోమవారం రెండుసార్లు వెంటవెంటనే వాయిదా పడింది. పోలవరం ఆర్డినెన్స్‌తో పాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ కావడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. వేద్ ప్రతాప్ వైదిక్ యోగా గురువు రాందేవ్ బాబాకు సన్నిహితుడు. నరేంద్ర మోడీ అనుమతితోనే హఫీజ్‌తో వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ అయ్యారా అని కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రశ్నించారు. ముంబయి పేలుళ్ల నిందితుడితో కలవటమేంటని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనటంతో చైర్మన్ హమీద్ అన్సారీ సమావేశాలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. -
రాజ్యసభలో హఫీజ్-వేద్ ప్రతాప్ భేటీపై రగడ
-
రాహుల్‌పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
-
రాందేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ దాఖలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాందేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేవలం హనీమూన్ కోసం, పిక్నిక్ కోసమే రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తారంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దళిత అమ్మాయిని అతడు పెళ్లి చేసుకుని ఉంటే ప్రధాని అయ్యేవాడని కూడా రాందేవ్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాహుల్ తలరాత ఏమాత్రం బాగోలేదని, విదేశీయురాలిని పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ ప్రధాని కాలేవని సోనియా ఆయనకు చెప్పిందని అన్నారు. కానీ భారతీయ అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఆ అబ్బాయికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ముందు ప్రధాని అయ్యి, తర్వాత ఓ విదేశీయురాలిని పెళ్లి చేసుకోవాలని వాళ్ల అమ్మ చెప్పిందన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తాజాగా రాందేవ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. -
కళంకిత నేతల తరఫున రాందేవ్ ప్రచారం
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్లలో నిందితులుగా ఉన్న బీజేపీ నాయకుల తరఫున యోగా గురువు రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్నారు. ముజఫర్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న సంజీవ్ బలియాన్, బిజ్నోర్ నుంచి పోటీ చేస్తున్న భరతేందు సింగ్ ఇద్దరి తరఫున ఆయన ప్రచారం చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అలాగే స్విస్ బ్యాంకులలో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని కూడా చెప్పిందని ఆయన ఈ అభ్యర్థులిద్దరినీ తలోపక్క కూర్చోబెట్టుకుని విలేకరుల సమావేశంలో చెప్పారు. బలియాన్, భరతేందు సింగ్ ఇద్దరూ ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బెయిల్ మీద విడుదలై ఇప్పుడు లోక్‌సభకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ఇదే కేసులో పేరున్న మరో నిందితుడు హుకుమ్ సింగ్ కూడా కైరానా లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫునే పోటీ చేస్తున్నారు. హుకుమ్ సింగ్, సంజీవ్ బలియాన్ ఇద్దరిపైనా రెండేసి కేసులు ఉన్నట్లు వారి నామినేషన్ల అపిడవిట్లలోనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లలో 67 మంది మరణించారు. 85 మంది గాయపడగా, 51వేల మంది నిరాశ్రయులయ్యారు. -
కేజ్రివాల్ కాంగ్రెస్ ఏజెంట్, కమెడియన్: రాందేవ్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ పై యోగా గురువు రాందేవ్ బాబా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేజ్రివాల్ ను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్, కమెడియన్ అని వ్యాఖ్యలు చేశారు. కేజ్రివాల్ ను కాంగ్రెస్ పార్టీ పావుగా ఉపయోగించుకుంటుందని... అందుకే వారణాసిలో నరేంద్రమోడీపై పోటికి పెడుతోందని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలున్న కేంద్రమంత్రి కపిల్ సిబల్, డీఎంకే ఎంపీ కణిమొళిపై ఎందుకు పోటీ చేయరని రాందేవ్ బాబా ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేయాలనే ధృడ సంకల్పం ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలపై పోటికి దిగాలని రాందేవ్ సూచించారు. అయితే ప్రధాని పదవి కోసం మోడీ పాకులాడుతున్నారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రాందేవ్ తెలిపారు. మోడీపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు. -
'థర్డ్ ఫ్రంట్ కు విధానాల్లేవు..నాయకుడూ లేడు'
ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దాంతాలను గాలికి వదిలి.. దారి తప్పుతోందని యోగా గురువు రాందేవ్ బాబా విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆతర్వాత ఆపార్టీతో పొత్తును కుదుర్చుకోవడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో 'చిపిరి కట్ట'ను పెట్టిన ఆమ్ ఆద్మీ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలన, వ్యవస్థను మార్చేస్తాం అనే నినాదాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ తన సిద్దాంతాలకు దూరమైందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు అని రాందేవ్ అన్నారు. ఎన్నికల తర్వాత భారత రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ అవిర్భావంపై పెదవి విరిచారు. తృతీయ ఫ్రంట్ కు విధానాల్లేవని.. అంతేకాకుండా సరియైన నాయకత్వం కూడా లేకపోవడమే ప్రధాన లోపం అని ఆయన వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విజయానికి మద్దతుగా మార్చి 23 తేదిన న్యూఢిల్లీలో లక్షలాది మందితో యోగా క్యాంప్ ను నిర్వహిస్తానని రాందేవ్ తెలిపారు. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టమే: రాందేవ్
లోకసభ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశం లేదని యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. కాని తెలంగాణ ఏర్పాటు మాత్రం తథ్యం అని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు వల్ల వనరులు, ఉద్యోగాలు, ఇతర రంగాలకు సంబంధించినంత అంశాల్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగదని రాందేవ్ తెలిపారు. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకే తెలంగాణ గురించి కాంగ్రెస్ మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నిజంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే.. తెలంగాణను ముందే ప్రకటించాల్సి ఉండేదన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా ఐదేళ్లపాటు కాంగ్రెస్ నిద్రపోయిందా అని రాందేవ్ ప్రశ్నించారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఎన్నికల కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. -
రాందేవ్ అంత ప్రముఖుడేమీ కాదు: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ పార్టీ తనపై కుట్ర చేస్తోందన్న యోగా గురు రాందేవ్ బాబా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ సింగ్ ఖండించారు. అసలు రాందేవ్ బాబా ఎవరైనా సరే కుట్ర చేయాల్సినంత ప్రముఖుడేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాందేవ్ బాబాకు అంత స్థాయి లేదని ఆయన అన్నారు. పతంజలి ఆశ్రమంలో ఓ ఉద్యోగిని కిడ్నాప్ చేసినందుకు రాందేవ్ బాబా సోదరుడు రాం భరత్‌పై పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారమంతా జరిగింది. రాందేవ్ బాబా కుటుంబ సభ్యులు ఎవరినో కిడ్నాప్ చేస్తే, అది కాంగ్రెస్ కుట్ర ఎలా అవుతుందని, అందుకు ఆయనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.