శంషాబాద్: పతంజలి సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వెయ్యిమంది నిరుద్యోగులకు పంపిణీదారులు, సేల్స్‌మెన్‌లుగా ఉపాధి కల్పిస్తున్నట్లు యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు పతంజలి సంస్థ ఉద్యోగులు, అభిమానులు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన విదేశీ సంస్థల పెత్తనం ఇప్పుడు వ్యవసాయరంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. లక్షల కోట్ల రూపాయల భారత దేశ ధనం విదేశాలకు పోతోందన్నారు. దేశ ప్రజల్లో స్వదేశీ వస్తువుల వాడకంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించే చైతన్యవంతమైన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment